koodali

Thursday, April 30, 2020

యుద్ధాలు రాకుండా అందరూ ఆలోచించాలి....



ఒక జబ్బు వస్తేనే ప్రజలు తట్టుకోలేకపోతున్నారు.


యుద్ధం అంటే మరెన్నో ఇబ్బందులు ఉంటాయి కదా!


************

 చాలామంది ప్రజలు యుద్ధం అంటే సైనికుల వరకే పరిమితం అనుకుంటారు. యుద్ధం అంటే సైనికులు మాత్రమే త్యాగాలు చేయటం కాదు.

యుద్ధం అంటే.. పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం.


శత్రుదేశం బాంబులు వేస్తుందనే భయంతో రాత్రిపూట విద్యుత్ నిలిపివేయవచ్చు.


ఎప్పుడు ఎక్కడ బాంబులు పడతాయో ? ఎందరు మరణిస్తారో ? ఎందరు వికలాంగులు అవుతారో? తెలియదు.


ఎన్నో  వ్యవస్థలు స్థంభిస్తాయి.  ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది.


 ఇతరదేశాలపై మనం యుద్దం  చేయాలా? వద్దా ? అనేది మనం నిర్ణయించుకోవచ్చు.


 తరువాత, మనదేశంపై ఇతరులు యుద్ధం చేస్తారా ? లేదా ? అనేది మన చేతిలో విషయం కాదు.


************* 

ప్రజలు కరోనా  కష్టాలే తట్టులేకపోతున్నప్పుడు యుద్ధం వల్ల వచ్చిపడే కష్టాలు అస్సలు తట్టుకోలేరు.


యుద్ధం వల్ల ఏ దేశానికైనా కష్టాలు తప్పవు. కరోనా వల్ల ప్రపంచ ఆర్ధివ్యవస్థ కూప్పకూలుతుందని  చెబుతున్నారు . 


యుద్ధాలు వస్తే.. ఆర్ధికవ్యవస్థ కుప్పకూలటం మాత్రమే కాకుండా, అన్నీ కుప్పకూలుతాయి.


*************** 

 విదేశాలకు, ఇతరదేశాలకు  వెళ్లిన వారు .... 
ఇప్పుడు కరోనా లాక్డౌన్ వల్ల   స్వస్థలాలకు వస్తామంటున్నారు.


విదేశాలలో చదువుల కోసం వెళ్ళి హాస్టల్స్లో ఉన్నవారు.. మమ్మల్ని ఇక్కడ హాస్టల్స్ ఖాళీ చేసి వెళ్లమంటున్నారు. ఇప్పుడు విమానాలు లేవు, మాకు ఇక్కడ వసతి, ఆహారం సరిగ్గా లేదు.. మమ్మల్ని స్వస్థలాలకు తీసుకెళ్ళాలంటూ ప్రభుత్వాలను అడుగుతున్నారు.



ఇప్పుడంటే ఇంకా ఫో న్ కాల్స్, ఇంటర్నెట్..సౌకర్యాలు చక్కగా పనిచేస్తున్నాయి కాబట్టి,  ఏ దేశంలో ఉన్నవాళ్ళయినా స్వదేశంలో ఉన్న బంధువులతో మాట్లాడగలుగుతున్నారు.



యుద్ధంలాంటివి వస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఫో న్ కాల్స్, ఇంటర్నెట్..సౌకర్యాలు ఉంటాయో ? ఉండవో ? తెలియదు. ఎవరి పరిస్థితి ఎలా ఉందో  తెలిసే సమాచార వ్యవస్థ ఏమవుతుందో తెలియదు.


*****************

ఎప్పుడు ఎక్కడ బాంబులు పడతాయో తెలియదు. అప్పుడు క్షతగాత్రులకు వైద్యసేవలు అందించటానికి హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.


యుద్ధం ఏమీ లేకపోయినా కూడా కరోనా వల్ల కొంత ఎక్కువమంది రోగులు వస్తేనే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా హాస్పిటల్స్ , వైద్యులు సరిపోక  కొందరికి వైద్యసేవలు అందించలేకపోయారట.



