ఎవరైనా కట్నం ఇచ్చినా,తీసుకున్నా శిక్షార్హులే అంటారు.
కట్నం ఇవ్వటము.. తీసుకోవటమూ రెండూ నేరమే అయినా ..ఏదో ఒకరూపంలో అమ్మాయి తరపు వారి నుంచి ధనాన్ని తీసుకుంటూనే ఉన్నారు.
పుట్టింటినుంచి మరింత సొమ్ము తీసుకురావాలని కోడళ్ళను ఆరళ్ళు పెట్టే అత్తింటి వారి గురించి వింటున్నాము.
.....................
పాతకాలంలో, స్త్రీ ధనాన్ని అత్తింటివారు వాడుకోవటం చిన్నతనంగా భావించేవారు. అందువల్ల స్త్రీ ధనాన్ని పురుషులు వాడుకోవటం ఎక్కువగా జరిగేది కాదు.
స్త్రీలకు ఆర్ధికసాయం గురించి ఎంతో దూరం ఆలోచించిన మన పెద్దలు ..స్త్రీలకు ఆభరణాలను పెట్టుకోవటం అనేది ఆచారంగా ఏర్పాటుచేసారు.
ఈ ఆభరణాలు స్త్రీల ఆధీనంలోనే ఉండేవి. వాటిని వారు తమ తరువాతి తరాలకు అందజేసేవారు. ఎప్పుడయినా ఆర్ధికంగా కష్టం వస్తే ఈ ఆభరణాలు ఆడవాళ్ళను ఆదుకునేవి.
....................
కొడుకూ కూతురూ సమానమేనని భావించే ఎంతో మంది తల్లితండ్రులు తమ కూతుళ్ళకూ కొంత ధనాన్ని ఇష్టపూర్వకంగానే ఇస్తుంటారు.
ఎక్కువ ఆస్తి లేని వాళ్ళు కూడా అప్పోసప్పో చేసి కొంత ధనాన్ని ఇవ్వటమూ జరుగుతోంది. ( అత్తింటి వారు అడుగుతారు కాబట్టి..)
..............................
అయితే, కట్నం ఇవ్వటం, పుచ్చుకోవటం నేరం.. అనే పరిస్థితి వల్ల సొమ్ము ఇచ్చిన పుట్టింటివారూ తీసుకున్న అత్తింటివాళ్ళు కూడా ఆ విషయాలను గోప్యంగానే ఉంచుతున్నారు. ఈ గోప్యత వల్ల ఆడవాళ్ళకే నష్టం జరుగుతోంది.
ఎలాగూ ధనాన్ని ఇస్తున్నప్పుడు, ఇంత ఇచ్చామని చెప్పుకునే వెసులుబాటు ఉంటే, ఆ విషయాన్ని ఆడపిల్లల తరపు వాళ్ళు ధైర్యంగా బయటకు చెప్పుకోగలరు.
కోడలు తెచ్చిన స్త్రీ ధనాన్ని ( కట్నాన్ని ? ) దిగమింగి కోడళ్ళను బయటికి గెంటే పరిస్థితి ఉన్నప్పుడు ..
.తీసుకున్న స్త్రీ ధనానికి చట్టబద్ధత ఉంటే , అమ్మాయిల తరపు వాళ్ళు ధైర్యంగా తాము ఇచ్చిన సొమ్మును అత్తింటి వారి వద్ద నుంచి వసూలు చేసి, అమ్మాయికి తిరిగి ఇవ్వగలుగుతారు.
.................
ఈ రోజుల్లో పుట్టింటి ఆస్తిలో అమ్మాయిలకూ భాగం కల్పించారు. ఇందువల్ల ఆడవాళ్ళకు కొంత నష్టం జరిగే అవకాశమూ ఉందనిపిస్తుంది.
ఉదా.. కోడలి పుట్టింటివారిని ఇబ్బంది పెట్టాలని, వారి ఆస్తి మీద కన్నేసి, మరింత ఆస్తి తెమ్మని కోడలిని జీవితాంతమూ వేధించే అవకాశమూ ఉంది.
దీనికన్నా, వివాహసమయంలో కొంతసొమ్మును ముట్టచెపితే అప్పటితో సరిపోతుంది కదా ! అమ్మాయి పుట్టింటి వారికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనిపిస్తోంది.
