koodali

Monday, December 22, 2025

పగిలిన గాజుముక్కలను....

 

ఎన్నో గాజు సామాన్లను వాడతాం. అవి పగిలినప్పుడు మాత్రం వాటిని ఎక్కడ ఎలా పడెయ్యాలో అనేది కష్టంగా ఉంటుంది.


 పగిలిన గాజుముక్కలను అలాగే బయట పడేస్తే అవి గుచ్చుకుని పారిశుధ్యసిబ్బందికి, బయట ఆహారం కొరకు తిరిగే జంతువులకు గుచ్చుకుని గాయాలు అయ్యే ప్రమాదముంది.

 అందువల్ల గాజు ముక్కలను ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి,  పాతబట్టలను మందంగా వాటికి గట్టిగా చుట్టి,  మరల ప్లాస్టిక్ కవర్లో చుట్టి అప్పుడు వాటిని ప్లాస్టిక్ చెత్త వేసే డబ్బాలలో వేయాలి. 

ఏదైనా పెట్టెలో పెట్టి పడేస్తే ఇంకా మంచిది. ఇంకా ఏమైనా పద్దతులు కూడా ఉండవచ్చు. 


ప్లాస్టిక్ కాకుండా, చిన్న గోనె సంచి లేక కాటన్ సంచిలో వేసి చుట్టి, తాడుతో కట్టి కూడా పడేయవచ్చు. కొబ్బరి పీచుతో కూడా సంచులను తయారుచేయవచ్చు.

 పగిలిన గ్లాస్ పడెయ్యటానికి విడిగా చెత్తబాక్సులను ఏర్పాటు చేయాలి.

 గాజు సామాను కొనకుండా జాడీలను, మట్టిపాత్రలను కొనవచ్చు.

పాతకాలంలో జాడీలను వాడేవారు. ఇప్పుడు కూడా జాడీలను అమ్ముతున్నారు. అలాగే జాడీలు తయారుచేసే పద్ధతిలో కప్పులు, చిన్న జాడీలు, మగ్గులను కూడా అమ్ముతున్నారు. అవి పగిలినా కూడా గాజుగ్లాసులా పదునుగా గుచ్చుకోవు. 
 

ఈ రోజుల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ కుప్పలుగా పడేసి వదిలేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సమాజంలో. అలాకాకుండా, సమాజం బాగుండేలా పాటించటానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. 

........................... 

ప్రపంచంలో  ఎన్నో సమస్యలున్నాయి. ఎవరికి ఏం చెప్పినా వినే వాళ్ళెంతమంది? పాటించేవాళ్లెంతమంది?
 ..................

దైవమే దిక్కు.

 

Monday, November 24, 2025

కొన్ని విషయములు..

 

 link..

ఓం, దైవానికి అనేక వందనములు...

 link..

  • ఓం..
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. ....4
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. .3
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్....2
  • వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. 1

  • కొన్ని సందేహాలు..కొన్ని ఆలోచనలు..

     

     నాకు కొన్ని సందేహాలు కలిగాయి. 

    నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. దైవనామస్మరణ.. చేస్తే దోషం కాదు కాని, మంత్రాలు.. స్తోత్రాలు.. చేయకూడదంటున్నారు కొందరు.

      కార్తికమాసంలో కొన్ని దేవాలయాల్లో ఎవరైనా నెలకు కొంత డబ్బు కడితే, నెలంతా అభిషేకాలు..పూజలు చేస్తున్నారు. ...

    అలాంటప్పుడు ఆ కుటుంబంలో స్త్రీలకు నెలసరి వస్తే అప్పుడు వాళ్ళ పేరు కూడా పూజలో చదువుతారు కదా....అప్పుడు వాళ్లు పూజ చేసినట్లే కదా..

    మరి అలాంటప్పుడు దోషం ఉంటుందా? ఉండదా? అని సందేహం అనిపించింది. 

    అర్చనలు చేయించుకునేటప్పుడు కూడా వేరే ఊళ్లలో ఉండే కుటుంబసభ్యుల పేర్లు కూడా చెప్పి అర్చన చేయిస్తారు. 

    పూజలో పేర్లు ఉన్న వాళ్ళు నెలసరిలో ఉంటే అప్పుడేమిటి?

     ఇలా పూజలు చేయించుకుంటే చేయించుకున్నవాళ్లకు, చేయించిన వాళ్లకు, చేసిన వారికి...కూడా దోషం వస్తుందా? అలా ఏమీ కాదా? 

    పూజకు డబ్బు కట్టిన తరువాత, ఎవరి ఇంట్లో అయినా అకస్మాత్తుగా మైల పాటించే పరిస్థితి వస్తే,  ఆ సంగతి
    ని వాళ్ళు   చెప్పకపోవచ్చు.

    అంటుముట్టు..మైల ఉన్నాకూడా, దేవాలయంలో లేకుండా దూరంగా ఉంటే, వారి పేరుతో ఏ పూజ అయినా  చేయించుకోవచ్చా? అలా చేస్తే ఏమైనా దోషం ఉంటుందా? ఉండదా? తెలియటం లేదు.

     ఇన్ని  సందేహాలు ఎందుకు అంటే, నెలసరి దోషం వల్ల చాలా కష్టాలు వస్తాయంటున్నారు అని.

    స్త్రీల అంటుముట్టు గురించి పబ్లిక్ గా మాట్లాడటం ఏమిటీ అంటున్నారు కొందరు.

     మరి స్త్రీల నెలసరి గురించి అలా చేయకూడదు..ఇలా చేయకూడదు..చేస్తే కష్టాలు వస్తాయని పబ్లిక్ గా కొందరు చెబుతున్నప్పుడు, ఆ సందేహాల గురించి పబ్లిక్ గా మాట్లాడితే తప్పేమిటి?

    ఇంకా, చాలా విషయాల గురించి కూడా.. ఇలా చేయకూడదు..అలా చేయకూడదు..చేస్తే కష్టాలు వచ్చి మీద పడిపోతాయని చెబుతున్నారు. ఇవన్నీ విని, ఏం చేస్తే ఏం తప్పో? అనే పరిస్థితితో భయం, అయోమయం కలిగి, అనేక సందేహాలతో సతమతమయ్యే పరిస్థితి ఉంటుంది.

      .............................

    లోకకల్యాణం కొరకు పూజలు చేసే సందర్భాలలో.. లోకంలో అంతా బాగుండాలని పూజ చేస్తారు. 

    ఎవరికి వారు పూజలు చేయించుకునే సందర్భాలలో.. అంటుముట్టు, మైలలో ఉన్నవారు కొన్ని రోజులు ప్రత్యేక పూజలు చేయడానికి దూరంగా ఉండాలంటారు.

    నాకు ఏమనిపిస్తోందంటే,  అర్చన, అభిషేకం వంటి సందర్భాలలో..వేరే ఊరిలో ఉన్న కుటుంబసభ్యులందరి పేర్లు చెప్పటం సంగతి ఏమోకానీ..

    అంతా బాగుండాలని, కుటుంబంలో అందరూ బాగుండాలని.. భావిస్తూ పూజ చేయిస్తున్నట్లుగా (పూజారి గారితో) పూజ చేయించవచ్చేమో? అనిపించింది. 

    (వేరే ఊరిలో ఉన్నవారి  పరిస్థితి(అంటుముట్టు..) గురించిన సంగతులు తెలియనప్పుడు, ఇలా కూడా చేయవచ్చేమో?..అనిపించింది.)

    .........................

      ఇంకొక విషయం ఏమిటంటే, కొన్నిసార్లు పూజలలో సుమారు అర్ధగంటకు పైగా  గోత్రనామాలు ..కుటుంబసభ్యుల పేర్లను చదవటంతోనే సరిపోతుంది.

     మేము చెన్నైలో ఉన్నప్పుడు,  అక్కడ దేవాలయంలో ..అర్చన కొరకు గోత్రనామాలు చెప్పకపోయినా కూడా,  స్వామిపేరుతో.. అని చెప్పి అర్చన చేసేవారు. 

    పేర్లు చెప్పకుండా ఈ పద్ధతి సులభంగా అనిపించింది.

    ....................

    గోత్రనామాలు చెప్పినా చెప్పకపోయినా,  దైవప్రీతి కొరకు.. జీవప్రీతి కొరకు ..కష్టాలు తొలగటానికి ..ఇలా దైవానికి ఎవరికి వారు మనస్సులో కూడా చెప్పుకోవచ్చు.

    మన గురించి, మన ఆలోచనల గురించి..అన్నీ దైవానికి తెలుస్తాయి.

     ............................

    వ్రాసినవాటిలో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

     

    Sunday, November 9, 2025

    చక్కగా దైవాన్ని ఆరాధించుకోవచ్చు. ...

     

     సోషల్మీడియాలో చెప్పేవన్నీ పాటించకపోతే కష్టాలొస్తాయేమోననే భయపడనవసరం లేదు.

     అందరూ అన్నింటినీ పాటించలేరు. కలియుగంలో దైవస్మరణ..దైవనామస్మరణతోనే తరించవచ్చని ప్రాచీనులే తెలియజేసారు.

     ఎవరి శక్తికి తగ్గట్లు వారు దైవాన్ని ఆరాధించుకోవచ్చు. 
     

    దైవానికి మన విషయాలను చెప్పుకోవచ్చు. 

    హిందూత్వంలో నిరాకారం, సాకారం..ఇలా ఇంకా ఎన్నో పద్ధతులున్నాయి. మన శక్తికి తగ్గట్లు చక్కగా హాయిగా దైవాన్ని ఆరాధించుకోవచ్చు.

