koodali

Monday, September 2, 2024

పసిపిల్లల్ని చక్కగా చూసుకుంటే దైవానికి పూజ చేసినట్లే.... ఒకటవభాగం....

 

పెద్దవాళ్లు తమ సమస్యలను చెప్పగలరు. పిల్లల విషయం అలా ఉండదు కదా..పసిపిల్లలకు సరిగ్గా మాటలు రావు కాబట్టి తమ సమస్యలను చెప్పలేరు. కొంచెం పెద్దయిన పిల్లలు తమ సమస్యలను చెప్పినా, అర్ధంచేసుకునే పేరెంట్స్ ఎందరు?

ఉదా..పాతకాలంలో పసిపిల్లలకు పల్చటి నిక్కర్ వంటివి వేసేవారు. వాళ్ళు యూరిన్ పోసినప్పుడల్లా ఆ చెడ్డిలను మార్చి ఉతికి ఆరేసేవారు. యూరిన్ నేలమీదపడితే క్లాథ్ తో తుడిచేవారు. ఈ రోజుల్లో పెద్దవాళ్లు ఆ పనులన్నీ చేయలేక, సోఫాలు, మంచాలు పాడవుతున్నాయని చెప్పి, పసిపిల్లలకు రోజంతా పెద్ద నాప్కిన్స్ వేస్తున్నారు.

 ఆ నాప్కిన్స్ తో చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లల చర్మానికి రాషెస్ కూడా వచ్చే అవకాశముంది.. దురద, మంట వచ్చినా పిల్లలు చెప్పలేరు. గోక్కోటానికి నాప్కిన్  ఉండి గోక్కోలేరు. ఆ బాధతో పిల్లలు ఏడుస్తుంటే, పిల్లల్ని పెంచటం చాలా కష్టం అంటారు. 

పిల్లలు ఇబ్బంది పడినా ఏంకాదు కానీ, సోఫాలు, మంచాలు పాడవ్వకూడదని, తమకు అస్తమాను శుభ్రం చేసే పని ఉండకూడదని పెద్దవాళ్ల ఉద్దేశం కాబోలు.పిల్లలను అలా ఇబ్బంది పెట్టటం చాలా పాపం.

ఇక కొందరు పసిపిల్లలను డేకేర్ సెంటర్లలో వేస్తారు. కొన్ని విదేశాల్లో పసిపిల్లలకు ఎప్పుడూ షూస్ వేసి ఉంచుతారు. పిల్లలను డేకేర్ సెంటర్లలో మధ్యాహ్నం నిద్రపుచ్చుతారు. నిద్రపోయేటప్పుడు కూడా షూస్ తీయకూడదని అక్కడ రూల్స్ అట. 
 
ఇబ్బందిగా ఉండి పిల్లలు షూస్ తీయటానికి ప్రయత్నించినా కూడా, అక్కడిసిబ్బంది మళ్లీ షూస్ వేసేస్తారట. ఇంట్లో అయితే అలా ఉండదు కదా. పెద్దవాళ్లు నిద్రపోయేటప్పుడు షూస్ వేసుకుని పడుకోగలరా? 

...........................
 
పసిపిల్లలు సున్నితంగా ఉంటారు. కొందరు పెద్దవాళ్లు పసిపిల్లలకు ఎక్కువ ముద్దులు పెడతారు. అలా చేయకూడదు. 
 
నేను యూట్యూబ్లో ఒకదగ్గర చూసాను, చిన్న పాపను పెద్దామె ఎత్తుకుంది. వాళ్ల బంధువు ఒకతను ఆ పాప బుగ్గ పైన గట్టిగా తన మెహాన్ని ఆనించి ముద్దుపెట్టాడు, పాప ఏడ్చింది. మగవాళ్ల గరుకైన మొహం పిల్లల బుగ్గలకు గుచ్చుకుంటాయి. అది కూడా తెలియకుండా ఎలా బతుకుతున్నారో?
 
కొందరు ఆడవాళ్లు కూడా పసిపిల్లల బుగ్గలు నలిపి, వాళ్ళు ఏడుస్తుంటే సంతోషపడతారు. సున్నితత్వం లేకుండా  రాక్షస మనస్తత్వం ఉన్నవారే ఇలా చేస్తారు.ఇలాంటివారి బారినుంచి పిల్లలను కాపాడాలి.
..........................
  
పిల్లల్ని పెంచే సమయం, ఓపిక లేదనుకున్నప్పుడు, డబ్బు సంపాదన, కెరీరే ముఖ్యం.. అనుకున్నప్పుడు పిల్లల్ని కనవద్దు. వాళ్ళను కష్టపెట్టవద్దు. పిల్లల్ని పెంచటం చాలా కష్టం.. అని కొందరు పెద్దవాళ్లు విసుక్కోవటం నేను గమనించాను.

 చిన్నపిల్లల్ని పెంచటానికే ఓపిక లేనప్పుడు..ఏది తప్పో, ఏది ఒప్పో తెలిసి కూడా, ఎందరో పెద్దవాళ్ళు జీవహింస చేస్తూ, ఎన్నో పాపాలు చేస్తూ బతుకుతున్నారు. వీళ్లందరిని దైవము ఎందుకు భరించాలి? ఈ పెద్దవాళ్ళను ఏం చేయాలి.
.....................
 
చంటిపిల్లల్ని క్రెచ్లలో వేసి పెద్దవాళ్లు ఉద్యోగం కోసం వెళ్తున్నారు. పిల్లల కొరకు డబ్బు సంపాదించటం కోసమే అలా చేస్తున్నామంటున్నారు కొందరు. 
 
తల్లి వద్ద ఆప్యాయంగా పెరగవలసిన ....మాటలు కూడా సరిగ్గారాని చంటి పిల్లల్ని  పగలు ఎక్కడో బయట ఉంచుతున్నారు. అక్కడ వారిని మంచిగా చూస్తున్నారో ? లేదో? తెలియదు. చంటి పిల్లలు ఏమీ చెప్పలేరు. 
 
పిల్లల్ని కొట్టిన కొన్ని సంఘటనల గురించి వార్తల ద్వారా తెలిసింది. కనీసం పిల్లలకు బాగా మాటలు వచ్చి తమ గురించి చెప్పేవరకయినా వారిని తల్లి దగ్గరుండి చూసుకోవాలి. 
 
పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఉద్యోగం రాకుంటే, సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం చేస్తూ అయినా ఉపాధి పొందవచ్చు. 
 
పిల్లల క్షేమం ముఖ్యం కదా.
 
link... 

* ఆధునిక కాలం కన్నా ఆటవిక కాలం నయమేమో.. అనిపిస్తోం... 

 పసిపిల్లల్ని చక్కగా చూసుకుంటే దైవానికి పూజ చేసినట్లే.రెండవ భాగము..లింక్ క్రింద..

 * పసిపిల్లల్ని చక్కగా చూసుకుంటే దైవానికి పూజ చేసినట్..రెండవభాగం...


అనే విషయాన్ని అందరూ..

  

మరింత పెద్ద విపత్తు రాకుండా కాపాడినందుకు దైవానికి కృతజ్ఞతలు.

................................... 

    విజయవాడ ప్రకాశం బ్యారేజ్  కొంత ప్రమాదంలో ఉందంటున్నారు.  దైవం దయవల్ల వాన పడటం తగ్గింది.  బ్యారేజ్ కు  ఏమీకాదు.

.........................................
 ప్రపంచంలో చాలాచోట్ల పెద్ద ఎత్తున వరదలు, ఎండలు, అతివృష్టి, అనావృష్టి..వంటివి వస్తున్నాయి.  పర్యావరణాన్ని పాడుచేయటం వల్ల కూడా ఇలా జరుగుతాయి. ప్రకృతి కన్నెర్ర చేస్తే మనుషులు ఏం చేయలేరు.

 

మనుషులు అంతులేని కోరికలతో టెక్నాలజీ పేరుతో పర్యావరణాన్ని పాడుచేస్తే, కార్బండయాక్సైడ్ పెరగటం, ఓజోన్ పొర పలచబడటం, భూమి వేడెక్కటం, హుధుద్ తుపాన్ లాగ తుపాన్లు రావటం ..వంటివి ఎన్నో జరుగుతాయి.


