koodali

Friday, February 13, 2015

అందరాని ఎండమావుల వెంట...

 
పాతకాలంలో ఇన్ని యంత్రాలు లేకున్నా, మనుషులు  తాపీగా జీవించేవారు. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకూ ఏదో ఒక టెన్షన్. 

కోట్లాది సంపదతో తులతూగే ధనవంతులు ఒకవైపు ,  కూటికి  కూడా  కరువైన  నిరుపేదలు మరొక వైపు  అన్నట్లుగా   పెరుగుతున్న ఆర్ధిక అసమానతలు . 


 ఆరోగ్యం విషయానికి వస్తే,  పాతకాలంలో కేన్సర్, కిడ్నీ జబ్బులు వంటివి రావటం చాలా అరుదుగా ఉండేది. ఇప్పుడు కేన్సర్, కిడ్నీ జబ్బులు..  
 కొందరు చిన్నపిల్లలకు కూడా వస్తుండటం అత్యంత బాధాకరం. 


చిన్నపిల్లలకు కూడా ఇలాంటి  జబ్బులు ఎందుకు వస్తున్నాయో ఆలోచించే తీరుబడి కూడా ఎవరికీ లేదు.


 అందరూ దేనికో పరుగులు తీస్తున్నారు. అందరాని ఎండమావుల వెంట పిచ్చివాళ్ళలా పరుగులు పెడుతూ అదే అభివృద్ధి అంటూ తమను తాము మోసం చేసుకుంటున్నారు.


ఇక స్త్రీల పట్ల అఘాయిత్యాల విషయానికొస్తే చెప్పనే అక్కర్లేదు. స్వేచ్చ అంటూ బయటకు వచ్చిన స్త్రీలు.. స్వేచ్చ మాట అటుంచి ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతూ జీవించవలసి వస్తోంది.


 పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్లుగా ఉంది చాలామంది మహిళల పరిస్థితి. 


 చిన్నపిల్లల పట్ల కూడా అఘాయిత్యాలు జరిగిన  కేసుల గురించి విన్నాము.


 ఎక్కడికి పోతోంది ఈ సమాజం ? అభివృద్ధి అంటే ఇది కానే కాదు.


అభివృద్ధి పేరుతో.. భూమిమీద గాలి, నీరు, వాతావరణం పొల్యూట్ అయిపోతున్నా,  వాతావరణమార్పులు..  హెచ్చరికలు చేస్తున్నా  పట్టించుకోకుండా..


ఆకాశానికి నిచ్చెనలు వేసేస్తాం, చందమామ  పైన న్నవి  కిందికి దింపేస్తాం....అంటూ చెప్పేవారి మాటలను వింటూ మైమరిచిపోతే ఆనక చేతులు కాలిన తరువాత పట్టుకోవటానికి ఆకులు కూడా మిగలవు. 


9 comments:

  1. అమ్మా... మీరు అసలు ఆలోచిస్తారోలెదో కూడా నాకు అర్ధం కాకుంది.

    "కోట్లాది సంపదతో తులతూగే ధనవంతులు ఒకవైపు , కూటికి కూడా కరువైన నిరుపేదలు మరొక వైపు అన్నట్లుగా పెరుగుతున్న ఆర్ధిక అసమానతలు ."

    \ఒకప్పుదు ఈ ఆర్ధిక అసమానతలులేని సామ్యవాద సమాజం రాజ్యమేలిందటండీ?!

    " ఆరోగ్యం విషయానికి వస్తే, పాతకాలంలో కేన్సర్, కిడ్నీ జబ్బులు వంటివి రావటం చాలా అరుదుగా ఉండేది. ఇప్పుడు కేన్సర్, కిడ్నీ జబ్బులు.. కొందరు చిన్నపిల్లలకు కూడా వస్తుండటం అత్యంత బాధాకరం."
    నిజానికి క్యాన్సర్ వచ్చే సంభావ్యత 40 దాటినవారిలో ఎక్కువ. ఒకప్పుడు మనిషి average lifespan 30కి దగ్గర్లో ఉండేది. కాబట్టి క్యాన్సర్ కన్నా ముందుగా క్షయతోనో, లోబీపీతోనో, మలేరియాతోనో చచ్చేవాళ్ళు ఒకప్పుడు.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ఆర్ధిక అసమానతలు ఇంతకుముందు కూడా ఉండేవి. అయితే ఇప్పుడు ఉన్నంతలాగ కాదు. విదేశీయుల రాక ముందు భారతదేశం పరిస్థితి వేరేగా ఉండేది.

    ఇండియాకు దారి వెదుకుతూ కొలంబస్ అమెరికాను కనుక్కున్నాడని చరిత్ర చెబుతోంది.(ఇండియా సంపన్నదేశం కాబట్టి.) ఉపయోగం ఉంటేనే దారి వెదుకుతారు కానీ, లాభం లేని దేశాలకు దారి వెదకరు కదండి.

