koodali

Saturday, May 16, 2020

ఎంత కాలమో ?.....


వలస కార్మికుల బాధలు ఎంతో దారుణంగా ఉన్నాయి.

కనీసం రెండో విడత లాక్డౌన్ ముందు అయినా.. కొంత సమయం ఇచ్చి స్వస్థలాలకు వెళ్ళాలని అనుకున్న వారిని పంపించవలసింది.

వాళ్ళు నడిచి వెళ్ళకుండా అవసరమైనన్ని రైళ్ళు వేయాలి.


 రైళ్లలో ప్రయాణించటానికి సవాలక్ష రూల్స్ పెట్టకుండా.. తేలికగా టికెట్ బుక్ చేసుకునే విధానం ఉండాలి.

వాహనాలలో ఊళ్ళకు వెళ్ళాలంటే ఆన్లైన్లో వివరాలు ఇవ్వటం వంటివి వాళ్ళకు చేతనవుతుందా ?

రోజులతరబడి వాళ్ళు అలా బాధలుపడవలసి రావటం దారుణం.


ఊళ్ళకు వెళ్లనీయకుండా బలవంతంగా వారితో పనిచేయించాలనుకుంటే మానవహక్కులను ఉల్లంఘించటమే అవుతుంది.

**************

వలస కార్మికులు రోజుల తరబడి సరైన సౌకర్యాలు లేకుండా గుంపులుగా ఒకే దగ్గర ఉండటం వల్ల కూడా వారికి కోరోనా వచ్చే అవకాశం ఉంది.

కొరోనా వచ్చిన వారిని స్వస్థలాలకు రానివ్వమని అనటం కూడా అన్యాయం.

వ్యాధిలేనివారే.. తమను పరాయి ప్రాంతంలో సరిగ్గా పట్టించుకోవటం లేదని అంటున్నప్పుడు, ఇక వ్యాధి వచ్చిన వారిని పరాయిప్రాంతంలో ఏం పట్టించుకుంటారు? ఇవన్నీ గమనిస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

స్వస్థలాలకు వెల్తామనే వారిని స్వస్థలాలకు పంపించి , వారిని హోం క్వారైటైన్ లో ఉంచవచ్చు. అప్పుడప్పుడు వైద్యులు రోగుల ఇళ్లకు వెళ్లి వారిని పరీక్షించవచ్చు.

వేరే ఊరి నుండి వచ్చే వారివల్లే కోరోనా వస్తుందని అనుకోనక్కర లేదు. ఇప్పటికే కోరోనా దేశంలోకి వచ్చి ఉంది . 

స్వస్థలంలో ఇళ్ళలో ఉన్న వారికి కూడా కోరోనా వస్తోంది కదా!


************
మద్యం షాపులు తెరిచినప్పుడు ఇక లాక్డౌన్ ఎందుకు ?

మద్యం తాగిన వారు ఆ మత్తులో సోషల్ డిస్టెన్స్, 
చేతులు శుభ్రం చేసుకోవటం  వంటివి   పాటిస్తారా ?

మద్యం తాగిన వారి వల్ల ఇంట్లో వారికి, బయట వారికి కూడా కొరోనా సోకే అవకాశం ఉంది.


**********
వలస కార్మికులు మాత్రమే  కాకుండా .. ఎన్నో రంగాల వారు , ఎందరో వ్యక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వీరి  బాధలు ఎప్పుడు తీరుతాయో?

**********
మద్యం తాగితే కొరోనా తగ్గుతుందని కొందరు అపోహపడుతున్నట్లున్నారు. మరి, అమెరికాలో, ఇంకా కొన్ని దేశాలలో   చాలామంది మద్యం త్రాగుతారు. అక్కడ  కొన్నివేలమంది చనిపోయారు కదా. 

ఇందువల్ల ఏం తెలుస్తుందంటే, మద్యం త్రాగితే కోరోనా తగ్గకపోగా ఇంకా పెరిగే అవకాశముంది అని .

**********

క్రమంగా  లాక్ డౌన్  తీసి డిస్టెన్స్ పాటిస్తూ జాగ్రత్తగా పనులు చేసుకోవచ్చు.

బయటకు వెళ్ళి ఎక్కడైనా కుర్చీలో కూర్చుని లేస్తే... ఇంకొకరు  వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటే... అప్పటికే కుర్చీకి అంటుకుని ఉన్న కొరోనా వైరస్... కుర్చీలో కొత్తగా వచ్చి కూర్చొన్న వారికి వచ్చే అవకాశం ఉండొచ్చు కదా ? 

ఇకమీదట.. లిఫ్ట్ బటన్లు, బస్సు లో సీట్లు, షాపింగ్ మాల్స్ లో వస్తువులు..ఇవన్నీ ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలేమో ? 

**********
లాక్డౌన్ వల్ల పర్యావరణ కాలుష్యం కొంత తగ్గింది. లాక్డౌన్ తరువాత కూడా పర్యావరణ కలుషితం కాని విధంగా ఉపాధి పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. 

పారిశ్రామిక వ్యర్ధాలు విచ్చలవిడిగా గాలిలోనూ,నీటిలోనూ (నదుల్లోను, సముద్రంలోనూ..)  కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

పర్యావరణకాలుష్యం వల్ల అనేక జబ్బులు వస్తున్నాయి. జబ్బులు వచ్చి మనుషులు చచ్చిపోయినా ఫరవాలేదు.. ఆర్ధికవృద్ధి రేటు పెరగటమే ముఖ్యం..  అనుకుంటే మాత్రం కష్టం.