గ్లోబల్ వార్మింగ్.. వంటి వాటివల్ల వాతావరణంలో ఎన్నో మార్పులు జరుగుతాయంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో సముద్రమట్టం పెరిగి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఊర్లు.. 

ఉదా..సముద్రపు ఒడ్డున ఉన్న వైజాగ్, ముంబై, చెన్నై..వంటి ఊర్లు  ప్రమాదంలో పడే  అవకాశాలున్నాయంటున్నారు.


 కొందరు పర్యావరణహిత శాస్త్రవేత్తలు ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా, చాలామంది  పట్టించుకోవటం లేదు. ప్లాస్టిక్ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ పడేయటం వల్ల అవి కాలువల్లో, చెరువుల్లో నీటికి అడ్డం పడిపోతున్నాయి. 

  డ్రైనేజ్ సిస్టం సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. వానలు పడితే ముంబయ్, చెన్నై, హైదరాబాద్ ..వంటి నగరాల్లో  కూడా  వరదలు వస్తున్నాయి.

  *****************
 కొండచరియల క్రింద , చెరువుల్లో,కాలువల్లో.... ఇళ్లు కడితే ప్రమాదాలు జరిగే అవకాశముంటుంది.

 అక్రమంగా కట్టిన ఇళ్లను కూల్చేస్తే మరల ప్రభుత్వాలను తిట్టిపోస్తారు. అక్రమంగా కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన ఉద్యోగస్తుల ఆస్తులను కూడా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవాలి. అవినీతిపనులు చేసే వారికి కఠినశిక్షలుండాలి.


 ప్రభుత్వం వారు, అధికారులు, ప్రజలు అందరు .. ఎవరి పని వారు సక్రమంగా నిర్వర్తిస్తేనే వ్యవస్థలు అన్నీ బాగుంటాయి. అంతేకానీ, ఎవరికి వారు తప్పులు చేస్తూ ఉంటే వ్యవస్థల పరిస్థితి తప్పులతడకలాగే ఉంటుంది.


 అవినీతితో వేలకోట్ల అక్రమ సంపాదన సంపాదించేవారు కొందరు, ఆఫీసుల్లో లంచాలు తీసుకుని, ఏ పనికైనా పర్మిషన్ ఇచ్చే వారు కొందరు, ఎన్నికల్లో వెయ్యి రూపాయలు.. ఒక మద్యం సీస..ఒక బిరియానిపాకెట్ తీసుకుని ఓట్లు వేసేవారు కొందరు. ప్రజలు చాలామంది ఇలా ఉన్నప్పుడు, వ్యవస్థ దానికి తగ్గట్లే ఉంటుంది.


 సమాజంలోని అందరూ ఎవరి పని వారు సక్రమంగా చేస్తేనే సమాజం సజావుగా నడుస్తుంది.

***********
 దైవానికి కూడా భయపడకుండా చాలామంది పాపాలు చేస్తున్నారు. ఎవ్వరైనా దైవం నుంచి తప్పించుకోలేరు..అనే  విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటే మంచిది.

 ************

 ఈ మధ్యకాలంలో చాలా ఊళ్ళలో వరదలు వస్తున్నాయి. ప్రభుత్వం ఒక్కటే అంతా చేయలేరు. ప్రజలు కూడా సమాజం పట్ల తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి.


 మా చిన్నతనంలో మా తాతగారి ఊర్లో వేసవికాలంలో చెరువు ఎండినప్పుడు, ప్రజలే కలసి పూడిక తీసేవారు. ఎండ తగ్గిన తరువాత సాయంకాలం పనిచేసేవారు. కొన్నిసార్లు వెన్నెలవెలుగులో కూడా పనిచేసేవారు.  అదంతా చాలా సందడిగా ఉండేది.

చెరువులను, కాలువలను ఆక్రమించి .. ఇప్పటికే ఎంతోకాలం నుంచి బోలెడు కట్టడాలు నిర్మించారు.

అవి  చెరువులు, కాలువలు ప్రవహించే ప్రాంతాలని కొందరికి తెలిసి కూడా కట్టడాలను నిర్మిస్తే,  కొందరు  తెలియక  కొన్నామంటారు.  తెలిసిచేసినా, తెలియకచేసినా దాని పర్యవసానాలు ఉంటాయి.

అయితే, ఇప్పుడు ఆ కట్టడాలను కూల్చాలంటే చాలామంది ఒప్పుకోకపోవచ్చు. ఇక,  ప్రభుత్వాలు ఏం చేయగలరు? మరీ అడ్దంకిగా ఉన్న వాటిని కూల్చక తప్పదు కానీ, అన్నింటిని పడగొట్టాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో?  చెప్పలేము.


 భవిష్యత్తులో అయినా కొత్తగా అక్రమకట్టడాలు కట్టకుండా ప్రభుత్వాలు కఠినచర్యలు తీసుకోవాలి. 

వరదలు వచ్చే ప్రాంతాలలో ఇళ్లను భూమికి బాగా ఎత్తుగా కడితే.. కొద్దిగా వరద వచ్చినప్పుడు నీరు ఇంట్లోకి రాకుండా ఉంటుంది.


బుడమేరు వరద రావటం వంటి సంఘటనలలో.. బుడమేరు వద్ద ఎత్తుగా గోడ కట్టడం వల్ల, వరద ఊరిమీదకు వచ్చే ప్రమాదం తగ్గవచ్చని నిపుణులు అంటున్నారట.

బుడమేరు నీరు సహజంగా కొల్లేరు సరస్సులో కలుస్తుందట. బుడమేరు కొల్లేరు  వరకు  సరిగ్గా వెళ్ళేలా  దారిలో అడ్డంకులను తొలగించాలి. కొందరు జనాలు కొల్లేరును కూడా కబ్జా చేస్తున్నారట.

 

గండ్లు పడి పెద్ద ఎత్తున వరదలు ఊర్ల మీద పడినప్పుడు.. ప్రాణనష్టం, వందలు లేక వేలు కోట్ల  ఆస్తినష్టం జరుగుతుంది..సహాయకార్యక్రమాలకు కూడా బోలెడు శ్రమ మరియు బోలెడు డబ్బు ఖర్చవుతుంది ..అలాంటప్పుడు, ఎక్కువ డబ్బు ఖర్చయితే.. అప్పు తెచ్చి అయినా ..  గోడవంటిది కట్టడం లేక వరద నీరు నిల్వ కొరకు చిన్న రిజర్వాయర్ కట్టడం.. వంటి  శాశ్వతపరిష్కారాలు చేయటం మంచిది.


వరదలు వచ్చే అవకాశమున్న ఊర్లలో.. అక్కడక్కడా ఎత్తైన భవనాలను నిర్మిస్తే వరదబాధితులకు పునరావాసకేంద్రాలుగా ఉపయోగించవచ్చు.

 
ప్రభుత్వాలు పడవలను, బల్లకట్టులను.. ఎక్కువసంఖ్యలో  కొనుగోలు చేసి ఉంచి, పడవలు నడిపే వారిని సిద్ధం చేసి ఉంచుకుంటే..ఎప్పుడైనా వరదలు వస్తే ప్రజలను త్వరగా రక్షించడానికి, ఇళ్లపైన ఉన్నవారికి ఆహారపొట్లాలను అందించడానికి పడవలు ఉపయోగపడతాయి. పడవల ద్వారా, మారుమూల ఉన్నవారికి కూడా త్వరగా సహాయాన్ని అందించవచ్చు.

**********
పడవలను ఉపయోగించటం మనకు కొత్తకాని, కేరళలో పడవలను ఎక్కువగా ఉపయోగిస్తారు.. అక్కడ రవాణాకు కూడా పడవలను ఉపయోగిస్తారు. మనకు కూడా పాతకాలంలో బకింగ్ హాం కాలువ ద్వారా ర
వాణావ్యవస్థ ఉండేదట.

*************

 ఎక్కువ నీళ్లు ఉన్నప్పుడు పడవలు ఉపయోగపడతాయి. నీరు తగ్గినతరువాత పడవలు ఉపయోగపడవు. విజయవాడలో నీరు ఎక్కువ ఉన్నప్పుడు పడవలను ఉపయోగించారు. నీరు తగ్గిన ప్రాంతాలలో వరదబాధితులను రక్షించడానికి ప్రభుత్వం వారు ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారు.  ఇది మంచి ఆలోచన.  ఇలాంటప్పుడు ట్రాక్టర్లు బాగా ఉపయోగపడతాయి.

