koodali

Saturday, July 16, 2016

ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదు...

ఈ రోజులలో  ప్రజలు రోగాల బారిన పడటం ఎక్కువగా జరుగుతోంది.  

వయస్సుతో సంబంధం లేకుండా  చిన్నపిల్లలు  కూడా ఎక్కువగా వ్యాధుల బారిన పడుతున్నారు. 

ఇలా  జరగటానికి అనేక కారణాలున్నాయి.

 వాతావరణ కాలుష్యం బాగా పెరగటం , పంటలు పండించటానికి రసాయన ఎరువులు వాడటం , చదువు, ఉద్యోగ వత్తిళ్ళు పెరగటం..ఇలా అనేక కారణాలున్నాయి.

 ఈ రోజుల్లో  ఇంటి శుభ్రత కోసం వాడుతున్న రకరకాల రసాయనాల వల్ల కూడా భూమి, నీరు కలుషితం అవుతున్నాయి.


 ఇలా కలుషితమైన మట్టి, నీటితో పంటలు పండించటం  అనారోగ్యకరం.
..............................

 అనారోగ్యం రావటానికి  ఇంకో ముఖ్యమైన కారణం ఏమిటంటే ..చిన్నతనం నుంచి తీసుకునే ఆహార  పద్ధతిలో వచ్చిన విపరీతమైన  మార్పులు.

 పాతకాలంలో ఇంట్లోనే  తయారుచేసిన ఆహారం ఎక్కువగా తీసుకునే వారు.

ఈ రోజుల్లో ఎక్కువగా బయట ఆహారం తీసుకోవటం జరుగుతోంది.

 పాతకాలంలో...  కొబ్బరి నూనె, పసుపు, కారం ...వంటివి  ఇంట్లోనే తయారుచేసుకునేవారు.


 ఈ రోజుల్లో అల్లం..వెల్లుల్లి పేస్ట్ కూడా బయట నుంచి కొని తెచ్చుకునే పరిస్థితి ఉంది.

బయట నుంచి తెచ్చుకునే వాటిలో నిల్వ ఉండటం కోసం కొన్ని రసాయనాలు కలిపే అవకాశం ఉంది.

 ఈ రోజులలో  పదార్ధాల రుచికొరకు వాడే రసాయనాలతో కూడిన ఆహారాన్ని తినటం ఎక్కువయింది.  


 జంక్ ఫుడ్ వల్ల రుచి బాగుంటుంది కానీ, రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

 ఆహారపదార్ధాలలో రుచి పెరగటం కోసం  ఈ రోజుల్లో  చాలామంది ..  ఎన్నో వంటలలో  బేకింగ్ సోడా, అజనిమోటో వంటివి.. వాడుతున్నారు. 

 అజనిమోటో  బయట షాపులలో సులభంగా లభిస్తుంది. ఇవన్నీ వాడటం వల్ల ఆహార పదార్ధాలకు ఒక విధమైన  రుచి  రావటం వలన  వీటి  వాడకం  బాగా పెరిగింది.

 ఆ రుచికి అలవాటుపడటం వల్లకు మళ్లీమళ్లీ అవే తినాలనిపిస్తుంది.  అలా శరీరంలోకి  వెళ్లే అజనిమోటో పరిమాణం బాగా పెరుగుతుంది. 


 అజనిమోటో  తరచు వాడితే కలిగే నష్టాలు చాలామందికి తెలియదు.

ఇంట్లో చేసుకునే వంటలలో కూడా అజనిమోటో, సోడాఉప్పు వంటివి ఎక్కువగా వాడటాన్ని తగ్గించాలి.

నాకు తెలిసినంతలో సోయాసాస్ , వెనిగర్ వంటివి పదార్ధాలను నెలల తరబడి పులవబెట్టి తయారుచేస్తారు.


   కెమికల్స్ తో కూడా సోయాసాస్, వెనిగర్ తయారుచేస్తారట.

 మన పూర్వీకులు  సోడాఉప్పు వంటివి  వాడకుండానే వెన్న వాడి  కరకరలాడే రుచికరమైన స్నాక్స్ చేసేవారు. 

................................

 పాత రోజుల్లో  సూర్యరశ్మి, వెన్నెల, గాలి, వెలుతురు ప్రసరించే విధంగా జీవనశైలి ఉండేది.

 ఈ రోజుల్లో  ఎక్కువగా  నాలుగుగోడల మధ్యన సెల్ ఫోన్స్, టీవీ, కంప్యూటర్స్.. మధ్యే ఉంటున్నారు.  


అనారోగ్యాలు పెరగటానికి ఇవన్నీ కారణాలే.

40 సంవత్సరాల క్రిందట కూడా  కాన్సర్, కిడ్నీ..వంటి వ్యాధులు  అరుదుగా ఉండేవి.  


ఇప్పుడు చిన్నపిల్లలలో కూడా కాన్సర్, కిడ్నీ..వంటి జబ్బులు వస్తున్నట్లు  వింటున్నాము.

ఆరోగ్యమే మహాభాగ్యం.  ఆరోగ్యాన్ని  అశ్రద్ధ  చేయరాదు.



No comments:

Post a Comment