koodali

Thursday, October 3, 2013

ప్రజల సమస్యలను పరిష్కరించండి....

 
రాష్ట్రంలోని  అన్ని  ప్రాంతాలు  అభివృద్ధి  అయి  ఉంటే   ఇప్పటి  పరిస్థితి  వచ్చేది  కాదు. 

 దోపిడీదారులు  అన్ని  ప్రాంతాలలోనూ   ఉంటారు. .  సీమాంధ్ర  మరియు  తెలంగాణాలో  పేద  ప్రజలు  అష్టకష్టాలు  పడుతుంటే  ..  కోట్లాది  రూపాయల  సొమ్మును   అక్రమంగా   కూడబెట్టుకుంటున్నవారు   అందరూ    అటువంటి  వారే.

గత  కొన్ని  సంవత్సరాల  నుంచి  ఆంధ్రప్రదేశ్ లో   అయోమయ  పరిస్థితి  నెలకొంది.  అభివృద్ధి  ఆగిపోయింది.  ప్రజల  సమస్యలు  ఎక్కడివి  అక్కడే  ఉన్నాయి..... ప్రజలంటే  అభిమానం  ఉన్న  నాయకులయితే  ప్రజల  కష్టాలను  తీర్చాలి.  అంతేకానీ  వాళ్ళ  ఖర్మకు  వాళ్ళను  వదిలి  ఊరుకోరు.


ప్రజలంటే  అభిమానం  ఉన్న  నాయకులయితే  కాళ్ళు,  కీళ్ళు  కొంకర్లు  పోయి  కష్టాలు  పడుతున్న  ఫ్లోరైడ్  బాధితుల  కష్టాలను  తీర్చలేదెందుకని  ? 


అప్పులను  భరించలేక  ఆత్మహత్యలు  చేసుకుంటున్న  రైతుల,  చేనేత  కార్మికుల  కష్టాలను  తీర్చలేదెందుకని  ?

పనులు  దొరకక  పస్తులుంటున్న  కార్మికుల  కడగండ్లను  పట్టించుకోలేదెందుకని  ?


 పదవులు, అధికారం  లేకపోయినా  పుట్టి  పెరిగిన  ఊరిని  అభివృద్ధి   చేస్తున్న    సామాన్యుల  కధలెన్నో  పత్రికలలో  వస్తున్నాయి.  


అధికారం,  డబ్బు,  పలుకుబడి  అంతగా  లేని  వ్యక్తులు  పట్టుదలతో  ప్రజల  సమస్యలను  తీర్చుతున్నప్పుడు....అధికారం  ఉన్నవారికి  ప్రజల  సమస్యలు  పరిష్కరించటం  సాధ్యమే  కదా  !   
 
గత  కొన్ని  సంవత్సరాలుగా  విభజన  అని  కొందరు ..... సమైక్యం  అని  కొందరు  వాదులాడుకుంటూ  ప్రజల  సమస్యలను  పట్టించుకోవటమే  మానేశారు. 

 ప్రజల  సమస్యలను  పరిష్కరించి  అప్పుడు  విభజన  అనో  లేక  సమైక్యం  అనో  తీరికగా  వాదులాడుకోవచ్చు. 


 అంతే  కానీ ,  అనేక   దైనందిన   సమస్యలతో  అలసిపోతున్న  ప్రజలను  మరింతగా  కష్టపెట్టవద్దు....

విభజన,  సమైక్యం  గొడవలు  ప్రక్కనపెట్టి    ముందు  ప్రజల  సమస్యలను  పరిష్కరించాలి. 

రాయలసీమలో  ఎందరో  పేదవారున్నారు.  తెలంగాణాలో  ఎందరో  పేదవారున్నారు. ఉత్తరాంధ్రాలో ఎందరో  పేదవారున్నారు.  కోస్తాలో     ఎందరో  పేదవాళ్ళున్నారు.  

  రాజధాని  ఉన్న  ప్రాంతంలో    అభివృద్ధి  జరుగుతుందని  అందరికి  తెలుసు. 


 సీమాంధ్ర  వాళ్ళు   అందరూ  డబ్బు  కోసం  ఆశపడేవాళ్ళు,  ఇతరులను  దోచుకునే  వాళ్ళు   అయితే    రాజధానిని  హైదరాబాద్ లో  పెట్టడానికి  ఒప్పుకోరు  కదా  !  రాజధాని  తమ  ప్రాంతంలోనే  ఏర్పాటు  చేసుకునేవారు. 
........................

అయితే,   అక్రమంగా  సమాజంలోని  సంపదను  దోచి  దాచుకునే  దోపిడీదారులు   అన్ని  ప్రాంతాలలోనూ  ఉంటారు.
.............................

అన్ని  రాజకీయ  పార్టీలను  సంప్రదించిన  తరువాతే    విభజన  ప్రక్రియ  ప్రకటన  వచ్చిందని ,  తాము  మాట  తప్పే  వాళ్ళం  కాదని  కొందరు  అంటున్నారు. 


రాజకీయపార్టీలు  ప్రజల  అభిప్రాయలను  సరిగ్గా  తెలుసుకోలేదు  కాబట్టే  ప్రజలందరి  అభిప్రాయం  కనుక్కుంటామని  చెప్పి  శ్రీ  కృష్ణ  కమిటీని  వేశారు.


 శ్రీ  కృష్ణ  కమిటీకి   తమ  అభిప్రాయాలు    తెలియజేయాలని   ఎన్నోసార్లు  ప్రజలను  కోరారు.  

 అన్ని  ప్రాంతాల  ప్రజలు  తమ  అభిప్రాయాలను  శ్రీ  కృష్ణ  కమిటీకి  తెలియజేశారు.  


ఇప్పుడేమో   రాజకీయపార్టీల  అభిప్రాయం  ప్రకారమే   చేస్తామంటున్నారు.  

మరి,   ఎంతో  ఖర్చుపెట్టి  శ్రీ  కృష్ణ  కమిటీని  వేయటమెందుకో  ?  ఆ  కమిటీకి  ప్రజల  అభిప్రాయాలను  తెలియజేయమనటం  ఎందుకో  ?




4 comments:

  1. A statesman sees beyond this generation a politician looks for the next election. Unfortunately we are now hiving only politicians in all parties. No body is interested about the poor and public.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    అవునండి ఈ రోజుల్లో ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి పనిచేసే నాయకులు చాలా తక్కువగా ఉన్నారు.

    ReplyDelete
  3. ధర్మమేవ జయతే!
    జై తెలంగాణ!

    ReplyDelete
  4. shayi gaaru, వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

    ఈ విషయం గురించి ఇంతకుముందు వ్రాసిన వ్యాఖ్యలను కూడా దయచేసి చదవండి.

    ReplyDelete