koodali

Wednesday, November 30, 2011

వరాహస్వామివారి అవతారం గురించి మరి కొన్ని వివరాలు . ........


* శ్రీపాదశ్రీవల్లభస్వామివారు, శ్రీ వరాహస్వామి వారి అవతారం గురించి చెప్పిన రకం జాతి జీవుల గురించి,
ఈ టపా వ్రాసిన తరువాత మళ్ళీ అంతర్జాలంలో స్పష్టంగా చూస్తే.... ఆ జీవులకు ఒకే కోర ఉంటుంది. ఇంకా, ఆ జాతిలోని కొన్ని రకాలకు రెండుకోరలు కూడా ఉండే అవకాశం ఉంది.అనీ ,


ఇంకా
అడవిజాతికి చెందిన వరాహాల గురించి అంతర్జాలంలో వ్రాసినది చూస్తే ...... వాటిలో పురుషజాతివరాహాలకు పెద్దకోరలు ఉంటాయనీ, స్త్రీజాతివరాహాలకు చిన్నవైన కోరలుంటాయని నాకు అర్ధమయింది మరి. ..


* చాలా,మంది భావిస్తున్నట్లు అడవిలో తిరిగే
వరాహాలకు ఒక్కటే కోర ఉండటం జరగదు కదా !. వాటికి నోటికి ఇరుప్రక్కలా రెండు కోరలు ఉంటాయి.


* వరాహావతారం శ్రీపాదశ్రీవల్లభస్వామివారు చెప్పిన జీవజాతికి సంబంధించినదే
.
.................

శ్రీ వరాహస్వామివారి అవతారం గురించి కొన్ని వివరాలు ......... క్రిందటి టపాలో వ్రాశాను కదండి. ...
." శ్రీ దేవీ భాగవతము " గ్రంధములో .........

వరాహస్వామి భూదేవిని సముద్రంలోనుంచీ పైకి తీసుకువస్తున్న సందర్భాన్ని గురించి ఒక దగ్గర ఇలా ఉంది..........

" ఒక పద్మాన్ని కోరమీద నిలబెట్టిన దిగ్గజం లాగా భాసించాడు.ఆదివరాహమూర్తియైన ఆ యజ్ఞేశుడూ యజ్ఞపూరుషుడూ "..... అని వర్ణించబడింది...అంటే " ఒకే కోర " .అన్నమాట.

అంటే మనం సామాన్యంగా చూసే వరాహాలకు కోరలుండవు. అడవిలో తిరిగే వరాహాలకు రెండు కోరలుంటాయి. అంటే ఆ అవతారమూర్తి మనం భావించే వరాహం వంటిది కాదు.
అని కొన్ని వివరాలు ,
............ఇంకా.......,

ఈ వసుంధర ( భూదేవి ) వరాహావతారము సమయంలో వారాహిగా అర్చింపబడిందట.

" శ్రీ దేవీ భాగవతము " గ్రంధములో ....

శుంభనిశుంభుల వధ గురించి చదివితే ఒక దగ్గర ...... శుంభనిశుంభులతో యుద్ధం జరిగిన సందర్భంలో .....వారాహీ దేవికి కోరలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది.

మా ఇంట్లో ....ఇద్దరు రచయితలు వచనరూపంలో అందించిన .... "శ్రీ దేవీ భాగవతము " గ్రంధములు రెండు ఉన్నాయండి.


౧. ఒక దగ్గరేమో ....నారసింహి నఖాగ్రాలతోనూ, వారాహి ముట్టెతోనూ దానవుల శరీరాల్ని చీల్చివేశారు...అని ఉంది.
2 .ఇంకొకరు అందించిన గ్రంధములో ...... వారాహీ దంష్ట్రాలకు రానురాను పదును పెరిగింది. ....అనీ అలా ఉంది.

*మరి ." శ్రీ దేవీ భాగవతము " గ్రంధములో వరాహస్వామి గురించి.......


గజరాజు తొండంతో కమలాన్ని ఎత్తినట్లు......తన దంష్ట్రాగ్రంతో భూదేవిని పైకి ఎత్తాడు...అని ఉంది కదా !


ఇవన్నీ చదివిన తరువాత నాకు రకరకాల ఆలోచనలు వచ్చాయి.

* నాకు ఏమనిపిస్తోందంటే సృష్టిలో స్త్రీ పురుష జాతి జీవులకు శరీరనిర్మాణంలో తేడాలుంటాయి కదా!

అలాగే వరాహస్వామికి పెద్దగా ఒక కోర ఉంటే వారాహీదేవికి రెండు కోరలున్నాయేమో ? అనిపించింది. ( పొరపాటైతే దైవం దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను. )

వరాహస్వామి అవతారం చాలా కాలం క్రితం జరిగింది కదా ! ఇప్పుడున్న అలాంటి జీవులలో , స్త్రీజాతి జీవులలో కొన్ని మార్పులు జరిగి కూడా ఉండవచ్చేమో ? అనికూడా అనుకున్నాను.

ఇదంతా చదువుతున్న వారికి అసలు వరాహస్వామి ధరించినది ఏ జీవి రూపం అన్నది స్పష్టంగా తెలుసుకోవాలంటే ....... దీనికి సమాధానం " శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి " వారే చెప్పటం జరిగింది.

" శ్రీ పాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము " అన్న గ్రంధములోని 7 వ అధ్యాయములో 61 వ పేజీలో ఆ వివరములు చక్కగా ఉన్నాయండి.

ఇంకా....

ఒకసారి బ్రహ్మ, విష్ణువులు తామే గొప్ప అని భావించిన సందర్భంలో ఒక మహా లింగాకారం వారి మధ్యన ఆవిర్భవించిన కధ మనకు తెలుసు.

* అయితే బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి లింగాకారము యొక్క ఆది ..అంతము , కనుగొనే సమయంలో ....... వారు వేరొక విధమైన ఆకారములు ధరించారని "శ్రీదేవీ
భాగవతము"లోవివరించబడలేదు. .
................................................................

* ఈ టపా చదువుతున్న వారికి నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానని అనిపిస్తోందా ?

మరి .. వారాహీదేవికి రెండు కోరలున్నాయని చదివాను అని ఎవరైనా అంటారేమోనని ఇలా వ్రాయటం జరిగింది.

విజ్ఞానం గురించి లోతుకు వెళ్ళేకొద్దీ
ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ( ఇది ఆధునిక శాస్త్రవేత్తలకు కూడా వర్తిస్తుంది. )

కొన్ని విషయాల్లో కొంతవరకూ ఎక్కువగా ఆలోచించటం అవసరం , కొన్ని విషయాల్లో అనవసరం . ఏది ఎంతవరకు అన్నది .... అది వారివారి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. తెలియకపోతే చేతనయినంతవరకూ ప్రయత్నించి , సరైన మార్గాన్ని చూపించమని దైవాన్ని ప్రార్ధించటం ఉత్తమం...

*వ్రాసిన విషయాల్లో అచ్చుతప్పులు గానీ, ఇతరత్రా ఏమైనా పొరపాట్లు ఉంటే దైవం దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను. 

 

Monday, November 28, 2011

వరాహావతారం గురించి కొన్ని విషయాలు..........

తెలుగుభావాలు వారి బ్లాగులో వరాహమూర్తి అవతారం గురించి కొన్ని అభిప్రాయాలు చదివానండి.

