ప్రజలు నిత్యావసర సరుకులకు బైటకు రాకుండా.. ప్రభుత్వాలు కొన్ని షాప్స్ వాళ్ళకు అనుమతి ఇచ్చి, వారు మాత్రం సరుకులను వాహనాల ద్వారా వీధుల వెంట తిరుగుతూ, ప్రతి ఇంటికి అందుబాటులో సరుకులను విక్రయించే విధానాన్ని అమలుచేయవచ్చు.
(అయితే ప్రజలు గుమికూడకుండా పోలీసుల సహాయం తీసుకోవటం మంచిది. ప్రజలు సరుకులను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేయకుండా చూసుకోవాలి.)
ఫోన్ చేస్తే నిత్యావసర సరుకులను ఇంటికి తెచ్చే విధానాన్ని పాటించవచ్చు.
అయితే, భారతదేశంలో చాలామంది ప్రజలకు షాప్స్ వారికి ఫోన్ చేసి సరుకులను తెప్పించుకునే పరిస్థితి లేదు. తక్కువ ఆదాయ వర్గాల వారికి ఇంటికే సరుకులను అందుబాటులోకి తెస్తే బాగుంటుంది.
*********************
మాస్కులు దొరకనప్పుడు , మాస్కులు లేవని కంగారుపడకుండా, కర్చీఫ్ను మడిచి మాస్క్ తయారుచేసి వాడుకుని, ఉతుక్కుంటే మంచిది.
How to make easy handkerchief mask Without stitching at home? - YouTube
www.youtube.com
**************
శానిటైజెర్ లేకపోతె ఉప్పు నీరు వాడవచ్చు.
కూరగాయలు, పండ్లను మార్కెట్లో ఎందరో చేతులతో తాకుతారు. వాటిని తెచ్చిన వెంటనే ఫ్రిజ్లో పెట్టకుండా , ఒక బకెట్ నీళ్ళలో రెండు స్పూన్ల ఉప్పు వేసి ఆ నీటిలో కూరగాయలను వేసి 5 నిముషాలు ఉంచి, క్రింద న్యూస్ పేపర్ గాని, పాత టవల్ కానీ వేసి దానిపైన కూరగాయలను పరిచి, తడి ఆరిన కొన్ని గంటల తర్వాత ఫ్రిజ్లో పెడితే వైరస్ ఫ్రిజ్లోకి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు.లేదంటే బయటే కూరగాయలను ఉంచుకోవచ్చు.
సరుకులను తెచ్చిన ప్లాస్టిక్ పాకెట్ల పైన కూడా ఉప్పునీటితో తడిపిన క్లాత్ తో తుడిచి పెట్టుకోవచ్చు.
ఉప్పునీటిలో అదేపనిగా చేతులు కడిగితే చేతులు కొద్దిగా నల్లబడే అవకాశం ఉండవచ్చు కాబట్టి, ఉప్పునీటితో చేతులు కడుక్కున్న వెంటనే మంచినీటితో కూడా కడుక్కోవాలి.
ఇల్లు తుడిచేటప్పుడు ఆ నీటిలో ఒక స్పూన్ ఉప్పువేసి తుడిస్తే మంచిది.
.................................
డబ్బున్న వాళ్ళు సరుకులను ఎక్కువగా కొని నిల్వ ఉంచుకోగలరు. ఏ రోజు కారోజు సంపాదనతో జీవించే వారికి నిత్యావసరాలవిషయంలో ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలి.ధనవంతులు కూడా సహాయం చేయవచ్చు.
ఇంట్లోనే ఉన్నాం కదాని బోలెడు సరుకులు కొనేసి, రకరకాల వంటలు చేసుకుని తింటే అజీర్తి కలిగే అవకాశం ఉంది.
భవిష్యత్తులో నిత్యావసర సరుకుల కొరత వచ్చినా రావచ్చు. అందువల్ల తగుమాత్రం వంటలు వండుకుని తినటం మంచిది.
**********
కొన్ని చోట్ల.. చదువుకునే పిల్లలను, వివాహం కాకుండా ఉద్యోగం చేస్తున్న వారిని హాస్టల్స్ ఖాళీ చేసి వెళ్లమంటున్నారట.
కరోనా పేషంట్లకు సేవ చేస్తున్న వైద్యవిద్యార్ధులను కూడా అద్దె యజమానులు ఖాళీ చేయమంటున్నారట.
( అద్దె ఇంటి యజమానులకు కరోనా వస్తే మాత్రం మళ్ళీ డాక్టర్ల వద్దకే వెళ్తారు.)
కుటుంబానికి దూరంగా చదువుకుంటున్నవారికి, ఉద్యోగస్తులకు భోజనం ఎక్కడ లభిస్తుంది?
విదేశాల్లో ఉండేవారికి కాలేజీలు మూసెయ్యటం మంచిదే కానీ, హాస్టల్స్ ఖాళీ చేయమనకుండా వారిని హాస్టల్స్లో ఉండనిచ్చి ఎప్పటిలాగే భోజనం అందిస్తే , వారి గదుల్లో వారు ఉంటారు కదా!