***************

 విజయవాడ వరదల్లో ఎంతోశ్రమతో కష్టపడి పనిచేస్తున్న వారు, సాయాన్ని అందిస్తున్నవారు ఎంతో గొప్పవారు. అందరికి ధన్యవాదములు.  ఎక్కడైనా సరే, విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసిన అందరూ గొప్పవారే. అందరికి ధన్యవాదములు.

గోదావరి జిల్లాలు, విశాఖలో, ఉత్తరాంధ్రలో ..విపరీత వర్షాలు  త్వరగా  తగ్గుముఖం పడితే బాగుండు. ఎంతోశ్రమతో కష్టపడి పనిచేస్తున్న వారు, సాయాన్ని అందిస్తున్నవారు ఎంతో గొప్పవారు. అందరికి ధన్యవాదములు.  ఎక్కడైనా సరే, విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసిన అందరూ గొప్పవారే. అందరికి ధన్యవాదములు.


Sunday, August 18, 2024

ఏవి నిజాలో ?ఏవి ప్రక్షిప్తాలో? ... కొన్ని విషయములు..

ఇక్కడ పోస్టును వేరే వద్ద వేసి అక్కడ పోస్టును ఇక్కడ వేయటం జరిగిందండి.

 ....................................

 Friday, October 24, 2025
ఏవి నిజాలో ?ఏవి ప్రక్షిప్తాలో? ... కొన్ని విషయములు..

 ఈ మధ్య ఒక దగ్గర విన్న విషయం గురించి నాకు కొన్ని సందేహాలు కలిగాయి.

 శ్రీరాముల వారు మాంసాహారాన్ని తీసుకున్నారో? లేదో? అనే విషయాల గురించి గొడవలు జరుగుతున్నాయి.

కొందరు ఏమంటున్నారంటే, వనవాస సమయంలో రాములవారు మాంసాహారాన్ని తిన్నట్లు చెబుతున్నారు. సత్యాన్ని పలికే శ్రీరాములవారు తనతల్లి అయిన కౌసల్యాదేవికి చెప్పిన దానికి వ్యతిరేకంగా నియమాలను పాటించకుండా మాంసాహారాన్ని తిన్నారని ఎలా చెబుతారు? గ్రంధాలలో ఎన్నో ప్రక్షిప్తాలు ఉన్నాయి.

 ఈ మధ్యన ఒకరు ఏమన్నారంటే, శ్రీ ఆంజనేయుల వారు లంకకు వెళ్లినప్పుడు  సీతాదేవితో ..శ్రీ రాముల వారు సీతాదేవి మీద బెంగతో మధుమాంసాదులను కూడా తీసుకోవటం లేదని అన్నట్లు.. ఆ శ్లోకాన్ని చెప్పి, అంటే శ్రీరాముల వారు ఇంతకుముందు తింటేనే కదా.. ఇప్పుడు తినటం లేదని హనుమంతుల వారు చెపుతారు..అన్నారు.

ఈ విషయాలను గమనించిన తరువాత నాకు కొన్ని సందేహాలు కలిగాయి.

 అడవుల్లో ఊళ్ళలోలా రకరకాల ఆహారపదార్ధాలు లభించవు. అందువల్ల, అడవుల్లో ఏం తింటారోనని కొందరికి సందేహాలుంటాయి.  వనవాసానికి వెళ్లేముందు రాములవారు కౌసల్యాదేవితో, వనవాసంలో తాను కొన్ని నియమాలను పాటిస్తానని చెప్పారట.

 నారదుస్తులను ధరించి కొన్ని నియమాలతో వనవాసానికి వెళ్ళిన శ్రీరాముల వారు,  ఆహారం విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించారన్నట్లు  నాకు అర్ధమయింది.

మరి, సీతాదేవి పట్ల బెంగతో శ్రీరాములవారు మధుమాంసాలను తీసుకోవటం లేదని హనుమంతుల వారు సీతాదేవికి చెప్పారంటున్నారు..

 కొందరేమో వనవాస సమయంలో వారు ఆహార విషయంలో  కొన్ని నియమాలతో ఉన్నారంటారు. కొందరేమో మాంసాహారాన్ని తిన్నారంటారు..ఏం జరిగిందో దైవానికే తెలుస్తుంది.

ఏమిటో? అప్పుడు ఏం జరిగిందో? గ్రంధాలలో  ఏవి నిజాలో ? ఏవి ప్రక్షిప్తాలో?  

..........

 నాకు ఏమనిపిస్తోందంటే, సంస్కృతంలో  అనేక అర్ధాలుంటాయి...ఒక్క అక్షరాన్ని కలిపి లేక విడదీసి చదివినా అర్ధాలు మారిపోయే అవకాశముంది. అందువల్ల ఆ శ్లోకాన్ని సరిగ్గా ఎలా అర్ధం చేసుకోవాలో మనకు తెలియకపోవచ్చు.

మధు(మధువు) అంటే అనేక అర్ధాలుంటాయి. మాంసం.. అన్నా కూడా అనేక అర్ధాలుంటాయి.

మాంసం అనే పదానికి బలాన్ని కలిగించే ఆహారం అని కూడా అర్ధం ఉండవచ్చు...పండ్ల రసాలను కూడా మధు.. అని అంటారు కావచ్చు..

వనాల్లో సంవత్సరాల తరబడి ఉన్నప్పుడు సీతాపహరణానికి ముందు,  బలమైన ఆహారం కొరకు కొన్ని పంటలను కూడా వారు పండించుకుని ఉండవచ్చు.

 ఉదా..కొన్ని పప్పుధాన్యాలు పండించుకున్నారేమో? మినుములు(మాష)వంటివి.. కూడా మాంసాహారంతో సమానమైన బలమైన ఆహారమని అంటారు.

 నానబెట్టిన పప్పుధాన్యాలు లేక ఉడికించిన గుగ్గిళ్ళు వంటివి..వారు తీసుకున్నారేమో.. 

పండ్ల గుజ్జును కూడా మాంసం అని అంటారని కొందరు అంటున్నారు. 
........................

నాకు ఏమనిపిస్తోందంటే... అపహరణ తరువాత  సీతాదేవి పట్ల బెంగతో రాముల వారు తన ఆహారం పట్ల  శ్రద్ధ వహించలేదని ...

పువ్వులు, పండ్ల నుంచి లభించే తీపి పదార్ధాన్ని.. పండ్ల రసాలను(మధు..), బలాన్ని కలిగించే మినుముల(మాష) వంటి పప్పుధాన్యాలను  భుజించటం పట్ల,  
పండ్ల గుజ్జును(మాష)  భుజించటం పట్ల కూడా  ...శ్రద్ధ వహించలేదని అర్ధం చేసుకోవచ్చని నాకు అనిపిస్తుంది.


రామాయణం జరిగిన త్రేతా యుగంలో, మనుషులు జీవించే కాలమూ ఇప్పటితో పోలిస్తే చాలా ఎక్కువేనంటారు. అప్పటి కాలంలో వారి ఆకారాలు ఇప్పటివారితో పోలిస్తే భారీగా ఉండేవారంటారు. అప్పట్లో మొక్కలు, చెట్లు కూడా ఆకారాలు భారీగా ఉండేవి కావచ్చు.

 అప్పట్లో ఇప్పటిలా తేనెటీగల నుంచి నుంచి తేనె సేకరించటం కాకుండా, భారీ పరిమాణంలో తేనె వంటి తీపి పదార్ధం పువ్వులు, పండ్ల నుంచి తేలికగా లభించేది కావచ్చు.  

 వేల సంవత్సరాల క్రిందట విషయాలను గ్రంధాలలో చదివిన వాటిని కొన్నిసార్లు మనం సరిగ్గా తెలుసుకోలేకపోవచ్చు.

ఏది ఎలా జరిగిందో.. దైవానికి సరిగ్గా తెలుస్తుంది.
............................

 నాకు సంస్కృతం తెలియదు. నేర్చుకోవాలనే  ఆసక్తి కూడా  ప్రస్తుతం లేదు.  నాకు తోచింది రాయాలనిపించి వ్రాసాను.  అయితే, ఈ విషయాల గురించి నాకు సరిగ్గా అర్ధం కాలేదు. సందేహాలున్నాయి.
..........

