బాగా తెల్లటి పంచదార తయారీలో జంతు అవశేషాలు లేక బ్లడ్ ఆల్బుమిన్ వంటివి వాడతారని కొందరు అంటున్నారు...జంతు అవశేషాలతో సంబంధం లేకుండా కూడా శుద్ధ శాకాహార పంచదారను కొందరు తయారుచేస్తున్నారట. ఈ విషయాల గురించి ఇంతకుముందు టపాలో వ్రాసాను.
చెరకుగడల రసాన్ని మరగించి, దానిని చల్లబరచి పంచదారను తయారుచేయటం అనేది సరైనపద్ధతి. ఈ పద్ధతిలో తయారయిన పంచదారను చక్కగా వాడుకోవచ్చు. ప్రాచీన కాలంలో ఇలాగే తయారుచేసేవారనుకుంటాను.
ఈ రోజుల్లో కూడా ఇలా తయారుచేసుకోవచ్చనిపిస్తోంది.
పంచదార తయారీ గురించిన కొన్ని లింక్స్ క్రింద ఇస్తున్నానండి.
Making Sugar at Home - in the Amazon - Rainforest Education
How to make cane syrup at home... without a sugar cane press
స్నాక్స్ లో వాడే స్వీట్ చట్నీ తయారీలో ఖర్జూరాన్ని వాడతారు. ఖర్జూరాన్ని చింతపండుతో కలిపి ఈ చట్నీని తయారుచేస్తారు.
అయితే ఈ రోజుల్లో ఖర్జూరం ఎక్కువ రేటు కాబట్టి , పంచదార లేక బెల్లాన్ని చింతపండుతో కలిపి స్వీట్ చట్నీ చేసేస్తున్నారు.
No comments:
Post a Comment