koodali

Wednesday, February 11, 2015

శ్రీ రామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు ..సమర్పించటం...

 
శ్రీ రామ నవమి సందర్భంగా  భధ్రాచలం దేవాలయం  వద్ద   రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాలతలంబ్రాలు ..  సమర్పించటం ఆనవాయితీగా జరుగుతోంది. 

అయితే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  పట్టువస్త్రాలు సమర్పించే విషయంలో కొన్ని సందేహాలు ఉన్నట్లు మీడియా చర్చల ద్వారా తెలుస్తోంది. 


ఉత్తరాంధ్రాలోని  రామతీర్ధం దేవాలయం  అని కొందరూ,   రాయలసీమలోని  వొంటిమిట్ట రామాలయం అని కొందరూ అంటున్నారు.


   ఒక సంవత్సరం రామతీర్ధం దేవాలయం .... ఇంకొక  సంవత్సరం వొంటిమిట్ట దేవాలయం.. అనుకుంటే సమస్య ఉండదు కదా... 


 మరొక నిర్ణయం ఏమైనా ఉందేమో తెలియదు. ఏమైనా,  అందరూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి.


3 comments:

  1. 1948 వరకు నిజాము, అప్పటి నుండి 1956 వరకు హైదరాబాదు ముఖ్యమంత్రి గార్లకు ఈ హక్కు ఉండేది. అంచేత ఇప్పటి నుండి తెలంగాణా ముఖ్యమంత్రి ఆనవాయితీ కొనసాగించడమే సబబు.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    శ్రీ రామనవమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ దేవాలయం వద్ద పట్టువస్త్రాలు..సమర్పించాలి.. అనే విషయం గురించి జరిగిన చర్చ గురించి నాకు కలిగిన అభిప్రాయాన్ని వ్రాయటం జరిగింది.

    ఈ విషయం గురించి టీవీ చానల్లో జరిగిన చర్చ చూసిన తరువాతే నాకు ఈ ఆలోచనలు కలిగాయి. అంతకుముందు ఈ విషయాల గురించి నాకు ఆలోచనలు రాలేదు.

    బహుశా చానల్లో ఈ చర్చ జరగటానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. అవి ఏమంటే..

    ఉమ్మడిరాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రభుత్వం తరపున ఉమ్మడి రాష్ట్ర ప్రతినిధి భద్రాచలం ఆలయం వద్ద పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించేవారు.

    అయితే, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున భధ్రాచలం దేవాలయం వద్ద పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించవచ్చో ? లేదో ? తెలియదు కదా..

    అలాగని ఎప్పటిలా పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సీతారాములకు సమర్పించకపోతే ఎలా? అనే సందేహాలు ప్రజలకు కలిగి ఉంటాయి.

    శ్రీ రామనవమి సందర్భంగా, ఎప్పటిలా తమ తరపున సీతారాములకు పట్టువస్త్రాలను,ముత్యాల తలంబ్రాలను సమర్పించితే బాగుండు.. అని ఏపి వారికి అనిపించి ఉంటుంది.

    అయితే, ఏ దేవాలయం వద్ద సమర్పించాలి.. అనే విషయం గురించి సందేహాల వల్ల ఈ చర్చ జరిగింది.

    సీతారాములు అందరివాళ్ళూ కాబట్టి, వాళ్ళు ఎక్కడయినా ఉంటారు కాబట్టి, ఏపి ప్రభుత్వం సీతారాములకు పట్టువస్త్రాలను సమర్పించాలని చర్చలో పాల్గొన్న వారి అభిప్రాయం.

    ................

    Jai Gottimukkala ! గారు

    ఏపి ప్రభుత్వం భధ్రాచలం దేవాలయం వద్దే పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించవచ్చు కదా..అనేది మీ ఆలోచనా ? లేక ఏపీ లోని దేవాలయం వద్దే సమర్పించవచ్చు కదా .. అనేది మీ ఆలోచనా ?
    లేక,

    ఏపీ ప్రభుత్వం సీతారాములకు పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను అసలు సమర్పించనే అక్కర్లేదు అని మీ అభిప్రాయమా ?


    ReplyDelete
  3. అప్పటి తానీషా రాజ్యం లో ఇప్పటి ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనేక ప్రాంతాలు కూడా ఉన్నాయంటారు.

    అలాంటప్పుడు, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భధ్రాచలం దేవాలయం వద్ద పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించవలసి ఉంటుందేమో ...
    లేక,
    మరొక నిర్ణయం ఏమైనా ఉందేమో తెలియదు. ఏమైనా, అందరూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి.
    ......
    అప్పటి రాజ్యంలోని ప్రాంతాల వివరాల కోసం అంతర్జాలంలో వెతుకుతుంటే ఈ లింక్ కనిపించింది. ఈ లింక్ నుంచి అప్పటి రాజ్యం యొక్క వివరాలు తెలుస్తున్నాయి.

    Aruna Kumari - Please Save Andra pradesh. Hyderabad has...

    రచయిత అనుమతి అడగకుండా లింక్ ఇవ్వవచ్చో లేదో నాకు తెలియదు. అభ్యంతరాలుంటే దయచేసి తెలుపగలరు.

    ReplyDelete