     సరైన విధంగా జీవించే శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధించుకోవచ్చు.

     

    ఇలాంటి గొప్ప తల్లులు అభినందనీయులు...



    చిన్నపిల్లలు వాళ్ళకువాళ్ళు చేత్తో తీసుకుని సరిగ్గా తినలేరు. చిన్నపిల్లలు పెద్దవారిలా గబగబా నమిలి తినలేరు. నిదానంగా తింటారు. అలాగని పిల్లలకు ఆహారాన్ని కుక్కి అదేపనిగా బోలెడు తినిపించకూడదు. 
     
    వాళ్ళకు ఎంతకావాలో అలాగ తల్లి దగ్గరుండి  ఓపికగా తినిపించాలి. అందుకు ఎక్కువ సమయమే పడుతుంది.

    అయితే, ఈ రోజుల్లో చాలామంది తల్లులు ఉద్యోగాల కొరకు వెళ్ళటం వల్ల పిల్లలకు చక్కగా తినిపించటానికి కూడా సమయం ఉండటం లేదు. 
     
    పిల్లలను డేకేర్ సెంటర్లలో వేస్తున్నారు. లేదంటే చిన్నప్పుడే స్కూల్లో వేస్తున్నారు. పిల్లలను త్వరగా అక్కడ దింపాలని ఉదయాన్నే వాళ్లకు హడావిడిగా ఏదో కుక్కి తినిపిస్తారు.

     ఇంట్లో ఉండే తల్లులు కూడా కొందరు ఈ విషయంలో ఓపికగా చేయటం లేదు. చిన్నపిల్లలు ఏమీ చేయలేరు కదా..
     
    కొందరు పిల్లలు ఉదా..3 సంవత్సరాల చిన్నపిల్లలు నాకు తినిపించమని పెద్దవాళ్ళను అడిగినా, నువ్వే తినాలంటూ తినిపించకుండా ఉండే పెద్దవాళ్ళను నేను చూసాను.. 
     
    పాపం చిన్నపిల్లలు తమకు తాము సరిగ్గా తినలేని వయస్సు వాళ్ళది...అలా అర్ధాకలితో ఉంటే  బాధ అనిపిస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడో?

    చాలామంది పిల్లలు తినటం విషయంలో విసిగిస్తారు. ఆ వయస్సు పిల్లలు చాలామంది అలాగే ఉంటారు. 
     
    కొందరు తల్లులు మాత్రం ఓపికగా మాటలు చెబుతూ తినిపిస్తారు. ఇలాంటి గొప్ప తల్లులు అభినందనీయులు.
     ......................................
     
    చంటిపిల్లల్ని క్రెచ్లలో వేసి పెద్దవాళ్లు ఉద్యోగం కోసం వెళ్తున్నారు. పిల్లల కొరకు డబ్బు సంపాదించటం కోసమే అలా చేస్తున్నామంటున్నారు కొందరు. 
     
    తల్లి వద్ద ఆప్యాయంగా పెరగవలసిన ....మాటలు కూడా సరిగ్గారాని చంటి పిల్లల్ని  పగలు ఎక్కడో బయట ఉంచుతున్నారు. అక్కడ వారిని మంచిగా చూస్తున్నారో ? లేదో? తెలియదు. చంటి పిల్లలు ఏమీ చెప్పలేరు. 
     
    పిల్లల్ని కొట్టిన కొన్ని సంఘటనల గురించి వార్తల ద్వారా తెలిసింది. కనీసం పిల్లలకు బాగా మాటలు వచ్చి తమ గురించి చెప్పేవరకయినా వారిని తల్లి దగ్గరుండి చూసుకోవాలి. 
     
    పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఉద్యోగం రాకుంటే, సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం చేస్తూ అయినా ఉపాధి పొందవచ్చు. 
     
    పిల్లల క్షేమం ముఖ్యం కదా.
    .....................................
     
    కొందరు తల్లితండ్రి , తమ పిల్లలను సరిగ్గ చూసుకోవటానికి కూడా సమయం లేదంటూ  బిజి అంటారు. 
     
    తాము పెద్దయ్యాక  మాత్రం,  ఏమీ తోచక ఫోన్ పుచ్చుకుని అస్తమాను పిల్లల జీవితాల్లో కల్పించుకుంటూ.. అదేపనిగా వాళ్లకు సలహాలిస్తూ పిల్లల విడాకులకు కారణమవుతున్న పెద్దవాళ్ళూ ఉన్నారు.
    ............................

    ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు ఉద్యోగాలని బయటకు వెళ్లటం వల్ల సమయం సరిపోక హడావిడిగా వండుకుని తింటున్నారు. పిల్లలు చదువులని బయట ఉండటం, ఇంకా అనేక కారణాల వల్ల చాలామంది బయట ఆహారాన్ని ఎక్కువగా తింటున్నారు. బయట ఆహారం పరిస్థితి ఎలా ఉందో.. ఈ లింక్ వద్ద గమనించవచ్చు.
    ................
     ఇంట్లో ఉండే స్త్రీలు కూడా కొందరు బయట ఆహారాన్ని ఎక్కువగా తెప్పించుకుంటున్నారు.

    ఇంట్లో సరైన ఆహారం లేక బయట ఎక్కువగా తింటే, పిల్లలకు, పెద్దవాళ్లకు అనారోగ్యం వచ్చే అవకాశముంది. ఆరోగ్య సమస్యలు వచ్చాక ఎంత డబ్బున్నా కూడా కొందరికి కొన్నిసార్లు అనారోగ్యం తగ్గటం కష్టమవుతుంది. అందువల్ల, అందరూ జాగ్రత్తగా ఉంటే మంచిది.
    ............
    ఈ మధ్య కొందరు యువతులు తాము ఇంజనీరింగ్ వంటివి చదువుకుని ఉద్యోగాలు చేయకుండా ఇంటిపనులు చేయటాన్ని తక్కువగా భావిస్తూ ..తామెంతో చిన్నపనులు చేస్తున్నట్లుగా పోస్టులు పెడుతున్నారు...
     
     స్త్రీలు కుటుంబబాధ్యతలను చక్కగా  నిర్వహించటం, పిల్లల్ని చక్కగా పెంచి శారీరికంగా, మానసికంగా ఉత్తమ పౌరులుగా చేయటం చాలా గొప్ప పనులు. 
     
     తమకు తమ కుటుంబసభ్యులకు ఇంత ఆహారాన్ని చక్కగా వండుకుని తినటం, ఇంటిని చక్కదిద్దుకోవటం తక్కువ పనులనుకుంటే ఎలా?
    ..................................
     కష్టాలున్నా కూడా , కుటుంబాన్ని చక్కగా చూసుకునే స్త్రీలు చాలామందే ఉంటారు.  అలాంటి వారు ఎంతో గొప్పవారు....అభినందనీయులు...
    ..............................
       యూట్యూబ్లో కొందరు అమ్మాయిలు తాము అత్తగార్లను ఎలా కంట్రోల్ లో పెడుతున్నది చూపిస్తున్నారు. పాతకాలంలో అత్తగార్లు కోడళ్లను కంట్రోల్లో పెట్టారు కాబట్టి, ఇప్పుడు కోడళ్ళు అత్తగార్లను కంట్రోలో పెట్టి మురిసిపోతున్నారు.

     అత్తగార్లు ఒకప్పటి కోడళ్ళే అని, కోడళ్ళూ కాబోయే అత్తగార్లేనని గుర్తంచుకుంటే అందరికి మంచిది.
    ............................

     చంటిపిల్లలు తల్లి దగ్గర ఉండాలనుకుంటారు. ఆ వయస్సులో వారిని 
    డేకేర్లో వేసి, వారి కొరకు బోలెడు డబ్బు సంపాదిస్తామంటారు. పెద్దవారిని వృద్ధాప్యంలో వృధాశ్రమంలో వేస్తే బాధపడతారు కదా..పిల్లలకు కొంత మాటలు చెప్పే వయస్సు వచ్చేవరకైనా ఇంట్లో వారు చూసుకుంటే మంచిది.

     పిల్లల్ని మంచిగా చూసుకునే సంస్థలు ఉండి, వారు పిల్లల్ని బాగా చూస్తారనే నమ్మకం కలిగితే వీడియో ద్వారా ఎప్పటికప్పుడు పిల్లల్ని చూసుకునే అవకాశం ఉంటే కొంతవరకు ఫరవాలేదు. ఇవన్నీ ఉండాలంటే ఎక్కువ డబ్బు అవుతుంది. 

     
    పిల్లల పెంపకం తేలిక కాదు. అయితే, చిన్న పిల్లల ముద్దు ముచ్చట్లను  చూస్తే, ఆ కష్టం కష్టంగా అనిపించదు. పిల్లల ముద్దుముచ్చట్లను   చూసుకునే సమయం జీవితంలో మళ్లీ వస్తుందా?

    చదువులు, ఉద్యోగాల కొరకు రాత్రింబగళ్లు చదివి ఎంత కష్టమైనా చేస్తున్నారు కదా.. అవన్నీ కూడా ఎంతో కష్టమైన పనులే. కుటుంబబాధ్యతలంటేనే బొర్ అనటం బాధాకరం.
     ....................
     కొందరు తల్లులు తమ పిల్లల్ని చావబాదిన  కేసులను గురించి కూడా విన్నాము. ఇదంతా ఎంతో బాధాకరం. 
    ..............

