టాయ్లెట్ వాడే కమోడ్లలో, ఇండియన్ కమోడ్ డిజైన్ వల్ల శరీరం కమోడ్ కు తగలదు.
అయితే ఈమధ్య కాలంలో చాలామంది మోకాళ్ల నొప్పితో వంగలేకపోతున్నారంటూ చాలా చోట్ల పైన కూర్చునే విధంగా టాయ్లెట్ కమ్మోడ్ కట్టించుకుంటున్నారు.
ఇళ్ళల్లోను, బయట కూడా కొత్తవిధానం కమోడ్ లే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ కమ్మొడ్ పైన కూర్చుంటే మన శరీరం కమ్మొడ్ కు తగులుతుంది.
ఇంతకుముందు వాడిన వారు అక్కడే కూర్చుని వెళ్తారు. ఇలాంటప్పుడు, ఒకరినుంచి ఒకరికి జబ్బులు వచ్చే అవకాశముంది.
అందువల్ల, మనం వాడేముందు కమ్మొడ్ పైన టాయ్లెట్ పేపర్ వేసి, దానిపైన కూర్చోవటం కొంతవరకు బెటర్.
ఇంకో సమస్య ఏమిటంటే, మలవిసర్జన సమయంలో మలం నీటిలో పడినప్పుడు కొన్ని చుక్కలు చింది శరీరంపై పడే పరిస్థితి ఉంటుంది.
స్త్రీలకయితే ఆ నీటి చుక్కలు శరీరపు ప్రైవేట్ పార్ట్స్ లో పడే అవకాశముంటుంది. ఇది తలచుకుంటేనే చాలా భయం వస్తుంది.
బయట టాయ్లెట్స్ ఎందరో వాడుతారు. ఎన్ని భయంకరమైన జబ్బులు వచ్చే అవకాశముందో తెలియదు.
నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలంటే, ఆధునిక టాయ్లెట్స్ లో నీరు క్రింద పడకుండా పొడిగా ఉండాలంటారు.
షాపింగ్ మాల్స్, హోటల్స్, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్ట్స్..ఇలా ఎన్నో చోట్ల టాయ్లెట్స్ వాడతారు.
లాంగ్ జర్నీస్ లో బయట టాయ్లెట్స్ వాడక తప్పదు. ఎక్కువసేపు టాయ్లెట్ వెళ్ళకుండా ఆపుకుంటే అనారోగ్యాలు వచ్చే అవకాశముంది. టాయ్లెట్స్ సమస్యల వల్ల ప్రయాణం అంటేనే భయమొస్తుంది.
ఇలాంటప్పుడు మనమే టాయ్లెట్ పేపర్, డెట్టాల్ తీసుకెళ్లి కమ్మొడ్ పైన జల్లి వాడుకోవాలేమో?
అసలు కమ్మోడ్ పైన కూర్చోకుండా, చెత్త ఎత్తే చిన్న చాట తీసుకెళ్ళి మలవిసర్జన తరువాత కమోడ్లో వేసి.. పైప్ నీటితో క్లీన్ చేస్తే ఎలాగుంటుంది? అని కూడా అనిపిస్తుంది.
కమ్మొడ్ తయారు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ..
మలం ఒకేసారి నీటిలో పడకుండా నిదానంగా జారి నీటిలో పడేటట్లు, ఆ నీరు మనిషి మీద చిందకుండా, నీటికి...మనిషి కూర్చున్న దానికి కొంత దూరం ఉండేటట్లు కమోడ్ లోపలి భాగాన్ని తయారు చేయాలి. ..
అంటే, మనిషి కూర్చున్న క్రింద కాకుండా కొంత దూరంగా కమ్మోడ్ నీటిగుంత ఉండాలి.
.....................
ఇదంతా ఇంత వివరంగా రాయవలసి రావటం ఏమిటో ఖర్మ. కొంతకాలం తరువాత ఈ పోస్ట్ డిలిట్ చేసేస్తాను.
.......................
కుదిరినంతలో భారతీయ మోడల్ కమోడ్ వాడటం మంచిది.
No comments:
Post a Comment