koodali

Thursday, October 3, 2024

పండుగల సందర్భంగా..

  

 శరన్నవరాత్రులు మరియు   శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు   మొదలవ్వబోతున్న  సందర్భంగా అందరికి శుభాకాంక్షలండి.

....................

marikonni vishayamulu..

 సంక్రాంతి పండుగకు సూర్యారాధన చేస్తారు. ఆరోగ్యదాత అయిన సూర్యుని వారమైన ఆదివారం మాంసాహారం తినకూడదు. అయితే ఆదివారమే ఎక్కువ మాంసాహారం తింటున్నారు.

 ఈ రోజుల్లో కొందరు సంక్రాంతి పండుగంటే, పల్లెటూళ్లకు వెళ్ళి, కోడిపందేలు, మాంసాహారం తినటం, రికార్డ్ డాన్సులు చూడటమే పండుగ... అన్నట్లు చేస్తున్నారు. 

 వినాయకచవితి ఊరేగింపుల్లో కూడా కొందరు సినిమాపాటలు పెట్టి డాన్సులు వేస్తున్నారు. 

సినిమాపాటలు, డాన్సులు వేరే సమయంలో వేసుకోవచ్చు. పండుగల్లోనే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో?

 

 

 

 

 

 

 

 

 

1 comment:

  1. సంక్రాంతికి గాలిపటాలను ఎగురవేస్తారు. గాలిపటాలు బాగా ఎగరటం కోసం ఈ రోజుల్లో, దారాలకు గాజుపెంకులను పొడిచేసి జిగురుతో కలిపి దారాలకు పట్టిస్తున్నారు.

    ఈ దారాలు తగిలి పైన ఎగిరే పక్షులకు గాయాలయ్యే ప్రమాదముంది. ఈ గాలిపటాలు తెగి నేలపైన పడినప్పుడు.. మనుషులకు, పశుపక్ష్యాదులకు చుట్టుకుని గాయాలయ్యే ప్రమాదం ఉంది. మనుషులు ఆ దారాలను తీసుకోగలరు. పశుపక్ష్యాదులు తీసుకోలేవు.

    ReplyDelete