    చిన్నతనంలో పునాది బాగుంటే జీవితంలో మంచిపౌరులుగా తయారయ్యే అవకాశం ఉంది. తల్లితండ్రి ఎన్ని మంచి విషయాలను నేర్పించినా కూడా, బయటప్రపంచం, సోషల్మీడియా..వాటి ప్రభావం చాలానే ఉంటుంది..

    అయితే, తల్లితండ్రి మరీ స్ట్రిక్టుగా చెప్పటం కాకుండా, కొంత ఫ్రెండ్లిగా పిల్లలకు విషయాలను చెప్పటం మంచిది.

    తల్లి చెప్పిన మాటలను చాలామంది పిల్లలు వింటారు. అయితే, తల్లులు మంచి విషయాలను నేర్పించాలి. పిల్లల మనస్సులో పంతాలు, పట్టుదలలు, ఆవేశకావేషాలు, పాపాలు చేసైనా డబ్బు సంపాదించాలి..అనే విధంగా చెప్పకూడదు.

    అమ్మాయిలు..అబ్బాయిలు ఒకరినొకరు గౌరవించుకోవాలని, జీవితంలో అధర్మంగా ఉండకూడదని, ఇతరులను మోసం చేసి డబ్బు సంపాదించకూడదని చెపుతూ ఉంటే దాని ప్రభావం పిల్లలపై చాలా ఉంటుంది.  వాళ్లు మంచిపౌరులుగా తయారయ్యే అవకాశం ఎంతో ఉంటుంది.

    అయితే,  సమాజంలో చెడు ప్రభావం వల్ల, ఎంత చెప్పినా కొందరు త్వరగా మాట వినేటట్లు లేరు. 
     
     ఈ రోజుల్లో తల్లితండ్రికి పిల్లలతో గడపటానికి కూడా సమయం ఉండటం లేదు. 

    సరిగ్గా తినటానికి సమయం లేక, కుటుంబసభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి సమయం లేనప్పుడు ఎందుకొరకు అంత డబ్బు సంపాదించాలి? జీవితంలో డబ్బు ఎంతో ముఖ్యమే. అయితే, జీవితం కూడా ఎంతో ముఖ్యం.
    ................................

     కుటుంబసభ్యులకు తీరిక దొరికినా కూడా ఒకరితో ఒకరు ఏం మాట్లాడాలో తెలియక ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. కుటుంబసభ్యుల మధ్య అనేక కారణాల వల్ల సఖ్యత లేక గొడవలు పడుతున్నారు. మనుషుల్లో పంతాలు, పట్టుదలలు ఎక్కువయ్యాయి.

    కుటుంబం అంటే ఎన్నో సమస్యలుంటాయి. పెద్దవాళ్లతో అభిప్రాయ బేధాలు, భార్యాభర్త మధ్య ఇగోలు, పిల్లల సమస్యలు, డబ్బు సమస్యలు..ఎన్నో ఉంటాయి. ఇలాంటప్పుడు బయట వారితో స్నేహాలు బాగున్నట్లు అనిపిస్తాయి. 

    ఈ రోజుల్లో వ్యవస్థ అంతా మారిపోయింది కాబట్టి, ఎంతో ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి.

    ఒకే ఇంట్లో ఉంటూ  పెద్దవాళ్లతో సరిపడకుంటే , పెళ్లయిన పిల్లలు, పెద్దవాళ్లు..పక్కపక్కన ఇళ్లలో ఉండవచ్చు లేక ఒకే ఊరిలో దూరంగా వేరే ఇళ్ళలో ఉండవచ్చు. అప్పుడు సహాయం అవసరమైనప్పుడు ఒకరికొకరు అందుబాటులో ఉంటారు....ఇంకా కుదరకపోతే వేరే ఊర్లో ఉండవచ్చు.
    ...............

    చాలామంది డబ్బు సరిపోవటం లేదంటారు. 

    ఈరోజుల్లో ఒకరిని చూసి ఒకరు పోటీలుపడుతూ డబ్బు ఖర్చు చేసి అనేక వస్తువులను కొనటం ఎక్కువయ్యింది. చూసినవన్నీ కొంటూ పోతే ఇంట్లో అందరూ ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు సరిపోదు.

    వ్యాపారస్తులు వస్తువుల ధరలు పెంచేస్తున్నారు. ప్రజలు వస్తువులను అదేపనిగా కొనటాన్ని తగ్గిస్తే, వాళ్ళు ధరలు  కూడా తగ్గించక తప్పదు. 
     
     అదేపనిగా వస్తువుల్ని కొని పడేస్తుంటే చెత్త పెరిగి పర్యావరణసమస్యలు కూడా పెరుగుతాయి.
    ......................................

    సరైన ఆహారం, కుటుంబసభ్యుల మద్య ఆప్యాయతలకు సమయం లేనప్పుడు ఎంత డబ్బున్నా ఏం లాభం? సరైన ఆహారం, ఆప్యాయత ఉన్న కుటుంబాలలో వారు ఆరోగ్యంగా, చక్కగా జీవిస్తారు, అలాంటివారు ఉన్న సమాజమూ బాగుంటుంది.
    ....................

     ఈ రోజుల్లో 
    చాలామంది ఆదరాబాదరాగా ఉదయాన్నే పరుగులు పెడుతున్నారు. చంటిపిల్లల్ని డేకేర్లో వేయటం , పెద్దవాళ్ళు ఉద్యోగాలకు పోవటం..ఇలా ఉంటుంది.

     చిన్నతనంలోనూ టైం అయిపోతోందంటూ టెన్షనే, పెద్దయ్యాక అఫీసుల్లో టార్గెట్లతో టెన్షనే, ఇక వృద్దాప్యం వచ్చాక సంపాదించిన సొమ్ము హాస్పిటల్స్క్ పోస్తూ టెన్షన్లతోనే జీవితం సమాప్తం అవుతుంది. 
     
    చివరికి మిగిలేదేమిటి?


    స్త్రీలు నెలసరి వాయిదా మందులు వేసుకుని, ఆరోగ్యం పాడుచేసుకోవద్దు...మరికొన్ని..

     

    ఈ రోజుల్లో చదువులు, ఉద్యోగాల వల్ల వత్తిడి పెరిగి ఆడవాళ్ళకు నెలసరి సరిగ్గా రావటం లేదు. 

    చదువుల వత్తిడి వల్ల చాలామంది అమ్మాయిలకు మూడునెలల వరకు కూడా నెలసరి రాకుండా ఉంటున్నాయి.

    ఈ నెలసరి అంటుముట్టు గొడవల వల్ల  కొన్నిసార్లు  ...పండుగలు, పూజలు, శుభకార్యాలను కూడా ప్రశాంతంగా చేసుకోలేని పరిస్థితి  ఉంటుంది.

     నెలసరి వస్తుందేమో? అని భయపడుతూ ఉండవలసి ఉంటుంది.

    ముందురోజు పూజకు సామాగ్రి కొనుక్కున్నా, పూజ చేస్తున్నా, ఫంక్షన్ జరుగుతున్నా కూడా సడన్ గా తమకుకానీ, తమ కుటుంబసభ్యులకు కానీ నెలసరి వస్తే ఏం చేయాలి? పూజ పూర్తి అవకపోతే మళ్ళీ చేయాలా? ఇలా ఎన్నో సందేహాలతో ప్రశాంతతే ఉండదు. 

    ఈ విషయాల వల్ల కుటుంబసభ్యుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి.
    ..............................

     ఈ రోజుల్లో  చాలారకాల పూజలను చాలామంది చేస్తున్నారు కదా..

     పూజలప్పుడు  కొందరు నెలసరి వాయిదా వేయటానికి మందులు వేసుకొంటున్నారు. ఇందువల్ల తరువాత చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.

    ఉదా..కొందరు కొన్ని వారాలు కొన్ని పూజలు చేస్తామనుకుంటారు. మధ్యలో నెలసరి రాకూడదని మందులు వేసుకుంటారు. 

    అలా అక్కరలేదు. నెలసరి వచ్చినా కూడా... తరువాత వారం ఆ పూజను కంటిన్యూ చేయవచ్చు. 

    కొన్ని పూజలు మాత్రం తిరిగి మొదటి నుంచి చెయ్యాలట...అంత ఓపిక లేనివాళ్లు పూజలు చేసే ముందే ఆలోచించుకుని మొదలుపెట్టడం మంచిది.

    ...........................

    సంతానం కలిగే వయస్సులో ఉన్న స్త్రీలు నెలసరి వాయిదా టాబ్లెట్స్ బాగా వాడితే పుట్టే పిల్లలకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉండవచ్చు. అందువల్ల, జాగ్రత్తగా ఉండాలి.

    నెలసరి అంటుముట్టు భయంతో నెలసరి వాయిదా..మందులు వేసుకుని, ఆరోగ్యం పాడుచేసుకోవద్దు...జాగ్రత్తలు తీసుకోవాలి.

    అనారోగ్యం వస్తే కష్టం....ఆరోగ్యం ఉంటేనే ఏమైనా చేయగలరు.

    ........................................... 

    వివాహం వంటి శుభకార్యాల్లో లగ్నపత్రిక, వివాహం..ఇలా ఎన్నో సందర్భాలుంటాయి. 

    అన్ని సందర్భాల్లో ఇంట్లో వారికి, బంధువులకు నెలసరి రాకుండా ఉండాలంటే కుదరదు.

     జన్మకొకసారి చేసుకునే వివాహంలో 
    నెలసరి వల్ల పాల్గొనకుండా ఉండాలంటే ఇంట్లో కుటుంబసభ్యులకు ఎంతో బాధగా ఉంటుంది.

