koodali

Saturday, April 18, 2020

మానవ శరీర అవయవాలను పోలిన కొన్ని పండ్లు, మొక్కలు, కూరలు..కొన్ని మందులు. ..మరికొన్ని విషయములు..


ప్రపంచంలో కొన్ని  మానవ శరీర భాగాలను పోలియుంటాయి. ఉదా.. అక్రూట్ కాయ ఆకారం ...మానవ మెదడు ఆకారాన్ని  పోలి ఉంటుంది.


 అక్రూట్ ను తగు మోతాదులో వాడుకుంటే మెదడుకు మంచిదంటారు. అక్రూట్ మరి ఎక్కువగా తినకూడదు. 


అల్లం ఆకారం జీర్ణాశయాన్ని పోలి ఉంటుందట.


అజీర్ణం చేసినప్పుడు అల్లం ఎండిన  శొంఠి  బాగా ఉపయోగపడుతుందని మనకు తెలుసు కదా! 



 నల్లేరు మొక్క ఎముకలు ఆకారంలో ఉంటుంది. ఎముకలు బలంగా ఉండటానికి, ఎముకలు విరిగినప్పుడు ఆయుర్వేదంలో ఈ మొక్క కాడలను వాడతారట.


బాదాం కాయలు కన్ను ఆకారంలో ఉంటాయి. కొన్ని మాత్రం బాదాం పప్పు నానబెట్టి, పొట్టు తీసి తింటే కళ్ళకు మంచిదంటారు.



మరికొన్ని విషయాలను క్రింద ఇచ్చిన లింక్ వద్ద చూడగలరు.

10 Foods That Look Like the Body Parts They're Good For



మరికొన్ని ముఖ్యమైన విషయాలను కామెంట్స్ వద్ద  వ్రాసాను. దయచేసి చదవగలరు. 

  *************
కొరోనా లో శ్వాస సరిగ్గా ఆడకపోవటం వల్ల కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉందంటున్నారు.

ఆయుర్వేదంలో శ్వాసకోశ జబ్బులకు ఎన్నో మందులున్నాయి. 

అలాంటప్పుడు .. ఎవరైనా ఊపిరి  సరిగ్గా  అందక ఇబ్బంది పడుతున్న కొరోనా పేషెంట్లకు ఆయుర్వేద విధానాల ద్వారా శ్వాస తీసుకోవటాన్ని సులభం చేసి, కొంచెం  ఊపిరి సులభం అయిన తరువాత అశ్వగంధ వంటి మందులు వాడి పూర్తిగా కోలుకునేలా చేయవచ్చేమో..ఆలోచించాలి.

***************
కొన్ని విషపు మొక్కల నుండి కూడా ఎన్నో మందులు తయారు చేస్తారు . 

 హోమియోలో... విషపూరితమైన మొక్కల భాగాలనుంచి తీసిన పదార్ధాన్ని కూడా పొటెన్సీలలోకి మార్చి  మందులగుళికలను తయారుచేస్తారట.

**************

Datura stramonium Medicinal Uses, Side Effects and Benefits


దత్తుర ఆకును ఎండబెట్టి కాల్చి, ఆ పొగను పీల్చినా శ్వాసకోశము ఫ్రీ అవుతుందట.

అయితే, దత్తుర విషపు మొక్క.....ఆ మొక్కతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మొక్క రసం తినటం, త్రాగటం చేయరాదు. 

 దత్తుర మొక్క రసం కళ్ళకు తాకితే కళ్ళకు ప్రమాదమంటారు.

అందువల్ల, దత్తుర ఆకును ఇంటర్నల్ గా తీసుకోకుండా,ఎండిన ఆకును కాల్చి, ఆ పొగను పీల్చటం వల్ల  శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయంటున్నారు.

ఈ పొగను పీల్చేటప్పుడు కళ్ళలోకి పొగ వెళ్ళకుండా కళ్ళు మూసుకోవటం మంచిది.
పొగ ఒక గొట్టం నుండి నేరుగా ముక్కులోకి వెళ్లేటట్లు పరికరం తయారుచేస్తే బాగుంటుంది.

* అయినా,  శ్వాసకోశ సమస్యలు తగ్గటానికి ఆయుర్వేదంలో మరెన్నో మందులు ఉన్నాయి.

* ప్రజలు  దత్తూర వంటి విషపు మొక్కలను వాడటం కన్నా, మిగతా మందులను వాడుకోవటం మంచిదనిపిస్తోంది.

 ఒకవేళ వాడాలనుకుంటే ఎవరికి తోచినట్లు వారు వాడకుండా, వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ మందులను వాడాలి.

************
దత్తుర తో కుక్క కాటుకు కూడా చికిత్స చేయవచ్చట. సుశ్రుతసంహిత ద్వారా తెలిసిన విషయాలు..

ఆ వివరాలు కూడా క్రింద ఇచ్చిన లింక్ వద్ద ఉన్నాయి.

