ఈ మధ్య నెట్ లో (బంగారయ్య శర్మ, పరిపూర్ణానంద, చాగంటి లకు సవాల్ విసిరిన హేతువాది ...) అని కొన్ని విషయాలను చూసి.. నాకు తోచిన అభిప్రాయాలను వ్రాయాలనిపించి వ్రాసాను.
ఇలాంటి విషయాల గురించి పాత టపాలలో వ్రాసాను. అలాగని, పదేపదే వ్రాయాలనుకోవడం లేదు.
**********
సృష్టి ఎలా ప్రారంభమయ్యింది ? అనే ప్రశ్నకు , దైవం వల్ల ప్రారంభమయ్యింది. . అని ఆస్తికులు ఖచ్చితమైన సమాధానం చెప్పగలరు.
సృష్టి ఎలా ప్రారంభమయ్యింది ? అనే ప్రశ్నకు , నాస్తికులు సరైన జవాబు చెప్పలేరు. సృష్టి దానికదే ప్రారంభమయిందని అంటారు.
కొందరు నాస్తికులు ఏమంటారంటే, దైవం ఎలా ఉద్భవించారని ప్రశ్నిస్తారు. సృష్టి దానికదే ఎలా ప్రారంభమయిందో వీరు సమాధానం చెప్పగలరా?
సృష్టి దానికదే ప్రారంభమవటం సంభవమని వారు నమ్ముతున్నప్పుడు.. మరి, దైవం తమకు తామే ఉద్భవించలేరా....
సృష్టి దానికదే ప్రారంభమయిందని చెప్పే నాస్తిక భౌతికవాదులు... దైవం ఎలా ఉద్భవించారని అడగటం విడ్డూరం.
గాలిలో ఎగిరే పక్షులకు తేలికైన రెక్కలు ఉండటం, నీటిలో చేపలకు ఈదటానికి తగ్గట్లు శరీరం ఉండటం, అతి చిన్న చీమకు ఉండే శ్రమశక్తి, గతితప్పకుండా వచ్చే సూర్యచంద్రులు, వాటివల్ల జీవించే మొక్కలు, భూమికి గల గురుత్వాకర్షణ శక్తి, శరీరంలో గుండె కొట్టుకోవటం, జీర్ణప్రక్రియ ఇవన్నీ.. ఇంత పద్ధతిగా సృష్టి నిర్మాణం జరగాలంటే గొప్ప ఆలోచనాశక్తి ఉంటేనే సాధ్యం.
******************
కర్మ ప్రకారం ఫలితం ఉండటమూ నిజమే, బ్రహ్మవ్రాత అనేదీ నిజమే , శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు.... అనేదీ నిజమే.
జన్మను ఎత్తిన తరువాత ఎలాంటి కర్మలు చేయాలనే స్వేచ్చ వ్యక్తులకు ఉంటుంది. వారు చేసే కర్మల ప్రకారం ఫలితం ఉంటుంది. వ్యక్తి చేసిన కర్మ ప్రకారం కలిగే ఫలితాన్ని ...బ్రహ్మ వ్రాత , శివుని ఆజ్ఞ ..లేక ఇంకా ఎలాగైనా అనుకోవచ్చు.
చాలామంది విషయంలో తాము చేసిన పనులు సరైనవిగా అనిపిస్తాయి. తప్పు చేసిన వాళ్లు కూడా తాము చేసింది కరెక్టే అనుకోవచ్చు.
అయితే, ఎవరు చేసిన కర్మల ప్రకారం వారికి తగిన ఫలితాన్ని దైవం నిర్ణయిస్తారు.
****
దైవకృపను పొంది భవిష్యత్తును మార్చుకోవచ్చని సతీ సావిత్రి, మార్కండేయుడు..వంటి ఉదాహరణల ద్వారా పెద్దలు తెలియజేసారు.
***
వ్యక్తులు చేసిన కర్మల ఫలితం ప్రకారం చెడు జరగాలని ఉందనే సూచనను జ్యోతిష్యం ద్వారా తెలుసుకుంటే , వర్తమానంలో సత్ప్రవర్తన, ఇతరులకు సాయం చేయడం, పూజలద్వారా పరిహారాలను ఆచరించడం వంటి... వాటి ద్వారా చెడు ఫలితాలను గణనీయంగా తగ్గించుకునే అవకాశముంది.
( అయితే , జ్యోతిష్యం తెలుసుకోవడానికి ఉపాసనాబలం చక్కగా ఉన్న వ్యక్తుల ద్వారా తెలుసుకోవటం మంచిది. చెడు ఫలితాలను తగ్గించుకోవాలంటే పరిహారం ఆచరించడంతోపాటు సత్ప్రవర్తన కూడా అవసరం. )
***********
భవిష్యత్తులో శాస్త్రవేత్తలు కొన్ని మూలకాలను కలిపి జీవాన్ని సృష్టించినా కూడా అందులో ఆశ్చర్యం ఏముంది ?
ఈ ప్రయోగాలకు వాడే మూలకాలను శాస్త్రవేత్తలు ఎక్కడినుంచి తెస్తారు? అవి దైవసృష్టిలోని మూలకాలే .
దైవసృష్టిలోని వాతావరణాన్ని ఉపయోగించుకుంటూ, ఆ గాలి పీల్చుతూ, ఆహారాన్ని తింటూ వీటన్నింటికీ కారణమైన దైవాన్ని మాత్రం గుర్తించడానికి మాత్రం కొందరు ఒప్పుకోకపోవటం ఎంతో అన్యాయం.