     వివాహం అంటే వధువుకు నెలసరి ఇబ్బంది లేకుండా ముహూర్తం నిర్ణయిస్తారు.

    వధువు విషయంలో కూడా వివాహం సమయంలో అన్ని వేడుకలకు నెలసరి రాకుండా ఉండాలంటే కుదరకపోవచ్చు. 

    ఇలాంటి సందర్భాలలో టెన్షన్ వల్ల నెలసరి ముందే కూడా వచ్చే అవకాశముంది....

    అలాంటప్పుడు ఏం చేయలం...వేడుకలను పెంచుకుని నెలసరి వాయిదా మందులు మింగటం కన్నా, కొన్ని వేడుకలను తగ్గించుకోవచ్చు.  

    వివాహం సందర్భంగా కొన్ని వేడుకలు ఉంటాయి...అవన్నీ ఒకే రోజు ఉండవు.

     అయిదుసార్లు వేడుకలకు బదులు రెండు లేక మూడు సార్లు సరిపెట్టుకోవచ్చు.లేదా కొన్ని రోజులు తేడాతో ఫంక్షన్స్ జరుపుకోవచ్చు.

     నెలసరిలో ఉన్నప్పుడు దేవాలయాలకు వెళ్ళటం, పూజలు చేయటం దోషం కాబట్టి, అందుకు తగినట్లు మొదటే జాగ్రత్తగా తేదీలను నిర్ణయించుకోవాలి.

     ................................

    నాకు తెలిసిన ఒకమ్మాయి వివాహం సందర్భంగా నెలసరి ఆపటానికి ఒక వారం ముందు నుండి మందులు వేసుకుంటే, ఆ అమ్మాయికి ముఖానికి, పెదవులకు కొంచెం వాపు కూడా వచ్చింది.... 

    ఏమీ కాదంటూ అలాగే మాత్రలు వేయించారు పెద్దవాళ్ళు. 

    అలా మందులు వేసుకుని ....వివాహం రోజుకు కొద్దిగా గోధుమరంగు డిశ్చార్జ్ కనిపిస్తే నెలసరి అవునా? కాదో? అమ్మాయికి కూడా అర్ధం కాదు. 

    కొందరికి మందులు వేసుకున్నా కూడా ఆగినట్లు ఉండదు.

    .............................

     ప్రాచీనులు చెప్పినట్లు  ఖచ్చితంగా పాటించాలంటే.... నెలసరిలో ఆడవాళ్లు చదువులు, ఉద్యోగాల కొరకు కూడా ఖచ్చితంగా బయటకు వెళ్ళకూడదు.  

     మరి చదువులు, ఉద్యోగాలని నెలసరి రోజుల్లో బయటకు వెళ్ళి కలిపేస్తే కూడా పాపమే కదా..

    కాలానుగుణంగా మారక తప్పదంటూ స్త్రీలు చదువులు, ఉద్యోగాలకు నెలసరి రోజుల్లో కూడా వెళ్తున్నారు.  ఈ రోజుల్లో అలా ఇంట్లో కూర్చుంటే ఎలా కుదురుతుంది 
    ..బయటకు వెళ్తే దోషంకాదు..అంటారు.

    ( ఇలా..అవసరాన్ని బట్టి మాట్లాడటం, అవసరాలకు తగ్గట్లు మార్చుకోవటం అంటారు.)

    బయట దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు..పూజలు చేసుకున్నవాళ్ళు ఉంటారు. నెలసరిలో ఉన్నవాళ్ళు బయటకెళ్ళి తిరిగితే దోషం కాదా? మనకు అవసరం కాబట్టి బయటకు వెళ్తే దోషం ఉండదా?

     ..............................

     నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. చక్కగా చేసుకోవచ్చు.
    .................................

     oka link...చేతనైతే ఈ సమస్యలను.........

    oka link.. ఈ ఆచారం ఎక్కడవరకు వెళ్ళిందంటే..

    ........................

     mari konni vishayaalu....

     నాకు కొన్ని సందేహాలు కలిగాయి. 

    నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. దైవనామస్మరణ.. చేస్తే దోషం కాదు.  కాని, మంత్రాలు.. స్తోత్రాలు.. చేయకూడదంటున్నారు కొందరు.

      కార్తికమాసంలో కొన్ని దేవాలయాల్లో ఎవరైనా నెలకు కొంత డబ్బు కడితే, నెలంతా అభిషేకాలు..పూజలు చేస్తున్నారు. ...

    అలాంటప్పుడు ఆ కుటుంబంలో స్త్రీలకు నెలసరి వస్తే అప్పుడు వాళ్ళ పేరు కూడా పూజలో చదువుతారు కదా....అప్పుడు వాళ్లు పూజ చేసినట్లే కదా..

    మరి అలాంటప్పుడు దోషం ఉంటుందా? ఉండదా? అని సందేహం అనిపించింది. 

    అర్చనలు చేయించుకునేటప్పుడు కూడా వేరే ఊళ్లలో ఉండే కుటుంబసభ్యుల పేర్లు కూడా చెప్పి అర్చన చేయిస్తారు. 

    పూజలో పేర్లు ఉన్న వాళ్ళు నెలసరిలో ఉంటే అప్పుడేమిటి?

     ఇలా పూజలు చేయించుకుంటే చేయించుకున్నవాళ్లకు, చేయించిన వాళ్లకు, చేసిన వారికి...కూడా దోషం వస్తుందా? అలా ఏమీ కాదా? 

    పూజకు డబ్బు కట్టిన తరువాత, ఎవరి ఇంట్లో అయినా అకస్మాత్తుగా మైల పాటించే పరిస్థితి వస్తే,  ఆ సంగతి
    ని వాళ్ళు   చెప్పకపోవచ్చు.

    అంటుముట్టు..మైల ఉన్నాకూడా, దేవాలయంలో లేకుండా దూరంగా ఉంటే, వారి పేరుతో ఏ పూజ అయినా ( చండీ హోమము, రుద్రాభిషేకము, సత్యనారాయణస్వామి వారి వ్రతములు..ఇలా ఏ పూజ అయినా ..) చేయించుకోవచ్చా? అలా చేస్తే ఏమైనా దోషం ఉంటుందా? ఉండదా? తెలియటం లేదు.

     ఇన్ని  సందేహాలు ఎందుకు అంటే, నెలసరి దోషం వల్ల చాలా కష్టాలు వస్తాయంటున్నారు అని.

    .............................

    కుటుంబసభ్యులందరూ పూజ చేస్తున్నట్లుగా  వారి పేర్లు చెప్పటం కాకుండా, అంతా బాగుండాలని....కుటుంబంలో అందరూ బాగుండాలని భావిస్తూ పూజ చేయిస్తున్నట్లుగా (పూజారి గారితో) పూజ చేయించవచ్చేమో? అనిపించింది.

     అంటే , వాళ్లు పూజ చేస్తున్నట్లుగా భావించటం కాకుండా, పూజారి గారి చేత పూజ చేయిస్తున్నట్లు అయితే అంటుముట్టు దోషాలు ఉండవేమో?..అని నాకు అనిపించింది. .

    అయితే, అంటుముట్టు ఉన్నవారి గోత్రనామాలు చదివి పూజలు చేయవచ్చా? లేదా? అన్నది నాకు తెలియదు.

    ..........................

     నేను గమనించిన విషయం ఏమిటంటే, కొన్నిసార్లు పూజలలో సుమారు అర్ధగంటకు పైగా ఈ గోత్రనామాలు ..కుటుంబసభ్యుల పేర్లను చదవటంతోనే సరిపోతుంది.

     మేము చెన్నైలో ఉన్నప్పుడు,  అక్కడ దేవాలయంలో ..అర్చన కొరకు గోత్రనామాలు చెప్పకపోయినా కూడా,  స్వామిపేరుతో.. అని చెప్పి అర్చన చేసేవారు. 

    పేర్లు చెప్పకుండా ఈ పద్ధతి సులభంగా అనిపించింది.

    ....................

    గోత్రనామాలు చెప్పినా చెప్పకపోయినా,  దైవప్రీతి కొరకు.. జీవప్రీతి కొరకు ..కష్టాలు తొలగటానికి ..ఇలా దైవానికి ఎవరికి వారు మనస్సులో కూడా చెప్పుకోవచ్చు.

    మన గురించి, మన ఆలోచనల గురించి..అన్నీ దైవానికి తెలుస్తాయి.

     

    గ్రంధముల లోని ఒక కధ..కొన్ని అభిప్రాయాలు..


    గ్రంధాలలోని ఒక కధలో ఒక స్త్రీ.. ఒక రాజు కొడుకు.. అక్రమంగా తిరగటం.. కధలో.. 

     ఇవన్నీ సామాన్యులు  సరిగ్గా అర్ధం చేసుకోలేక, మంచిగా ఉన్నవారు నరకానికి పోవటం, చెడ్దపనులు చేసిన వాళ్లు స్వర్గానికి వెళ్లటం ఏమిటి? అని అనుకునే ప్రమాదముంది. 

     చెడు పనులు చేసిన వారు దయాభిక్షలా పుణ్యం ధారపోస్తే... స్వర్గానికి వెళ్ళవలసిన పరిస్థితి మంచివారికి ఏమిటి? అనిపిస్తుంది.
    ..................................

    రాజకుమారుడు చనిపోయేముందు ఆత్మ రక్షణ కొరకు బ్రాహ్మణుని కూడా చంపటం జరిగిందని  ఒక దగ్గర విన్నాను. 