.............
ఈ రోజుల్లో కూడా, కోడళ్లను ఆరళ్ళు పెట్టే అత్తలు చాలామందే ఉన్నారు. అలాగే వయసుడిగిన అత్తలను ఆరళ్ళు పెట్టే కోడళ్లూ ఉంటారు.
భర్త మరణించినా లేక అత్తింటివారు బయటకు తోసేసినా.. పాతకాలంలో అయితే ఇలాంటి స్త్రీలు అత్తింటిలోనో, పుట్టింటిలోనో ఉండేవారు. తల్లితండ్రులు లేకపోయినా సోదరులు ఆదుకునేవారు.ఇప్పుడు ఎవరి కుటుంబాన్ని వారు చూసుకోవటమే కష్టంగా ఉంది.
.................
స్త్రీలు మహిళామండలిగా ఏర్పడి తోటి స్త్రీలకు సాయంగా నిలబడాలి. ఉదా..భూమిక హెల్ప్ లైన్ .. వంటి సంస్థలు ఆడవాళ్ళకు చేయూతనిస్తున్నాయి. ఇలాంటి సంస్థలు మరిన్ని ఏర్పడితే స్త్రీలు సాయం కోసం పరాయి మగవారిని అడిగి మోసపోకుండా ఉంటారు.
అంతేకాదు, అత్తింటివారి వల్ల అన్యాయం జరిగినప్పుడు , ఆడవాళ్ళకు ఆర్ధికంగా ఆసరాను కల్పించేలా ఏర్పాటు ఉండాలి.
(అయితే ఇలాంటి చట్టాలను ఆడవాళ్ళు తమ స్వార్ధం కోసం ఉపయోగించి, అమాయకులైన అత్తింటివారిని బెదిరించే అవకాశం ఉండకూడదు. )
స్త్రీలు పుట్టింటి నుంచి తెచ్చే సొమ్ముకు చట్టబద్ధత ఉంటే బాగుంటుందని.. ఒక కాలేజ్ అమ్మాయి వెలిబుచ్చిన అభిప్రాయాన్ని వార్తాపత్రికలో చదివిన తరువాత, నాకు తోచిన ఆలోచనలతో.. ఈ టపా వ్రాయటమైనది.
ఈ రోజుల్లో భర్త లేకపోతే వంటరిగా ఎమీ కూర్చోవటం లేదు. ఇంకొకడితో సెటిల్ అవుతున్నారు లేండి. మీరేమి వర్రి కానవసరంలేదు. వనజ వనమాలి అనే ఒకావిడ ఐ యాం ఆల్వేస్ ఎ లూజర్ కవిత రాసింది. వాస్తవానికి ఆడవాళ్ళు ఆల్వేస్ గైనర్స్.
ReplyDeleteరెండేడుపులేడ్చి సానుభూతితో పనులు సులువుగా చక్క బెట్టుకొంటారు. మగవాళ్ళ మీద పడి ఏడవటమే వాళ్ల జీవిత లక్ష్యం.
Deleteమీ వ్యాఖ్యకు కృఅతజ్ఞతలండి.
నా దృష్టిలో స్త్రీలైనా పురుషులైనా సమానమే.
స్త్రీలకు, పురుషులకు ..హక్కులూ ఉన్నాయి. బాధ్యతలూ ఉన్నాయి.
స్త్రీలంటే పురుషులకు శత్రుత్వం ఉండకూడదు.పురుషులంటే స్త్రీలకు శత్రుత్వం ఉండకూడదు. కుటుంబమంటే స్త్రీలూ ఉంటారు. పురుషులూ ఉంటారు.