సృష్టిలోని వాతావరణం, ఆకాశం, సూర్యరశ్మి, జలం, అగ్ని, భూమి, నీరు, మూలకాలు.. ఇవన్నీ శాస్త్రవేత్తలు సృష్టించినవి కాదు. ఇవన్నీ దైవం సృష్టించినవి.
దైవసృష్టిలోని మూలకాలను, ముడిసరుకును ఉపయోగించి...మనుషులు వస్తువులను తయారుచేసి, అవన్నీ మేమే తయారుచేసాం, ఎంతో ఆలోచించి ఈ వస్తువులను తయారుచేసాం..అని చెప్పుకుంటారు.
మా ఆలోచనలతో వస్తువులను తయారుచేసాం.. అని చెప్పుకుంటున్నప్పుడు..ఇంత వైవిధ్యభరితమైన సృష్టి వెనుక అత్యద్భుమైన ఆలోచనాశక్తి తప్పకుండా ఉంటుంది.. అని కూడా తెలుసుకోవాలి.
మరి, ఇంత వైవిధ్యభరితమైన సృష్టి వెనుక ఎంతో అత్యద్భుతమైన ఆలోచనాశక్తి కలిగిన శక్తి తప్పకుండా ఉంటారు. ఈ శక్తినే ఆస్తికులు దైవం అని అంటారు. విజ్ఞానమంతా దైవసృష్టిలోనే ఉంది. ఇప్పటికి మనుషులు తెలుసుకున్న విజ్ఞానం చాలా తక్కువ. దైవమే అత్యద్భుతమైన సైంటిస్ట్.
************
ప్రాచీన గ్రంధాలలో భారీ పక్షులు, జంతువుల గురించిన సమాచారం ఉంది.
**********
రోగకారణమైన బాక్టీరియా గురించి తెలియకపోతే చికిత్సను, మందులను అందించలేరు కదా! బాక్టీరియా గురించి అప్పటివారికి తెలియబట్టే ఆయుర్వేదవైద్యం ద్వారా ఎన్నో చికిత్సలను అందించారు.
***************
మంత్రాల గురించి హేళనగా మాట్లాడటం సరికాదు.. మంత్రాలను ఒక పద్దతిలో సరిగ్గా ప్రయోగిస్తే గొప్ప శబ్దశక్తి వెలువడుతుందని అంటారు. మంత్రాల ద్వారా ఎన్నో శక్తులను పొందినవారి గురించి గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
ఆధునిక శాస్త్రాల ద్వారా కూడా శబ్దశక్తి గురించి తెలుసుకున్నారు. ఉదా.. అల్ట్రాసౌండ్.
**********
ఇక ప్లాస్టిక్ వగైరాల వాడటాన్ని తప్పనిపరిస్థితిలో వాడుతున్నారు.. వాటివల్ల కొన్ని సౌకర్యాలతో పాటు చెడు ఫలితాలూ కలుగుతున్నాయి.
ప్లాస్టిక్ వంటి వాటి వల్ల ప్రపంచంలో ఎంతో పొల్యూషన్ జరిగి గ్లోబల్ వార్మింగ్ వంటి ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. ఎన్నో జీవజాతులు అంతరించే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితి మార్చుకోవలసిన అవసరం ఉంది.
***
కళ్లజోడు రావడానికి అనేక కారణాలుంటాయి.ఈ రోజుల్లో తినే ఆహారంలో సత్తువ లేక చాలామంది చిన్నపిల్లల్లో కూడా తెల్లజుత్తు, కళ్లజోడు వంటివి వస్తున్నాయి.
ఇక, టీవీలు చూడటం, సెల్ వాడకం, కంప్యూటర్ వాడకం వల్ల కూడా కళ్లజోడు వస్తుంది. పొల్యూషన్ వల్ల కూడా అనేక జబ్బులు వస్తున్నాయి. కిడ్నీజబ్బులు, కాన్సర్లు బాగా పెరిగాయి.
ఈ రోజుల్లో కొందరు హార్మోన్ ఇంజెక్షన్లు వేసి కోళ్ళను పెంచుతున్నారు. అలాంటి కోడిగుడ్లను తినటం మంచిది కాదని పరిశోధనలు ద్వారా తెలిసిందట.
**************
సృష్టిలో అన్నీ ఒకలాగే ఎందుకుంటాయి. దైవసృష్టి జిరాక్స్ లా ఎందుకుంటుంది? విభిన్నంగా ఉంటేనే కదా ప్రపంచం ఆసక్తికరంగా ఉంటుంది. ఇంత విభిన్నమైన సృష్టి ఎంతో అద్భుతమైన ఆలోచనాశక్తి ఉన్న శక్తికే సాధ్యం.
********
సృష్టిలో మనకు తెలిసిన విజ్ఞానం సముద్రంలో నీటిబొట్టంత అయితే, మనకు తెలియని విజ్ఞానం సముద్రమంత, ఇంకా ఎక్కువ కూడా.
ప్రతి చిన్న విషయాన్ని గురించీ అతిగా ఆలోచిస్తూ, అతిగా వాదించుకుంటూ సమయాన్ని వృధాచేయడం కన్నా, విచక్షణతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, మనల్ని సరైన దారిలో నడిపించమని దైవాన్ని శరణువేడుకోటం మంచిది.

No comments:
Post a Comment