ఇక యుద్ధాలు వస్తే పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. ఎంతమందికి వైద్య సేవలు అందుతాయో? ఎంతమందికి అందవో ? చెప్పలేం.


అందరికీ వైద్యసేవలు అందించాలని ప్రభుత్వాలు భావించినా కూడా.. పరిస్థితి అనుకూలించాలి కదా!


*****************

భవిష్యత్తులో బయోవార్లు మాత్రమే జరుగుతాయంటూ కొందరు అంటున్నారు.

 పాతకాలం లో కూడా బయోవార్ జరిపే  విషయంలో ప్రయత్నాలు జరిగాయంటారు. అయితే, బయోవార్లు చేయకూడదని అంతర్జాతీయంగా ఒప్పందాలు ఉన్నాయట.

 అయినా, భవిష్యత్తులో యుద్ధాలు జరిగితే ? జీవాయుధాలతో పాటు ఇప్పటికే గుట్టలుగా పోగయి ఉన్న ఆయుధాలను కూడా ఉపయోగించే అవకాశం ఉంటుందేమో ?

*************
 కొంతకాలం క్రిందట ఒక దేశంలో యుద్ధం జరుగుతుంటే, అక్కడ ఉన్న కొందరు భారతీయులు అప్పటివరకూ తాము కూడబెట్టిన  ఆస్తులన్నీ వదులుకుని భారతదేశానికి వచ్చేశారు.


కొందరు ఉన్నతచదువుల కోసం వెళ్లినా .. అక్కడ శాశ్వతంగా ఉండకపోవటమే మంచిది.


 కొన్ని సార్లు మరి కొన్ని సమస్యలు వస్తుంటాయి. 


ఉదా..కుటుంబంలో తల్లితండ్రి యొక్క వీసా సమయం ముగిసి స్వదేశానికి వెళ్ళవలసివస్తుంది. వాళ్ళ సంతానమేమో విదేశాల్లో జన్మించి అక్కడి పౌరసత్వం కలిగిఉంటారు. 


 ************

మొత్తానికి కరోనా ఎన్నో ప్రశ్నలను సృష్టించింది.

పరిస్థితి ఎలా ఉన్నా కూడా విదేశాల్లోనే ఉంటాము ..అనే వాళ్ళ గురించి ఆలోచించనక్కరలేదు.


శాశ్వతంగా విదేశంలో స్థిరపడాలా? వద్దా ? అనే  ఆలోచనలు ఉన్న వాళ్లు సరైన నిర్ణయం తీసుకోవటం మంచిది. 


విదేశాల్లో స్థిరపడటం అంటే మన తరువాత మన పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుంది ? అనికూడా ఆలోచించుకోవాలి.



భవిష్యత్తులో విదేశాల్లో తరువాత తరం వాళ్లు స్వేచ్చగా ఉండగలరా ? లేక రెండవతరగతి పౌరులుగా ఉండవలసి వస్తుందా ? అని కూడా ఆలోచించాలి.



అక్కడ పుట్టి పెరిగిన పిల్లలు..తల్లితండ్రులు పుట్టి పెరిగిన దేశానికి రావటానికి ఇష్టపడకపోవచ్చు. 


కారణాలు ఏమైనా కూడా, అటు విదేశాల్లోనూ సరిగ్గా ఉండలేక , స్వదేశానికీ రాలేక బాధపడే  పరిస్థితి మాత్రం ఎవ్వరికీ ఎదురుకాకూడదు.


ఇప్పుడు చాలా చోట్ల స్థానికులు..  వలసలు వచ్చిన వారి వల్ల తమకు ఉద్యోగాలు పోతున్నాయని భావిస్తున్నారు.....ఎప్పుడు ఎవరి బుద్ధి ఎలా మారుతుందో చెప్పలేం ?