స్రీలు, పురుషులు ఎందులో సమానం? అలా అనటం పురుషులను అవమానించటమే! మగవారితో తగువుకి దిగేది,శత్రువులుగా చూసేది స్రీలే. మధ్యతరగతి స్రీలకి బాధ్యతలేవి ఉండవు. మగవాడి సంపాదనను దొబ్బడానికి మాత్రం వాళ్లకు చాలా హక్కు ఉన్నాయి.ఈ హక్కుల కొరకు రక రకాల ఎత్తుగడలు వేస్తూ స్రీవాదం గొడుగు కింద ఏకమైతారు. స్రీవాదులంటే చదువుకొన్న బందిపోటు ముఠా. వాళ్ల పని మగవాళ్లను అన్ని రకాల మీడీయాలో తిట్టిపోసి, మగవారి కష్టార్జితాన్ని సులువుగా దోచేయటం. అగ్రవర్ణ మధ్యతరగతి స్రీలు మగవాళ్లు సంపాదించిన సొమ్మును జీవితాంతం తినటమే కాక, ఇంకా వాళ్ల గురించి చెడుగా మాట్లాడే దుర్మార్గురాళ్ళు. భార్య తో ఎన్ని ఏళ్లు కాపురంచేసినా ఆమే భర్త గారికి ఆమే ఆస్థిపై హక్కే లేదు. అదే తాళి కట్టించుకొన్న పక్క రోజునుంచే భార్యకి పురుషుడి జీతంలో , ఆస్థిలో అన్ని రకాల హక్కులు ఉంటాయి. ఇదేక్కడి న్యాయం? స్రీలకి డబ్బుల గురించి ఎంత తాపత్రయం ఉంటే ఇటువంటి చట్టాలు ప్రభుత్వం చేత పట్టుపట్టి చేయిస్తారు.
Deleteమీరు పురుషవాదులు అనిపిస్తోంది. స్త్రీవాదులు పురుషులను తిట్టిపోస్తుంటారు.పురుషవాదులు స్త్రీలను తిట్తిపోస్తుంటారు. స్త్రీవాదులు,పురుషవాదుల వల్ల సమాజంలో సమస్యలు పెరుగుతున్నాయి.
Deleteమగవారి సంపాదనను భార్య ఒక్కతే తింటుందా ? కుటుంబంలో అందరూ తింటారు కదా !
తమ సంపాదనను కుటుంబం కోసం ఖర్చుపెట్టడానికి బాధపడే మగవాళ్ళు వివాహం చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తే సరిపోతుంది.
స్త్రీవాదులు కొందరు మేము వంటింట్లో పడి ఉండాలా ? అంటుంటారు. కుటుంబ సంరక్షణ, కుటుంబం కోసం వంట చేయటం కూడా తప్పే అనుకునే స్త్రీలు వివాహం చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తే సరిపోతుంది.
కుటుంబం కోసం సంపాదించటం పురుషుని బాధ్యత, ఇంటిని చక్కదిద్దుకోవటం స్త్రీ బాధ్యతగా పెద్దవాళ్ళు నిర్ణయించారు.
స్త్రీలు పురుషులతో సమానమే అంటే అవమానం ఏముంది ?
Deleteస్త్రీలు తలచుకుంటే కుటుంబ పోషణ భారాన్ని కూడా చక్కగా నిర్వర్తించగలరు.
మరి పురుషులు స్త్రీలలా నెలసరి, గర్భాన్ని ధరించటం..వంటి భారాలను భరించగలరా ? ( ఆ అవకాశం వస్తే..)
...........
స్త్రీలు అణచివేతకు గురవుతున్నారని.. రక్షణ కోసం కొన్ని ప్రత్యేక చట్టాలు కల్పించారు. ఇప్పుడు కొందరు మగవాళ్ళు కూడా అణచివేతకు గురవుతున్నారని అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మగవాళ్ళ రక్షణ కోసం కూడా కొన్ని ప్రత్యేక చట్టాలు కల్పిస్తారేమోలెండి.
తినమరిగిన కోడి ఇల్లేక్కి కూసిందని. మగవాళ్ల సంపాదన తినటం అలవాటైన స్రీలు, మగవాళ్ల నెత్తినే భస్మాసుర హస్తం పెడుతున్నారు. స్రీవాదుల సలహాలతో చట్టాలు చేస్తున్నారు. వాళ్ల వాదన ప్రకారం వారి శారీరం తాకటానికి కూడా భర్త కు హక్కు లేదు.భార్య శారీరాన్నికూడా తాకటానికి భర్తకి హక్కు లేనపుడు,డైవర్స్ తీసుకొనేటప్పుడు వాడి సంపాదన లో భాగం ఎందుకు?