* నాకు ఏమనిపిస్తోందంటే......." శ్రీ దేవీ భాగవతము " గ్రంధములో .........వరాహస్వామి తన బంగారుకోరతో భూదేవిని సముద్రం నుంచీ పైకి తెచ్చి స్థిరంగా నిలబెట్టారని చెప్పటం జరిగింది. అంటే " ఒకే కోర " .


ఇంకా, వరాహస్వామి భూదేవిని సముద్రంలోనుంచీ పైకి తీసుకువస్తున్న సందర్భాన్ని గురించి ఒక దగ్గర ఇలా ........." ఒక పద్మాన్ని కోరమీద నిలబెట్టిన దిగ్గజం లాగా భాసించాడు.ఆదివరాహమూర్తియైన ఆ యజ్ఞేశుడూ యజ్ఞపూరుషుడూ "..... అని వర్ణించబడింది...


అంటే మనం సామాన్యంగా చూసే వరాహాలకు కోరలుండవు. అడవిలో తిరిగే వరాహాలకు రెండు కోరలుంటాయి. అంటే ఆ అవతారమూర్తి మనం భావించే వరాహం వంటిది కాదు.

* మరి ఏమిటి ? అంటే దీనికి సమాధానం " శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి " వారే చెప్పటం జరిగింది. " శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము " అన్న గ్రంధంలో
7 వ అధ్యాయములో .... 61 వ పేజీలో వివరములు ఉన్నాయండి.


ఇంకా " శ్రీ దేవీ భాగవతము " గ్రంధములోని వివరముల ప్రకారం చూస్తే ........ భూమిని హిరణ్యక్షుడు మహా సముద్రంలో విసిరేశాడని చెప్పబడింది. అంటే ఈ సముద్రం భూమిపైన ఉన్న సముద్రం కాదు. అయినా భూమిపై ఉన్న సముద్రంలోకి భూమిని ఎలా పడవేస్తాడు లెండి.


*మరి ఆ మహా సముద్రం మాత్రం దేని ఆధారంగా నిలబడిఉందని మనకు సందేహం వస్తుంది. ఆలోచిస్తే సమస్త విశ్వానికి ఆదిశక్తి అయిన పరమాత్మ శక్తే ఆధారశక్తిగా నిలుస్తోంది. ఆ మహా శక్తివల్లనే అనంతబ్రహ్మాండాలుగా సృష్టిరచన సాగుతోందని మనం తెలుసుకోవచ్చు.


ఉదా... భూమి తిరుగుతున్నప్పుడు భూమిపైని సముద్రాలలోని నీరు క్రింద పడటం లేదు కదా ! గురుత్వాకర్షణ శక్తి వల్ల పడటం లేదు అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తిని ఇచ్చింది దైవమే కదా ! అలాగే .ఎన్నో గ్రహాలు కూడా క్రింద పడిపోకుండా విశ్వంలో నిలిచే ఉన్నాయి.


సూర్యచంద్రులు గతి తప్పకుండా వస్తున్నారు.
ఊళ్ళను ముంచేసే వానలు వానగా కురవకముందు తేలికైన మబ్బుల్లో ఆకాశంలోనే నిలిచి ఉంటున్నాయి కదా !

 ఇన్ని సాధ్యమయినప్పుడు మహాసముద్రాలు కూడా ఏ ఆధారం లేకపోయినా వాటికవే విశ్వంలో నిలిచి ఉండగలవు. దైవం ప్రసాదించిన విశ్వగురుత్వాకర్షణశక్తి కూడా ఉంటుందేమో ! దైవానికి ఏదీ అసాధ్యం కాదు.

కొన్ని విషయాలు ................

*ఒకప్పుడు త్రిమూర్తులు ఆదిపరాశక్తి అయిన పరమాత్మ వద్దకు వెళ్ళి వారిని స్తుతించగా ఆదిపరాశక్తి వారికి ఎన్నో విషయాలను వివరించటం జరిగిందట. అందులో కొద్ది భాగం.........


ఆదిపరాశక్తి బ్రహ్మదేవునికి వివరించిన విషయాలలోని కొద్ది భాగం.........

*.........ఇక్కడ అంతా జలమయం, పృధివి లేదు, సృష్టి ఎలా చెయ్యను అని కదా అడిగావు. స్థూలాకారంలో పృధివి లేదు అంటే పరమాణువు(లు )గా ఉందని తెలుసుకో. పృధివ్యభావం పరమాణ్వభావం కాదు........అని
ఆదిపరాశక్తి ( పరమాత్మ ) ఎన్నో విషయాలను చెప్పటం జరిగింది.

..............................................

* యమధర్మరాజు సావిత్రీదేవితో చెప్పిన దేవీ మహిమలోని కొన్ని భాగాలు...
........................................................
సర్వకారణకారణుడు సర్వాత్మకుడు సర్వభగవంతుడు సర్వేశ్వరుడు సర్వాద్యుడు సర్వవేత్త సర్వపరిపాలకుడు నిత్యరూపి నిత్యదేహి నిత్యానందుడు నిరాకృతి నిరంకుశుడు నిరాశంకుడు నిర్గుణుడు నిరామయుడు నిర్లిప్తుడు సర్వసాక్షి సర్వాధారుడూ అయిన పరాత్పరుడు ( ప్రకృతి ) మాయావిశిష్టుడై ప్రకృతి శబ్దవాచ్యుడు అవుతున్నాడు. ప్రకృతిపురుషులు పరస్పరం అభిన్నులు. అగ్ని - దాని దాహకశక్తి లాగా అవిభాజ్యులు. వీరి వికారాలే సర్వప్రాకృతరూపాలూనూ. ప్రకృతి శక్తినే మహామాయ అంటారు. సచ్చిదానందరూపిణి. తాను రూపరహిత అయినా భక్తులను అనుగ్రహించడం కోసం రూపం ధరిస్తూ ఉంటుంది. మొట్టమొదటగా గోపాలసుందరీ రూపాన్ని సృష్టించింది. వెంటనే అత్యంత మనోహరుడైన గోపసుందరుణ్ణి సృష్టించింది. ఆమె రాధాదేవి,. అతడు శ్రీకృష్ణపరమాత్మ. ...............

*యముడు చెప్పిన మరికొన్ని విశేషాలు.........

వాయువు సముద్రాన్ని మోసినా, సముద్రం కూర్మాన్ని మోసినా, కూర్మం అనంతుణ్ణి మోసినా ,అనంతుడు ధరణిని మోసినా, ధరణి రత్నరాశులనూ సముద్రాలనూ పర్వతాలనూ సకల చరాచర ప్రాణికోటినీ ఓర్పుతో భరిస్తున్నా - ఇదంతా పరమాత్ముని ఆజ్ఞయే.

*యమధర్మరాజు ప్రళయం గురించి చెప్పిన మరి కొన్ని విషయాలు ..........................

వైకుంఠంలో క్షీరసముద్రమధ్యాన శేషతల్పం మీద శయనించే చతుర్భుజ నారాయణుడు సైతం శ్రీకృష్ణపరమాత్ముని వామపార్శ్వంలో లీనమవుతాడు............అనీ,

ఇంకా........