    అప్పటి భారతదేశంలో పరిష్తితి ఎలా ఉండేదో ఎందరో విదేశీయులు తెలియజేసారు.భారతదేశంలో బీదరికం చాలా తక్కువగా ఉందని మెకాలే, ఇంకా ఎందరో విదేశీయులు తెలియజేసారు. ఇవన్నీ గమనిస్తే, ఇక విదేశీయుల భారీ రాకకు పూర్వం భారతదేశం మరెంత బాగుండేదో అనిపిస్తుంది.
    ...........

    మీరన్నట్లు, క్యాన్సర్ వచ్చే సంభావ్యత 40 దాటినవారిలో ఎక్కువ కావచ్చు. అయితే, మరి ఇప్పుడు కేన్సర్ కొందరు చిన్నపిల్లలకు కూడా ఎందుకు వస్తోంది ?

    ఆ మధ్య కొందరు సినిమా వాళ్ళు కేన్సర్ బాధిత పిల్లలను పలకరించిన వార్తలను టీవీలలో చూపించారు. ఆ హాస్పిటల్లో చాలామంది కేన్సర్ బాధిత పిల్లలు కనిపించారు. కిడ్నీ జబ్బులు విషయంలో కూడా పరిస్థితి ఇలాగే ఉందంటున్నారు.

    ........................

    యాంటిబయాటిక్స్ కనిపెట్టిన తరువాత ఎన్నో జబ్బులు తగ్గుముఖం పట్టాయంటారు. అయితే, ఆంటీబయాటిక్స్ విచ్చలవిడి వాడకం ద్వారా రోగకారక బాక్టీరియా మరియు వైరస్లు యాంటీబయాటిక్స్ను కూడా తట్టుకుని ఆ మందులకు లొంగని అత్యంత ప్రమాదకర పరిస్థితి పొంచి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు కూడా.
    ..............

    పాతకాలంలో ఇన్ని కేన్సర్, కిడ్నీ కేసులు లేవని నేను వ్రాసిన దానిలో అబద్ధమేమీ లేదండి.

    ఇంకా, పాతకాలంలో బీపీ హెచ్చుతగ్గులు, సుగర్ జబ్బు కేసులు కూడా ఇంతలా లేవన్నది కూడా నిజం.
    ........................

    పాతకాలంలో మనుషుల సగటు ఆయుర్దాయం 30 ఏళ్ళే అన్నది నిజం కాదు. మాకు తెలిసినవాళ్ళలో కూడా చాలామంది 80 ఏళ్ళకు పైగానే జీవించారు.

    పాతకాలంలో చాలా మంది యోగా చేస్తూ 90 ఏళ్ళ వయస్సులో కూడా ఏ జబ్బు లేకుండా జీవించేవారు.
    ఇంకా పూర్వకాలానికి వెళ్తే పురాణేతిహాసాలకాలంలో వందసంవత్సరాల కంటే ఎక్కువకాలమే జీవించేవారని తెలుస్తుంది.
    .......................

    పాతకాలం పెద్దవాళ్ళు కిలోమీటర్ల దూరాన్ని సునాయాసంగా నిడిచేవారు. ఇప్పటివాళ్ళలో యుక్తవయస్సుకే డీలాపడిపోతున్నారు.ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలకే వృధ్యాప్య చిహ్నాలైన కళ్ళజోడు, తెల్లజుట్టు కనబడుతున్నాయి.

    ReplyDelete
  3. ఇలాంటి శాస్త్ర విజ్ఞాత అజ్ఞాతలకు కొదవలేదు.. బాగా విశ్లేషించారు... కీప్ రైటింగ్ ...

    ReplyDelete
    Replies
    1. ఊరు వెళ్ళి ఈ రోజే వచ్చాము. ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.

      Delete
    2. ఊరు వెళ్ళి ఈ రోజే వచ్చాము. ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.

      Delete
    3. @Voleti : నేనే అజ్ఞానినైతే, నువ్వేంటో తెలుసుకొని తెల్లారు.

      Delete
  4. 'సంభావ్యత' అన్నమాట మీకర్ధమవుతుందని అనుకున్నాను. కేన్సర్ వచ్చే సంభావ్యత (అవకాశాలు) నలభైదాటినవారిలో ఎక్కువ అంటే చిన్నపిల్లలకు అస్సలు రాదనికాదు. కేన్సర్ నిజానికి చాలా పాత వ్యాధి (పర్షియన్ రాజు డేరియస్ భార్యకు వచ్చిన క్యాన్సర్ గురించి నెట్లో సమాచారం గొరుకుతుంది). కొంచెం గూగులించండి. 'రాచపుండు' అన్నపదం నిన్నమొన్న పుట్టింది కాదు.