Deleteమీరు చెప్పే పెద్దల నిర్ణయించినవాటిని, భారత సంస్కృతిని స్రీవాదం ఒప్పుకోదు. సుమారు 80% ప్రభుత్వానికి పన్నులరూపంలో వచ్చే ఆదాయం మగవారి సంపాదననుంచే. స్రీ వాదులు, ప్రభుత్వం సహాయం చేయాలని కోరేది పరోక్ష్యం గా మగవాళ్ల సంపాదననే. వ్యక్తిగత స్వేచ్చ పై నమ్మకం, ఆత్మాభిమానం ఉంటే స్రీలు వారి సంపాదనను వార సంపాదించుకొని జీవించాలి. మరి అలా చేయరెందుకు? నీ వంశానికి వారసుడినిచ్చా అని పల్లవి ఎత్తుకుంటారేందుకు? మోగోళ్ళకి భారత సంస్కృతి వలన ఎమీ సుఖంలేదు.లాభం అంతకన్నా లేదు. మగవారి కష్టార్జితాన్ని ప్రభుత్వం, కుటుంబం సంస్థాగతం గా దోచుకొని తినటం హక్కుగా భావిస్తున్నారు.
స్త్రీలు తమ సంపాదనను తాము సంపాదించుకుని, తమ తిండి తాము తిని బ్రతకగలరు. పురుషులు తమ సంపాదనను తాము సంపాదించుకుని, తమ తిండి తాము తిని బ్రతకగలరు.
Deleteమరి, వాళ్లకు జన్మించిన సంతానం ఎవరి డబ్బుతో పెరిగి పెద్దవుతారు ? స్త్రీలు,పురుషులు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు కాబట్టి ప్రభుత్వమే దేశంలోని పిల్లల్ని పెంచి పోషించాలా ?
పురుషవాదుల దృష్టిలో భార్య అంటేనే కోపమా? లేక స్త్రీలయిన.. తల్లి, అక్కచెల్లెళ్ళు, కుమార్తెలు ..అంటే కూడా కోపమేనా? స్త్రీవాదుల దృష్టిలో భర్త అంటేనే కోపమా? లేక పురుషులైన.. తండ్రి, అన్నదమ్ములు, కుమారులు..అంటే కూడా కోపమేనా ?
Deleteభార్య భర్త సర్దుకుపోతేనే సంసారం సజావుగా నడుస్తుంది. పంతాలు, పట్టింపులకు పోతే గొడవలు పెద్దవవుతాయి తప్ప పరిష్కారం లభించదు.
భార్యాభర్త అనేకాదు, ఎవరికయినా సరే, జీవితంలో కొంత సర్దుబాటు ధోరణి లేకపోతే కష్టం. మగవాళ్ళు లేక స్త్రీలు..తమ ఆఫీసులో పై ఆఫీసర్ పెత్తనాన్ని భరిస్తారా ? లేక ఎదురుతిరిగి ఉద్యోగం ఊడగొట్టుకుంటారా ?
ఆఫీసులో పైవాళ్ళతోనూ, సాటి కొలీగ్స్ తోనూ కూడా మనకు నచ్చని అనేక అంశాలుంటాయి. మనకి ఇబ్బంది కలిగించే అంశాలూ ఉంటాయి. అయితే, ఉద్యోగం కోసం వాటిని భరిస్తారు కదా! మరి అదే సర్దుబాటు ధోరణిని కుటుంబంలోనూ చూపిస్తే బాగుంటుంది కదా !
ఎన్ని ఆఫీసులు మారినా..కొద్దిగా అయినా సర్దుబాటు ధోరణి లేకపోతే ఉద్యోగంలో నిలదొక్కుకోవటం కూడా కష్టమవుతుంది.
బయట ఉద్యోగం అయినా వ్యాపారం అయినా లేక మరే ఉపాధి అయినా సరే సర్దుకుపోక తప్పదు. ఉదా..ఎన్ని ఇంటి గొడవలతో సతమతమవుతున్నా కూడా, వ్యాపారం చేసే వ్యక్తి షాపుకు వచ్చిన కస్టమర్లతో ఓపికగా మాట్లాడకపోతే ఇంకోసారి కస్టమర్లు అతని షాపుకు రారు.
నిజమే, ఎంత సర్దుకుపోదామన్నా కొన్నిసార్లు సర్దుకుపోలేము. అయితే జీవితమంటే సర్దుకుపోక తప్పదు.
అంతెందుకు తల్లితండ్రులు, జన్మించిన పిల్లలతో కూడా అభిప్రాయాలు కొన్ని సరిపడకపోవచ్చు. అయితే, వాళ్ళతో సర్దుకుపోతాము కదా !
