koodali

Tuesday, January 8, 2019

కొన్ని విషయాలు ...రేబిస్ వ్యాధి..


కొన్ని రోజుల క్రిందట ఒక వార్త తెలిసింది.(మా కుటుంబంలో వారు .. వైద్యులుగా చేస్తున్నారు. అలా ఈ విషయం తెలిసింది. )

హాస్పిటల్ కు వచ్చిన  14 సంవత్సరాల ఒక అబ్బాయికి వారి ఇంట్లో పెంచుకుంటున్న కుక్క కరవటమో? గీరటమో? జరిగిందట. ఇంట్లో పెంచుకుంటున్నదే కదా.. అని ఇంజక్షన్ చేయించుకోలేదట.

 కొంతకాలానికి ఆ అబ్బాయికి కొన్ని వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్ళారట.  ఈ విషయం జరిగి కొన్ని రోజులు గడిచాయి.

అయితే, నాకు కొన్ని సందేహాలు కలిగాయి. . ఇంట్లో పెంచుకుంటున్న కుక్కకు రేబిస్ వ్యాధి ఉంటే కుక్క కూడా చనిపోయి ఉండాలి కదా? వారి ఇంట్లో కుక్క పరిస్థితి ఎలా ఉంది ? అబ్బాయికి ఇంట్లో పెంచుకుంటున్న కుక్క వల్లే  వ్యాధి సోకిందా? లేదా ? అనే సందేహాలు కలిగాయి.

(ఇంట్లో పెంచుకునే జంతువులకు రేబిస్ రాకుండా ముందే టీకాలు ఇప్పించాలట. )


రేబిస్ గురించి అంతర్జాలంలో వెతికితే కేరళలో ఒక ఆయుర్వేద వైద్యుడు  రేబిస్ వ్యాధికి ఆయుర్వేదం ద్వారా  మందు తయారుచేస్తున్నారని తెలిసింది. 

ఆ లింక్..

Kozhikode Native Gets Patent For Ayurveda Medicine To Cure Rabies

అడ్రస్..

CM Sivaraman Vaidyar
Gurudev Ayurveda,Noor Building, Rly link road, near Apsara theatre calicut, 673002


ఆ పిల్లవాడికి ఏమైనా ఉపయోగపడుతుందేమోననే ఆశతో .. కేరళ వైద్యుల గురించిన అడ్రస్ కాగితం మీద వ్రాసి,  వీలుకుదిరితే వాళ్ళకు ఇవ్వమని పంపించాను. 

అయితే, అప్పటికే అతని పేరెంట్స్ పిల్లవాడిని తీసుకుని విజయవాడ ఆసుపత్రి నుండి గుంటూరు వెళ్లారట. .

చికిత్స కొరకు గుంటూరులో కొంత మెరుగైన ఫెసిలిటీస్ ఉన్నాయట. 

 చిన్న అబ్బాయికి అలాంటి పరిస్థితి రావటం అత్యంత బాధాకరం.
 అబ్బాయి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. 

************
అడవులలో నివసించే గిరిజనులు ఎవరికైనా జంతువులు కరిస్తే వనమూలికలను వాడుకుంటారని అంతర్జాలంలో చదివాను. (అయితే, ఈ విషయాలు నాకు సరిగ్గా అర్ధం కాలేదు.)

 గిరిజనులు వాడే మూలికలపై కూడా పరిశోధనలు జరిగితే బాగుంటుంది. 
*************
లూయి  పాశ్చర్ రేబిస్ వ్యాధికి టీకాను కనుగొన్నారు.

రేబిస్ వ్యాధి ఉన్న జంతువులు ఎవరినైనా  కరిచినప్పుడు..  వెంటనే ఇంజక్షన్లు చేయించుకుంటే రేబిస్ వ్యాధి సోకదంటున్నారు.

 ( రోజుల్లో ..  పొట్టకు కాకుండా, భుజానికే  ఇంజక్షన్లు చేసే విధానం వచ్చిందట .)

ఇంజక్షన్ వేయించుకోకుండా ...తరువాత వ్యాధి లక్షణాలు కనిపిస్తే వ్యాధి తగ్గటానికి సరైన మందు లేదంటున్నారు?

 ఆ వ్యాధి సోకిన వారికి  బ్రెయిన్  బలహీనమయి అనేక భయాలు, భ్రాంతులు  కలుగుతాయంటారు. 

ఉదా..నీరంటే భయం కలిగి, నీటిని త్రాగకపోవటం వల్ల డీహైడ్రేషన్ వస్తుందట. 


ఇవన్నీ గమనిస్తే నాకు ఏమనిపించిందంటే.. బ్రెయిన్   శక్తివంతం అవ్వటానికి, నరాల శక్తికి  ఆయుర్వేదంలో సరస్వతీ ఆకు, అశ్వగంధ, మరియు పునర్నవ..వంటి అనేక మూలికలు ఉన్నాయి కదా ..

ఎన్నో వ్యాధులకు పెన్నేరును ( అశ్వగంధ)  మందుగా వాడవచ్చని అంటారు.

ఎవరైనా రేబీస్ వ్యాధికి గురయ్యి... ఆఖరి రోజులలో  ఉన్నవారికి ఈ ఆయుర్వేదమూలికలను ఉపయోగించి చూస్తే మంచి ఫలితాలు కలుగుతాయేమో? వైద్యులు పరీక్షించి చూడవచ్చు..  అనిపించింది.

 శ్రీ కాలభైరవ స్వామిని పూజించటం మంచిది.  దైవానికి వందనములు.

*************
కొత్తగా టపా వ్రాయటం అంటే ప్రస్తుతం ఆసక్తి లేక ... కొన్ని రోజులక్రితం ఈ విషయాలను వ్రాసి, పాత టపాలలో  చేర్చాను. 

అయితే , పాత టపాలలో చేర్చితే... ఇప్పుడు చదువుతారో ? లేదో ? అనిపించి టపా వేసాను.


4 comments:

  1. I am glad you posted the information. Thanks.

    ReplyDelete
  2. మీకు ధన్యవాదములండి.


    ReplyDelete

  3. దత్తుర తో కుక్క కాటుకు కూడా చికిత్స చేయవచ్చట. సుశ్రుతసంహిత ద్వారా తెలిసిన విషయాలు..

    ఆ వివరాలు కూడా క్రింద ఇచ్చిన లింక్ వద్ద ఉన్నాయి.

    Datura (Datura stramonium ) Seeds & Leaves, Their Uses, Health Benefits, Dosage & Side Effects


    కుక్క కరిచినప్పుడు వెంటనే అల్లోపతి ఇంజక్షన్లు వేయించుకుంటే ప్రమాదముండదు. ఏమి అవదులే అనుకుని ఇంజక్షన్లు వేయించకుండా తరువాత రేబిస్ వ్యాధి వస్తే మాత్రం అప్పుడు సరైన మందులు లేవంటున్నారు.

    అలాంటప్పుడు ఆయుర్వేదంలో చెప్పిన సుశ్రుతుల వారు చెప్పిన మందును ప్రయత్నించవచ్చేమో?

    ReplyDelete

  4. దతూరను కుక్క కరిచినప్పుడు వాడతారట.

    దతూర రూట్ పొడి 125 గ్రాములు పునర్నవ పొడి 5 గ్రాములు కలిపి కోల్డ్ వాటర్ తో రోజుకు రెండు సార్లు ఇవ్వాలట .

    ఈ విషయం సుశ్రుత సంహితలో ఉందట.

    ReplyDelete