అయినా, రాములవారు మాంసాహారాన్ని భుజించారని చెప్పటానికి కొందరు ఎందుకు పదేపదే ప్రయత్నిస్తున్నారో? అర్ధం కావటం లేదు.  

ఇంతవరకు మాంసాహారం తిన్నారని చెప్పారు. ఇప్పుడు మధు.. కూడా స్వీకరించారని అంటున్నారు.  మధు ..అంటే మత్తెక్కించే సారా వంటిదని కొందరు భావించే ప్రమాదం కూడా ఉంది.

...................... 

సత్యము కొరకు రాజ్యపట్టాభిషేకాన్ని తృణప్రాయంగా వదిలి వనవాసానికి  వెళ్ళిన గొప్ప వ్యక్తి శ్రీ రాములవారు.
 ..................

 ప్రాచీనకాలంలో రాక్షసుడు వేదాలను అపహరించితే, శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుని సంహరించి వేదాలను రక్షించారని గ్రంధముల ద్వారా తెలుస్తోంది.

 వేదాలనే అపహరించగలిగినప్పుడు, ఎవరైనా గ్రంధాలలో మార్పులుచేర్పులు(ప్రక్షిప్తాలు)చేసారనే విషయంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
  ..............

  గ్రంధాలలో 
ఎన్నో అర్ధం కాని విషయాలుంటాయి.  ప్రక్షిప్తాలు కూడా ఉంటాయి.

ఇవన్నీ  అదేపనిగా ఆలోచిస్తూ, వాదిస్తూ సమయాన్ని గడపటం కన్నా, ఇవన్నీ విని గందరగోళం పడటం కన్నా..కొంతవరకు తెలుసుకుని..అన్నింటికి మూలమైన దైవాన్ని నమ్ముకుని మన శక్తికొలది చక్కగా దైవాన్ని ఆరాధించుకోవటం మంచిది.

****************
వ్రాసిన వాటిల్లో తప్పులు ఉంటే దయచేసి క్షమించమని  దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 ..............

క్రింద ఒకరు ఒక వ్యాఖ్య వ్రాసారు. పొరపాటున ఆ వ్యాఖ్య డిలిట్ అయ్యింది. వారి కొరకు ఈ లింక్ ఇస్తున్నాను.

 మాంసాహారం గురించి కొంత వివరంగా ఇంతకుముందు పోస్టులో వ్రాసాను.  ఒక లింక్ ఇస్తాను..మీకు ఆసక్తి ఉంటే మరికొన్ని విషయాలను చదవచ్చు.

LINK..... .....
పాలు, తేనె వంటివి శాకాహారం ఎలా అవుతాయి?..హింస..అహి...



Wednesday, August 14, 2024

ప్రపంచంలో మతాల పేరిట, అధికారం పేరిట, సంపదల...



 ప్రపంచంలో మతాల పేరిట, అధికారం పేరిట, సంపదల గురించి ఎన్నో పోరాటాలు, రక్తపాతాలు జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇదంతా ఎంతో బాధాకరమైన విషయం. దైవం అంటేనే శాంతి. అలాంటి దైవం పేరిట రక్తపాతాలు, మారణహోమాలు జరగటం ఏమిటో అర్ధంకాదు.

 మతాల పేరుతో క్రూరంగా ప్రవర్తిసున్నవారు దైవం వద్ద తప్పక శిక్షను పొందుతారు.


అధికారం, సంపద కొరకు మతాలను
కూడా  స్వార్ధపూరితంగా వాడుకుంటారనిపిస్తుంది.  ఇలాంటివారు   సామాన్యప్రజలకు మాయమాటలు చెప్పి నమ్మిస్తారు. వాళ్ళ మాటలు నమ్మిన జనాలు ...వారు ఏం చెపితే అది చేస్తారు. ఇది బాధాకరం.  ప్రజలు విచక్షణతో ఆలోచించాలి. 

అభద్రత భావం, తమ మాటే నెగ్గాలనే పట్టుదల ..వంటి లక్షణాల వల్ల ..కుటుంబాలలో కానీ, సమాజంలో కానీ గొడవలు వస్తుంటాయి. 

 పాతకాలంలో యుద్ధాలలో కూడా కొన్ని నియమాలు ఉండేవి. యుద్ధంలో స్త్రీలకు, పిల్లలకు, అమాయకులైన వారికి హాని చేయకూడదని నియమాలతో భారత దేశంలో  యుద్ధాలు చేసేవారు. అక్కడక్కడా కొన్ని నేరాలు జరిగినా కూడా,  ఎక్కువ హింస ఉండేదికాదు. విదేశీ దాడులలో మాత్రం  పెద్ద ఎత్తున దాడులు జరిగాయి.


గతకొంతకాలంగా ప్రపంచంలో జరుగుతున్న 
హింస  చాలా బాధగా ఉంది.   పిల్లలు, స్త్రీల పట్ల,  మగవారి పట్ల  .. దారుణాలు  చేయటం ఏమిటో?     వాళ్లు మనుషులేనా? అనిపిస్తుంది. అలాంటి వాళ్లను ఏం చేసినా పాపం ఉండదు. అలాంటి దారుణాలు చేసిన  వారికి  దైవం సరైన బుద్ధి తప్పక చెబుతారు.

 సనాతనధర్మం, హిందువులు బాగుండాలని  కోరుకుంటున్నాను.

  ఏ దేశానికి చెందినవాళ్ళైనా, ఏ మతానికి చెందిన వాళైనా అమాయకులు, మంచివాళ్ళు  బాగుండాలని కోరుకుంటున్నాను.  ఏ దేశానికి చెందినవాళ్ళైనా, ఏ మతానికి చెందిన వాళ్ళైనా  వారి చెడ్డతనం  ...నాశనం అవ్వాలని కోరుకుంటున్నాను.   (వారి చెడ్డతనం పోని పరిస్థితిలో ఆ చెడ్డవాళ్లు నాశనం అవ్వాలని కోరుకుంటున్నాను.)


లోకకల్యాణం కొరకు పాతకాలంలో యజ్ఞయాగాదులు చేసేవారు. ఈ రోజుల్లో 
చాలావరకు   కల్తి వస్తువులు ఉన్నాకూడా, వాటితోనే యజ్ఞయాగాదులు చేస్తే ఎంతోకొంత ఫలితం తప్పక ఉంటుంది.


 ప్రపంచంలో శాంతి నెలకొనాలని , అంతా బాగుండాలని అందరూ మనస్పూర్తిగా దృఢంగా దైవాన్ని ప్రార్ధించాలి. 
దైవాన్ని, దైవనామాన్ని అందరూ స్మరించుకోవాలి.

  ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా,  నీతినియమాలను పాటించనివారిని మనం ఏం చేయగలం?   వారి సంగతి దైవం చూసుకుంటారు.

 కొందరైనా నీతినియమాలతో దైవభక్తి కలిగి.. ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ ..దైవాన్ని ప్రార్ధిస్తే.. ఆ ఫలితం వల్ల దైవకృప కలిగి.. సమాజంలో శాంతి నెలకొనే అవకాశముంది.


ఆధునికకాలంలో చాలామందిలో అత్యాశ,  పాపాలు చేసి  అయినా డబ్బు సంపాదించాలనే తత్వం పెరిగాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు. డబ్బు, అధికారం..కొరకు ఎన్నో పాపాలు చేస్తున్నారు. సామాన్యజనం కూడా తమ వంతు పాపాలు చేస్తున్నారు. వీటి ఫలితాలే ప్రస్తుతం ప్రపంచం అనుభవిస్తోంది.

 

సోషల్మీడియాలో హింసాత్మక దృశ్యాలు, చెడ్ద విషయాలు వల్లకూడా చాలామంది ప్రభావితులవుతున్నారు. 

ఎవరైనా ఘోరమైన నేరాలు చేస్తే వారిని కఠినంగా   శిక్షించేలా చట్టాలు ఉండాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే,  ఎవరైనా నేరాలు చేయాలంటే ..భయంతో వణికిపోయేలా ఉండాలి.    హింసతో కూడిన ప్రసారాలకు, సమాజానికి హాని కలిగించే వ్యవహారాలకు.. ప్రభుత్వాలు సమర్ధవంతంగా అడ్డుకట్ట వేయాలి.   ప్రభుత్వాలు ఎప్పుడు ఇవన్నీ చేస్తాయో అర్ధం కావటం లేదు.