ఎక్కడో పుట్టి పెరిగిన భార్యాభర్త మధ్య అభిప్రాయ భేదాలు ఉండటం అత్యంత సహజం.
దురదృష్టం ఏమిటంటే, ఈ రోజుల్లో కొందరు బంధువులు, స్నేహితులు..అనబడే దగ్గరి వారి వల్ల కూడా భార్యాభర్త మధ్య గొడవలు వస్తున్నాయి.
ఈ పరిస్థితి మారి అందరూ బాగుండాలని ఆశిద్దాము.
పురుషవాదం గురించి తెలియదు. స్రీలు పురుషులతో పోటి పడాలనుకొంటే అభ్యంతరం కూడలేదు. పోటి ఉన్నపుడు ఎవరో ఒకరు గెలవాలి. ఓడిపోయిన వాళ్లు ఓటమిని అంగీకరించాలి. స్రీలు ఓటమిని అంగీకరించరు. కన్సెషన్స్ కావాలని కోరుతారు. వనజా వనమాలి అనే రచయిత భర్తలు ఇంట్లో భార్యలకి పనిచేయటం లేదని ఆరోపిస్తూ కథ రాసింది. స్రీలు చదువుకొంటే మొగవాళ్లు అంట్లు తోమి ఇంట్లో పనిచేస్తామని ఎక్కడైనా వాగ్దానం చేశారా? వాళ్ల తుత్తి కొద్ది వాళ్లు చదువుకొన్నారు. వాళ్ల ఆనందం కోసం ఉద్యోగం చేస్తున్నారు. ఆమే అడగవచ్చేమో మరి స్రీల సంపాదనను మగవాళ్ళు అనుభవించటంలేదా? అని. దానికి జవాబు ఎమిటంటే చరిత్రలో స్రీలు సంపాదింన డబ్బులతో మోగోళ్లు కోటలు కట్టలేదు. వీళ్ల సంపాదన తిప్పికొడితే వాళ్ల గుడ్డలు,అలకరణ సామగ్రికే ఖర్చు అవుతుంది. వాళ్ళు పెట్టే విపరీతమైన ఖర్చు గురించి కథలు రాసుకోరు.
Deleteమీ వ్యాఖ్యను కొద్దిసేపటి క్రితమే చూసాను.
Deleteస్త్రీవాదం తెలిసిన వాళ్ళు పురుషవాదం గురించి తెలియదనటం విడ్దూరంగా ఉంది.
స్త్రీలు, పురుషులు సమానం.. అంటుంటే ఇక ఎవరైనా ఓడటం అనే సమస్యే ఉండదు కదా !
వనజవనమాలి గారి గురించి పదేపదే మీరు ఈ బ్లాగులో వ్రాయటం ఎందుకో అర్ధం కావటం లేదు. మీ అభిప్రాయాలను ఆమె బ్లాగ్ లోనే వ్రాస్తే బాగుంటుంది.
చరిత్రలో స్రీలు సంపాదించిన డబ్బులతో మోగోళ్లు కోటలు కట్టలేదు...అని మీరు వెలిబుచ్చిన అభిప్రాయం గురించి నాకు ఏమనిపిస్తుందంటే,
అంతా డబ్బుతోనే బేరీజు వేయకూడదు. ఏ వ్యక్తి అయినా ఈ లోకంలో జన్మించాలంటేనే అందుకు ఆ వ్యక్తి యొక్క తల్లి నవమాసాలూ మోసి ప్రసవిస్తేనే ఈ లోకంలోకి వస్తారు.( పూర్వకాలంలో అయోనిజులు గురించి మినహాయిస్తే..)
ఆ తరువాత శిశువు సంరక్షణ, పెరిగి పెద్దవ్వటం వెనుక స్త్రీ పాత్ర చాలా ఉంటుంది. ఇదంతా జరిగితేనే కదా డబ్బు సంపాదించేది, కోటలు కట్టేది.
సంసారంలో స్త్రీల పాత్రా ముఖ్యమైనదే.... పురుషుల పాత్రా ముఖ్యమైనదే. ఎవరి ప్రాముఖ్యత వారికి ఉంది.