* ఇలా ప్రళయం సంభవించినప్పుడు సమస్తమూ శ్రీకృష్ణుడిలో లీనమైతే శ్రీకృష్ణుడు ప్రకృతిలో లీనమవుతాడు. ఒక్కటే పరాశక్తి. ఒక్కడే పరాత్పరుడు నిర్గుణుడు. అగ్ర అసీత్ అని వేదాలు చెప్పేది ఇదే. అవ్యక్త మూల ప్రకృతి . అవ్యాకృత పదవాచ్య. చిదభిన్న. ప్రళయంలో తానే మిగులుతుంది. పరాశక్తి గుణాలను కీర్తించడం బ్రహ్మాండంలో ఎవరి వల్లా కాదు .........అని ఇంకా ఎన్నో విషయాలను యముడు సావిత్రికి చెప్పటం జరిగింది.

 ...............................

ఒకసారి బ్రహ్మ, విష్ణువులు తామే గొప్ప అని భావించిన సందర్భంలో ఒక మహా లింగాకారం వారి మధ్యన ఆవిర్భవించిన కధ మనకు తెలుసు. అప్పుడు విష్ణుమూర్తి వేరొక ఆకారం ధరించి లింగాకారం యొక్క వేరొకకొస కనుగొనాలని ప్రయత్నించారు అని కొందరు అంటారు. . అప్పుడు ధరించిన అవతారం కూడా వరాహావతారం లాంటిదేనో నాకు తెలియదు.


* అయితే బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి లింగాకారము యొక్క ఆది అంతము కనుగొనే సమయంలో ....... వారు వేరొక విధమైన ఆకారములు ధరించారని "శ్రీ దేవీ భాగవతము "లో వివరించబడలేదు. .
...............................

*బ్రహ్మమానసపుత్రుడైన స్వాయంభువ మనువు తన తండ్రియైన బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారం మహాదేవిని ఆరాధించి ప్రజలను సృష్టించే శక్తిని పొందారట.

అచ్చుతప్పులు గానీ ఇతరత్రా పొరపాట్లు గానీ ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను..
 

Friday, November 25, 2011

పరిణామవాదాన్ని వేరొక కోణం నుండి పరిశీలిస్తే..... .. మూడవ భాగం........

 
ఈ ప్రపంచం ఒక పద్దతి ప్రకారం దైవం చేత సృష్టించబడింది. ఉదా.... మొక్కలు ఉన్నాయి. అవి విపరీతంగా పెరిగిపోకుండా వాటిని ఆహారంగా తీసుకునే కుందేలు, మేకలు వంటి శాకాహార జంతువులు సృష్టించబడ్డాయి అనిపిస్తుంది .


ఈ శాకాహార జంతువులు ఎక్కువగా పెరిగిపోయి మొక్కలను బాగా తినేస్తే మొక్కలు గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని ఈ జంతువులు విపరీతంగా పెరిగిపోకుండా వాటిని ఆహారంగా తీసుకునే మాంసాహార జంతువులు సృష్టించబడ్డాయి అనిపిస్తుంది.


పులి వంటి కొన్ని జీవులను పరిశీలిస్తే ......పులి పిల్లలకు జన్మ ఇచ్చాక వెంటనే తన పిల్లలను తానే చంపుతుంది అని ఒక దగ్గర చదివానండి,. . . . . అలా చంపబడకుండా మిగిలిఉన్నవి జీవిస్తాయట.


లేకపొతే పులులవంటి బలమైనక్రూర జంతువుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతే మిగిలిన జీవులకు అపాయం కాబట్టి సృష్టిలో ఇలాంటి ఏర్పాటు జరిగిఉంటుంది అని కూడా చదివానండి.


యిలా ఏది ఎంతలో ఉండాలో అంతలో ఉండేలా దైవం ఏర్పాటు చేశారు.


ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది . మరి మొక్కలు వంటి జీవులు విపరీతంగా పెరిగితే తప్పేమిటని ? మొక్కలు విపరీతంగా గుబురుగా పెరిగిపోతే వాటికి ఆహారసమస్య ఎదురవుతుంది. అంటే, వాటికి నేలనుండి అందే పోషకాలు సరిపోవు.

ఉదా...మన ఇళ్ళలో కూడా మొక్కలు ఏపుగా పెరగాలంటే మొక్కకుమొక్కకు నడుమ కొంచెం దూరంగా నాటాలి.


ఇంకా ప్రపంచంలో ఒకో ప్రదేశంలో ఒకోరకమైన వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణానికి తగ్గట్టు జీవులు ఉంటాయి.

ఒకే దేశంలో కూడా రకరకాలుగా వాతావరణం మారుతుంటుంది.


ఒక ప్రదేశంలో పెరిగే మొక్కలకు వాటికి తగ్గ సహజ మిత్రులు, సహజ శత్రువులు ఉంటాయట.


అంటే మొక్కలు విపరీతంగా పెరిగిపోకుండా చీడపురుగుల వంటివి కూడా వస్తాయి. చీడపీడలు మరీ ఎక్కువయితే మొక్కలు పూర్తిగా అంతరించిపోతాయి.


( అప్పుడు ఇతర జీవులకు ఆహారసమస్య ఎదురవుతుంది.)అలా కాకుండా మొక్కలనాశించే చీడపురుగులను పట్టితినే పక్షులు ఉంటాయి.అలా మొక్కలకు తగు రక్షణ ఉంటుంది.

ఇలా సృష్టిలో ఒక క్రమం ఉంది. మనుషుల్లో కూడా జనాభా విపరీతంగా పెరగకుండా ప్రకృతిలో ఏర్పాట్లు ఉన్నాయి.


అయితే ఒక దగ్గర జీవించే మొక్కలను తీసుకెళ్ళి వేరొక ప్రాంతంలో నాటితే ........ అక్కడ వాటికి సహజ శత్రువులు , సహజ మిత్రులు లేక ....... ఆ జీవులు అంతరించిపోవటమో లేక విపరీతంగా వృద్ధి చెంది సమస్య రావటమో జరుగుతుందట.

అందుకే ఎక్కడివాటిని అక్కడే ఉంచటమే మంచిపద్ధతి.

అయితే జీవులు కూడా ఒక్కసారిగా పరిసరాలు, వాతావరణం మారినప్పుడు త్వరగా అలవాటుపడలేవు.

కొన్ని జీవులు ప్రపంచంలో ఎక్కడయినా జీవించే లక్షణాన్ని కలిగి ఉంటాయి. . .

కొన్ని అలా కాదు . ఉదా.... ఇప్పుడు మనం చూస్తున్న మిరపమొక్క విదేశాలనుంచి వచ్చిందంటారు. ( పూర్వం మనవాళ్ళు కారం కోసం మిరియాలు వాడేవారట. ) ఇప్పుడు మిరప భారతదేశంలో బాగానే పెరుగుతోంది .

అయితే దూరంగా ఉన్నా కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని వాతావరణంలో పోలికలు కనిపిస్తాయి .

అయితే యాపిల్ మొక్క వేడిగాఉండే ప్రాంతాలలో తెచ్చినాటితే ఏపుగా పెరగదు. చలిప్రాంతాల్లోనే బాగా పెరుగుతుంది. ఇలాంటి వాటిని వాటికి తగ్గ చల్లనివాతావరణం ( గ్లాస్ హౌస్ ) ఏర్పరిచి పండించటానికి ప్రయత్నిస్తున్నారు .