సడన్ గా వారిని హాస్టల్స్ ఖాళీ చేసి వెళ్లమంటే ఫ్లైట్స్ లేని సమయంలో అప్పటికప్పుడు వారు ఎక్కడికి వెళ్ళగలరు?
కొన్నిరోజుల తర్వాత, బాచలర్స్ ను స్వస్థలాలకు పంపాలంటే వేలాదిమందిని గుంపులుగా ఒకేసారి వదలటం కాకుండా, రోజుకు కొంతమందిని చొప్పున పంపిస్తే గుంపులుగా గుమికూడటం ఉండదు. అందరికీ వైద్యపరీక్షలు చేయటమూ కొంత సులభమవుతుంది.
................
పర్యావరణాన్ని పాడుచేయకూడదు అని ఎందరు చెప్పినా చాలామంది లెక్క చేయలేదు.
మూగజీవాలు ఎన్ని బాధలు పడినా పట్టించుకోలేదు.
ఇప్పుడు తమ ప్రాణాలమీదకు వచ్చేటప్పటికి ఎంతగా అల్లాడిపోతున్నారో కదా!
...................
కొరోనా నుండి తప్పించమని కొన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.
అందరూ దైవనామస్మరణ చేయటం మంచిది. సరైన విధానాన్ని తెలుసుకుని ప్రాణాయామ, ధ్యానం చేయటం మంచిది.
దైవం దయ వల్ల విపత్తు తగ్గుముఖం పడుతుందని ఆశిద్దాము.
***************
దైవప్రీతి కొరకు యజ్ఞయాగాదులు నిర్వహించాలి.
లోకక్షేమం కొరకు యజ్ఞాలు చేయటం అవసరం.
ఎవరైనా నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు కానీ, ఆపత్కాలంలో కానీ యజ్ఞయాగాదులు నిర్వహించవచ్చు.
కొందరు స్వార్ధపరుల వల్ల పర్యావరణానికి హాని కలిగి జీవజాలానికి ముప్పు వాటిల్లుతోంది. మూగజీవులకు కూడా కష్టాలు వస్తున్నాయి. మూగజీవులు యజ్ఞయాగాదులు చేయలేవు. అందువల్ల సమాజ హితం కొరకు మనుషులు యజ్ఞయాగాదులు నిర్వహించవచ్చు.
*****************
కోవిద్ జబ్బు అంతరించాలని యజ్ఞాలు నిర్వహించటం అవసరమే. ఇలా చేయటం సరైనదే. అయితే, మనుషులు చేస్తున్న అనేక తప్పుల వల్ల కోవిడ్ వంటి జబ్బులు వస్తున్నాయి. **************
ఉదా:పర్యావరణ కాలుష్యం, జీవితంలో అనారోగ్యకరమైన పనులు..వంటి వాటి వల్ల కోవిద్ వంటివి ప్రబలుతున్నాయి. కోవిడ్ వంటివి తగ్గాలంటే యజ్ఞాలు చేయటంతో పాటు తప్పులను సరిదిద్దుకోవాలి.
మనుషులు తాము చేసే తప్పులను కొనసాగిస్తూనే.. తద్వారా వచ్చే దుష్ఫలితాలను మాత్రం.. యజ్ఞాలు చేసి తగ్గించుకోవాలనుకోవటం వల్ల పూర్తిగా సరైన ఫలితాలు వస్తాయా?
తప్పులు చేయటం కొనసాగిస్తూనే.. తమకు గొప్ప ఫలితాలు రావాలని దైవాన్ని కోరటం ఎంతవరకూ సరైనది?
తాము చేసే తప్పులను కూడా సరిదిద్దుకోవటానికి ప్రయత్నించాలి.
అయితే, ప్రపంచంలో చెడుచేసేవాళ్ళు మాత్రమే ఉండరు. మంచిపనులు చేసేవారు ఉంటారు.కొంత మంచి, కొంత చెడు పనులు చేసే వాళ్లూ ఉంటారు.ముందు చెడ్డగాఉన్నా,తరువాత మంచిగామారేవారూ ఉంటారు.
అందరూ మంచిగా ఉండటానికి ప్రయత్నించాలి.అప్పుడే సమాజం అంతా బాగుంటుంది.
**********
మనుషులు తాము చేసే తప్పులను కొనసాగిస్తూనే.. తద్వారా వచ్చే దుష్ఫలితాలను మాత్రం.. యజ్ఞాలు చేసి తగ్గించుకోవాలనుకోవటం వల్ల పూర్తిగా సరైన ఫలితాలు వస్తాయా?
తప్పులు చేయటం కొనసాగిస్తూనే.. తమకు గొప్ప ఫలితాలు రావాలని దైవాన్ని కోరటం ఎంతవరకూ సరైనది?
తాము చేసే తప్పులను కూడా సరిదిద్దుకోవటానికి ప్రయత్నించాలి.
అయితే, ప్రపంచంలో చెడుచేసేవాళ్ళు మాత్రమే ఉండరు. మంచిపనులు చేసేవారు ఉంటారు.కొంత మంచి, కొంత చెడు పనులు చేసే వాళ్లూ ఉంటారు.ముందు చెడ్డగాఉన్నా,తరువాత మంచిగామారేవారూ ఉంటారు.