    రాజకుమారుని ఒక్క కత్తివేటుతో చంపి, తరువాత బ్రాహ్మణుడు తనను తాను చంపుకున్నట్లు మరొక దగ్గర చదివాను. 

    ( ఒక్కవేటుతో రాజకుమారుడు చనిపోయినప్పుడు,  ఆత్మరక్షణ కొరకు బ్రాహ్మణుని ఎలా చంపగలడు?)

     తనను తాను చంపుకోవటం అంటే ఆత్మహత్య .  ఆత్మహత్య పాపం అంటారు కాబట్టి.. అలా కూడా బ్రాహ్మణున్ని నరకానికి తీసుకుపోవటానికి యమదూతలు వచ్చారేమో?

    ............................................

     రాజకుమారుడు మొదట్లో మంచిగా ప్రవర్తించేవాడని, తరువాత అతను దురలవాట్లకు లోనయ్యి రాజ్యంలోని స్త్రీలను కూడా వేధించేవాడని తెలుస్తుంది..... 

      రాజకుమారుడు వాళ్ళు తాము చేసిన పాపానికి పశ్చాత్తాపం చెందారో ? లేక ఎందుకో తెలియదు కానీ, తమ దీపారాధన పుణ్యాన్ని బ్రాహ్మణునికి కొంత ఇవ్వటానికి ముందుకు వచ్చారు. 

    రాజకుమారుని తల్లితండ్రి గతంలో చేసిన పుణ్యాల వల్ల.. రాజకుమారుడు గతంలో చేసిన ఏమైనా పుణ్యాల వల్ల  ఇంకా..దీపారాధన చేసిన పుణ్యం వల్ల.. అతనికి తాను పొందిన  పుణ్యంలో కొంత భాగాన్ని బ్రాహ్మణునికి ఇవ్వాలనే ఆలోచన వచ్చి ఉండవచ్చు.

     బ్రాహ్మణుడు ఇంతకుముందు  చాలా  పూజలు, పుణ్యాలు చేసిఉంటారు కాబట్టి,  మొత్తానికి అతను స్వర్గానికి వెళ్ళటం జరిగిందని ఒక దగ్గర విన్నాను. 

    దుష్ప్రవర్తన కలిగిన రాజకుమారుని చంపటం ద్వారా ....రాజ్యంలోని స్త్రీలకు ఉపకారం కూడా జరిగింది.

    బ్రాహ్మణుడు చేసిన పూజలు, పుణ్యాల వల్ల పరిస్థితులు కలసి వచ్చి  బ్రాహ్మణుడు స్వర్గానికి వెళ్ళటం జరిగింది.
    ......................
      

     రికొన్ని ఆలోచనలు...........

    ఆ రాజకుమారుడు భయపెట్టి ఆమెను లొంగదీసుకుని ఉండవచ్చు.

    (అయితే, కధను గమనిస్తే  ఆ స్త్రీ తాను కూడా ఇష్టంగానే రాజకుమారునితో ఉన్నట్లు  తెలుస్తుంది.) 

     భార్య  వేరే వారి మోజులో పడితే  తప్పే.

    ........................... 

     ఆ రాజకుమారుని తండ్రి.. పుత్ర ప్రేమతో తన  కొడుకుకు సరైన బుద్ధి చెప్పకుండా అలా వదిలేయటం తప్పు...ఇంకా అతడేం న్యాయం చేస్తాడు ప్రజలకు?

    .............................

    ఆ స్త్రీ భయంతో రాజకుమారునితో ఉన్నదో? లేక ఇష్టపడి ఉన్నదో? తెలియదు.

     నాకు ఏమనిపిస్తుందంటే, ఆ స్త్రీ ఇష్టంగానే రాజకుమారునితో ఉంటే,  ఆ స్త్రీ యొక్క భర్త ఆమెను సరిగ్గా పట్టించుకోలేదేమో? 

    (అయితే, కొందరు మగవారు...ఆడవారు తమ జీవితభాగస్వామి ఎంత బాగా చూసుకున్నా కూడా పరాయి వాళ్ల మోజులో పడుతారు.)

    ........................ 

    జీవితానికి పరమార్ధం మోక్షాన్ని పొందటం అనేది నిజమే కానీ, మనకు నాలుగు ఆశ్రమాలను పెద్దలు తెలియజేసారు.

     గృహస్తాశ్రమంలో ఉండగా సన్యాసాశ్రమంలా కాకుండా,  భార్యాభర్తలు అన్యోన్యంగా కూడా ఉండాలి. 

    భార్యాభర్త ఇద్దరూ ఇష్టపూర్వకంగా ఒకే విధంగా ఆలోచించుకుని చాలా నియమాలను పాటిస్తూ జీవిస్తే.. అది వేరే విషయం.

    .......................................

    గృహస్తాశ్రమంలో ఉన్నప్పుడు భార్యాభర్త అన్యోన్యంగా లేకుంటే గొడవలు, అక్రమసంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. 

    దైవాన్ని స్మరించుకోవటం, నిత్యపూజ చేయటం..వీటికి భార్యాభర్త సంసారానికి దూరంగా ఉండనవసరం లేదు. 

    కొన్ని పండుగలు, కొన్నిపూజలు రోజుల్లో బ్రహ్మచర్యాన్ని పాటించి,  మిగతా రోజుల్లో  భార్యాభర్త అన్యోన్యంగా సంసారం చేయవచ్చని నా అభిప్రాయం.
    ...................................

     కధలలో మనకు తెలియని అంతరార్ధాలు ఎన్నో ఉంటాయి. పైపైన తెలుస్తున్న వాటిప్రకారం నా అభిప్రాయాలను వ్రాయటం జరిగింది.

    వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని కోరుకుంటున్నాను.
     

    Friday, November 7, 2025

    కొన్ని విషయాలు..

    Friday, October 31, 2025

    చేసిన తప్పు లకు పశ్చాత్తాపాన్ని పొంది.....

     

     దైవానుగ్రహం పొందాలన్నా, గురువు అనుగ్రహం పొందాలన్నా సత్ర్ప్రవర్తన అవసరం.

        కొందరు పాపాలు చేసి, తరువాత చేసిన పాపాలకు పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తారు.  తాము పశ్చాత్తాపం చెందాం కాబట్టి,  ఇక తమకు ఎటువంటి శిక్షా లేకుండా ఉండాలని కూడా కొందరు ఆశిస్తారు. 

    ఇలాంటి వాళ్ళు నిజంగా పశ్చాత్తాపం చెందారా లేక పరిస్థితి అనుకూలిస్తే మళ్ళీ నేరం చేస్తారా? అనేది తెలియదు.

            నిజంగా పశ్చాత్తాపం చెందినా కూడా కొంతయినా  శిక్ష పడక తప్పకపోవచ్చు. ఎందుకంటే, నేరస్తుల వల్ల బాధితులకు జరిగిన అన్యాయం, బాధ, ఆక్రోశం ఉంటాయి కదా!

       చిన్న నేరం అయితే బాధితులు నేరస్తులను క్షమించే అవకాశం ఉంది, లేక కొద్దిపాటి శిక్షతో సరిపెట్టుకోవచ్చు.

      పెద్ద నేరం, క్రూరమైన నేరం చేస్తే మాత్రం.. నేరం చేసిన వాళ్ళు పశ్చాత్తాపాన్ని ప్రకటించినా కూడా శిక్ష తప్పకపోవచ్చు. కొన్నిసార్లు మరణశిక్ష కూడా పడవచ్చు.  అప్పుడు, నేరస్తులు ఎంత ప్రాధేయపడినా ఉపయోగం ఉండకపోవచ్చు.

      అయితే, నేరం చేసిన కొంతకాలం తరువాత కానీ,మరణానికి ముందు కానీ .. పశ్చాత్తాపం కలిగితే దానివల్ల మరుజన్మలో కొంత మంచి జన్మ రావటానికి ఉపయోగపడవచ్చు.
        ........................................................
           
        సమాజంలో క్రూరమైన నేరం చేసిన తరువాత ఉరిశిక్ష పడితే ఆ శిక్ష నుండి తప్పించాలని జడ్జి ముందు ఎంత ఏడ్చి ప్రాధేయపడినా ఏం లాభం? 

    జడ్జి ఎంత దయకలవారైనా వారికి కొన్ని నియమాలు ఉంటాయి కదా..వారు చట్టం ప్రకారం నడచుకోవాలి.

       జీవులు తమను తాము నిగ్రహించుకోలేక పాపాలు చేసి, తత్ఫలితంగా కష్టాలు వస్తే దైవాన్ని నిందించటం సరికాదు.  .

       కొందరు పాపకర్మలను పరిహారాలు చేయటం ద్వారా తొలగించుకోవాలనుకుంటారు. అయితే, పాపకర్మల పరిహారం కొరకు పరిహారక్రియలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి.

    కొన్ని పరిహారాలను చేయటం కూడా కష్టమే. కొన్ని పరిహారాలను ఆచరించటం కంటే, కష్టాలను అనుభవించటం ద్వారా పాపక్షయం చేసుకోవటమే తేలికగా అనిపించవచ్చు.

    పరిహారాలు సరిగ్గా ఫలించాలన్నా సత్ప్రవర్తన అవసరం.
      .....................................................