Datura (Datura stramonium ) Seeds & Leaves, Their Uses, Health Benefits, Dosage & Side Effects 


కుక్క కరిచినప్పుడు వెంటనే అల్లోపతి ఇంజక్షన్లు వేయించుకుంటే ప్రమాదముండదు. 


ఏమి అవదులే అనుకుని ఇంజక్షన్లు వేయించకుండా తరువాత రేబిస్ వ్యాధి వస్తే మాత్రం అప్పుడు సరైన మందులు లేవంటున్నారు.

అలాంటప్పుడు ఆయుర్వేదంలో చెప్పిన సుశ్రుతుల వారు చెప్పిన మందును ప్రయత్నించవచ్చేమో?



ఏ మందులైనా ఏ విధంగా వాడాలో వైద్యుల సలహాతో వాడాలి.

***************

పోస్ట్ పెద్దగా అయితే బాగుండదని..  మరికొన్ని ముఖ్యమైన విషయాలను కామెంట్స్ వద్ద  వ్రాసాను. దయచేసి చదవగలరు. 



8 comments:



  1. మరికొన్ని విషయాలను క్రింద ఇచ్చిన లింక్ వద్ద చూడగలరు.

    10 Foods That Look Like the Body Parts They're Good For

    **************

    బీట్రూట్ తగుమాత్రంగా తింటే రక్తం బాగుంటుందట.

    కిడ్నీల ఆకారంలో ఉండే బీన్స్ ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో మనం మామూలుగా కూరకు వాడే చిక్కుడు కాయలు ఒక రకం, కిడ్నీ బీన్స్ అని ఇంకొకరకం ఉన్నాయి.

    ఏ రకం బీన్స్ అయినా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయట.

    అయితే, కిడ్నీ బీన్స్ అనే రకం ఎక్కువగా తింటే ఆరోగ్యవంతులకు కూడా త్వరగా అరగవట.

    కొందరు ఏమంటారంటే ..కిడ్నీ పాడయిన వారు మాత్రం కిడ్నీ బీన్స్ తినకూడదంటున్నారు.

    కొందరు ఏమంటారంటే..కిడ్నీ పాడయిన వారు కూడా కిడ్నీ బీన్స్ వంటివి తగుమోతాదులో తింటే మంచిదే అంటున్నారు.

    ReplyDelete

  2. దానిమ్మ గింజలు దంతాలను పోలి ఉంటాయి. పన్ను నొప్పి వచ్చినప్పుడు కొన్ని దానిమ్మ గింజలను బాగా నమిలి ఆ పన్నునొప్పి ఉన్న దగ్గర రాత్రంతా ఉంచితే నొప్పి తగ్గుతుంది.

    పిప్పింటాకు అని ఒక మొక్క ఆకుల వల్ల కూడా పిప్పి పన్ను నొప్పి చాలాబాగా తగ్గుతుంది.

    ఈ పిప్పింటాకును ఎలా వాడాలో వైద్యుల ద్వారా తెలుసుకుని వాడటం మంచిది.

    లేదంటే, ఎలా వాడాలో యూట్యూబ్లో కూడా ఉన్నది.

    ReplyDelete
    Replies


    1. త్రిఫల పొడిని పిప్పిపన్ను పైన రాత్రంతా ఉంచినా మంచి ఫలితం ఉంటుంది.

      **********
      పిప్పింటాకు గురించి మరికొన్ని విషయాలు.. పిప్పింటాకు మొక్క (acalypha indica ) ఆకులను చాలా మితంగా తిన్టే నులిపురుగులు పోతాయట. అయితే సంతానం కావాలనుకునేవారు, గర్భిణులు తినకూడదట.

      నాకు తెలిసినంతలో...పిప్పింటాకు రెండే ఆకులను దంచి పిప్పిపన్ను వద్ద కొంతసేపు ఉంచాలి. ఇలా రోజుకు ఒకసారి చొప్పున రెండురోజులు చేస్తే పన్ను నొప్పి చాలా బాగా తగ్గుతుంది.

      అయితే, పిప్పిపన్ను వద్ద ఆకును పెడితే రసం కొంతైనా కడుపులోకి వెళ్తుంది కదా! సంతాన దశలో ఉన్నవాళ్ళు పిప్పిపన్నుకు కూడా ఈ ఆకును వాడకూడదేమో?

      *****
      అప్పుడప్పుడు కొద్దిగా వేపాకు తింటే మంచిదంటారు. ఎక్కువగా తినకూడదు. అయితే, నాకు తెలిసినంతలో ..వేపాకుకు తాత్కాలికంగా ..అంటే కొంతకాలం సంతాన నిరోధకం చేసే గుణం ఉందట.

      ఎలా తినాలనే విషయం సరిగ్గా తెలుసుకుని తినాలి.