 

 ఎవరైనా మనకు ఆపద కలిగించాలని చూస్తే, భయపడి కూర్చోము కదా..మన రక్షణ కొరకు ఎంతకైనా పోరాడుతాము.  ఎవ్వరైనా తమకు ఆపదలు సంభవించినప్పుడు అధైర్యపడకుండా, దైవాన్ని నమ్మి ఆ ఆపదల నుంచి రక్షించుకోవాలి. శత్రువులను ఎదుర్కుని గెలవాలి.
 


ఆ మధ్య ఒక పేరుపొందిన జ్యోతిష్కుడు (ఒక అబ్బాయి) చెప్పినదాన్ని బట్టి ఆధునిక కాలంలో జీవ హింస చేయటం బాగా పెరిగింది. పశుపక్ష్యాదులను చంపి తినటం విపరీతంగా పెరిగింది. అలా చనిపోయిన జీవుల ఉసురు తగిలి కూడా ప్రపంచంలో కష్టాలు వస్తున్నాయని వారు తెలియజేసారు. 

 మనుషులకు జరుగుతున్న హింస పట్ల మనకు ఇంత బాధ ఉన్నప్పుడు, జంతువుల పట్ల మనం చేస్తున్న హింస గురించి కూడా మనము ఆలోచించాలి.


కారణాలేమైనా కూడా, ప్రపంచంలో జరుగుతున్న 
ఘోరాలు వింటుంటే,  చూస్తుంటే ..భరించలేని బాధగా ఉంది. రాక్షసమూక పట్ల సౌమ్యత, సహనం పనికిరాదు. ఎలాగైనా ఈ ఘోరాలు ఆగాలి.   ఇక దైవమే దిక్కు. 


అయితే, అంతా దైవం మీదే భారం వేసి కూర్చోవటం కాకుండా, దారుణాలు ఆగడానికి అందరూ తమవంతు ప్రయత్నం చేయాలి. 

అంతా దైవం దయ .

**************

 ప్రపంచంలో ఎన్నో మతాలు, ఎందరో భక్తులు, ఎన్నో పూజలు జరుగుతున్నాయి.ఎన్నో శుభాలు జరుగుతున్నాయి... యుద్ధాలు, గొడవలు, నేరాలు, ఘోరాలు, ప్రమాదాలు, అన్యాయాలు..కూడా జరిగాయి.

 ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో శుభాలు జరిగాయి. అశుభాలు కూడా జరిగాయి. యుద్ధాలు, రక్తపాతాలు జరిగినప్పుడు అమాయకులైన పిల్లలు, మంచివారైన పెద్దవాళ్లు కష్టాలు పడుతున్నప్పుడు ఎంతో బాధనిపిస్తుంది. దైవం చెడ్దవారిని శిక్షించి, ఆ దారుణాలను ఆపితే బాగుంటుంది కదా ..అనిపిస్తుంది. 

పురాణేతిహాసాలలో దైవం.. రాక్షసులను చంపివేసి లోకాన్ని రక్షించిన సంఘటనలు గురించి మనం తెలుసుకోవచ్చు.


 అయితే, ఏది ఎందుకు జరుగుతుందో చాలాసార్లు అర్ధం కాదు. మహాభారతంలో శ్రీకృష్ణులవారు..తమ గురువుయొక్క మరణించిన పుత్రులను తీసుకువచ్చి ఇచ్చారు. కానీ, యుద్ధంలో అభిమన్యుని రక్షించలేదు. లోకంలో కూడా చాలా విషయాలు మనకు అర్ధం కావు.  

  మనలో చాలామంది జీవితంలో...దైవం ఉన్నారని చక్కగా అనుభవంలోకి వచ్చిన సంఘటనలు ఉంటాయి.  దైవాన్ని నమ్మి.. ధర్మబద్ధంగా జీవించాలి.

దైవం మహాశక్తి....


 

సృష్టిలో దైవం మహాశక్తి. ఒక్క దైవశక్తే ప్రపంచంలో అందరినీ సృష్టిస్తారు. అంతేకానీ, ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క దైవం సృష్టించరు. విశాలమైన భూప్రపంచంలో  వివిధ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, అనేక మతాలు పద్ధతులు ఏర్పడ్డాయి. ఎవరి పద్ధతిలో వారు దైవాన్ని ఆరాధిస్తున్నారు. 

అయితే, ఎవరైనా పాటించే పద్ధతులు ఇతరులకు హానికలిగించే విధంగా ఉండకూడదు.

 భగవంతుని పేరుతో కూడా కొందరు ఇతరులను బాధించడానికి ప్రయత్నిస్తారు. అలా చేయటం చాలా తప్పు.  జీవితంలో కష్టాలు పోవాలని దైవాన్ని ప్రార్ధిస్తాము. అలాంటప్పుడు  దయామయులైన దైవం పేరు చెప్పి  క్రూరమైన పనులు చేయటం ఏమిటి?

***************
సనాతనధర్మం మతం కాదంటారు కొందరు. సనాతనధర్మము ఆదర్శవంతమైన  గొప్ప విధానము.

మన ప్రాచీనులు ..లోకాఃసమస్తాః సుఖినో భవంతు..అని తెలియజేసారు. ఆ విధంగా ప్రపంచంలోని అందరూ బాగుండాలని కోరుకుంటాము. 

పరమతసహనం, సహనం..వంటి లక్షణాలు కలిగిఉండాలని మన పెద్దలు మనకు నేర్పించారు. పెద్దవాళ్ళు సహనాన్ని గురించి గొప్పగా నేర్పించినప్పుడు ప్రజలు సౌమ్యంగా తయారవుతారు.


సహనము, పరమతసహనం..వంటిలక్షణాలు కలిగిఉండాలని  పెద్దలు చెప్పటంలో తప్పులేదు. వాళ్లు అలాగే చెప్పాలి కూడా. అలాకాకుండా ఒకరినొకరు చంపుకోమని చెబితే అందరూ ఒకరినొకరు చంపుకుంటారు. అప్పుడు అందరూ బాధలు పడవలసి వస్తుంది. 

 అయితే,  ఎవరైనా  పరమత సహనం లేకుండా ప్రవర్తిస్తునప్పుడు మాత్రం అందుగుతగ్గ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

*********** *********

అన్ని మతాలవారు చక్కగా జీవించవచ్చు. అయితే,  ఎవరైనా  హిందు మతాన్ని లేకుండా చేయాలని.. మతమార్పిడులకొరకు నయానాభయానా ప్రయత్నిస్తున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి. 

  ఎవరైనా మనపట్ల దాడులు చేస్తే మనం శాంతి అంటూ చేతులు ముడుచుకుని కూర్చోము కదా ..మన రక్షణ కొరకు ఎంతకైనా పోరాడుతాము. 

 లోకంలోని అమాయకులు, మంచివారికొరకు..

లోకాఃసమస్తాః సుఖినో భవంతు ..అనుకోవాలి కానీ, 

చెడ్డవారి కొరకు కాదు.

అందరూ మంచి బుద్ధితో ఉండాలని కోరుకోవాలి. మంచి బుద్ధి ఉంటే మంచి ఉంటుంది.

........................

పరమతసహనం, సహనం..వంటి లక్షణాలు మంచివే. అయితే, ఇతరులు పరమత సహనం లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు, మనల్ని మనం కాపాడుకోవటం తప్పనిసరి పరిస్థితి అవుతుంది. అలాంటప్పుడు సహనం..అని నింపాదిగా కూర్చుంటే ఏం జరుగుతుందో చెప్పలేం.

 మనల్ని రక్షించుకోవటానికి  తెలివిగా ఏదో ఒకటి చేయాలి. దైవాన్ని ప్రార్ధిస్తూ మన వంతు ప్రయత్నం మనం తప్పక చేయాలి.

******************
హిందువులకు పరమత సహనం ఎక్కువ. రామకృష్ణమఠంలో అన్ని మతాలవారికి ప్రవేశం ఉంది. ఒక యోగి ఆత్మ కధ పుస్తకంలో ఇతరమతముల ప్రస్తావన ఉంది. 

