koodali

Thursday, September 8, 2016

దృష్టి లోపాలు..కళ్ళజోడుతో సమస్యలు..




ఈ రోజుల్లో అనేక  కారణాల వల్ల దృష్టి లోపాలు బాగా పెరిగాయి.చాలామందికి కళ్ళజోడు వాడే అవసరం వస్తోంది.

అయితే కళ్ళజోళ్ళ వల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటున్నాయి.

కొద్దిపాటి దృష్టి లోపం ఉన్నప్పుడు రీడింగ్ గ్లాసెస్ వంటి వాటితో సరిపెట్టుకోవచ్చు.

సమస్య మరింత పెరిగితే బై ఫోకల్ గ్లాసెస్  లేక  ప్రొగ్రెస్సివ్   గ్లాసెస్  వేసుకోవలసి ఉంటుంది.

 ఇక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి.

బైఫోకల్స్ అంటే కళ్ళజోడు రెండు భాగాలుగా ఉండి మధ్య ఒక గీత ఉంటుంది. ఈ గీత భాగంలో చూస్తున్నప్పుడు గందరగోళంగా ఉంటుంది.

ఇలాంటప్పుడు మెట్లు ఎక్కే సమయంలో సరిగ్గా కనిపించక పడిపోయే అవకాశం కూడా ఉంది.

 అయితే ఇదంతా కొన్ని రోజులలో అలవాటు అవుతుంది లెమ్మని సర్దిచెబుతారు.

అలవాటు అవుతుందా లేదా అన్నది ఎవరి అభిప్రాయం వారిది.అలవాటు కాలేకపోయినా వేరే దారి లేక సరిపెట్టేసుకుంటారు చాలామంది.
...................

కళ్ళజోడు తయారీలో తప్పులుంటే,  కొత్త కళ్ళజోడు కూడా సరిగ్గా కనిపించని పరిస్థితి ఉంటుంది. 

 కళ్ళజోడు షాపుకు వెళ్ళి అడిగితే కొందరు సరిగ్గా చేసి ఇస్తారు. 

 ఏం చేయలేం .అలాగే సర్దుకోవాలని చెప్పే వాళ్ళూ కొందరు ఉంటారు. 

************
 బైఫోకల్స్తో ఉన్న  సమస్య నుంచి బైట పడటం కోసం ప్రొగ్రెస్సివ్  అనే కొత్త కళ్ళజోళ్లు వచ్చాయి. అయితే వీటితో  కూడా సమస్యలు ఉన్నాయి.

చాలామంది విషయంలో ప్రోగ్రెస్సివ్ అద్దాలు అలవాటు కావటం కష్టమని అద్దాల తయారీ దారులు కూడా చెబుతారు.

  కొందరు అద్దాల తయారీదారులేమో ప్రోగ్రెస్సివ్ మంచివి అంటారు  . కొందరేమో బైఫోకలే మంచివి అంటారు.

 మరికొందరేమో లేసర్ ఆపరేషన్ మంచిది కదా... అంటూ సలహాలు ఇస్తారు.

లేసర్ ఆపరేషన్తో కూడా సమస్యలు ఉంటాయి. ఇలా  ఎన్నో భిన్నాభిప్రాయాలున్నాయి.

కళ్ళజోడు సరిగ్గా లేకకపోతే మెడ నొప్పులు వచ్చే ప్రమాదముంది.

ఏతావాతా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే.. శరీరంలో ఏ భాగమైనా సమస్య రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవటమే అన్నింటికన్నా మంచిది.

అవసరం ఉన్నా లేకపోయినా కంప్యూటర్లు, టీవీలు అదేపనిగా చూడటం వల్ల ఎన్నో సమస్యలు వచ్చే ప్రమాదముంది.

 అందువల్ల నా అభిప్రాయం ఏమిటంటే ఎంతవరకూ అవసరమో అంతవరకే  టీవీని, కంప్యూటర్ వాడాలి.

అయితే దురదృష్టం ఏమిటంటే .. ఈ రోజుల్లో చాలా మందికి ఉద్యోగరీత్యా  కంప్యూటర్ వాడకం తప్పనిసరి అయ్యింది.

ఇందువల్ల ఎందరో స్పాండిలైటిస్,వెన్ను నొప్పి, నరాల సమస్యలు, కళ్ళ సమస్యలు... వంటి సమస్యలతో బాధపడుతున్నారు.


Monday, September 5, 2016

వినాయక చవితి శుభాకాంక్షలు....



అందరికి  వినాయక  చవితి  శుభాకాంక్షలు.