      ***********
      మలేరియాకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ -అనే మందును సింకోనా అనే చెట్టు బెరడు నుంచి తయారుచేస్తారు.ఈ మందు కూడా ఎవరికి వారే తమకు తోచినట్లు వాడితే చాలా దుష్ఫలితాలు వస్తాయట.

      అందువల్ల..ఆకులే కదా.. అని ఏదిపడితే అది తినకూడదు.వైద్యులను అడిగి వాడుకోవటం మంచిది.


      Delete

    2. కొరోనా కు ..కొత్తగా ప్లాస్మా ద్వారా చేసే చికిత్స సత్ఫలితాలను ఇస్తోందంటున్నారు.

      **********
      కొరోనా వచ్చినా అందరికీ ప్రాణగండం ఉండదు. చాలామంది కోలుకుంటున్నారు. రోగి రోగనిరోధకశక్తి, జబ్బు అటాక్ అయిన స్థాయిని బట్టి పరిస్థితి ఉంటుంది.

      రోగనిరోధకశక్తి బాగా ఉండి, జబ్బు తక్కువగా వచ్చినప్పుడు తక్కువ మందులు వాడినా జబ్బు తగ్గిపోతోంది.

      జబ్బు ఎక్కువ స్థాయిలో వచ్చినప్పుడు ఎక్కువ శక్తి గల మందులను వాడతారు. అంతేకానీ, అందరికీ ఎక్కువశక్తి ఉండే మందులను వాడే అవసరం రాదు.

      ఎక్కువ శక్తిగల కొన్ని రకాల మందులను వాడితే, కొన్ని సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అయినా ప్రాణం నిలపడానికి ఆ మందులను వాడతారు.

      ***********
      లండన్ లో ఉండే డా.నిమ్మగడ్డ శేషగిరిరావు గారి దంపతులు కొరోనా బారినపడి, బయటపడి
      తమ అనుభవాలను మీడియాలో తెలియజేసారు. వారికి వారే చికిత్స చేసుకుని తగ్గించుకున్నారట.

      వారు మంచి ఆహారం తీసుకోవటం మరియు పారాసిటిమల్, పసుపు, ఉప్పు, నిమ్మరసం, మిరియాలు వంటివి వాడటం వల్ల కొరోనా తగ్గిందట.

      ఇవన్నీ గమనిస్తే, అందరికీ ఎక్కువ శక్తి ఉండే మందులు వాడవలసిన అవసరం ఉండదనిపిస్తోంది.

      నాకు తెలిసినంతలో విషయాలను రాసాను. ఏ మందులైనా ఏ విధంగా వాడాలో వైద్యుల సలహాతో వాడాలి.

      Delete

    3. కొందరికి ప్లాస్మా థెరపీ ఫెయిలయ్యిందట.

      Delete

    4. నీటిలో ఉప్పును ఎక్కువగా వేసుకోకుండా తగుమాత్రం వేసుకోవాలి.

      ఉప్పునీటితో పుక్కిలించటం మరీ ఎక్కువగా చేయకుండా కొన్నిసార్లు మాత్రమే చేయాలి.

      ఒక రోజు ఉప్పునీటితో పుక్కిలించితే, ఒక రోజు ఒక స్పూన్ త్రిఫల పొడిని నీటిలో వేసి ఆ నీటితో పుక్కిలించవచ్చు.

      కొరోనా ఉన్నంత వరకూ ఇలా కొన్ని రోజులు చేయవచ్చు.

      ఉప్పునీరు అదేపనిగా శరీరభాగాలకు తగిలినా సమస్యలు రావచ్చు.

      Delete
  3. కొరోనా జబ్బుకు చక్కటి ఆహారం తింటూ.. కొంచెం వేడి నీటిలో ఉప్పు, పసుపు కలిపి గొంతులో గార్గిల్ చేయటం చేయాలి.
    మిరియాలు, పసుపు, ధనియాలు, తులసి, ఉసిరి, చ్యవన్ ప్రాస్..వంటివి వాడుకోవాలి.

    వెచ్చని రసం త్రాగితే బాగుంటుంది. వేడినీటిలో పసుపు, మిరియాలపొడి వేసి త్రాగితే మంచిదట.

    అన్నింటికి మించి దైవప్రార్ధన చేసుకోవాలి.

    ReplyDelete

  4. ఈ రోజుల్లో చాలామంది సూర్యరశ్మి తగలకుండా గదుల్లోపలే గడుపుతున్నారు.

    రోజూ ఉదయం, సాయంత్రం కొంతసేపైనా సూర్యరశ్మి తగిలేలా ఉండాలట. సూర్యరశ్మి వల్ల D విటమిన్ లభిస్తుంది.

    సూర్యరశ్మి తగిలితే ఆరోగ్యానికి మంచిది.

    ReplyDelete