koodali

Thursday, April 9, 2020

సామూహికంగా భోజనాలు వంటి కార్యక్రమాలు జరిగేటపుడు....కొన్ని జాగ్రత్తలు..


సామూహికంగా భోజనాలు వంటి కార్యక్రమాలు జరిగేటపుడు కొన్ని విషయాలను గమనించాలి. 

వేసవిలో కొన్ని ప్రాంతాల్లో త్రాగటానికే సరిగ్గా నీరు లభించదు. 

 ప్లాస్టిక్ ప్లేట్స్ వంటివి వాడితే వాటిని కడగటానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది.

ఆహారం తిన్న తరువాత ప్లాస్టిక్ ప్లేట్లను సరిగ్గా శుభ్రం చేయకపోతే ఒకరినుంచి ఒకరికి రోగాలు వ్యాపించే అవకాశమూ ఉంది.

ఇలాంటప్పుడు  సామూహిక భోజనాలు, ఫంక్షన్స్ జరిగేటప్పుడు విస్తరాకులు వాడటం మంచిది.

రెండుపొరలుగా విస్తరాకులను వేసి వాడితే ఎంగిలి క్రింద పడకుండా ఉంటుంది.

నీరు సమృద్ధిగా లభించే వద్ద ప్లేట్స్  బాగా శుభ్రం చేస్తారు. 

అయితే కొన్నాళ్ళు ప్లేట్స్ పైన విస్తరాకు వేసి కూడా ఆహారాన్ని అందించవచ్చు. ఇలా చేయటం వల్ల చాలా లాభాలున్నాయి.

 ఇప్పటికే చాలా చోట్ల ఇలాంటి పద్ధతిని అవలంబిస్తున్నారు.

ఉదా..కొందరు ప్లేట్లపై అరటాకు వేసి ఇడ్లీలు వడ్దించటం మనం గమనించవచ్చు.

ఆకులు వేసినా కూడా ప్లేట్స్ కడగాలి. అయితే, ఆకులు వేయటం వల్ల పరిస్థితి చాలా మెరుగవుతుంది.

భోజనాలు ముగిసిన తరువాత విస్తరాకులను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ఒక దగ్గరే వేయాలి.

ఫంక్షన్స్ లో బల్లలపైన పొడుగ్గాటి పేపర్ వేసి దానిపైన విస్తరాకులు వేసి, భోజనాలు ముగిసిన తరువాత పేపర్ మడిచేసి పడేస్తారు.

అలా అన్నీ ఒక చోట పడేసి కాల్చివేయవచ్చు.

**************

సామూహిక భోజనాల సమయంలో పలుచటి రసం, మజ్జిగ కాకుండా.. చిక్కగా వండిన సాంబారు, కూరలు వడ్డించవచ్చు.

ఇలా చేయటం వల్ల ఆహారం విస్తరాకు నుండి క్రిందకు వెళ్ళకుండా ఉంటుంది.

పార్సిల్స్ విషయంలో.. ఆహారాన్ని ప్లాస్టిక్ కవర్లలో కాకుండా, విస్తరాకులలో పెట్టి పొట్లంలా చుట్టి పంపించవచ్చు. 

పులిహోర కానీ, అన్నం, పప్పు, కూరగాయలు కలిపి చేసే బిసిబిలేబాత్ వంటివి ఇతరులకు ఇస్తే వాళ్ళకు బలవర్ధకంగానూ ఉంటుంది.

కొందరు ప్లాస్టిక్ మంచినీళ్ళబాటిల్స్ ను ఉచితంగా రోడ్లపై వెళ్లే వారికి ఇస్తున్నారు.

 మంచినీరు ఇవ్వటం మంచిదే కానీ, ప్లాస్టిక్ బాటిల్ వల్ల పర్యావరణానికి జరిగే నష్టం సంగతేమిటి ?

**********

కొన్ని దేశాలలో అరటి చెట్లను కొట్టేసిన తరువాత నారతీసి, ఆ నారతో పేపర్ బ్యాగులు వంటివి తయారుచేస్తున్నారు.

 మన దేశంలో కూడా అలా అరటినారతో భోజనం ప్లేట్లు, బ్యాగులు తయారుచేయవచ్చు.




No comments:

Post a Comment