***********
mari konni vishayaalu..

ప్రపంచంలో అనేకప్రాంతాలున్నాయి. అక్కడి వాతావరణపరిస్థితులను బట్టి మొక్కలు, చెట్లు..ఉంటాయి. చలిప్రాంతాలలో యాపిల్స్ బాగా పెరుగుతాయి. వేడిప్రాంతాలలో  ఉసిరి..వంటివి పెరుగుతాయి. ఏ ప్రాంతాలవారు ఆ ప్రాంతంలో లభించే ఆహారాన్ని తింటే మంచిదంటారు. ఇది నిజమే.


 కానీ,ఈ రోజుల్లో భారతదేశం నుంచి చలిప్రాంతాలైన విదేశాలకు వెళ్తున్నారు. అలాంటప్పుడు ఏం తింటే మంచిదని సందేహాలు వస్తాయి. తరతరాల నుంచి వరి,జొన్న..వంటివి తినే వారికి వారి జీన్స్ కు అవి అలవాటుఉండి, అవి తింటే చక్కగా ఉంటుందట. చలి ప్రాంతాలవారికి గోధుమ,బార్లి వంటివి బాగా పండుతాయి కాబట్టి, అవి తినటం అలవాటు. 


అయితే, గోధుమలో  ఉండే గ్లుటెన్ చాలామందికి పడదు. ఈ రోజుల్లో గోధుమ పంటలు వేయని దక్షిణభారతం వారు కూడా గోధుమరొట్టెలు తింటున్నారు. యాపిల్స్ తింటున్నారు. విదేశాలకు వెళ్లినవారికి కూడా తరతరాలనుంచి అలవాటైన తమ సొంత దేశం యొక్క ఆహారానికి వారి జీన్స్ అలవాటుపడిఉంటాయి.


 కాబట్టి, నాకు ఏమనిపిస్తుందంటే, ఎక్కడపండే పంటలు అక్కడివారు తింటే చాలా మంచిది. అయితే ఇతర ప్రాంతాల పంటలను తిన్నా కూడా శరీరం క్రమంగా అలవాటు పడుతుందనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళిన భారతీయులు అక్కడ ఉండే ఓట్స్, ఆలివ్స్..వంటివి తినొచ్చు, భారతదేశం నుంచి ఎగుమతి చేస్తున్న వరి, కూరగాయలు కూడా తినొచ్చు అనిపిస్తోంది.


మనుషుల కోణం సంగతి అటుంచితే, మొక్కలు, చెట్లు కోణం నుంచి కూడా పరిశీలించాలి. కొన్ని మొక్కలు వాటికి అనువైన వాతావరణంలోనే చక్కగా పెరుగుతాయి. కొన్ని మొక్కలు విదేశాల నుంచి తెచ్చినా కూడా, భారతదేశంలో కూడా పెరుగుతాయి. ఉదా..యాపిల్స్ మొక్కలను విజయవాడ వంటి వేడి ప్రాంతాలలో పెడితే సరిగ్గా పెరగవు. అవకాడో మొక్కలను గుంటూరు లో పెంచితే కాయలు కాస్తున్నాయి.

ఈ విషయాల గురించి మరిన్ని పరిశోధనలు జరగాలి.


Friday, September 2, 2016

మరి కొన్ని విషయాలు....గంగా నది వంటి నదిలో కూడా..


ఈ మధ్యనే దేవాలయాలలో వరుణయాగాలు చేసారు . 

దైవం  దయ వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి.

 దైవానికి అనేక కృతజ్ఞతలు.                                        
.......................................

వర్షాల వల్ల  ఊళ్ళలోని నీరు కాలువల ద్వారా నదులలోకి చేరుకుంటుంది.  ఊళ్ళలో  పడ్డ వర్షంతో పాటు  ఊరిలోని మలినాలు కూడా నదిలోకి చేరుకుంటాయి. 

అయితే, పాతరోజుల్లో రసాయన వ్యర్ధాలు, ప్లాస్టిక్  వంటివి లేవు కాబట్టి , సహజసిద్ధమైనవే వాననీటితో కలిసి నదులలోకి చేరి, నదులు కలుషితం కావటం తక్కువగా ఉండేది.

 అయితే, ఈ రోజుల్లో  కొన్ని  పరిశ్రమల ద్వారా విడుదలయ్యే  రసాయన వ్యర్ధాలు... వంటివి కూడా డ్రైనేజ్ ద్వారా  నదులలో , సముద్రాలలో కలిపేస్తున్నారు. 

ఇంటి  శుభ్రతకు వాడే అనేక రసాయనాలు, ఆసిడ్స్ వంటివి కూడా  డ్రైనేజ్ ద్వారా మట్టిలో, నీటిలో.... కలిసిపోతున్నాయి.

గంగా నది వంటి నదిలో కూడా ఎన్నో ఊళ్ళ నుంచి వచ్చే వ్యర్ధాలను వదులుతున్నారంటే  ఏమనుకోవాలి?