            ఎవరైనా తప్పు చేస్తే చట్టంలో దానికి తగ్గ శిక్షలుంటాయి.  ఇలా శిక్షించటం ఎందుకంటే, శిక్ష వల్ల భయంతో ఇకమీదటైనా తప్పులు చేయరనే ఉద్దేశంతో శిక్షిస్తారు.

        అంతేకానీ , తప్పు చేసినా తప్పుకు శిక్షగా జరిమానా చెల్లించటం లేక కొంతకాలం జైల్లో ఉండి వచ్చి , చేసిన తప్పులకు పరిహారం జరిగిపోయింది కాబట్టి, మళ్లీ తప్పులు చేయటం ..అనేది అసలు ఉద్దేశం కాదు. 

    తిరిగి మళ్లీ తప్పు చేయకూడదనేది సరైన ఉద్దేశ్యం.

        చెడుపనుల వల్ల కష్టాలు వచ్చినప్పుడు, ఆ కష్టాల నుండి తప్పించుకోవటానికి పరిహార పూజలు చేసుకోవటంలో తప్పులేదు. అయితే పరిహారం జరిగింది కాబట్టి, మళ్లీ పాపాలు చేయటం తప్పు.

        ఎన్ని పాపాలు చేసినా .. పరిహారాలతో బైటపడవచ్చు ..అనే భావన ప్రజలలో వస్తే అది ఎంతో ప్రమాదకరమైనది. పూర్వీకులు మనకు తెలిపిన ఉద్దేశ్యాలకు వ్యతిరేకమైనది.
     ..............................

    కొందరు చేసే చెడ్దపనుల వల్ల సమాజంలో ఎందరికో కష్టాలు వస్తాయి.

    ఇలాంటప్పుడు దైవం చూస్తూ ఊరుకోరు.. చెడుపనులు చేసేవారిని తనదైన విధానంతో దారిలోకి తెస్తారు.

        ****************************
        రావణాసురుడు ఎంతో గొప్ప పండితుడు. అతనికి ఎన్నో పరిహారాలు తెలిసే ఉంటాయి. అయినా మరి శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడు.

        పాపాలు చేయటాన్ని కొనసాగిస్తున్నప్పుడు పరిహారాలు చేయాలన్నా..అనుకున్నట్లు జరగకపోవచ్చు.

    ***************************

    ఎవరైనా మంచిచేసినా.. చెడ్ద చేసినా దానికి తగ్గ ఫలితాలు ఉంటాయి.

        చెడ్దవారి విషయంలో ఎలాగూ వారు చేసిన చెడుపనులకు తగ్గ ఫలితాలు ఉంటాయి. 

    అయితే, కొందరు మంచివారికి కూడా కొన్ని కష్టాలు రావటం, వ్యాధులు రావటం.. లోకంలో గమనిస్తాం.

         ఎన్నో మంచిపనులు చేసినా కూడా ఇలాంటి కష్టం ఎందుకు వచ్చిందో కదా ..అనిపిస్తుంది. 

         కొన్ని విషయాలు ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, మంచివారి వల్ల కూడా కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బందులు వస్తాయి.

    ఉదా..ఒక మంచి వ్యక్తికి కోపం బాగా ఉండి అందువల్ల ఇతరులకు బాగా ఇబ్బందులు కలిగితే, అందువల్ల కూడా ఆ మంచివ్యక్తికి కొన్ని బాధలు కలిగే అవకాశముంది.

        ఉదా..ఒక మంచివ్యక్తి తాను కొన్ని మూఢనమ్మకాలను నమ్మి, కుటుంబసభ్యులను, ఇతరులను కూడా ఆ మూఢనమ్మకాలతో ఇబ్బంది పెడితే, ఆ ఉసురు వల్ల అతనికి ఈ జన్మలోనో, మరుజన్మలోనో..కొన్ని కష్టాలు..వచ్చే అవకాశముంది.
     .................................

    భక్తులమని చెప్పుకునే వాళ్ళలో కూడా కొందరు చెడుపనులు చేస్తున్నారు. భక్తులనే వాళ్లు పాపాల విషయంలో ఎందుకు భయపడటం లేదు? 

    బహుశా వాళ్ళ ఉద్దేశం ఎన్ని పాపాలు చేసినా దానికి తగ్గ పరిహారం చేసుకుంటే చాలు.. పాపాల నుంచి విముక్తులు కావచ్చని అనుకుంటున్నారు కాబోలు, లేక మనస్సును అదుపులో ఉంచుకోలేక తిరిగి తప్పులు చేస్తారు.    

     ................................................ 

    దైవనామ స్మరణాన్ని, పూజలు చేయటాన్ని  మొదలుపెట్టి, అలా పూజలు  చేస్తూచేస్తూ..ఉండటం వల్ల  క్రమంగా   పాపాత్ములలో  మార్పు వచ్చి మంచిగా  పరివర్తన చెందుతారు.

    * మందులు మనకు ఇష్టం ఉండి వేసుకున్నా, ఇష్టం లేక  మ్రింగినా అనారోగ్యాన్ని  పోగొడతాయి కదా! అలాగే ఏ కారణంతో దైవనామస్మరణాన్ని మొదలుపెట్టినా ఫలితం లభిస్తుంది. 

    అయితే, దైవనామ స్మరణం చేసే వ్యక్తి  యొక్క  భక్తిశ్రద్ధలు , నీతినిజాయితీలను బట్టి  ఫలితాల్లో  ముందువెనుక  తేడాలుంటాయి.  కొందరికి  శీఘ్రంగా  మంచి  ఫలితాలు  కనిపిస్తాయి. కొందరికి  ఒక జన్మలో  మంచి మార్పు  కనిపిస్తే, మరి  కొందరిలో  కొన్ని జన్మలు పట్టవచ్చు. 

    *  డాక్టరు  తన  వద్దకు  వచ్చిన  పది  మంది  రోగులకు  ఒకే రకం   మందులను  ఇచ్చినా ,  ఆ  రోగులు  సక్రమంగా  మందులను వేసుకోవటం,  సక్రమంగా  పధ్యాన్ని  పాటించే  విధానాలను   బట్టి  వారి  వ్యాధులు   తగ్గే  సమయంలో  ముందువెనుక  తేడాలుంటాయి.   
     
    కొందరికి రోగం  త్వరగా  తగ్గుతుంది. కొందరికి ఆలస్యంగా  తగ్గుతుంది. మందులు  సరిగ్గా  వేసుకోకుండా, పధ్యం సరిగ్గా  పాటించని  వారికి  రోగం త్వరగా తగ్గకపోవచ్చు కూడా.
    ............................. 

     దైవాన్ని దృఢంగా నమ్మి శరణు పొందిన వారి విషయంలో దైవము, వారిని సరైన పద్ధతిలో జీవించేలా చేస్తారు.

    అయితే, భక్తులం అని చెప్పుకునేవారికి కొందరికి అహంకారంతో పాటు, తన భక్తి కూడా ఎంతో గొప్పది..తాను ఎన్నో పూజలు చేయటం వల్ల, తాను ఎలా ప్రవర్తించినా కూడా..దైవం కూడా తనకి లొంగక తప్పదు..అనే విధంగా అహంకారం ఉన్న వారి విషయంలో, వారు ఎన్ని పూజలు చేసినా కూడా గొప్పఫలితాలను పొందలేకపోవచ్చు. 

    ................................. 

        కష్టాల నుండి తప్పించుకోవాలంటే, చేసిన పాపాల గురించి పశ్చాత్తాపపడి మంచిమార్గంలోకి రావటానికి ప్రయత్నించాలి.

        తప్పులు చేసిన వారిని క్షమించటమూ అవసరమే. అయితే ఎంతవరకు?

        దైవం దయామయులు. ఎవరైనా మంచిగా మారటానికి కొంత సమయాన్ని ఇస్తారు.
        ఆ తరువాత కూడా వినకపోతే వారికి తగిన శాస్తి జరుగుతుందని పురాణేతిహాసాల ద్వారా తెలుస్తుంది.

        శ్రీరామునికి సీతాదేవిని అప్పగించేయమని ఎందరు చెప్పినా రావణాసురుడు వినలేదు.
        శివుని అంశ అయిన హనుమంతులవారు మంచి చెప్పినా రావణుడు వినిపించుకోలేదు. తుదకు అందుకు తగిన శిక్షను అనుభవించాడు.

    (రావణాసురునికి తాను గొప్పసంపదలు ఉన్న వ్యక్తిని అనే అహంకారంతో పాటు, తన భక్తి కూడా ఎంతో గొప్పది, తాను ఎలా ప్రవర్తించినా కూడా ..దైవం కూడా తన కి లొంగక తప్పదు.. అనే అహంకారం ఉండి ఉంటుంది.అందుకే అతనిపరిస్థితి అలా అయ్యిఉంటుంది. )

      శ్రీకృష్ణుడు..శిశుపాలుని నూరు తప్పుల వరకు సహించి తరువాత శిక్షించారు.

     అందువల్ల, అందరమూ జాగ్రత్తగా ఉండటం మంచిది.

     దైవం పట్ల ప్రేమతో కూడిన శరణాగతి ఉంటే,
     దైవం  కాపాడుతారు.
        ......................

        గతంలో చేసిన పాపాలకు దృఢంగా పశ్చాత్తాపపడి,  ఇక మీదట పాపాలు చేయటం మాని, పూజలు చేయటం, కష్టాల్లో ఉన్నవారికి సాయంచేయటం.. వంటి పరిహారాలు, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే.. గతపాపకర్మ ఫలితం గణనీయంగా పలుచబడి, తక్కువ కష్టాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కష్టాలు వచ్చినా పెద్ద కష్టం తెలియకుండానే ఆ కష్టాలు గడిచిపోవచ్చు.