************

నా ఫ్రెండ్ ఒకామె నాకు శ్రీపాదశ్రీవల్లభసంపూర్ణ చరితామృతము గ్రంధాన్ని ఇవ్వటం జరిగింది.ఆ విధంగా నాకు శ్రీ దత్తాత్రేయ అవతారమైన శ్రీపాదుల వారి గురించి తెలిసింది. మేము కురువపురం కూడా వెళ్లి దర్శించుకున్నాము. ఆ గ్రంధంలో శాయి గురించి కొన్ని విషయములున్నాయి. ఈ విషయాల అంతరార్ధం ఏమిటో.. ఆ విషయాల గురించి దైవానికే తెలుస్తుంది.
 ***************

 కొన్ని సంవత్సరాల క్రితం వరకు షిరిడిసాయిబాబా గురించి చాలామందికి తెలియదు. కొందరు శిరిడిసాయిబాబా గురించి సినిమాలు తీయటం జరిగింది. ఆ సినిమాలో కొందరు బ్రాహ్మణులు కూడా పాత్రధారులుగా నటించారు, పాటలు వ్రాసారు, పాడారు. ఆ పాటలు ఎలా ఉన్నాయో చాలామందికి తెలుసు. ఆ సినిమాల ద్వారా ఎందరో ప్రభావితులయ్యారు.  కొందరు పండితులు కూడా సాయిబాబా పూజల గురించి గొప్పగా ప్రచారం చేసారు, గ్రంధాలు కూడా వ్రాసారు.

 

సమాజంలో గొప్ప పేరు ఉన్నవారు చెబుతున్న విషయాలను సామాన్యప్రజలు నమ్ముతారు. వారు చెప్పిన విషయాలను పాటిస్తారు. సమాజంలో ఆధ్యాత్మిక విషయాలలో దిశానిర్దేశం చేసే బ్రాహ్మణులు చెప్పే విషయాలను చాలామంది నమ్ముతారు. శిరిడి లోని కొందరు బ్రాహ్మణులు కూడా సాయిని అనుసరించారు.

  క్రమంగా సాయి పూజలు పెరిగేసరికి..కొన్ని సందేహాలు కలిగి, సాయిబాబా పూజలు ఎందుకు చేస్తున్నారంటూ.....ఇప్పుడు సామాన్యప్రజలను తప్పు పడుతున్నారు. 


కొంతకాలం క్రిందట సాయిబాబాను గురించి గొప్పగా చెప్పి సమాజంలో వ్యాపింపచేసినది హిందువులే. సామాన్యజనం ఆకర్షించబడి సాయిపూజలు ఎక్కువయ్యేసరికి, ఇప్పుడేమో సాయికి పూజలు చేయవద్దని చెప్తున్నవారు కూడా హిందువులే.
**************

సాయిబాబా షిరిడి వచ్చి ,  తన పాటికి తాను ఉండగా, హిందువులే ఆయన వద్దకెళ్లి సలహాలను అడిగితే, వారు తనకు తోచినవిషయాలను తాను చెప్పి ఉంటారు. సాయిని తప్పుపట్టటం ఎందుకు? 

జనాలు  షిరిడి సాయి వెంట  పడితే, ఆయన తన అభిప్రాయాలను  చెప్పి ఉండవచ్చు. 

     సాయిబాబా హిందుదేవతలతో పాటు ఇతరమతాల దేవతలను కూడా స్మరించేవారు కాబట్టి,  భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందోనని భయంతో కొందరు హిందువులు .. షిర్డిసాయిని పూజించవద్దని అంటుండవచ్చు.  

udaa.. ఆ మధ్య ఒక వీడియోలో... కొందరు సాయి భక్తులైన వాళ్లు,  అల్లా ..అంటూ పాటలు పాడుతున్నారు. అలా భవిష్యత్తులో వాళ్లు వేరే మతంలోకి వెళ్తారేమోనని సందేహాలు కలుగుతున్నాయేమో? 

 ఇలాంటి పరిస్థితిలో  దైవమే దారి చూపాలి.

************** 

    నాకు ఏమనిపిస్తుందంటే, హిందువులలో ఉన్న కొన్నివిధానాలను చాలామంది హిందువులు పాటించలేకపోతున్నారు.   అనేక ఆచారవ్యవహారాలను పాటించే ఓపిక కలికాలంలో చాలామందికి లేదు. 

   షిర్డిసాయిబాబా  చెప్పిన విధానాలు తేలికగా ఉంటాయి. .. .అందువల్ల కూడా అనేకమంది సాయి విధానాల పట్ల ఆకర్షితులు అయి ఉండవచ్చు.  

 విధానాలు సులభంగా ఉంటే,  ఆధునిక కాలంలో ప్రజలు త్వరగా ఆకర్షితులవుతారు. 

**************

ఇంకా, ఇంకొక విషయం ఏమిటంటే.. హిందువులకు బోలెడుమంది దేవతలుండగా,   బోలెడు పండుగలు ఉండగా చాలనట్లు ఇంకా,  ఇతర మతాల వారి పండుగలు కూడా ఎందుకు చేస్తారో? ఏమిటో? అందరూ ఆలోచించవలసి ఉంది.

 *************

ప్రతిదానికి మీరు ఇలా చేయకూడదు..ఇలానే చేయాలి..లేకపోతే కష్టాలు మీద పడిపోతాయంటూ చెబుతుంటే, ఈ కలికాలంలో అవన్నీ పాటించటం అందరికి కుదరకపోవచ్చు.  తేలికగా ఆచరించే విధానాలు ఎవరైనా చెబితే అటు వెళ్ళటానికి ఇష్టపడతారు.

  
దైవం అందరికీ అవసరమే. దైవం అంటే భయంతో కాకుండా, జీవితంలో కష్టసుఖాలను దైవంతో చనువుగా, ప్రశాంతంగా, అరమరికలు లేకుండా పంచుకోవాలని ఉంటుంది. అయితే  పూజలు అంటే.. చాలా జాగ్రత్తగా ఉండాలి......అనుకునేవిధంగా పరిస్థితి ఉంది.


 ప్రశాంతంగా దైవపూజ చేయాలన్నా, అక్కడా అనేక ఆంక్షలు. అది అలా చేయకూడదు, ఇది ఇలాగే చేయాలంటూ చెబుతారు.  జీవితంలో నియమాలు ఎంతో అవసరం. అయితే,  ఆ నియమాలు తట్టుకోలేంత ఉంటే మాత్రం పాటించటం కష్టమవుతుంది.
అవన్నీ పాటించలేక  వదిలేయాలనిపిస్తుంది.

ఇవన్నీ పాటించలేక నాకు చాలాసార్లు ఏమనిపిస్తుందంటే,  మతంతో  సంబంధం లేకుండా నాకు తోచినట్లు దైవాన్ని పూజించుకుంటే ఎంత బాగుంటుంది.. అనిపిస్తుంది. పండుగ అంటే..దైవాన్ని స్మరించుకోవటం కన్నా, తప్పులు జరగకుండా  పనులు ఎలా జరుగుతాయో? అని టెన్షన్ ఎక్కువగా ఉండేది.

  ఇప్పుడు అతిని చాలావరకూ తగ్గించుకుని, నాకు తోచినంతలో ప్రశాంతంగా దైవాన్ని ఆరాధించుకోవటానికి ప్రయత్నిస్తున్నాను.

*************

అనేక విషయాలను పాటించే ఆసక్తి ఉన్నవారు పాటించవచ్చు. అయితే, అందరూ పాటించలేకపోవచ్చు. ఎవరి పరిస్థితి వారిది.

 పాతకాలంలో ఇన్నిరకాల విషయాలు అందరూ పాటించేవారు కాదు.    కొన్ని విషయాలలో వారి వంశాచారం ప్రకారం ..వారి పెద్దవారిని అడిగి పాటించేవారు.   

 కొందరు.. కోరికలు, కష్టాలు.. తీరాలంటే ఇలా చేయండి..అంటూ అనేక పద్ధతులను చెబుతారు.  సోషల్ మీడియాలో ఉండాలంటే..  ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి,   కొందరు ఎప్పుడూ ఏదో ఒకటి   చెబుతున్నారు. వీటివల్ల  కూడా  హిందువులు మరింత అయోమయంలో ఉంటున్నారు.   ఇవన్నీ ఎప్పుడు పరిష్కారమవుతాయో?

