koodali

Wednesday, August 14, 2024

ప్రాచీనకాలంలో ప్రపంచంలో చాలావరకు ఒకే పోలికలున్న మతం...

 

కొంతకాలం క్రిందట ఒకరు సాయి అనే పదం హిందువుల గ్రంధాలలో లేదంటే, నేను శాయి అనే   పదం ఉందని వ్రాసాను.  ఉదా..వటపత్రశాయి.  ఈశా ..అనే పేరును తిప్పి చదివినా   శాఈ.. అని వస్తుందని వ్రాసాను. 
 
అయితే,  వ్రాసిన వాటిలో  కొన్నింటిని   కొంతకాలం క్రిందట డిలిట్ చేసాను.  మంచి  అభిప్రాయంతో వ్రాసినా కూడా  ఎన్నో ఆలోచించాలి కదా..

 విదేశీ పేర్లకు మన దేశంలో కొన్ని పేర్లకు దగ్గర పోలికలు ఉన్నట్లు అనిపిస్తాయి. ఉదా..విదేశాల్లో కొందరికి స్మిత్ అనే పేరు ఉంటుంది. మనదేశంలో కూడా స్మిత అనే పేరు ఉంటుంది.

పేర్లు అన్నీ మరీ ఒకేలా ఉండకపోవచ్చు. కాలక్రమేణా పేర్లలో మార్పులు వచ్చి ఉండవచ్చు.

మనదేశంలో కొన్ని ఊర్లకు ఆ పేర్లు రావడానికి వెనుక కొన్ని కధలు చెబుతారు. ఆ పేర్లు కాలక్రమేణా కొన్ని మార్పులు చెందాయని చెబుతుంటారు. (ఇలాంటి వాటికి Grammar చూడరు.)


 ప్రాచీనకాలంలో... ప్రపంచంలో  చాలావరకు ఒకే పోలికలున్న
 
పద్ధతి ఉండేదేమో అనిపిస్తుంది.   విదేశాల్లో ప్రాచీన ఆనవాళ్ళకు.... భారతీయ సంస్కృతికి పోలికలు ఉన్నాయని కొందరు కనుగొన్నారట. 

   దైవం ఒక్కరే..అని చెప్పాలన్నా ఈ రోజుల్లో ఎవరు ఎలా అర్ధం చేసుకుంటారో?
 అని సందేహంగా  ఉంది.   ఈ రోజుల్లో, ఏం చెప్పాలన్నా  కూడా ఎంతో ఆలోచించవలసిన పరిస్థితి  ఉంది. కొన్ని నిజాలను కూడా నిర్భయంగా చెప్పలేని పరిస్థితి ఇది.

*************
 
మెక్సికో, ఇరాన్లో కొన్ని జాతులు, గ్రీక్, ఈజిప్ట్..ఇలా అనేకదేశాల సంస్కృతికి భారతీయ సంస్కృతికి ఉన్న పోలికలను తెలియజేస్తున్నారు.

links....

No comments:

Post a Comment