    కష్టాలలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు వారు పొందిన సంతోషం వల్ల మన పాపకర్మ పలుచబడే అవకాశముంటుంది.

    పరిహారాలు సరిగ్గా పనిచేయాలంటే, పాపాలు చేస్తూనే పరిహారాలు చేయటం కాకుండా, పాపాలు చేయటం మాని పరిహారాలు చేస్తూ ఉండాలి.
    ...................................

    మద్యానికి అలవాటు పడ్డ కొందరికి మద్యం హానికరమని తెలిసినా దానిని వదలలేరు. మద్యం వల్ల వ్యాధి వస్తే కొందరు దానిని తీసుకోవటం మానేస్తారు. కొందరు వ్యాధి వచ్చినా మద్యాన్ని మానలేరు. 

    అలాగే కొందరు,  
    పాపాలు చేయటం తప్పని, అందువల్ల కష్టాలు వస్తాయని తెలిసినా,  తాము చేసిన పాపాలకు నిజంగా పశ్చాత్తాపాన్ని పొందుతూ కూడా.....పాపాలు చేయకుండా మాత్రం మనస్సును నిగ్రహించుకోలేరు. 

    అలాంటప్పుడు తమకు సరైనదారిలో జీవించేలా శక్తిని ఇవ్వమని దైవాన్ని దృఢంగా ప్రార్ధిస్తే దైవము కరుణించే అవకాశం ఉంటుంది.

    ...........................
     పాపపరిహారం కొరకు పరిహారాలు చేయటం మంచిదే....పాపపరిహారాలు చేయగాచేయగా...ఆ పుణ్యం వల్ల వాళ్ల పాపప్రవృత్తి పోవచ్చు. 

    పూజలు, దానధర్మాలను చేయటం వంటి పరిహారాల వల్ల....చేసేవారికి, సమాజానికి మంచిదే. 

    అయితే, సరైన దైవభక్తి లేకుండా, అహంకారం కలిగి ఉండటం, పాపభీతి లేకుండా చేసే పరిహారాల వల్ల గొప్ప ఫలితాలను పొందలేకపోవచ్చు.

      ...................................
      ఎన్ని పాపాలు చేస్తునా కూడా కొన్ని పరిహారాలు చేస్తే చాలు సరిపోతుందని అనుకోవద్దు. దైవము ఏమీ అమాయకులు కాదు.

    ఉదా..కొందరిని గమనిస్తే, వాళ్లకు  
    జీవితంలో చాలా  డబ్బు ఉన్నాకూడా,  మనశ్శాంతి లేకుండా ఉంటుంది. 

    చేసిన పుణ్యాలకు  ఫలితంగా డబ్బు ఉన్నాకూడా, చేసిన పాపాలకు ఫలితంగా మనశ్శాంతి లేకుండా ఉంటుంది. 
    ................................

     కష్టాలు రాకుండా ఉండాలంటే, మనస్సును నిగ్రహించుకోవటానికి ప్రయత్నించక తప్పదు. 
    ...................

    ఎవరికైనా మంచిగా మారటానికి దైవము కొన్ని అవకాశాలను ఇస్తారు. 

    ఎన్ని అవకాశాలు ఇచ్చినా మంచిగా మారకుండా సమాజానికి హాని కలిగే విధంగా పాపాలు చేసినవాళ్లు.. ఒకవేళ సమాజం వేసే శిక్షల నుండి తప్పించుకున్నా కూడా, దైవం నుండి తప్పించుకోలేరు.
    ...........................

    దైవభక్తి..ధర్మబుద్ధి ఉండేలా దైవాన్ని ప్రార్ధించుకుంటే బాగుంటుంది.
    ......................................

     అజామిళుని కధ. వంటి కధలను చెప్పటంలో....link krimda..

    link.... ఓం ..కొన్ని విషయములు..

     link..జాతకంలో రాసిపెట్టి ఉన్నది అనుభవించక తప్పదా ?

        

    Tuesday, October 28, 2025

    గ్రహ స్థితులు ఎలా ఉన్నా ...

     

      కొందరు జోతిష్కులు చెబుతున్న ప్రకారం.. రాబోయేరోజుల్లో తీవ్రమైన బాధాకరమైన సంఘటనలు ప్రపంచంలో జరుగుతాయని చెబుతున్నారు. అవి వింటే ఎవరికైనా భయాందోళనలు కలుగుతాయి. 

    అయితే, భక్తితో దైవస్మరణ, దైవనామస్మరణ,  లోకక్షేమం కొరకు యజ్ఞయాగాదులు చేయటం, ధర్మబద్ధంగా జీవించటం..వంటి వాటివల్ల రాబోయే విపత్తులు గణనీయంగా తగ్గుతాయి. 

    గ్రహ స్థితులు ఎలా ఉన్నా .. దైవభక్తి, మన ప్రవర్తనను బట్టి కూడా పరిస్థితులను మార్చుకోవచ్చు. గాయత్రి మంత్రాన్ని .. అందుకు సంబంధించిన విధులను చక్కగా ఆచరించటం మంచిది. అందువల్ల లోకక్షేమం కలుగుతుంది. ఎక్కువసార్లు చేయకపోయినా, కొన్నిసార్లు అయినా శ్రద్ధతో చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

    అయితే, గాయత్రి మంత్రాన్ని అందరూ చేయకూడదంటారు. పెద్దవాళ్లు చెప్పినట్లు పాటించటం మంచిది.    సర్వగాయత్రి మంత్రాన్ని అందరూ చేయవచ్చు,  సర్వగాయత్రిని చేసినా మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు.
     

    అయితే, కొందరు సర్వగాయత్రి మంత్రాన్ని చదవటంలో కూడా.. అలా కాదు, ఇలా చదవాలంటూ..చెబుతున్నారు. ఇవన్నీ సందేహాలు ఎందుకనుకుంటే.. దైవస్మరణ, దైవనామస్మరణ చక్కగా చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. కలికాలంలో దైవస్మరణ, దైవనామస్మరణ సులభోపాయమని పెద్దలు తెలియజేసారు. 

     ********************
    దైవపూజలు చేసినప్పుడు ప్రజలు , ప్రపంచంలో అందరికి తమతో సహా బుద్ధి సరిగ్గా ఉండాలని కూడా దైవాన్ని ప్రార్ధించుకుంటే మంచిది. బుద్ధి సరిగ్గా ఉంటే అంతా మంచిగా ఉంటుంది. సరైన విధంగా జీవించే శక్తిని ప్రసాదించమని దైవాన్ని ప్రార్ధించితే మంచిది.

    *********************

     వ్రాసిపెట్టి ఉన్నది ఎలాగూ తప్పనప్పుడు మనం ఏం చేయగలం? అని చాలామంది నిరాశగా అనుకుంటారు. అలా భావించటం పొరపాటు.దైవానుగ్రహాన్ని పొందగలిగితే భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉందని కొందరి చరిత్రల ద్వారా పెద్దలు తెలియజేసారు.

    ఉదా..సతీ సావిత్రి చరిత్రలో సావిత్రి యమధర్మరాజును  మెప్పించి , సత్యవంతుని ఆయుర్దాయాన్ని పెంచుకోవటమే కాకుండా ఎన్నో వరాలనూ పొందటం జరిగింది.


    ఉదా.. భక్త మార్కండేయుని చరిత్రను గమనించినా ..దైవానుగ్రహాన్ని  పొందగలిగితే  మంచి జరుగుతుందని తెలుస్తుంది.
    ********* 

    గ్రంధాల ద్వారా మరి కొన్ని విషయాలను తెలుసుకోవచ్చు.  

     ఎవరైనా బాగా పట్టుదలగా తపస్సు చేస్తే, దేవతలు  వరాలనివ్వటం జరుగుతుంది.
     
    కొందరి విషయాలలో.. తపస్సు వల్ల  విపరీతమైన వేడి వచ్చి, ఆ వేడి లోకమంతా వ్యాపిస్తే.. ఆ వేడిని తట్టుకోలేని ప్రజలు దేవతలను ప్రార్ధిస్తే.. దేవతలు వరాలనివ్వటం జరుగుతుంది. ఆ వరాలను పొందిన తరువాత, వరాలను పొందినవారు వరగర్వంతో  ప్రజలను బాధ పెడితే, అప్పుడు ఎటువంటి మొహమాటం లేకుండా లోకక్షేమం కొరకు  దైవం వారిని చంపివేస్తారు.

    ఈ విషయాలను గమనిస్తే నాకు ఏమనిపించిందంటే, ఒక్కరు దృఢంగా తపస్సు చేస్తేనే లోకంపై చాలా ప్రభావం ఉన్నప్పుడు....కొందరైనా మంచివాళ్ళు లోకక్షేమం కొరకు గట్టి పట్టుదలతో ప్రయత్నిస్తే ... దైవం వరాలను ప్రసాదిస్తారు.. అనిపించింది.

     ******************

    లోకంలో కొందరు దుర్మార్గులు దారుణాలు చేసినప్పుడు  మనకు ఏమనిపిస్తుందంటే,   దైవం లోకంలోని చెడ్డవారిని అందర్నీ చంపేయవచ్చు కదా.. అనిపిస్తుంది. 

