koodali

Thursday, April 30, 2020

పేదరికం, నిరుద్యోగ సమస్య తగ్గించటం.. కష్టమైన పనేమీ కాదు. .



అందరికీ ఉద్యోగాలు కల్పించటం కష్టమైన పనేమీ కాదు. 


ఇప్పుడు , దేశంలో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వైద్య శాఖలో ఎందరినో నియమించాలి. ప్రభుత్వ కార్యాలయాలలో ఎన్నో శాఖలలో చాలా మందిని నియమించవచ్చు.


************
కొందరు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలు తమకు కొన్ని వందల ఎకరాలను ఇస్తే, తాము కొన్ని వందలమందికి మాత్రమే ఉపాధి కల్పిస్తామంటున్నారు.

వ్యవసాయం వల్ల కూడా ఎక్కువమందికి ఉపాధి లభిస్తోంది.


ఉదా..కడియం తోటలపై ఆధారపడి సుమారు 20,000వేలమంది ఉపాధి పొందుతున్నారట. ఇవన్నీ గమనిస్తే, పారిశ్రామీకరణ వల్ల మాత్రమే ఉపాధి ఎక్కువగా లభించటం అనేది నిజంకాదని తెలుస్తుంది.


*************
ప్రభుత్వాలు దేశంలోని సహజవనరులను తమ అధీనంలో ఉంచుకుని, ప్రభుత్వరంగ సంస్థలను సమర్ధవంతంగా నడిపించాలి. ఉద్యోగుల జీతాలను తగ్గించాలి. అలా వచ్చిన ఆదాయంతో మరెందరికో ఉపాధిని కల్పించవచ్చు.

పాతకాలంలో ప్రభుత్వరంగ సంస్థలు సమర్ధవంతంగా పనిచేసేవి. క్రమంగా ప్రైవేట్ ఆధిపత్యం పెరిగింది.


 అయితే, ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగులు తరచూ జీతాల పెంపు వంటి విషయాలకొరకు సమ్మెలు చేయటం వంటి వాటి ద్వారా కూడా ప్రభుత్వాలు విసిగిపోయి, ప్రైవేటీకరణ వేగవంతం చేసిఉండవచ్చు.


 ప్రభుత్వాలకు ఆదాయం బాగుండాలి.  కనీసం ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంలో సంస్థలను నెలకొల్పాలి. అంతేకానీ, సంస్థలను పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వాల పరిస్థితి బలహీనమవుతుంది.


అయితే, ప్రైవేట్ లో  కూడా కొందరు మంచి యజమానులు ఉంటారు. . అలాంటి వారి  సంస్థలను  ప్రోత్సహించవచ్చు.

******************
వస్తువుల తయారీ మాత్రమే కాకుండా ప్రపంచంలో ఇంకా చాలా పనులున్నాయి...

ప్రభుత్వాల వద్ద ..  జీతాలు ఇవ్వటానికి  డబ్బు బాగా ఉంటే,  ప్రజలకు   రకరకాల  ఉపాధి  పనులు ఎన్నయినా కల్పించవచ్చు...   

ఉదా.. రోడ్లపై ఎన్ని గుంటలున్నాయో చూసి పూడ్చటం, దేశంలో రహదార్ల ప్రక్కన, చెరువుల ప్రక్కన, ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ మొక్కలు నాటి అవి బాగా పెరిగేలా పెంచటం, 


ఇంకా ఉద్యోగాలు సృష్టించాలంటే..  ప్రతి 50 మొక్కలకు ఒక్కొక్క ఉద్యోగిని ఉద్యోగంలో నియమించవచ్చు.

*******************************
పాతకాలంలో డబ్బుకు బదులు వస్తుమార్పిడి విధానం ఉండేది. కొంతకాలం తర్వాత వస్తుమార్పిడి విధానం మరియు జీతం ఇవ్వటం కలిపి ఉండేవి. 

ఉదా..పొలాల్లో పనిచేసే వారికి జీతంగా కొంత డబ్బు  మరియు  కొంత ధాన్యం ఇవ్వటం కూడా ఉండేది. 

************
చాలా కంపెనీలు తక్కువమంది ఉద్యోగులతోనే సంస్థలను నడిపిస్తున్నారు.  ఇద్దరు చేసే పనిని ఒకరితోనే చేయిస్తున్నారు.

జీతాలు తగ్గించి, ఎక్కువమంది  సిబ్బందిని  నియమించుకుంటే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. 


అప్పుడు ఉద్యోగస్తులకు కూడా  పని భారం తగ్గి , టెన్షన్ తగ్గి అనారోగ్యాలు తగ్గుతాయి.  పనిలో నైపుణ్యత కూడా మెరుగుపడుతుంది.


*********************

 పరిశ్రమల యజమానులు లాభాలలో తమ వాటాను కొంత తగ్గించుకుని, ఎక్కువమందికి ఉద్యోగాలివ్వాలి. ఉద్యోగస్తులు జీతాలను తగ్గించుకోవాలి.

 మరీ  ఎక్కువ ధరకు వస్తువులను అమ్మకూడదు . 
ధరలు తగ్గితే ..జీతాలు తగ్గినా సమస్యలు ఉండవు. 


జనాభా విపరీతంగా పెరగకూడదు.

ప్రజలు కూడా కోరికలను తగ్గించుకోవాలి.ఉన్నంతలో పొదుపుగా జీవించటం అలవాటుచేసుకోవాలి.


ఇవన్నీ జరిగితే, సమాజంలో సంపద అందరికీ న్యాయంగా లభిస్తుంది. నిరుద్యోగ సమస్య ఉండదు. పేదరికం ఉండదు.