 డ్రైనేజ్  నీరు నదులలో కలువకుండా , డ్రైనేజ్  నీటిని శుద్ధి చేసి ..ఆ శుద్ధి చేసిన నీటి  ద్వారరహదారుల ప్రక్కన మొక్కలను పెంచవచ్చు.

 నదులలో, సముద్రాలలో  మురికిని కలుపకుండా 
జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కూడా నదులను, సముద్రాన్ని పూజించిన పుణ్యాన్నిపొందవచ్చు.  


     

Wednesday, August 24, 2016

కొన్ని విషయాలు.... ఎండల్లో ఊరేగింపుల వల్ల పిల్లలు..


కృష్ణా పుష్కరాలు ముగింపు కార్యక్రమాలు కూడా బాగున్నాయి.

 అయితే సింధు రాక సందర్భంగా జరిగిన  ఊరేగింపు బాగా ఎండలో జరిగింది.

 ఎందరో  పిల్లలు కూడా ఆ ఎండలో రోడ్డుకు ఇరువైపులా  ఉండటం టీవీలలో చూశాము.  

ఎండల్లో ఊరేగింపుల వల్ల అందరూ అలసిపోతారు. 

ఆహ్వానితులు.... ఆహ్వానించేవాళ్లు కూడా ఎండకు అలసిపోతారు.

స్టేడియంలో సన్మానం మరియు  సాయంత్రం హారతి కార్యక్రమానికి ఆమెను ఆహ్వానించటం బాగుంది.

 అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు.





Monday, August 22, 2016

కృష్ణా పుష్కరాలలో..........

 కృష్ణా పుష్కరాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటానికి ప్రభుత్వం వారు చాలా చర్యలను చేపట్టారు.

 విజయవాడలో చూస్తే .. ఎక్కడికక్కడ డస్ట్ బిన్లను ఏర్పాటు చేసారు. సిబ్బంది ఎక్కడికక్కడ పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. 


ప్రజలు కూడా చెత్తను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా చెత్తడబ్బాలలోనే చెత్తను వేస్తే పరిసరాలు శుభ్రంగా ఉంటాయి.

ఘాట్లో కూడా ఎందరో వాలంటీర్లు , పోలీసు వారు భక్తులకు సహాయం చేస్తున్నారు.

పిల్లలు, పెద్దవాళ్ళకు టాగ్స్  వేయటం  అనేది ఎంతో చక్కటి ఆలోచన.

అన్నదానం కూడా జరుగుతోంది.

అయితే,  నేను ఒక దగ్గర  గమనించిన విషయం ఏమిటంటే..  కొంతమంది పొంగలిని  మొత్తం తినకుండా చెత్త బుట్టలో పడేసారు.

ఆహారాన్ని వృధా చేయకూడదని తెలిసి కూడా ప్రజలు ఇలా వృధాగా పారవేయటం బాధాకారం. ఎక్కువ తినలేమనుకున్నప్పుడు ఎక్కువ  తీసుకోకుండా ఉండాలి.

పుష్కరాలకు లక్షలాది భక్తులు వచ్చినా కూడా పరిసరాలు శుభ్రంగా ఉంచటంలో ఎందరో  సిబ్బంది  చక్కగా కృషిచేసారు.
...........................


తిరుమలలో కూడా రోజూ ఎందరో భక్తులు వచ్చినా కూడా పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతారు.

  తిరుమల చూస్తే భారతదేశం అంతా తిరుమలలా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది.

భారతదేశం అంతటా తిరుమలను ఆదర్శంగా తీసుకుని చర్యలు చేపడితే బాగుంటుంది.


 తిరుమలలో  ప్రతి రోజూ ఎందరో భక్తులు వస్తున్నా కూడా అన్నదానం అద్భుతంగా  నిర్వహిస్తున్నారు. అక్కడ తక్కువ ధరకే  ఆహారం లభించే జనతా క్యాంటీన్లు వంటివి కూడా ఉన్నాయి. 

...............................


 దేశం అంతటా  పేదవారికి తక్కువ ధరకు ఆహారం లభించే  క్యాంటీన్ల వంటివి ఏర్పాటు చేయటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం, మొక్కలు ఎక్కువగా నాటి పెంచటం, ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవటం..వంటి చక్కటి కార్యక్రమాలు మరింతగా జరిగేలా అందరూ కృషి చేయాలి.



ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు.. చిత్తశుద్ధితో కృషి చేస్తే  భారతదేశం ప్రపంచంలోనే ఆదర్శ దేశం అవుతుందనటంలో ఎటువంటి సందేహమూ లేదు.


Wednesday, August 10, 2016

ఓం..