అయితే, దైవం చూస్తూ ఊరుకోరు..ఎవరిని ఎలా దారిలోకి తీసుకురావాలో సమయం వచ్చినప్పుడు చూపిస్తారు.

ఇప్పుడు చిన్న కోరోనా వైరస్  వల్ల ప్రపంచమే విలవిలలాడే పరిస్థితి  జరుగుతోంది కదా.

టెక్నాలజీకి మరీ అలవాటుపడకండి. భవిష్యత్తులో సోలార్ తుఫాన్లు వంటివి వచ్చి టెక్నాలజీ కూడా స్థంభించే పరిస్థితి కూడా రావచ్చు? 

అందుకే టెక్నాలజీ లేకుండా కూడా జీవించటం ఎలా? అనేదానికి కూడా మనం  సిద్ధపడి ఉండాలి.

ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి,  పద్ధతిగా జీవించాలి. 

టెక్నాలజీ అవసరమే కానీ, టెక్నాలజీ ఎంతవరకూ అవసరమో అంతవరకే వాడుకోవాలి.

( సోలార్  తుఫాన్  గురించి కొన్ని వివరాలను కామెంట్స్ వద్ద చదవగలరు. )

*************
ఎవరైనా సరే, ఇతరులను బాధపెడితే దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది.

తప్పుచేసిన వారు ఇహలోకంలో  తీర్పు నుండి తప్పించుకున్నా కూడా... దైవం యొక్క తీర్పు నుండి మాత్రం తప్పించుకోలేరు.




3 comments:


  1. మనుషులు బ్రతకాలంటే ఇంత టెక్నాలజీ, ఇంత పారిశ్రామీకరణ, ఇన్ని సౌకర్యాలు..అవసరమా?

    పొనీ ఇన్ని ఉన్నా కూడా అందరూ మనశ్శాంతిగా ఉన్నారా ?

    పర్యావరణాన్ని పాడుచేస్తూ ఇతర జీవజాలాన్ని నాశనం చేస్తూ మనుషులు మాత్రమే భూమి మీద బ్రతకాలా ?

    విపరీతంగా వస్తువులను ఉత్పత్తి చేసే చైనాలో .. ఆరోగ్యాలు పాడయ్యే స్థాయిలో వాతావరణకాలుష్యం విపరీతంగా పెరిగిందని కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి.

    మనుషుల ఆరోగ్యాన్నీ, ప్రాణాలను హరించే పరిస్థితి రావటం మనుషుల స్వయంకృతాపరాధం.

    ReplyDelete

  2. పైన పోస్టులో సోలార్ తుఫాన్ల గురించి కొంత వ్రాయటం జరిగింది. వాటి గురించి కొన్ని విషయాలు...

    సోలార్ తుఫాన్లు పెద్ద ఎత్తున వస్తే గనక.. శక్తివంతమైన ఎలెక్ట్రో మాగ్నెటిక్ రేడిఏషన్ వంటివి భూమికి వస్తాయట.

    వాటివల్ల సాటెలైట్ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదముందట. తద్వారా కొన్నిసార్లు అంతర్జాలంలో ఉన్న సమాచారం కూడా పాడయ్యే అవకాశం కూడా ఉంటుందట.

    ఫోన్లు పనిచేయకపోవటం, విద్యుత్ వ్యవస్థ దెబ్బతినటం వంటి ప్రమాదాలకు కూడా అవకాశం ఉంటుందట...ఆధునిక వ్యవస్థ విద్యుత్ పైనే నడుస్తోంది కదా! విద్యుత్ ఆగితే చాలా వ్యవస్థలు పనిచేయవు.

    ఇప్పటివరకూ శక్తివంతమైన సౌరతుఫాన్లు రాలేదు కాబట్టి వీటి గురించి తెలియకపోవచ్చు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? కొరోనా వచ్చి పరిస్థితి ఇలా ఉంటుందని ఎవరైనా ఊహించారా ?

    అందుకే టెక్నాలజీ లేకుండా కూడా జీవించటం ఎలా? అనేది కూడా మనం నేర్చుకుని ఉండాలి.

    ఎలెక్ట్రానిక్స్ వస్తువులు అతిగా వాడటం వల్ల పర్యావరణ కాలుష్యం వంటి ఎన్నో నష్టాలు కూడా ఉన్నాయి.

    వాడి పడేసిన ఎలెక్ట్రానిక్ వస్తువుల చెత్త నుంచి విడుదలయ్యే ప్రమాదకరమైన రసాయనాలు ... గాలిలో, నీటిలో, వాతావరణంలో కలవటం ద్వారా జీవజాలానికి ఎంతో ముప్పు ఉందంటున్నారు. కాబట్టి, టెక్నాలజీ ఎంతవరకూ అవసరమో అంతవరకే వాడుకోవాలి.

    ReplyDelete

  3. దయచేసి ఇక్కడ కూడా చూడండి.

    క్రింద ఇచ్చిన విషయాన్ని.. కాపీ.. పేస్ట్..క్లిక్ చేసి చూడగలరు.


    ఆకలి బాధ తెలిసి.కన్నీళ్లు పెట్టుకున్న పూజారులు |Must Watch: Very Emotional Video ilaamTi vaaLLeamdaroe imkaa umDiumTaaru.

    ReplyDelete