కోతులు ప్రపంచంలో చాలాచోట్ల ఉంటాయి. కానీ, ధ్రువపు ఎలుగుబంట్ల వంటి వాటిని వేడి ప్రదేశాల్లో పెంచలేము కదా!

ఇంకా నాకు అనిపిస్తుంది ఎక్కడి వారికి ఆ ప్రాంతంలో దొరికే ఆహారమే బలాన్ని కలిగిస్తుందేమో అనిపిస్తుంది. ఉదా...మనకు నిమ్మ, ఉసిరి వంటివి బాగా దొరుకుతాయి.

కానీ మనకు పొరుగింటిపుల్లకూర రుచి అన్నట్లు యాపిల్ పండే బలమని చాలామంది నమ్మకం.

20 రూపాయలు పెట్టి ఒక యాపిల్ కొంటారు గానీ, 2 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయ లేక ఒక ఉసిరి కాయ కొని రోజూ రసం తాగితే కావలసినంత 'సి ' విటమిన్ లభిస్తుంది.

అసలు నిమ్మ, ఉసిరిలో యాపిల్ కన్నా గొప్ప సుగుణాలు ఉన్నాయట.

అందుకే ఎక్కడి వాతావరణానికి తగ్గట్టు అక్కడ లభించే వాటిని ఎక్కువగా తినటం మరింత మంచిదేమోనని నాకు అనిపిస్తుంది.

కొన్ని పక్షులు వలస వస్తుంటాయి. కొంతకాలం గడిచాక తిరిగి తమదేశాలకు వెళ్ళిపోతుంటాయి. వాటికి పరిణామం చెందవలసిన అవసరం ఉండకపోవచ్చు.

కానీ , కొన్ని జీవులు తప్పనిసరి పరిస్థితిలో కొత్త వాతావరణంలో పరిసరాలలో జీవించవలసి వస్తుంది.

ఉదా.. ఒక మొక్కనో, జంతువునో వేరే ప్రదేశాలకు తీసుకెళ్తే వాటిజాతి తప్పనిసరిగా కొత్తప్రదేశానికి అనుగుణంగా నెమ్మదిగా పరిణామం చెందవలసి ఉంటుంది కదా ! ఇలాంటి సందర్భాలలో జీవులకు పరిణామలక్షణం అన్నది మంచిదే కదా!

ఈ రోజుల్లో మనుషులు అంతులేని కోరికలతో రకరకాల రసాయనాలు కనుక్కుని వాటితో (వాటి వ్యర్ధాలతో ) భూమిని, నీటిని, గాలిని పొల్యూట్ చేస్తున్నారు.


ఆ నీటిని త్రాగుతూ, ఆ భూమిలో పండిన పంటలను తింటూ, ఆ గాలిని పీలుస్తూ జీవులలో క్రమంగా బలం తగ్గిపోతోంది.


తీసుకునే ఆహారంలో బలం తగ్గిపోవటం, యంత్రాల వల్ల శారీరిక శ్రమ కూడా చాలావరకూ తగ్గిపోవటం వంటి అనేక కారణాల వల్ల ........ఈ రోజుల్లో మనుషుల్లో మధ్య వయసుకే కాళ్ళుకీళ్ళు నెప్పులు, నడుము నెప్పులవంటి లక్షణాలు చూస్తూనే ఉన్నాము కదా!

ఇక మాటలు రాని , తమ బాధ ఇదీ అని చెప్పుకోలేని మూగ జీవులు వాటి బాధలను ఎలా చెప్పుకుంటాయి ?

ఇంతగా పొల్యూట్ అయిపోయిన తరువాత జీవులు ఇక పరిణామం చెందటానికి కూడా అవకాశం ఉండదు. కొత్త మార్పులకు అనుగుణంగా పరిణామం చెందాలన్నా కొంతశక్తి కావాలి కదా !


విపరీతంగా పెరిగిపోయిన పొల్యూషన్ వంటి కారణాల వల్ల పిచ్చుకల వంటివి బాగా తగ్గిపోతున్నట్లు, మరి కొన్ని జీవజాతులు అంతరించే ప్రమాదం కూడా ఉందని కొందరు అంటున్నారు కదా !


ఇలాగే విజ్ఞానం పేరుతో విపరీతపోకడలు పోతూ ... జీవులన్నీ విలవిలలాడే స్థితికి వచ్చినప్పుడు .... దైవం చూస్తూ ఊరుకోరు కదా ! ఆ పరిస్థితి రాకుండా విజ్ఞులైనవారు మేలుకుంటే మంచిది..


ఇందులో చాలా విషయాలు పెద్దవాళ్ళు ,పిన్నలు, పండితులు, పామరులు ,... ద్వారా తెలుసుకున్నవి , పత్రికల్లో చదివినవేనండి. . అందరికి నా కృతజ్ఞతలు. అంతా దైవం దయ......దైవానికి కృతజ్ఞతలు.


Tuesday, November 22, 2011

పరిణామవాదాన్ని వేరొక కోణం నుండి పరిశీలిస్తే..... .. రెండవ భాగం.....

 

(Indian Minerva )

సీతగారూ మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి..

కానీ, నాకు ... తెలుగంత బాగా ఇంగ్లీష్ రాదు. అందుకని తెలుగులో వ్యాఖ్య వ్రాస్తే బాగుండేది అనుకున్నాను.

అయితే,నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదన్న విషయం మీకు తెలియదుకదా!

* పరిణామవాదానికి వీలులేకుండా..... దైవం మొదలే జీవులను పరిపూర్ణంగా సృష్టించవచ్చు కదా ! అని చాలా మంది సందేహం ...........

దైవం భూమిపై జీవుల్ని రరకాలుగా సృష్టించటం జరిగింది.

అయినా పిండ దశలో ఉన్నప్పుడు వివిధ జీవజాతుల పిండాల్లో ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తాయి.అని శాస్త్రవేత్తలు అంటున్నారట.

మానవులకు జ్ఞానాన్ని , ఎన్నో తెలివితేటల్ని ఇచ్చిన దైవం తలచుకుంటే మొక్కలకూ, జంతువులకూ కూడా ఇవన్నీ ఇవ్వగలరు.

* కానీ ఏ జీవులకు ఏ లక్షణాలను ఇస్తే సృష్టి సజావుగా సాగుతుందో దైవానికే తెలుసు.

* పరిణామ సిద్ధాంతం కూడా సృష్టికి ఆటంకం కలుగకుండా పరిమితమైన పరిధిలోనే జరుగుతుంది అనిపిస్తుంది.

ఉదా... మొక్కలు ..వాటికి మనుషుల్లాగా మాట్లాడటం ,నడవటం చేతకాదు.

దైవం మొక్కలకు మాటలు, నడక ఇచ్చినట్లయితే మానవులకు ఆహారం పొందటం చాలా కష్టమయ్యేది కదా..

మనం కాయలు, పువ్వులు తెంపుకునేటప్పుడు, వాటిని పీకి ఆకుకూరగా వండుకునేటప్పుడు .... అవి బాధపడితే లేక పోట్లాడితే .... మనం కాయలు, పండ్లు కోయగలమా ? వాటిని ఆహారంగా తీసుకోగలమా ?


............................

* పరిణామవాదానికి వీలులేకుండా..... దైవం మొదలే జీవులను పరిపూర్ణంగా సృష్టించవచ్చు కదా ! అని చాలా మంది సందేహం .