శ్రావణ శుక్రవారం  వరలక్ష్మీ వ్రతం.. శ్రావణ పూర్ణిమ..హయగ్రీవ జయంతి..ఈ సంవత్సరపు శుభప్రదమైన  అమరనాధ్ యాత్ర  శ్రావణ పౌర్ణమికి  పూర్తవుతుంది..శ్రావణ శనివారం శనిదేవుని పూజ..శ్రావణ మాసంలో ఎన్నో విశేషాలు ఉంటాయి.

****************
 కొందరు ఎక్కువ సంఖ్యలో దైవనామాలను అనటం కొరకు.. గబగబా చాలా స్పీడుగా అనేస్తారు. ఇలాంటప్పుడు గొంతునొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుందేమో? 

అలా చేయటం కన్నా, సంఖ్య తక్కువైనా.. దైవనామాలను నిదానంగా, ప్రశాంతంగా అనుకోవటం మంచిదని నాకు అనిపిస్తున్నది.


Monday, August 1, 2016

ప్రత్యేక హోదా మరియు.........

ప్రత్యేక హోదా మరియు......... కేంద్రం రాష్ట్రానికి ఎంతో చేసిందని కొందరు చెప్పటం సరైనది కాదు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు, రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి చర్యలు, పన్ను రాయితీలు..వంటి ఎన్నో వాగ్ధానాలు చేసారు. విశాఖ రైల్వే జోన్ విషయమూ అలాగే ఉంది. రాయలసీమ మరియు ఉత్తరాంధ్రా విషయంలోనూ ఇప్పటివరకూ ప్రత్యేక రాయితీలను ప్రకటించలేదు. విద్యా సంస్థల వల్ల రాష్ట్రానికి వచ్చే గొప్ప ఆర్ధిక లాభమేమీ లేదు. రహదారులు, విద్యా సంస్థలు వంటి వాటి విషయంలో ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఆంధ్రప్రదేశ్కూ ఇచ్చారు.. ఇందులో ఆంధ్రప్రదేస్కు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ఇప్పటికే రెండు సంవత్సరాలు గడచిపోయాయి. ఎప్పటికప్పుడు ఇదిగో... అదిగో అంటూ తాత్సారం చేస్తున్నారు. ప్రత్యేక హోదా , పన్ను రాయితీలు మరియు ఇతర విషయాల అమలు ఎప్పుడు చేస్తారు ? రాష్ట్రాన్ని విభజించినప్పుడు కేవలం తెలంగాణా అభిప్రాయాలకు మాత్రమే విలువ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అమలు చేయమంటే మాత్రం ఇతర రాష్ట్రాల వాళ్ల అభిప్రాయాలు కూడా కావాలంటున్నారు. అంటే దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలకు విలువ లేదా? రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయం చేసే విషయంలో ఆసక్తిగానే ఉండేవారనిపించేది. అయితే , రాష్ట్ర విభజన సమయంలో ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరిన కొందరి సలహాల వల్ల బీజేపీ పెద్దల ప్రవర్తనలో మార్పు వచ్చిందేమో అనిపిస్తోంది. అయినా, దేశంలో కాంగ్రెస్ , బీజేపీ మాత్రమే కాకుండా మూడో పార్టీ ఉండటం అవసరం అనిపిస్తోంది. ఆం ఆద్మీ పార్టీ మూడో పార్టీగా బలపడుతుందనుకుంటే ఆ పార్టీ వాళ్ళు ప్రజల ఆశలు వమ్ము చేసారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒంటరిగా అధికారంలోకి రావాలని అత్యాశ పడుతోంది. అయితే, భవిష్యత్తులో జాతీయపార్టీలు ఇతర పార్టీలపై ఆధారపడే పరిస్థితి బలంగా ఉందనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే తమకూ ఇవ్వాలని ఇతర రాష్ట్రాలు కోరటం అన్యాయం. ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా లేకుండా ఆర్ధికంగా కూడా వెనుకబడి ఉండటం వల్ల ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి ఉంది. చక్కటి రాజధాని మరియు ఆర్ధికంగా చక్కగానే ఉన్న రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోరటం అన్యాయం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఏ ప్రాతిపదికన ఇవ్వాలి ? అని కొందరు అనటం విడ్డూరం. ఆర్ధికంగా వెనుకబడి ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఇవ్వవచ్చని ఉంది. ఆర్ధికంగా వెనుకబడి ఉన్న ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా మరియు పన్ను రాయితీలు ఇవ్వాలి..... అంతేకాదు. ఆంధ్రప్రదేశ్ ను ఇతర రాష్ట్రాలతో పోల్చటానికి వీలు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా కాంగ్రెస్, బీజేపీ కలిసి రాష్ట్ర విభజన చేసారు కాబట్టి .....ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరియు ఇతర సహాయాలు చేయవలసి ఉంది.