    అన్నీ దైవమే చేస్తే మనుషులు ఏం చేస్తారు? టెక్నాలజీ పేరుతో ప్రకృతిని ధ్వంసం  చేయటం, పశుపక్ష్యాదులను చంపి తింటూ, మద్యం, మత్తుపదార్ధాల మత్తులో నేరాలు..ఘోరాలు చేయటం , పాపాలు చేసి అయినా ఆస్తులు పెంచుకుంటూ విలాసాలలో మునిగి ఉంటారా? 
     
    దైవం జీవులకొరకు మంచి వాతావరణం, ఆహారం కొరకు ఎన్నో మొక్కలను, ఆహ్లాదకరంగా ఎన్నో సుందర ప్రకృతిదృశ్యాలను..ఇంకా ఎన్నింటినో ప్రసాదించినా కూడా,   సంతోషంగా ఉండటం చేతకాక... అంతులేని కోరికలతో, అసూయాద్వేషాలతో కొట్టుకు పోతున్నారు.

    మనం ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ మన ప్రయత్నాలు మనం చేస్తూ.. కాపాడమని దైవాన్ని ప్రార్ధిస్తే కలికాలంలోనైనా కూడా , అమాయకులు, మంచివారైన వారికి బాధలు గణనీయంగా తగ్గే అవకాశముంది. అంతా దైవము దయ.


    *************************

     Sunday, August 18, 2024
    ఈ పోస్టును పైనవ్రాసిన తేదీన మొదట పోస్ట్ చేయటం జరిగింది. కొన్ని కారణాల వల్ల అక్కడ పోస్టును ఇక్కడ వేసి, ఇక్కడ పోస్టును అక్కడ వేయటం జరిగిందండి.

     

     

    ఏవి నిజమో? ఏవి ప్రక్షిప్తాలో? మరికొన్ని విషయములు..

     

    గ్రంధాలలో 
    ఎన్నో అర్ధం కాని విషయాలుంటాయి.  ప్రక్షిప్తాలు కూడా ఉంటాయి. 

    ఇవన్నీ  అదేపనిగా ఆలోచిస్తూ, వాదిస్తూ సమయాన్ని గడపటం కన్నా, ఇవన్నీ విని గందరగోళం పడటం కన్నా..కొంతవరకు తెలుసుకుని..అన్నింటికి మూలమైన దైవాన్ని నమ్ముకుని మన శక్తికొలది చక్కగా దైవాన్ని ఆరాధించుకోవటం మంచిదనిపిస్తుంది.
    ................

    ఒకప్పుడు వేదములను రాక్షసులు అపరించినప్పుడు,  దైవము రాక్షస సంహారం చేసి వేదాలను రక్షించారని గ్రంధాల ద్వారా తెలుస్తుంది. 

    వేదాలనే అపహరించగలిగినప్పుడు, ఎవరైనా గ్రంధాలలో మార్పులుచేర్పులు(ప్రక్షిప్తాలు) చేయటంలో ఆశ్చర్యం ఏముంటుంది.
    ..................
     

    మాంసాహారం వల్ల ఎంతో జీవహింస జరుగుతుంది. మద్యం వంటి మత్తు పదార్ధాల వల్ల మనస్సు అదుపు తప్పి ఎన్నో నేరాలు జరిగే అవకాశముంది. అందువల్ల, వాటిని ప్రోత్సహించేలా మాట్లాడటం సరైనదేనా?
    ...................
    మాంసాహారం తినకూడదని వేదములలో ఉందని కొందరు చెబుతున్నారు.

    మద్యాన్ని తీసుకోవటం పంచమహాపాతకాల్లో ఒకటని గ్రంధాలలో ఉందంటున్నారు. వాటిని సమర్ధించటం కూడా పాపమేనట.

     ............

     చక్కగా గాయత్రిని ఆచరించే కుటుంబాలవారు ఎన్నో నియమాలను పాటిస్తారు. అలా చేయలేనివారు తక్కువ నియమాలను పాటిస్తారు....(నాకు తెలిసినంతలో.. పాత కాలంలో అలా ఉండేదనుకుంటున్నాను.)

    అయితే ఈ మధ్య కొందరు, ఎవరైనా కూడా అనేక నియమాలను పాటించాలన్నట్లు చెబుతున్నారు. ఉదా.. ఉల్లి,వెల్లుల్లి వంటివి తినకుండా నియమాలు పాటించాలన్నట్లు చెబుతున్నారు.

    మరికొందరు ఏమంటున్నారంటే, గాయత్రిని ఆచరించే కొన్ని అగ్రవర్ణాల వారు (ఉదా..క్షత్రియులు..)మాంసాహారం తినొచ్చు అంటున్నారు.

    ఒకరు ఏమంటున్నారంటే, బ్రాహ్మణ,క్షత్రియులు..యజ్ఞంలో వ్రేల్చబడిన బలిని  (మాంసాహారాన్ని) తీసుకోవాలని గ్రంధాలలో ఉందని చదివినట్లు గుర్తు ..అని చెబుతున్నారు.

     గాయత్రి మంత్రాన్ని చేసేవారు మాంసాహారాన్ని తీసుకోవచ్చా?

     ఎలా తిన్నా కూడా మాంసాహారం మాంసాహారమే కదా...అప్పుడు ఎవరైనా దైవం పేరు చెప్పి జీవహింస చేసి మాంసాహారం తిని, మేం చేసింది తప్పుకాదు అంటే సరిపోతుందా?

    నియమాలను పాటించేటప్పుడు ఉల్లివెల్లుల్లి వంటివే తినకూడదంటే, మాంసాహారాన్ని ఎలా తీసుకుంటారు? ఏమిటో ?

    ................

    భారతదేశం విదేశీపాలనలో ఉన్నప్పుడు ఎవరైనా బెదిరించో, ప్రలోభపెట్టో గ్రంధాలలో కొన్ని మార్పులుచేర్పులు( ప్రక్షిప్తాలు)చేయించారేమో?

    హిందువుల్లోనే కొందరు తమలోతాము గొడవలు పడి తమకుతోచినట్లు ప్రక్షిప్తాలు చేసారేమో? ఏం జరిగిందో దైవానికే తెలుస్తుంది.
    ..............

    కొంతమంది ఏమనుకుంటారంటే, సాటి జీవులను ఎక్కువగా చంపితే వీరత్వం అనుకుంటారు. ఎవరైనా తమ మనస్సును అదుపులో ఉంచుకున్న వారే వీరులు. అంతేకానీ, మూగజీవులను చంపటం వీరత్వం కాదు.
    ................

    క్రూరమృగాలు ఊళ్ళమీద పడి మనుషులను చంపే సందర్భాల్లో క్షత్రియులు ఆ క్రూరమృగాలను చంపవచ్చు . అందువల్ల, క్షత్రియులకు వేట నిషిద్ధం కాదు. అలాగని వేట వ్యసనం కాకూడదు.
    ............

    వేటకు వెళ్లినప్పుడు దశరధ మహారాజు, పాండుమహారాజు.. అంతటివారే శాపాలకు గురయ్యారు.
    ................

    నేను ఒకప్పుడు ఏమనుకున్నానంటే, యుద్ధరంగంలో పోరాడేవారు పౌరుషం రావటానికి బహుశా మాంసాహారం అలవాటుచేసుకున్నారేమో?..అనుకున్నాను.

    ఇప్పుడు ఏమనిపిస్తోందంటే, రాజ్యం మీదకు దండెత్తి వచ్చిన శత్రువులను చూస్తే.. వారిని ఎదుర్కునే ధైర్యం దానికదే రావాలి. అంతేకాని, ధైర్యం రావటం కొరకు మూగజీవులను చంపనవసరం లేదు.

    తామసాహారాన్ని తింటే కోపం, ఆవేశం..వంటి తామస గుణాలు కలుగుతాయంటారు.

     ఆ విధంగా ఆహారం ద్వారా ఆవేశం రావాలంటే, మాంసాహారమే తిననవసరం లేదు. ఉప్పు,కారం బాగా ఉండే నిల్వ పచ్చళ్ళు, చద్ది ఆహారం.. కూడా తామసాహారమే. అలాంటివి తిన్నా సరిపోతుంది.

    ...........................

    ఇంతకుముందు ఒక పోస్టులో..
     
     యుద్ధసమయంలో జంతువులను వాహనాలుగా చేసుకునేవారు. యుద్ధసమయంలో కొన్నిసార్లు శాకాహారం సరిగ్గా దొరకని సందర్భాలలో..అలా చనిపోయిన జంతువులను తినేవారేమో? అని రాసాను.

    ఇలా వ్రాసిన తరువాత నాకు కొన్ని ఆలోచనలు కలిగాయి....

    మనుషులు తమ అవసరాల కొరకు జంతువులను పెంచటం అలవాటుచేసుకున్నారు. 


    మన అవసరాల కొరకు జంతువులను కష్టపెట్టటం కూడా పాపమే. యుద్ధాలు వస్తే మనుషులే తమలో తాము పోట్లాడుకోవాలి. మధ్యలో జంతువులను వాడటం, వాటిని చంపటం ..ఇంకా పాపం.
     
    పాపాలు చేసినప్పుడు ఫలితాలను అనుభవించాలి.
    ................
    మనుషులు కోరికలు తగ్గించుకుంటే కష్టాలు తగ్గుతాయి. 
     
    మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాకూడా వేరేవాళ్లు వచ్చి, రెచ్చగొట్టి యుద్ధాలు చేస్తే మనల్ని మనం కాపాడుకోవటానికి యుద్ధం చేయకతప్పదు. అప్పుడు ఆ పాపం రెచ్చగొట్టిన వారికే ఎక్కువగా తగులుతుందనిపిస్తుంది.
    ...............................