    ఒకప్పుడు ఏవ్యాధివచ్చి చనిపోయారో తెలుసుకోలేని స్థితిలో ఉండేవాళ్ళం. మా జేజమ్మ 'పేరు తెలియని వ్యాధి'తో చనిపోయింది. ఇప్పుడు డయాగ్నోస్టిక్స్ శాశ్త్రం అభివృధ్ధి చెందిందికాబట్టి వాటికి పేర్లుపెట్టి ఇది క్యాన్సర్, ఇది కిడ్నీ సంబంధిత వ్యాధి అని చెబుతున్నారు. ఒకప్పుడు వడదెబ్బకి, మరేరియాకీ, బీపీకి కూడా మనుషులు పుటుక్కున చనిపోయెవారు. వాటిని జనాలు 'మంచిచావు' ఖాతాలోకో, 'పేరు తెలియని వ్యాధి ఖాతాలోకో' రాసేశేవారు. కాబట్టే మన తాతల కాలంలో ఐదారుగుర్ని (కొందరైతే పదికిపైగానే) కనేసేవారు. ఎందుకంటే కొడుకులు చేతికి అందొచ్చే సంభావ్యత ఆరోజుల్లో చాలా తక్కువ. అభివృధ్ధిచెందిన మెడికల్ సైన్సెస్ ఈనాడు మనకి ఇద్దరు లేదా ఒక్కరితో సరిపెట్టుకోగలిన ధైర్యానిచ్చింది.

    ఒక ప్రశ్న రోగాలతో చావులు ఇప్పుడే ఎక్కువ అనీన్నారు కదా, ఎనభైల తరువాత పిల్లలను కన్న తల్లిదండ్రుల్లో ఎందరు ఇద్దరికన్నా ఎక్కువ మందిని కన్నారు? అసలలా ఇద్దర్ని మించి కన్నవారు మీకు ఎందరు తెలుసు? అదే తొంభైల్లో ఇద్దరికి మించి పిల్లల్ని కన్నవారు మీకు ఎందరు తెలుసు? మరి 2000s సంగతీ, 2010s సంగతీ ఏమిటి?

    ReplyDelete
  5. నెనుదహరించిన విషయాలన్నింటినీ వదిలేసి. మీరన్న ప్రతిదానికీ తందానతాన అనే జోకరుగాళ్ళని (ఉదాహరణ కావాలంటే అడగండి తప్పకుండా ఇస్తాను 'v') వెంటేసుకొని తిరగడంవల్ల మీకేదో ప్రయోజనం ఉందనుకోను.

    ఇంకోసారి మీబ్లాగులో వ్యాఖ్యరాసి, మీ అపోహలను చిధ్రంచేసే పనికూడా పెట్టుకోను.

    మా తరపు దౌర్భాగ్యం ఏమిటంటే ఎప్పుడో invalidate అయిపోయిన ఆలోచనలని ఇంకా propaganda ద్వారా సజీవంగా ఉంచుతున్న, ఆలోచించడం, facts verification చేయడానికి సిధ్ధంగా లేని ఒక తరం సజీవంగా ఉంది. అలా ఉండటమేగాక వారికి నకళ్ళను తయారుచేయడానికి పలువిధాలుగా కృషిచేస్తుంది. దేవుడా! ఆ తరానికి జన్మరాహిత్యాన్ని ప్రసాదించు. తద్వారా అలాంటి వాళ్ళు మరోసారి భూమ్మీద పుట్టకుండాచేయి. భూమిని రక్షించు.

    ReplyDelete
  6. మీ వ్యాఖ్యను ఈ మధ్యనే చూశాను.( పాత వ్యాఖ్యలను చూస్తుంటే కనిపించింది.)

    ప్రాచీన కాలంలోనే భారతదేశంలో వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ది చెందింది.

    చరకుడు వంటి గొప్ప వైద్యులు ఉండేవారు.సుశ్రుతుడు వంటి వారు శస్త్రచికిత్సలను కూడా చేసేవారని తెలుస్తోంది...తెగిన శరీరభాగాలను శస్త్రచికిత్స చేసి సరిచేయటం కూడా జరిగేదట.

    ఒకప్పుడు.. రోగి ముఖాన్ని, నాడిని పరిశీలించి, యంత్రాలతో సంబంధం లేకుండా రోగాన్ని నిర్ధారించగలిగే విధానాలు ఉండేవి.

    గత కొన్ని శతాబ్దాలుగా (అంటే, ఆధునిక కాలంలో..) ఆధునిక అలవాట్ల వల్ల రోగాలు పెరుగుతున్నాయి.

    ఎనభైలలో లేక తొంభైలలో ఎంతమంది సంతానాన్ని పొందారు ? అన్నది ముఖ్యం కాదండి.ఎనభైలలో లేక తొంభైలలో ఇప్పుడు ఉన్నంతగా చిన్నపిల్లలలో కూడా కేన్సర్, మూత్రపిండాల వ్యాధి వంటి వ్యాధులు రావటం జరగలేదు.

    .ఒక తరం సజీవంగా ఉంది. అలా ఉండటమేగాక వారికి నకళ్ళను తయారుచేయడానికి పలువిధాలుగా కృషిచేస్తుంది.దేవుడా! ఆ తరానికి జన్మరాహిత్యాన్ని ప్రసాదించు. అన్నందుకు మీకు కృతజ్ఞతలు.

    ReplyDelete