కొందరు ఏమంటారంటే, పాతకాలంలో ఏమీ బాగుండేది కాదు. ఇప్పుడు ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి అంటారు. అయితే, కొన్ని విషయాలను చూద్దాము..
...........
పాతకాలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి రోజున భోగిమంటలు వేసేవారు. ఇంట్లో ఉన్న విరిగిపోయిన , పాతవైన చెక్కసామాను..వంటివి ఆ మంటలలో వేసేసేవారు. ఆ విధంగా ఇల్లు శుభ్రమయ్యేది.
ఇప్పుడు వాడి పడేసిన ప్లాస్టిక్ సామాను మరియు ఎలక్ట్రానిక్ సామానును ఎలా వదిలించుకోవాలో ఎవరికీ సరిగ్గా తెలియటం లేదు .
పాతకాలంలో ప్రతి సంక్రాంతికి ఇంటికి సున్నం వేయించుకునేవారు. అందువల్ల ఎప్పటికప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండేది.
ఇప్పుడు ప్రతి సంవత్సరానికి రంగులు వేయించుకోవటం లేదు. 5 లేక 6 సంవత్సరాలకు ఒకసారి రంగులు వేయించుకోవటం వలన ఇంట్లో అశుభ్రత, తద్వారా రోగకారక పరిస్థితి ఎక్కువగా ఉంటుంది.
......................
పాతకాలంలో.. తలకు ఆముదం రాసుకునేవాళ్ళు. అందువల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతూ ఉండేది. ఉసిరి కలిపిన తలనూనె, ఆముదం వంటి వాటి వాడకం వల్ల కళ్ళకు, మరియు తలకు బాగుండేది.
కళ్ళకు కాటుక పెట్టుకునేవాళ్ళు. ఈ కాటుక బయట తయారుచేసినది కాకుండా , ఇంటివద్ద మహిళలే తయారుచేసేవాళ్ళు.
...............................
ఆ రోజుల్లో, ఇప్పటిలా టీవీలు చూడటం, కంప్యూటర్ చూడటం..వంటి కళ్ళకు ఎక్కువ శ్రమ కలిగించే పనులు ఉండేవి కాదు.
పుష్టికరమైన ఆహారం తీసుకోవటం వలన శ్రమను తట్టుకునే విధంగా కూడా శరీరం ధృడంగా ఉండేది.
......................
పాతకాలంలో.. రసాయనిక ఎరువులతో పండించిన ఆహారపదార్ధాలు కాకుండా, సేంద్రియ ఎరువులతో పండించిన ఆహారపదార్ధాలు తీసుకునేవారు.
ఇప్పుడు మనం వాడే అనేక పదార్ధాలలో ఉన్న రసాయనాల వల్ల వాతావరణం కలుషితమయ్యింది. కలుషిత వాతావరణంలో పెరిగిన ఆహార పదార్ధాలు తినేవారికి అనారోగ్యాలూ ఎక్కువవటం సహజమే కదా !
.........................
ఇప్పుడు చాలామంది పిల్లలకు మరియు పెద్దవాళ్ళకు కూడా సరైన పుష్టికరమైన ఆరోగ్యకరమైన ఆహారం లభించటం లేదు.
ఇప్పుడు చాలావరకు బ్రెడ్, నూడిల్స్, బిస్కెట్స్..వంటి రెడీమేడ్ ఫుడ్ తో సరిపెట్టుకుంటున్నారు.
......................
ఈ రోజుల్లో ఎక్కువమంది ఆరోగ్యం కన్నా ఆదాయాన్ని సంపాదించటానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు.
ఆదాయం పెరిగినా ఆరోగ్యాన్ని పొందలేము ...అని తెలుసుకునే సరికి సమయం మించిపోతుంది. అప్పుడిక ఏమీ చేయలేకపోతున్నారు.

No comments:
Post a Comment