అందరూ మంచిగా ఉండటానికి ప్రయత్నించాలి.అప్పుడే సమాజం అంతా బాగుంటుంది.
**********
గంగానదిలో కలిపిన కాలుష్యం వంటి వాటి విషయంలో గమనిస్తే..
రోజూ పరిశ్రమలనుంచి, నగరాలనుంచి వచ్చే మురుగును గంగలో వదలటం ఆపకుండా .. గంగానదిలో కలిపిన కాలుష్యాన్ని యజ్ఞం చేయటం ద్వారా పోగొట్టాలని ఎవరైనా భావిస్తే ఎంత మాత్రం సరైనది ?
గంగా నది లోకి వదిలే మురుగును ఆపటం కూడా ముఖ్యం.
ReplyDeleteఎంత డబ్బు ఉన్నా ఆహారం లేనిదే బ్రతకటం కష్టం కదా! ఇప్పుడు ఆహారం చక్కగా లభిస్తోంది కాబట్టి ఇంతమంది పనిచేయకపోయినా ఇళ్ళలో కూర్చుని ఉండగలుగుతున్నారు. వ్యవసాయరంగాన్ని కాపాడుకోవాలి.
***********
అయితే, మనకు ఆహారం కొరకు ఎన్నో మొక్కలు తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నాయి.
అందువల్ల, ప్రజలు ఆహారపదార్ధాలను వృధా చేయకూడదు. ప్రభుత్వాలు కూడా గిడ్డంగులలో ఆహారధాన్యాలు పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇప్పుడు ప్రజలు ఇంట్లోనే ఉన్నాం కదాని బోలెడు సరుకులు కొనేసి, రకరకాల వంటలు చేసుకుని తింటే అజీర్తి కలిగే అవకాశం ఉంది.అజీర్తి వల్ల జలుబు, దగ్గు, ఇంకా అనేక రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది.
భవిష్యత్తులో నిత్యావసర సరుకుల కొరత వచ్చినా రావచ్చు. అందువల్ల తగుమాత్రం వంటలు వండుకుని తినటం మంచిది.
Deleteకరోనా వ్యాపించి చాలా రోజులయింది. అయితే ...కనీసం వైద్యులకు, నర్సులకు, పారిశుధ్య సిబ్బందికి కూడా సరిపడినంత మాస్కులు లభించకపోవటం అనేది అత్యంత బాధాకరమైన విషయం.
ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంతో ఎదిగిపోయిందని చెప్తున్నారు.
ఒక మెషీన్ గంటకు వేలకొద్దీ వస్తువులను ఇట్టే తయారుచేసేస్తుందని చెబుతుంటారు కొందరు. మరి కనీసం మాస్కులను ఎందుకు అందివ్వలేకపోతున్నారు?
ఇంత టెక్నాలజీ ఉన్న ప్రపంచంలో ..ఎన్నో దేశాలు మాస్కులు లేక అల్లాడిపోవటం ఏమిటో అర్ధం కావటం లేదు.
ReplyDeleteA whole lot of doctors reportedly forced to reuse same mask for a week are crying for support | Business Insider India
www.businessinsider.in
పైన లింక్ వద్ద చూస్తే మాస్కుల విషయంలో ఎలాంటి పరిస్థితి ఉందో తెలుస్తుంది. మనదేశంలో మాత్రమే కాదు చాలా దేశాలలో కూడా వైద్యులు సరిపడినంత మాస్కులు లభించక ఇబ్బందులు పడటం గురించి వార్తలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వార్తలు గురించి తెలిసిన తరువాతే నేను వ్రాయటం జరిగింది.
డాక్టర్లకే జబ్బు చేస్తే పేషెంట్లకు ఏవరు వైద్యం చేస్తారు ?
కొన్ని చోట్ల వైద్యులను పేషెంట్ల తరపు వాళ్ళు బెదిరించిన సంఘటనలు కూడా జరిగాయి. ఈ విషయాలను మీడియాలో చూపించారు కూడా.
పేషంట్లు ప్రాణాల గురించి పేషేంట్లకు భయం ఉన్నట్లే.. వైద్యులకు కూడా తమ ప్రాణాల గురించి భయం ఉంటుంది కదా! ఇలాంటప్పుడు వైద్యులకు, నర్సులకు, పారిశుద్య సిబ్బందికి మరింత భరోసా ఇవ్వాలి .
......
మాస్కులను ఎక్కువసార్లు మార్చవలసి ఉంటుంది కాబట్టి, ఎక్కువ మాస్కులు అవసరం అవుతాయి.
ప్రజలు మాస్కులను వాడిన తరువాత ఎక్కడపడితే అక్కడ పడేయకుండా, జాగ్రత్తగా ఒక దగ్గర పడేయాలి. మాస్కులు వేసుకోని ప్రజలు కర్చీఫ్లను మాస్కుగా వాడుకుని ఉతుక్కోవచ్చంటున్నారు.