******************

హిందువులలోనే కొందరు, మా దేవత గొప్ప అంటే.. మా దేవతే గొప్ప అంటూ.. గొడవలు పడ్డారు. గొడవలు పడే హిందువులవల్ల హిందుమతానికి నష్టం జరిగింది. అలాంటివారు హిందువుల బాగోగుల గురించి పాటుపడుతున్నామనటం విచిత్రం.

 
హిందువులు  అభివృద్ధి చెందాలంటే, కొన్ని విషయాలను  సరిదిద్దుకోవాలి. హిందువులలో ఐక్యత ఉండాలి.   వైష్ణవులు, శైవులు, శాక్తేయులు..అంటూ  గొడవలు పడకూడదు.   

 అంటరానితనం..వంటివి కూడా ఉండకూడదు. మూఢనమ్మకాలను వదిలేయాలి. ఆచారవ్యవహారాలను విచక్షణతో ధర్మబద్ధంగా పాటించవచ్చు.

  ఒకే హిందూ మతంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి.   ఆచారవ్యవహారాల విషయంలోను అభిప్రాయభేదాలుంటున్నాయి. వీటివల్ల సామాన్య భక్తులలో అయోమయం నెలకొంటుంది. వ్యవస్థ క్లిష్టంగా కాకుండా, సరళంగా ఉంటే బాగుంటుంది.

 ***********

 భారతీయులలో ఐకమత్యం లేకపోవటం వల్ల, భారతీయుల అతి సహనశీలత వల్ల విదేశీయులు ఇక్కడకొచ్చి ఈ దేశాన్ని అనేకసంవత్సరాలు పాలించారు. ఇప్పటికీ భారతీయులలో ఐకమత్యం అంతగా లేదు. విదేశీమతాలవాళ్ళు ఇక్కడకొచ్చి ఇక్కడి వారిని మతాలమార్పిడి చేస్తున్నా కూడా  పట్టించుకోవటం లేదు. పరిస్థితి ఏమవుతుందో ? 

 మన బలహీనతలను మనం సరిదిద్దుకోకుండా.. అంతా అవతలవారివల్లే అనుకోవటం కన్నా,  తమ బలహీనతలను సరిదిద్దుకుంటే బలవంతులవుతారు. తాము బలవంతులయితే శత్రువులను తేలికగా జయించగలరు.

 ************

పరమతసహనం కొందరికి ఉంటే సరిపోదు..అందరికీ ఉండాలి. మతాల పేరుతో జరుగుతున్న దారుణాలను గమనిస్తే అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలుస్తుంది. మనుషులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో? ఈ సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయో? దైవానికే తెలియాలి.

***********

వేదములు, పురాణేతిహాసాలు ..ఎంతో గొప్పవి. వేదాలు, పురాణేతిహాసాల ద్వారా ఎన్నోవిషయాలను తెలుసుకోవచ్చు.  

 పురాణేతిహాసాల ద్వారా..జీవితంలో ఎలా ప్రవర్తించితే ఎలాంటి ఫలితాలుంటాయి. ఏది ధర్మం.. ఏది అధర్మం.. ఎలా ప్రవర్తించాలి.. ఎలా ప్రవర్తించకూడదు.. ఎలా ప్రవర్తిస్తే ఎలాంటి ఫలితాలుంటాయి..వంటి విషయాలను కూడా పురాణేతిహాసాలలోని పాత్రల ద్వారా ప్రాచీనులు మనకు తెలియజేసారని నా అభిప్రాయము. 

 ఒక్కో యుగంలో దైవం అవతారాలను ధరించినప్పుడు, ఆ అవతారాలను పూజిస్తారు.  హిందువులు, తరతరాలనుంచి ఎందరినో  దేవతలుగా పూజిస్తున్నారు.

  హిందువులకు చాలామందిదేవతలు ఉన్నా కూడా, కొత్తవాళ్ళను ఎందుకు పూజిస్తున్నారంటూ కొందరు మాట్లాడుతున్నారు. అయితే, క్రొత్త దేవతలను ఆరాధించటం హిందువులకు క్రొత్తకాదు.

   ప్రాచీనగ్రంధాలలో లేని దేవతలు ఎందరినో ఇప్పుడు దేవతా అవతారాలుగా పూజిస్తున్నారు. ఉదా.. కొందరు గొప్పవారు మానవులుగా జీవించినప్పుడు గొప్పమహిమలు కలిగి ఉంటారు. అలాంటి కొందరి శరీరత్యాగం తరువాత, వారిని కూడా దేవతలుగా గుడికట్టించి పూజిస్తున్నారు. వారి పూజా విధానాలు ఏర్పరుస్తారు.


మహిమలు గలవారు గొప్పవారే.. దేవతలవంటివారే. వారిని గౌరవించవలసిందే. అయితే, ఇలా  హిందువులకు మరింత ఎక్కువమంది దేవతలు పెరుగుతారు. భవిష్యత్తులో ఇంకా ఎందరిని దేవతాస్వరూపాలుగా

పూజిస్తారో
.. చెప్పలేము.


 అనేకమంది దేవతలు ఉన్నా కూడా, అవధూతలను, ఇంకా చాలామందిని పూజిస్తుంటారు. అవధూతలు వంటివారు గొప్పవారే. అలాగని అవధూతలు ఎవరైనా పరమపదించితే వారి విగ్రహాలను తయారుచేసి దేవతలుగా పూజలు మొదలుపెడితే .. బోలెడు పూజలు, బోలెడు ఆచారవ్యవహారాలు అవుతాయి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.

 దైవం సృష్టి అంతటా ఉంటారు. అలాగని ప్రతి జీవినీ దైవంగా భావించి విగ్రహాలు చేసి, గుడులు కట్టి పూజించలేరు కదా.. దైవాన్ని ఒకమహాశక్తిగా భావించి చక్కగా ఆరాధించుకోవచ్చు. 

ఏ దేవతను పూజించినా.. ఉదా..అమ్మవారిని పూజించినా..శివుణ్ని పూజించినా.. విష్ణువును పూజించినా.. ఒకే దైవశక్తిగా భావించి పూజించవచ్చు.  

అందరు దేవతలలో ఒకే దైవశక్తిని భావించి పూజించవచ్చు. ఒకే దైవంలో అందరు దేవతలను భావించి పూజించవచ్చు.

 శ్రీరాముడు హనుమంతుని మధ్య గల ఆప్యాయత అందరికి తెలిసిందే. హనుమంతుడు శివుని అంశ కలవారు. శిశువును కంసుడు చంపడానికి పైకి విసిరేయగా, ఆ శిశువు యోగమాయగా ప్రత్యక్షమయ్యి.. కొన్ని విషయాలను పలికి అదృశ్యమవుతారు. అమ్మవారు(యోగమాయ).. శివుడు.. విష్ణువు..వీరందరూ ఒకటే. వీరు వేరువేరు ..అని మనుషులు గొడవలు పడకూడదు.

హిందువులు ఇంకాఇంకా ..కొత్త  పూజావిధానాలను  పెంచుకుంటూ వెళ్తే, భవిష్యత్తులో భక్తుల మధ్య గొడవలు వచ్చి, వివిధ శాఖలుగా చీలే అవకాశమూ ఉంది. ఇప్పటికే హిందువులు బౌద్ధులు, జైనులు..ఇంకా కొన్ని శాఖలుగా అయ్యారు.

ఇప్పటికే ఒకే మతంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. పూజా విధానాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆచారవ్యవహారాల విషయంలోను   అభిప్రాయభేదాలుంటున్నాయి. వీటివల్ల సామాన్య భక్తులలో అయోమయం నెలకొంటుంది. వ్యవస్థ క్లిష్టంగా కాకుండా, సరళంగా ఉంటే బాగుంటుంది.

 దైవశక్తిని చక్కగా పూజించవచ్చు. భవిష్యత్తులో అయినా మరింతగా  పూజావిధానాలను  పెంచుకోకుండా పూజించుకుంటే  సరిపోతుంది.  వేదములలో, పురాణేతిహాసాలలో, ఇంకా కొన్ని ప్రముఖ గ్రంధాలలో.. చెప్పబడిన దేవతలను చక్కగా పూజించుకుంటే చాలా గొప్ప. 