************
 

వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమల వల్లే ఉపాధి ఎక్కువగా కల్పించగలం..అని చాలా మంది అపోహపడుతున్నారు.

మరి, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలలో కూడా నిరుద్యోగ సమస్య, ఆర్ధికమాంద్యం ఎందుకు ఉన్నాయి ?


ఈ విషయాలను గమనిస్తే, ఆధునిక ఆర్ధికవ్యవస్థ ధనవంతులను మరింత ధనవంతులుగా, పేదవారిని మరింత పేదవారుగా చేస్తున్నట్లు అనిపిస్తోంది.



***************
ఇప్పుడు అందరూ డబ్బు సాయం చేయాలని కేంద్రప్రభుత్వాన్ని అడుగుతున్నారు...అందుకే ప్రభుత్వాల వద్ద సంపద ఉండాలి.

అయితే, లాక్డౌన్ వల్ల బాగా నష్టపోయిన చిన్న, మధ్య తరహా సంస్థలను ప్రభుత్వాలు ఆదుకోవచ్చు కానీ,

 పెద్ద సంస్థల వాళ్ళ వద్ద  ఇంతకుముందు వచ్చిన లాభాలతో చాలా సంపద వాళ్ళ వద్ద ఉంటుంది కదా... వాళ్ళకు ఈ నష్టం పెద్ద లెక్కలోనిది కాదు.

****************
ప్రజలు అందరూ కూడా జీవితంలో వాస్తవపరిస్థితిని గుర్తించాలి. 

ఎలాపడితే అలా  చేసి పది తరాలకు సరిపడేలా విపరీతంగా డబ్బు సంపాదించినా కూడా మనశ్శాంతిని పొందటం మాత్రం కష్టం. 





2 comments:


  1. లాక్డౌన్ వల్ల ఎందరో వలసకూలీలు, విద్యార్ధులు, ఉద్యోగస్తులు..నగరాలలో చిక్కుకుపోయి ఉన్నారు.

    వీరిలో చాలామందికి వసతి, ఆహారం సరిగ్గా లేదంటున్నారు.

    ఆహారం సరిగ్గా లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గి జబ్బులు వచ్చి కూడా చనిపోయే అవకాశం ఉంది.

    వీరిలో చాలామంది సొంత ఊళ్ళకు వెళ్తామని అంటున్నారు. తమ బాధలు ఎవరికి చెప్పాలో తెలియక వందల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు కొందరు.

    సొంత ఊళ్లకు వెళ్తామని అనే వారికి ఊళ్లకు వెళ్ళడానికి వాహనాలు ఏర్పాటు చేసి వెంటనే పంపించితే బాగుంటుంది.

    విద్యార్ధులను, ఉద్యోగస్తులను, పనుల కొరకు ఇతర ప్రాంతాలకు వచ్చి చిక్కుకుపోయిన వారిని కూడా వారి ఊళ్లకు త్వరగా పంపించితే బాగుంటుంది.

    సొంత ఊళ్ళకు వెళ్ళిన తరువాత మళ్ళీ అందరికీ బయట క్వారంటైన్ అని అనకుండా.. హోం క్వారంటైన్ ఉండమనవచ్చు.

    వేరే ఊళ్ళనుంచి వచ్చిన వారివల్లే కొరోనా వస్తుందనేమీ లేదు. సొంత ఊరిలో ఉన్న వారికి కూడా కొందరికి కొరోనా వస్తోంది కదా..

    ***********
    నగరాలలో ఉంటామనే వారికి.. ఇప్పుడు అందుబాటులో ఉన్న భవనాల లో వసతి ఇచ్చి, ఆహారాన్ని అందించవచ్చు. వండిన ఆహారాన్ని ఇవ్వకపోయినా సరుకులను ఇచ్చినా వారు వండుకుంటారు.

    సహాయ శిబిరాలలో ఉన్న స్త్రీలకు శానిటరీ నాప్కిన్స్ కూడా అందించాలి.

    **************

    గోడౌన్లలో టన్నుల కొద్దీ ఆహార ధాన్యాలు ఉన్నాయంటున్నారు.

    ఒక ప్రక్క ఆకలితో అల్లాడే ప్రజలు ఉన్నప్పుడు గోడవున్లలో ఆహారం ఉన్నా ఏం లాభం ?

    లాక్డౌన్ విధించినప్పుడు పేదవారికి కొంతకాలం ఉచితంగా ఆహారాన్ని అందించటం ప్రభుత్వాల బాధ్యత.

    పరిస్థితి చక్కబడిన తరువాత ఉపాధి గురించి ఆలోచించుకుంటారు.

    వ్యవసాయం బాగుంటే ఉపాధి లేకపోయినా కనీసం ఎవ్వరూ ఆకలితో చనిపోరు. కొన్ని నెలలు గడిస్తే మళ్లీ పంటలు చేతికొస్తాయి.

    ReplyDelete

  2. ఆర్మీ వాళ్ళు ..కొవిద్ విషయంలో సహాయాన్ని అందిస్తున్న అందరికి వందనం చేయటం గొప్ప విషయం.

    ఆర్మీ వాళ్ళు కూడా దేశాన్ని రక్షిస్తున్నారు. ఆర్మీ వాళ్ళకు కూడా వందనం.

    సమాజానికి మేలు చేసే ప్రతి వృత్తి గొప్పదే.సమాజానికి మేలు చేసే ప్రతి వ్యక్తి గొప్పవారే. అందరికి వందనం.

    దైవానికి వందనాలు మరియు ధన్యవాదములు.

    ReplyDelete