koodali

Friday, April 22, 2011

కోమాలోకి వెళ్ళినవారిని కొన్ని సంవత్సరాల వరకు జీవింపజేసే ..............

ఈ రోజు గుడ్ ఫ్రైడే .

పీ ఎస్ ఎల్ వీ విజయవంతమయినందుకు కారణమైన అందరికి శుభాకాంక్షలు .దీని ద్వారా ప్రజలకు చాలా ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు గదా !

ఇవాళ ధరిత్రీ దినోత్సవమట. మంచిది.

ఆధునిక సైన్స్ వల్ల లాభాలూ ఉన్నాయి. నష్టాలూ ఉన్నాయి.

వైద్యంలో వెంటిలేటర్ సహాయంతో చికిత్స చేయటం లాభాలలో ఒకటి. ఇంకా, ఈ వెంటిలేటర్ చికిత్స సహాయంతో ఎంతకాలం ప్రాణాలు నిలుపుకోవచ్చో ...... ఆ వివరాలు నాకు అంతగా తెలియదు.

కోమాలోకి వెళ్ళినవారిని కొన్ని సంవత్సరాల వరకు జీవింపజేసే చికిత్సలు కూడా ఉన్నాయట. ( 10 సంవత్సరాలు కూడా జీవించి ఉంటారట కొందరు ).

అలాగే ఎవరికయినా సెలైన్ అందించి ప్రాణాన్ని కాపాడటం కూడా లాభాలలో ఒకటి.

వీటిని కనిపెట్టినవారికి కృతజ్ఞతలు చెప్పాలి మనము. ఎందరివో ప్రాణాలు ఇలాంటి చికిత్సల వల్ల కాపాడబడ్డాయి.


ఇక ఇవాళ ఎర్త్ డే అంటున్నారు గదా !

మనిషి అత్యాస వల్ల ధరిత్రి ఎంతగా నష్ట పోతున్నది అందరికీ తెలుసు.

ఉదా.... మనిషి తన అవసరాలకు అత్యంత ప్రమాదకరమైన అణుశక్తిని వాడుకుంటున్నాడు. వీటినుంచి విడుదలయ్యే వ్యర్ధాలను ఏమి చెయ్యాలో........... ఇంతవరకు సరైన సమాధానం లేదు.


ఇక ఈ మధ్య జరిగిన జపాన్ ప్రమాదంలో అణు రియాక్టర్లనుంచీ కొన్ని కిలోమీటర్ల దూరం వరకు జనం తరలిపోయారు.

మనుషులు కాబట్టి దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకుంటున్నారు.

సరే ...మరి కోట్లాది ఇతరజీవులు, చెట్లు ....వీటి గురించి ఎవరు ఆలోచించారు ?

అవి ఎక్కడికని వెళ్ళిపోగలవు ? మనుషుల స్వార్ధానికి అవి బలి అవ్వాల్సిందేనా ?

ఎంతసేపూ మనకు వైద్యం అవసరం........ విద్యుత్ అవసరం....... ఈ గోలే గానీ ఈ ధరిత్రి లోని ఇతర జీవులు మన ప్రయోగాల వల్ల ......... ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాయో , ఎంత బాధ పడుతున్నాయో మనకి పట్టదా ?


వాటికి మనలానే బాధలు ఉంటాయి. , వాటికీ వైద్యం, అవసరమే గదా ! ( విద్యుత్ అక్కరలేదు లెండి . మనం అలవాటు చేస్తే తప్ప........ )

ఈ ప్రపంచం మీద మనకు మాత్రమే హక్కులు ఉన్నట్లు ప్రవర్తిస్తున్నాము.

మనిషికి వైద్యము, విద్యుత్తు వీటి కన్నా ముందు ............. ధరిత్రి భద్రంగా ఉంటేనే మనకు భద్రత ఉంటుందని మనమందరము గుర్తుంచుకోవాలి మరి. 

 

4 comments:

  1. 16సంవత్సరాల తర్వాత కోమాలోంచి ఒక వ్యక్తి బయటపడ్డాడని ఈ మధ్యనే చదివాను.

    ReplyDelete
  2. నేను కూడా ఈ వార్త చదివానండి. ఇలా జరగటం చాలా గొప్ప విషయం.

    ReplyDelete
  3. We are forgetting about environment. If we give up on environment, environment will give up on us. The life on earth will come to end soon. So please save environment. Save animals and trees.
    Vruksho rakshathi rakshitaha.

    ReplyDelete
  4. పాత పోస్ట్ లు చూస్తుంటే మీ కామెంట్ కనిపించింది. ఆలస్యంగా జవాబు ఇస్తున్నందుకు సారీఅండి. మీరు చక్కగా చెప్పారు.

    ReplyDelete