నాణేనికి రెండు పక్కలుంటాయి. వివాహంతో ఒక స్త్రీ మరొక ఇంటికి వెళుతున్నపుడు తల్లి తండ్రులు తమకి తగినది ఇచ్చి పంపటం తప్పుకాదు. దీనికోసమని అమ్మాయిని హింసించడం, ఆడపిల్ల పుట్టిందని తరిమేయడం లాటివి అమానుషం. తవ్వుకుంటే తప్పులు ఇరు పక్కలా కనపడతాయి. సద్దుకుంటే నే జీవితం.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteఅవునండి, మీరన్నట్లు నాణేనికి రెండు పక్కలుంటాయి. వివాహంతో ఒక స్త్రీ మరొక ఇంటికి వెళుతున్నపుడు తల్లి తండ్రులు తమకి తగినది ఇచ్చి పంపటం తప్పుకాదు. దీనికోసమని అమ్మాయిని హింసించడం, ఆడపిల్ల పుట్టిందని తరిమేయడం లాటివి అమానుషం. తవ్వుకుంటే తప్పులు ఇరు పక్కలా కనపడతాయి. సద్దుకుంటే నే జీవితం.
హిందూ మహిళలు పుట్టింటి నుండి తీసుకొని వచ్చే మొత్తాన్ని స్త్రీధన్ అంటారు. దీని మీద సర్వ హక్కులు వారికే చెందుతాయి, మెట్టినింటి వారికి ఎటువంటి హక్కు ఉండదు. దీనికి పూర్తి చట్టబద్దత ఉంది.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteస్త్రీ ధనానికి చట్టబద్ధత ఉన్నప్పుడు, కట్నం ఇవ్వటం పుచ్చుకోవటం నేరం అనేది పరస్పర విరుద్ధంగా ఉంది కదా ! కట్నానికి స్త్రీ ధనానికి తేడా ఏమిటండి ?
స్త్రీధనం అంటే బంగారు ఆభరణాలు, బహుమతులు వంటివే వస్తాయా ? ఈ స్త్రీ ధనానికి కొంత మొత్తం అని పరిమితి ఉంటుందనుకుంట.
లక్షల విలువ చేసే ఆస్తిని అమ్మాయికి ఇస్తే అది కట్నం అవుతుందా లేక స్త్రీ ధనం కోవలోకి వస్తుందా?
కట్నం వేరే, స్త్రీ దానం వేరే. 1. కట్నం మెట్టినింటి వారికి చెల్లిస్తారు. స్త్రీధనం సర్వహక్కులూ మహిళకే 2. కట్నం సాధారణంగా డిమాండు చేసి తీసుకుంటారు, స్త్రీధనం తమ కూతురుకు తాము స్వచ్చందంగా ఇస్తారు.
Deleteనగదు లేదా వేరే రూపేణా, అలాగే పరిమితి అంటూ ఏమీ లేదండీ. తల్లితండ్రులు తమ తాహతు కొద్దీ తమ కూతురుకు స్వచ్చందంగా (వియ్యంకుల & అల్లుడి ప్రమేయం & హక్కు ఇసుమంతయినా లేకుండా) ఇస్తే చాలు.
మొత్తం స్త్రీధనం ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. దశలవారీగా (ఉ. పిల్లలు పుట్టినప్పుడు, ప్రతి దసరా పండుగకు వగైరా) కూడా ఇవ్వొచ్చు.
వివరాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి.
ReplyDeleteఒకరికి తెలిసిన విషయాలు ఇంకొకరితో పంచుకుంటే ఇద్దరికీ మంచే కదండీ.
Deleteమేడమ్.. నమస్తే! పై కామెంట్స్ లో నా గురించి పదే పదే ఉదహరించారు. వారి అక్కసు ఏమిటో నాకు అర్ధం కాలేదు. వీలైతే నా బ్లాగ్ లో మాట్లాడాలి. వ్యతిరేక భావాలు వుండటం తప్పు కాదు కానీ అంత అసహనాలు వ్యక్తపరుస్తూ పదే నన్ను టార్గెట్ చేయడం అసంబద్దంగా వుంది. :( జాలి పడటం తప్ప నేను ఏమీ మాట్లాడను. మీరు ఆ వ్యాఖ్యలను ఉంచడమా తీయడమా అనేది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. -వనజ తాతినేని.
ReplyDelete