 ఇంకా కూడా కొత్తగా పూజించాలంటే, వారిని  వేదములలో.. పురాణేతిహాసాలలో.. ఇంకా కొన్ని ప్రముఖ గ్రంధాలలో..చెప్పబడిన దేవతాస్వరూపాలుగా భావించి, ఒకరితోఒకరు గొడవలు లేకుండా, హిందుమతంలో మరిన్ని విభజనలు జరగకుండా పూజించుకోవాలి.

  పూజించటానికి  ప్రాచీనులు తెలియజేసిన దేవతలు ఉన్నారు... కఠినమైన ఆచారవ్యవహారాలను పాటించి పూజలు చేయకపోయినా, దైవాన్ని నమ్మి,  చక్కగా ప్రేమగా స్మరించుకోవచ్చు.

 ఈ రోజుల్లో కొందరు తాము దైవాంశగలవారమని, ప్రజల కష్టాలు తీరుస్తామని మోసం చేస్తున్నవారూ ఉన్నారు. ఇలాంటివారు తామే దేవుళ్ళమన్నట్లు పూజలు కూడా జరిపించుకుంటుకున్నట్లు వార్తల ద్వారా తెలుస్తోంది. ఇలాంటివారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొందరు తమ వ్యాపారాల కొరకు కొత్తగా  పూజలను పెంచుతున్నారనిపిస్తోంది.

  ఎవరిని ఏ విధంగా  పూజించాలి ? అనే విషయాల గురించి  బాగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. హిందుత్వానికి నష్టం జరగకుండా ఉండాలి.

సమాజంలో అనేక అభిప్రాయాలుంటాయి.  కొన్ని విషయాలు కొందరికి నచ్చుతాయి. కొన్నిసార్లు ఒకరు చెప్పింది ఇంకొకరికి నచ్చదు. ఇలాంటి పరిస్థితిలో దైవమే దారి చూపాలి.

 **********
ప్రపంచంలో కొందరు మనుషుల ఆలోచనలు గమనిస్తే , ప్రపంచం ఎటుపోతుందో అర్ధంకావటంలేదు. ఎవరి అభిప్రాయాలు వారివి. అందువల్ల, ఎవరూ ఏమీ చెయ్యలేని పరిస్థితి. దైవమే దిక్కు.
......

ఈ పోస్ట్ చాలా పెద్దగా అయ్యింది .

*************

అందరూ దైవభక్తిని కలిగి..ధర్మముగా
జీవించడానికి ప్రయత్నించాలి.

 

ప్రాచీనకాలంలో ప్రపంచంలో చాలావరకు ఒకే పోలికలున్న మతం...

 

  ప్రాచీనకాలంలో... ప్రపంచంలో  చాలావరకు ఒకే పోలికలున్న పద్ధతి ఉండేదేమో అనిపిస్తుంది.   విదేశాల్లో ప్రాచీన ఆనవాళ్ళకు.... భారతీయ సంస్కృతికి పోలికలు ఉన్నాయని కొందరు కనుగొన్నారట. 

 విదేశీ పేర్లకు మన దేశంలో కొన్ని పేర్లకు దగ్గర పోలికలు ఉన్నట్లు అనిపిస్తాయి. ఉదా..విదేశాల్లో కొందరికి స్మిత్ అనే పేరు ఉంటుంది. మనదేశంలో కూడా స్మిత అనే పేరు ఉంటుంది.

పేర్లు అన్నీ మరీ ఒకేలా ఉండకపోవచ్చు. కాలక్రమేణా పేర్లలో మార్పులు వచ్చి ఉండవచ్చు.

మనదేశంలో కొన్ని ఊర్లకు ఆ పేర్లు రావడానికి వెనుక కొన్ని కధలు చెబుతారు. ఆ పేర్లు కాలక్రమేణా కొన్ని మార్పులు చెందాయని చెబుతుంటారు.

 *********
 మెక్సికో, ఇరాన్లో కొన్ని జాతులు, గ్రీక్, ఈజిప్ట్..ఇలా అనేకదేశాల సంస్కృతికి భారతీయ సంస్కృతికి ఉన్న పోలికలను తెలియజేస్తున్నారు.
links....

Wednesday, July 24, 2024

దైవాన్ని గురించి...తోచినట్లు..


శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సుప్రభాతం గురించి ఒకరు..దైవాన్ని నిద్రపుచ్చటం, మేల్కొల్పటం ఏమిటంటూ , ఇంకా కొంత వెటకారంగా మాట్లాడటం జరిగింది.

 దైవాన్ని గురించి ఎవ్వరైనా తమకు తోచినట్లు వేళాకోళంగా మాట్లాడటం సరైనదికాదు. దైవానికి  మేలుకొలుపులు ..అనేవి భక్తులు ప్రేమతో భావించి చేస్తారు.

 

భక్తులు దైవాన్ని ఎన్నో విధాలుగా ఆరాధించుకుంటారు. భక్తితో సేవించుకుంటారు.  నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇవన్నీ  దైవంపట్ల భక్తితో చేస్తారు. అంతేకానీ, దైవానికి ఏమీ తక్కువయ్యి కాదు. సృష్టిలో అన్నీ దైవం సృష్టించినవే.

 

 దైవం ..సృష్టిలో జీవులు బ్రతకటానికి అవసరమైన  నీరు, గాలి, ఆహారం..ఇలా ఎన్నింటినో  సృష్టించారు.

 పిల్లలు తమ చేతులతో ఒక పండును తల్లితండ్రి నోటికి అందించినా తల్లితండ్రి ఎంతో సంబరపడతారు. భక్తులు కూడా భగవంతుని ప్రేమభక్తితో ఆరాధించుకుంటారు. 

............

 ఒక రాజుగారు దైవాన్ని విగ్రహరూపంలో ఆరాధించటం గురించి వేళాకోళంగా మాట్లాడగా, 

 రామకృష్ణపరమహంస  వారి  శిష్యులైన  వివేకానందస్వామి ,  ఆ రాజు యొక్క పెద్దల చిత్రాన్ని చూసి, ఆ చిత్రం పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే రాజుగారు ఎలా ఫీలవుతారని అడిగారట.

 అప్పుడు రాజుగారు కోపంతో తమ పెద్దల చిత్రం పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే శిక్షిస్తామనగా, 

వివేకానందగారు అది చిత్రమేకదా ..అని ప్రశ్నించగా,  రాజుగారికి జ్ఞానోదయమయ్యిందట.

ఈ సంఘటన  గురించిన సంభాషణలు ..జరిగింది జరిగినట్లు నాకు తెలియదు. 

............

చాలామంది దైవాన్ని నమ్మనివాళ్ళు  కూడా  తమ పెద్దలు, తాము గౌరవించే వారి చిత్రపటాలకు పూలదండలు వేయటం, పూలబొకేలను ఉంచటం,  ఆ ఫోటోలకు నమస్కరించటం చేస్తారు. 

మరణించినవారి ఫోటోలకు అంత మర్యాద ఇస్తున్నప్పుడు, ఎంతో గొప్పవారైన ఆద్యంతములు లేని  దైవాన్ని భక్తులు ప్రేమభక్తితో చక్కగా  ఆరాధించుకుంటే  ,వేళాకోళం  చేయటం సరైనదికాదు.

************

మరికొన్ని విషయాలేమిటంటే, 


 కొన్ని హిందు దేవాలయాల వద్ద చాలా సంపద నిల్వలు ఉన్నాయి. అలా బోలెడు ధనాన్ని పోగుచేసుకుని కూర్చుంటే , ఇతరులు ఆ సొమ్మును కాజేయటానికి ప్రయత్నిస్తారు.   కొందరు హిందువులు కూడా తమ చేతివాటతనం ప్రదర్శించవచ్చు. 
 
 
 అలాంటివి జరిగేకంటే, దేవాలయాల వద్ద ఉన్న కొంత సొమ్మును పక్కకు తీసి, హిందుదేవాలయాల ఆధ్వర్యంలో హిందువులకు ఉపయోగపడేలా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది.
 
 స్కూల్స్, హాస్పిటల్స్ పెడితే హిందువులు చాలామంది వాటికి విరాళాలు కూడా ఇస్తారు. తిరుమల అన్నదానానికి ఎందరో విరాళాలు ఇస్తున్నారు కదా.