*. ఒక కుక్క పిల్లనో, కుందేలు పిల్లనో భారతదేశంలోని వేడిప్రాంతం నుంచీ విదేశాల్లోని చలిప్రాంతాలకు తీసుకువెళ్తే ......అక్కడి కొత్త వాతావరణానికి తట్టుకోవాలంటే శరీరం కొంత మార్పుకు అలవాటుపడాలి.

ఇలాంటప్పుడు దైవం జీవుల శరీరాలను ఎండకు, లేక చలికీ మాత్రమే తట్టుకునేటట్లు ముందే ఏర్పాటు చేస్తే జీవులకు కష్టమయిపోతుంది.

ఒకోసారి ఒకే దేశంలో కూడా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తూంటాయి.

ఇలాంటప్పుడు దైవం జీవులకు పరిణామలక్షణం ఉండేలా ఇచ్చిన అవకాశం మంచిదే కదా !

అయితే
పరిణామ సిద్ధాంతం కూడా సృష్టికి ఆటంకం కలుగకుండా పరిమితమైన పరిధిలోనే జరుగుతుంది అనిపిస్తుంది.

ఉదా..నదిలో ఒకేరకమైన వాతావరణం ఉన్నప్పటికీ జీవులు ఆల్గే, కప్పలు, చేపలు ఇలా...... విభిన్న రూపాల్లో ఉంటాయి కానీ, ఒకే లక్షణాలు కలిగిన జీవుల్లా మారిపోవటం లేదు కదా !

.....................
దైవం మానవులను చక్కగా సృష్టించారు. కానీ పాపాత్ములయ్యేది, పుణ్యాత్ములయ్యేదీ వారికి అవకాశాన్ని కూడా ఇచ్చారు.

పుణ్యాలు చేస్తే ఉత్తమలోకాల్లో గొప్ప జన్మ లభిస్తుంది. పాపాలు చేస్తే నీచజన్మ లభిస్తుంది.

అలాగే జీవులకు కూడా పై తరగతి జీవులుగానూ, లేక క్రింద తరగతి జీవులుగానూ పరిణామాన్ని చెందేట్లుగా అవకాశాన్ని ఇచ్చారేమో ?

( అంటే ఇక్కడ పాపపుణ్యాలు అని కాకుండా వేరే పద్ధతిలో చూడాలి. అంటే పరిస్థితులు, అలవాట్లకు అనుగుణంగా పరిణామం చెందే విధంగా అని అర్ధం చేసుకోవాలి. )

పరిణామవాదం నిజమే అయితే ....ఈ వాదాన్ని గమనిస్తే నాకు ఇలా కూడా అనిపించింది.
.................

దైవం తన సృష్టి రచనలో భాగంగా . జీవులకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పరిచారు. జీవులను సృష్టించారు.

* అయితే జీవనసమరంలో జీవుల ప్రయత్నాలకు గుర్తింపు, ప్రాముఖ్యత ఉంటుందని మనం తెలుసుకోవచ్చేమో !

* జీవులు ప్రయత్నిస్తే ఉన్నతస్థాయికి గానీ, అధమ స్థాయికి గానీ మారే అవకాశాన్ని దైవం కల్పించారు అనిపిస్తుంది.

అంటే కొందరు అనేటట్లు మనతలరాత.. మనం ఏం చేయగలం .. అని అనుకోకూడదనీ , జీవుల ప్రయత్నానికి కూడా ప్రాముఖ్యత ఉందని మనం అర్ధం చేసుకోవచ్చు.

లోకానికి మొక్కలు, వంటి జీవజాతులు చాలా సహాయపడుతున్నాయి.

* అవి కష్టపడకుండా , తమను తాము కాపాడుకోవటానికి వీలుగా అంటే పరిసరాలకు అనుగుణంగా పరిణామం చెందే అవకాశాన్ని దైవం కల్పించారేమో అనిపిస్తుంది.

........................
ఇంకా, 

* పరిణామవాదానికి వీలులేకుండా..... దైవం మొదలే జీవులను పరిపూర్ణంగా సృష్టించవచ్చు కదా ! అని చాలా మంది సందేహం .

* నిజమే కానీ ఈ భూలోకాన్ని జీవులకు పరీక్షాలోకం అనికూడా అనుకోవచ్చేమో !

( అయితే , ఆదిశక్తియైన పరమాత్మ యొక్క దయ ఉంటే , ఇహలోక భోగము ... పరలోకమోక్షము కూడా పొందవచ్చని పెద్దలు చెప్పటం జరిగింది.)

* పరిపూర్ణత్వమనేది పరమాత్మకే సాధ్యం.

జీవులు కూడా పరిపూర్ణత్వాన్ని పొందాలంటే పరమాత్మను పొందాలి. దానినే పెద్దలు మోక్షం అన్నారు.

భూలోకంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి..ఒక ప్రాణిని బాధించి లేక చంపి ఆహారాన్ని పొందటం ద్వారా ఇంకొక ప్రాణి జీవించటం వంటి పద్ధతి ఈ లోకంలో ఉంది.

ఈ లోకాన్ని దైవం ఇలాగే సృష్టించారు.

( కొందరు మహాత్ములు సమాధి వంటి పద్ధతుల ద్వారా ఆహారం లేకుండా కూడా జీవిస్తారు. అది వేరే విషయం . )

* భూమి కన్నా పైన ఎన్నో ఉత్తమ లోకాలున్నాయి. అక్కడ పద్ధతి వేరేగా ఉంటుంది.

ఆహారం గురించి ఇతర జీవులపై ఆధారపడే పద్ధతి అక్కడ ఉండదు.

పుణ్యాత్ములు వెళ్ళే ఆ లోకాల్లో వారికి సంకల్పమాత్రం చేతనే ఆహారాన్ని సృష్టించుకోగల శక్తి ఉంటుంది. ( వారికి ఆహారంతో అవసరం కూడా ఉండదేమో ! . . )

* అలా జీవులు పరమాత్మను చేరుకుంటే మోక్షమనబడే .....ఏ
కష్టాలూ లేని పరిపూర్ణమైన పరమానందస్థితికి చేరుకుంటారు.


ఈ విధమైన చాలా విషయాలు " ఒక యోగి ఆత్మ కధ " గ్రంధంలో చెప్పబడ్డాయి.

* విజ్ఞానం, విశ్వవిజ్ఞానం కూడా ఆధ్యాత్మికతలో భాగమే.

......................

ఒక ఇంట్లో పెద్దవాళ్ళు బాగా చదువుకుని ఎన్నో విషయాలు తెలిసినా కూడా........ చిన్నపిల్లలకు అక్షరాలను దిద్దించటం నుంచే ప్రారంభిస్తారు గానీ, అన్నప్రాశననాడే ఆవకాయ సామెతలాగ చెయ్యరు గదా !

* అలాగే సృష్టి విధానం ఈ భూలోకంలో మాత్రం ఈ క్రమంలో జరుగుతుంది అనిపిస్తుంది. . ( పసితనం నుంచి వృద్ధాప్యం వచ్చినట్లుగా. )

...................
* అసలు ఇలా జీవులను సృష్టించటం ఇదంతా ఎందుకు ? అనుకుంటే ఇదంతా దైవానికి ఒక వినోదం అనుకోవచ్చేమో ..


