koodali

Friday, April 17, 2020

జబ్బులన్ని ఏమైనవి ?



ఈ మధ్య హాస్పిటల్స్లో కొరోనా పేషెంట్స్ తప్ప ఇతరజబ్బుల వాళ్ళు రావటం తగ్గిందంటున్నారు. ఇలా జరగటానికి అనేక కారణాలు చెప్తున్నారు. ఒక ఛానల్ లో కూడా చర్చ జరిగింది. 

 ఈ  విషయం గురించి రాజమండ్రికి చెందిన ఒక డాక్టర్ గారు చక్కగా వివరించారు. ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ కూడా చెప్పారు. 

లాక్ డౌన్ వల్ల వాహనాలు తిరగటం లేదు కాబట్టి యాక్సిడెంట్ల కేసులు తగ్గాయట...

పొల్యూషన్ తగ్గినందువల్ల ఆస్మా వంటి శ్వాసకోసవ్యాధులు తగ్గుముఖం పట్టాయట...

బయట భోజనం చేయటం తగ్గింది కాబట్టి జీర్ణకోశవ్యాధులు తగ్గాయట..

చేతులు బాగా శుభ్రం చేస్తున్నారు కాబట్టి కొన్ని రోగాలు రావటం తగ్గిందట..ఇలా చెప్పారు.

   ఆ డాక్టర్ గారు చెప్పిన విషయాలను వినాలనుకుంటే...  క్రింద ఇచ్చిన లింక్ ను కాపీ, పేస్ట్ చేసి యు ట్యూబ్ లో చూడగలరు. 

How come Hospitals are empty during lockdown? How come diseases decreased during Lockdown? - YouTube
www.youtube.com

జబ్బులన్ని ఏమైనవి ? Suddenly how did all health issues and diseases disappear? Dr. Karuturi MD - YouTube
www.youtube.com

*************
దయచేసి   లింక్ వద్ద కూడా చదవగలరు.

వైద్యులు,నర్సులు.. బాధలు... సిరంజిల.. ప్రమాదాల ను...



No comments:

Post a Comment