*************


ఏ దేశ పౌరులైనా కొంతమంది వరకూ విదేశాలకు వెళ్ళటం జరుగుతుంది. అయితే, ఆ సంఖ్య విపరీతంగా పెరిగితే మాత్రం దేశానికి మంచిది కాదు. 


 విదేశాల్లో ఉన్న కొందరి కోసం.. స్వదేశీయుల అవసరాలను త్యాగం చేయకూడదు కదా.(ఇలాంటి పరిస్థితి రావటానికి అనేక కారణాలుంటాయి.)


*************

 కష్టమైనా, సుఖమైనా ఎవరి స్వస్థలంలో వారు జీవించటం మంచిది. భారతదేశం లో ఎన్నో సహజవనరులున్నాయి. 

అందరూ కలిసి అభివృద్ధి చేసుకుంటే వలసలు వెళ్ళవలసిన అవసరం ఉండదు.


ప్రభుత్వాలు  కూడా స్వదేశంలోనే  ఉన్నతచదువులు, ఉపాధి కల్పించాలి. 


 *****

యుద్ధాల వల్ల ఎన్నో కష్టాలు, నష్టాలు ఉన్నాయి. 

అందువల్ల, అన్ని దేశాలవాళ్ళు ఇతరదేశాలను ఎలా దెబ్బకొట్టాలా..అని ఆలోచించటాన్ని మాని, ఎవరిదేశాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవటంపై దృష్టి పెడితే మంచిది.


అందువల్ల,  యుద్ధాలు రాకుండా అందరూ మంచిగా ఆలోచించాలి.



2 comments:


  1. మీడియాలో కరోనా గురించి తప్పు వార్తలు రాస్తే ఊరుకోం అంటున్నారు. మంచిదే.

    అయితే ఎంతో కాలం నుంచి అసభ్యకరమైన చిత్రాలు, పోర్న్ చిత్రాలు..ఇలాంటివాటి వల్ల సమాజానికి ఎంతో నష్టం కలుగుతోంది.

    ఇలాంటివాటిని కూడా ప్రభుత్వాలు కట్టడి చేస్తే బాగుంటుంది.




    ReplyDelete

  2. కొన్ని ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే, ఇతరప్రాంతాలకు వలస వెళ్లిన తమ ప్రాంతానికి చెందిన వాళ్లకు కొరోనా ఉంటే, వాళ్ళు తిరిగి తమ ప్రాంతానికి రాకూడదంటున్నాయి.జబ్బు లేనివాళ్లే రావాలట.

    కష్టసమయంలో పరాయి ప్రాంతం లో జబ్బుపడి అక్కడ చూసేవారులేక ఇంటికి వస్తామంటే..వారిని ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయించుకోవటానికి అనుమతించాలి కానీ, నీకు జబ్బు ఉంది కాబట్టి రావద్దు, వస్తే ఇక్కడ మా అందరికీ జబ్బు వస్తుంది, జబ్బు లేకపోతేనే ఇంటికి రావాలి..అనటం మానవత్వం కాదు.

    **********
    అయితే, ఈ అనుభవాల ద్వారా ఏం నేర్చుకోవాలంటే, ఇకమీదట ఎవరైనా ఉపాధి కోసం వలసలు వెళ్లటం తగ్గించి, స్వస్థలంలోనే ఉపాధిని పొందటం నేర్చుకోవాలి.

    ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా కూడా స్వస్థలాలకు వచ్చేస్తామంటున్నారు కదా..ఇకమీదట కూడా స్వస్థలాలలోనే ఉపాధి ఏర్పరుచుకుని ఉండటానికి సిద్ధపడాలి.

    అంతేకానీ, పరిస్థితి చక్కబడగానే మళ్లీ విదేశాలకు వలసలు పోయి, సుఖంగా ఉన్నప్పుడు విదేశాలు..కష్టకాలం వస్తే స్వదేశం ఆదుకోవాలి అనుకోకూడదు.

    ప్రభుత్వాలు కూడా ప్రజలు వలసలు పోకుండా ఉపాధి అవకాశాలు కల్పించాలి.

    ReplyDelete