ఉదా...మన ఇంట్లో పిల్లలకు ఆహారం అన్నీ అమర్చి ఇంట్లో కదలకుండా ఉండమంటే పిల్లలు వింటారా ? వినరు కదా !

బయటకెళ్ళి ఆడుకుంటాము.. అని పెద్దవాళ్ళను అడుగుతారు.

ఆటల్లో కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయని తెలిసినా, ఒకోసారి ఓడిపోతామని తెలిసినా కూడా ఆడుకోవటానికే పిల్లలు ఉత్సాహ పడతారు.

* ఎంత బయట ఆడుకున్నా తిరిగి పిల్లలందరూ ఇంటికి వెళ్ళాలి కదా !

అలాగే లోకంలో జీవులు అందరూ కష్టాలనూ, సుఖాలనూ అనుభవించి ఈ జగన్నాటకమనే ఆట ముగించి తిరిగి ఇంటికి వెళ్ళవలసిన వారే. జగన్మాతాపితరుల్ని చేరుకోవలసిన వారే.


సరైన మార్గంలో నడిచిన పిల్లలు ఇంటికి త్వరగా చేరుకుంటారు. దారి తప్పిన పిల్లలు ఆలస్యంగా ఇంటికి చేరుకుంటారు....

ఇంటికి అంటే దైవం దగ్గరకు అన్నమాట. ( ఇలా నేను ఇంతకుముందు ఒక టపాలో వ్రాశానండి. . )

ఈ సృష్టి అనేది లేకపోతే విశ్వం స్తబ్దంగా బోర్ గా ఉండేది.....
............................

*..ఏంటో తోచినట్లు వ్రాశాను. వ్రాసినదానిలో పొరపాట్లు ఉంటే దైవం క్షమించాలని ప్రార్ధిస్తున్నాను. ఇందులో తప్పులు ఉంటే నావిగానూ, ఒప్పులు ఉంటే దైవం దయగానూ నేను భావిస్తున్నాను.......
అంతా దైవం దయ.

ఇదంతా పెద్ద వ్యాఖ్యగా రాయటం కుదరక ఇక్కడ పోస్ట్ చేయటం జరిగింది...


Monday, November 21, 2011

పరిణామవాదాన్ని వేరొక కోణం నుండి పరిశీలిస్తే..... ఒకటవ భాగం.....


డార్విన్ పరిణామవాదం గురించి చిన్నప్పుడు చదువుకున్నాను కానీ, ఇప్పుడు అంత గుర్తు లేదండి. .

పరిణామవాదం గురించి ఈ మధ్య శాస్త్ర విజ్ఞానం వారి బ్లాగులో చదివాక నాకు రకరకాల ఆలోచనలు వచ్చాయి.

నాకు శాస్త్రవేత్తలలా విషయపరిజ్ఞానం లేదు కానీ, కొన్ని ఆలోచనలు వచ్చాయి. చూసి తప్పుగా భావించవద్దండి.

పరిణామవాదం అంటే నాకు అర్ధమయింది ఏమంటే, జీవులు తమ అలవాట్లు, పరిసరాలకు అనుగుణంగా పరిణామాన్ని చెందే అవకాశం ఉందనీ,

ఉదా...మనిషి కోతి నుంచీ పరిణామాన్ని చెందిఉండవచ్చని ఇలాగ.........అన్నారు కదా.. నిజమే పరిణామసిద్ధాంత నిజమే కావచ్చు.

అయితే , దైవం యొక్క సృష్టిరచన అత్యద్భుతమైనది. వారు ఒక పద్ధతి ప్రకారం జీవులను సృష్టించారు.

ముందు జీవుల మనుగడకు, ఆహారానికి అవసరమైన పద్ధతిలో సూర్యుడు, వాతావరణం మొదలైనవి , సూర్యరశ్మి ద్వారా పత్రహరితాన్ని తయారుచేసుకునే మొక్కలు, మొక్కలపై ఆధారపడి జీవించే జంతువులు ఇలాగా ...........అన్నమాట.

ఇంకా,

ఒక నదిలో ఒకేరకమైన వాతావరణం ఉన్నా కూడా ఆల్గే, దాన్ని తినే చిన్న జీవులు, కప్పలు, చేపలు, చిన్నచేపలను తినే పెద్దచేపలు ఇలా ఒక ప్రణాళిక ప్రకారం సృష్టి ఏర్పడి ఉంది.

(నదిలో ఒకే రకమైన వాతావరణం ఉన్నా కూడా జీవులన్నీ ఒకే రకంగా మారిపోలేదు మరి. )

అలాగే జీవులకు పరిస్థితులను బట్టి పరిణామం చెందే అవకాశాన్ని కూడా దైవం కల్పించారేమో ? అని కూడా అనిపిస్తుంది.

ఇంకా ఏమనిపించిందంటే , ఉదా... కొందరి భావన ప్రకారం . జీవులలో పనికిమాలిన అవయవాలు అని చెప్పుకుంటున్నవి. పనికిమాలినవి కాదేమో ?

1...ఉదా...... కొన్ని పాములకి కాళ్ళు ఉంటాయి. పాకే పాములకి కాళ్లతో ఏం పని? బల్లులకి, మొసళ్లకి ఉన్నట్టే ఉంటాయి గాని నిజానికి ఆ కాళ్లు ఆ పాముల కదలికలో పాల్గొనవు. ఇలాంటి అంగాలనే వ్యర్థ అంగాలు అంటారు. అని కొందరి అభిప్రాయం.

కానీ, కొన్ని ప్రాకే జీవులకు కదలికలో కాళ్ళు కూడా సహాయపడతాయి. అలాగే పాములకు కూడా కాళ్ళు సహాయంగా ఉండటానికి వీలుగా పరిణామం జరుగుతోందేమో ?

( పాము కాళ్ళు వ్యర్ధ అవయవాలు కాదేమో ! )

2....అలాగే మోల్ అనబడే ఎలుకని పోలిన జంతువులకి చెందిన బ్లైండ్(గుడ్డి) మోల్ అనే ఉపజాతి ఒకటి ఉంది. ఇవి ఎక్కువగా కలుగుల్లో, చీకటి ప్రాంతాల్లో బతుకుతుంటాయి. వీటికి కళ్లు ఉంటాయి గాని అవి పని చెయ్యవు. వాటి మీదుగా ఓ చర్మపు పొర కప్పబడి ఉంటుంది. చూపు లేని ఈ జీవాలకి కళ్లెందుకు ? అని కొందరి అభిప్రాయం.

మోల్ అనే ( బ్లైండ్ )జంతువుకి కళ్ళెందుకు ? అనుకోకూడదు. వాటికి అవి నివసించే చీకటి ప్రాంతాల్లో కూడా చూడటానికి వీలుగా వాటికి కళ్ళు ఏర్పాటు జరుగుతోందేమో ? ( గుడ్లగూబలు చీకటిలో కూడా చూడగలవు కదా ! )

( కళ్ళు వ్యర్ధ
అవయవాలు కాదేమో ! )

3... అలాగే కోళ్ళకు రెక్కలెందుకు ? అని కాకుండా అవి నెమ్మదిగా పక్షుల్లా పైకి ఎగరటానికి సిద్ధమవుతున్నాయేమో ? అనుకోవచ్చు కదా ! ( కోళ్ళు పల్లెటూళ్ళలో ఇళ్ళ మధ్యన ఉండే అతి చిన్న కాలువలను ఎగిరి దాటుతుంటాయి. )

( కోడి రెక్కలు వ్యర్ధ అవయవాలు కాదేమో !)

అందుకే వీటిని వ్యర్ధ అవయవాలు అనుకోకూడదేమో ? అనిపించింది. దైవ సృష్టి తప్పకుండా ‘ప్రతిభతో కూడిన రూపకల్పనే. ’


౪... ఈ నాటి మానవులు అభివృద్ధి పేరుతో పనులన్నీ యంత్రాలకు అప్పజెప్పి తాము సుఖపడుతున్నామనే భ్రాంతిలో ఉన్నారు.


.ఈ నాటి మానవులు చాలామంది తమ శరీరాలకు అతిగా ఇచ్చిన విశ్రాంతి వల్ల  కొన్ని తరాల తర్వాత మానవుల కాళ్ళూచేతులూ బలహీనమయిపోతాయేమో ?

( పరిణామవాదం ప్రకారం చూస్తే .....)

కాలిక్యులేటర్లూ గట్రా అతిగా వాడటం వల్ల ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తి మందగిస్తాయేమో ?
.............. 
ఇంకా ఈ మధ్య మనుషుల్లో పెరిగిపోతున్న అజ్ఞానం, ఆటవిక ప్రవృత్తి చూస్తుంటే ,మానవులలో జంతువుల వలె  శారీరిక లక్షణాలు పెరుగుతున్నాయేమో ? ( కొందరిలో ) అనిపిస్తోంది.

ఉదా..మానవుల్లో వ్యర్ధభాగంగా భావిస్తున్న coccyx ( tail bone) గతకాలపు అవశేషం కాదేమో ?  తోక అవసరమయ్యే విధంగా శారీరిక పరిణామం చెందుతున్న లక్షణమేమో ? అనిపిస్తోంది.

................ 

టాన్సిల్స్ తీసివేసిన వారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుందని కొందరు అంటున్నారు.    అయితే, ఈ రోజుల్లో కొందరు డాక్టర్లు రోగం వస్తే చాలు ఆ భాగం వేస్ట్ అంటూ కోసిపారేస్తున్నారు.

౫.... ఒక జీవి ఇంకొక జీవిగా మారటానికి ....... బోలెడుతరాలు అక్కర్లేని జీవులు కూడా సృష్టిలో ఉన్నాయి. ఉదా...సీతాకోకచిలుక.

దైవసృష్టి యొక్క గొప్పదనానికి గొప్ప ఉదాహరణ .........

* గగుర్పాటు కలిగించే గొంగళిపురుగు సమాధి స్థితి వంటి ప్యూపా దశ తరువాత అందమైన రంగురంగుల సీతాకోక చిలుకగా మారటం మనకు తెలుసు కదా !

దైవం ఏం చేసినా అందులో ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి.


* దైవ సృష్టి ఎప్పుడూ గొప్పదే. " ఒక యోగి ఆత్మకధ "లో ఏం చెప్పారంటే........... సర్వార్ధ సాధకమైన అనంత సంకల్పంతో అనుసంధానం పొంది బాబాజీ , మూలక అణువుల్ని , సుసంయుక్తమైన ఏ రూపంలోనైనా సాక్షాత్కరించ వలసిందిగా ఆదేశించగలరు.....అలా చెప్పబడింది.

దైవం తలచుకుంటే దేనినైనా ఏ విధంగానైనా మార్చగలరు.

దైవం ఏం చేసినా అందులో ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి.

* సృష్టి గొప్ప ప్రణాళిక ప్రకారం దైవం చేత సృష్టించబడింది. అయితే పరిణామవాదాన్ని గమనిస్తే. ,జీవులకు పరిణామం చెందే అవకాశం కూడా ఇవ్వబడిందని అనిపిస్తూంది.. దైవం యొక్క సృష్టి " ప్రతిభతో కూడిన రూపకల్పనే ".


Saturday, November 19, 2011

నేను నిన్న, మొన్న పాత పుస్తకాలు సర్దుతుంటే.......

నేను నిన్న, మొన్న పాత పుస్తకాలు సర్దుతుంటే.....

అంటే మా ఇంట్లో దగ్గరదగ్గర 10 సంవత్సరాల క్రిందటివి కొన్ని పత్రికలు, పుస్తకాలు ఉన్నాయి.

వాటిని
సర్దుతూ మధ్యమధ్య అందులో వ్రాసిన వంటలు, ఇంకా ఇతర ఆర్టికల్స్ చదువుతుంటే ఒక వ్యాసం కనిపించింది.

అది
" ఉత్పల " గారు వ్రాసిన " భగవన్నామం " అనే వ్యాసం.

అందులో
ఒక దగ్గర ఇలా ఉందండి............

శ్రీ
రాముని కంటే శ్రీ రామనామం గొప్పదన్నారు గోస్వామి తులసీదాసు. శ్రీ రాముడు తన అవతార సమయంలో ఎందరినో తరింపజేశాడు. నిజమే. ఎన్నో యుగాలు గడచినా శ్రీరామనామం భక్తుల్ని ఇప్పటికీ తరింపజేస్తున్నది కనుక రామనామమే గొప్పది. ..అంటూ వారు వ్రాయటం జరిగింది.

పుస్తకాలలోని పేజీలు గబగబా త్రిప్పుతూ వెళ్ళినా కూడా పుస్తకంలోని పేజీ మిస్సవకుండా కనిపించటం. నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.

మధ్యన బ్లాగుల్లో రాముడు గొప్పా ? రామనామం గొప్పదా ? అనే విషయంపై నేను కూడా అభిప్రాయాన్ని వ్రాయటంజరిగింది.

అందుకే
వ్యాసం నాకు కనిపించటం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతా దైవం దయ.
...............................

ఇంకా కొన్ని ఇతర రచనల గురించి కూడా చెప్పాలి.

" హిమయోగి " అనే రచనలో " ఒక యోగి ఆత్మకధ " లో చెప్పబడిన " బాబాజీ " వారి గురించి కొన్ని వివరాలను వివరించారు రచయిత.

ఇంకా, హిమాలయాల్లో నివసించే కొందరు యోగుల గురించి కూడా ఎన్నో విషయాలను చెప్పారు.

ఇంకా
రచయిత " అగ్నిసూర్య " అనే రచనలో జ్యోతిష శాస్త్రం గురించి కొన్ని విషయాలను చెప్పటం జరిగింది. రచయితపేరు. " సాత్విక్ ."

ఇంకా
ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారు అందించిన " గుణాఢ్యుని బృహత్కధ " కూడా చాలా బాగుంది.
...........................

తెలుగులో
ఇంకా ఎన్నో గొప్ప రచనలున్నాయి. గొప్ప రచయితలు, రచయిత్రులు ఉన్నారు.

చాలామంది
ఇలా పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటారు.

నా
దగ్గర ఎక్కువ పుస్తకాలు లేవు కానీ, పత్రికల్లో , పుస్తకాల్లో బాగున్నవి అనిపించిన ఆర్టికల్స్ ను కత్తిరించి దాస్తూఉంటాను.

అయితే
ఇప్పుడు అలా చేయటం బాగా తగ్గించానులెండి.

ఎందరో
ఎన్నో విషయాలను వ్రాస్తున్నారు. ఎంతో విజ్ఞానం ఉంది. . ఎంతకని సేకరించగలం అనిపిస్తోంది ?

అసలు
అతిగా విషయసేకరణ కూడా మనిషికి ఒక లంపటం అవుతుందేమో?

దైవభక్తి
విషయంలో తప్పించి ఇక విషయంలోనైనా అతి పనికిరాదు అని కూడా అనిపిస్తోంది.

విశ్వరహస్యాలను శోధించాలని అతిగా ఆరాటపడి ఆయాసపడి అలసిపోయే కన్నా అన్నింటికీ ఆదియైన  విశ్వాత్మనే (దైవాన్ని ) శరణు వేడితే ఉత్తమం కదా !

అప్పుడు అంతా వారే చూసుకుంటారు కదా !. అని కూడా అనిపిస్తోంది.....


Wednesday, November 16, 2011

నేను గృహిణిని ....

 

గృహిణి అంటే పని అంతగా ఏముంటుంది ? అనుకుంటారు చాలామంది.

నాకయితే పని ఎక్కువగానే ఉంటుంది. అంటే నేను అలా పని కల్పించుకుని బిజీగా ఉంటాను అన్నమాట. .


నాకు తోచినంతలో పూజ చేస్తాను.

వంట చేయటం, ఇల్లు సర్దుకోవటం, ఇవన్నీ ఎలాగూ ఉంటాయి.

ఇంట్లో పని అంటే పాత్రలు శుభ్రం చేయటం, బట్టలు ఉతకటం ఇవన్నీ కూడా నేనే చేస్తాను.

వాషిగ్ మెషీన్ ఉంది కానీ , అప్పుడప్పుడూ వాడుతాము అంతే. .


పనికి సాయంగా ఎవరినీ పెట్టుకోలేదు. గత మూడు సంవత్సరాలనుంచీ నేనే ఇంటిపని చేసుకుంటున్నాను. దానికి కారణాలు ఉన్నాయి లెండి.


వాళ్ళు వస్తారో రారో అని రోజూ ఎదురుచూడటం, వాళ్ళు వచ్చినా ఒక పూటే వస్తున్నారు ఈ రోజుల్లో .


మరి రాత్రి వంట చేసిన పాత్రలు నేనే శుభ్రం చేసుకోవాలి కదా ! .

ఒక పూట పనికోసం వాళ్ళు ఎందుకులే ! అని మానిపించేసాను.

ఇప్పుడయితే నేనే ఇంటి పనంతా చేస్తున్నానని ఇంట్లో వాళ్ళ వద్ద క్రెడిట్ పొందవచ్చు కదా !


ఎవరినైనా పనికి మాట్లాడుకోమని మా పెద్దవాళ్ళు కోప్పడుతుంటారు. . . . . విదేశాల్లో చాలామంది వారిపని వారే చేసుకుంటారట ! అని నేను వాళ్ళతో అంటాను.

అయినా ఎవరి పని వారు చేసుకుంటే తప్పేముందిలెండి.

నేను ఇంటి పని చేసుకోవటానికి ఇంకో కారణమేమిటంటే మా పెద్దవాళ్ళకి డయాబెటిస్ వ్యాధి ఉంది.

ఆ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలున్నాయట. ఆ వ్యాధి వస్తే బోలెడు ఎక్సర్ సైజులు చేయాలట.

అలా జాగింగులు గట్రా చెయ్యటం నావల్ల కాదు.

అందుకని వ్యాధి రాకూడ
ని ముందు జాగ్రత్తగా ఇలా పని చేసుకుంటున్నాను . మన ప్రయత్నం మనం చేస్తే ఫలితం దైవాధీనం కదండి.


డయాబెటీస్ ఉన్నవారు రోజూ రెండు రాతిఉసిరికాయలు ( పచ్చివి ) మిక్సీలో రసం తీసుకుని ఉదయాన్నే త్రాగితే చాలా మంచిదట.


మా పెద్దవాళ్ళు ఇలాగే చేస్తుంటారు. ఆ వ్యాధి బాగా కంట్రోల్ అయింది. ( అంటే వ్యాధి ఇంకా పెరగలేదు. )

అసలు ఉసిరి కాయ చాలా వ్యాధులకు మంచిది.

ఇప్పుడు ఉసిరికాయలు బాగా దొరుకుతాయి, ఇప్పుడు ఎండబెట్టి ముక్కలు ,చేసి నిలవపెట్టుకోవచ్చు, పొడి, పచ్చడి చేసుకోవచ్చు.

కొందరు తేనెలో, పంచదారపాకంలో నిలువచేసుకుంటారు. ఉసిరితో చేసే చ్యవనప్రాశ ఎప్పుడూ దొరుకుతుంది.


*******
ఇంకా నాకు వార్తాపత్రికలు పుస్తకాలు చదవటమంటే చాలా ఇష్టం. .

వార్తాపత్రికలు చదవటమంటే చాలామందికి బోర్. కానీ నాకు చాలా ఇష్టం.

ఇలాంటి మంచి అలవాటు కలిగించినందుకు నేను దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.


పుస్తకపఠనం ఆసక్తి ఉన్నవారికి బోర్ అనే సమస్యే ఉండదు. సమయం చక్కగా గడిచిపోతుంది.

కొంతకాలం క్రిందట దైవం దయ వల్ల M. A ( చరిత్ర ) ప్రైవేటుగా చదివి పూర్తిచేశానండి.

ఇంకా ఈ మధ్యనే ఒక ఆమె వద్ద సంగీతం నేర్చుకోవటానికి వెళ్తున్నాను.

సంగీతం ఒక మహాసముద్రం. ఎంత నేర్చుకున్నా తరగదు.


సంగీతం సరిగ్గా నేర్చుకోవాలంటే చాలా శ్రద్ధగా నేర్చుకోవాలి. నాకు సమయం సరిపోక సరిగ్గా వెళ్ళటం లేదు.


ప్రస్తుతానికి వెళ్తున్నాను. ఎంతకాలం నేర్చుకుంటానో తెలియదు.

ఇక బ్లాగు మొదలుపెట్టాక ఇంకా బిజీ అయిపోయింది. మరి అందరూ ఎలా వ్రాస్తున్నారో తెలియదు.


నేను పని త్వరగానే చేస్తాను. అయినా ఎంత చేసినా సమయం సరిపోవటం లేదండి.

అయినా నేను ఇలా బ్లాగు వ్రాయటం ఏమిటో తలుచుకుంటే అత్యంత ఆశ్చర్యంగా ఉంటుంది నాకు.

ఇది దైవం వేసిన భిక్షగా అనుకుంటున్నాను నేను.

ఒక సంవత్సరం కన్నా వ్రాయగలనా ? అనుకున్నాను. ఇంకా వ్రాస్తున్నాను మరి.

బ్లాగుల్లో అందరూ ఎంతో విషయపరిజ్ఞానం కలిగినవారుంటారు. నేను ఏం వ్రాయగలను ? అని భయపడ్డాను.


ఏదో దైవం దయవల్ల నాకు తెలిసినంతలో వ్రాస్తున్నానండి. ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు, .


నేను గృహిణిని అయినా కూడా ఇంటిపనీ, సంగీతం క్లాసులు, బ్లాగులు చూడటం, పత్రికలు చదవటం , టివీలో కొన్ని ప్రోగ్రాములు చూడటం ఇలా చాలా బిజీ అన్నమాట.....

అంతా దైవం దయ.