లాక్డౌన్ సమయంలో ఎందరో వలస కూలీలు, కొందరు బాచిలర్స్..స్వస్థలాలకు వెళ్తామని అంటున్నారు.
కొందరు గుంపులుగా గుమికూడుతున్నారు. కొందరు వందల మైళ్ల దూరం నడవటానికీ సిద్ధపడుతున్నారు.
అంతదూరం పెద్దవాళ్ళు కూడా నడవలేరు. అలాంటిది పిల్లల్నికూడా అలా నడిపించి హింసించటం సరైనది కాదు. అంతదూరం నడిస్తే చనిపోయే అవకాశం కూడా ఉంది.
వలసవెళ్లిన చోట వసతి, సరైన ఆహారం లభించక అలా స్వస్థలాలకు బయలుదేరి ఉండవచ్చు .
వాళ్ళేమో వెళ్లాలంటారు. ప్రభుత్వాలేమో వెళ్ళకూడదంటారు. ఏమిటో ? ఇదంతా బాధాకరం.
ఇప్పుడు ఆహారధాన్యాల నిల్వలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు...
మరి, వారికి ఉన్న చోటే సరిగ్గా ఆహారాన్ని అందిస్తే .. అలా స్వస్థలాలకు బయలుదేరకపోవచ్చు .
ఈ విషయంలో ప్రభుత్వాలు తప్పకుండా సరైన చర్యలు తీసుకోవాలి.
కొరోనా వల్ల చనిపోతారని చెప్పి, లాక్డౌన్ విధించినప్పుడు ఆహారం లభించని వారికి ఆహారాన్ని అందించటం ప్రభుత్వాల బాధ్యత.
మొదట , ఎక్కడివాళ్లు అక్కడే ఉండటానికి ఒప్పించటానికి ప్రయత్నించాలి.
వరదలు వంటివి వచ్చినప్పుడు ఊళ్ళకు ఊళ్ళే ఖాళీ చేసి ప్రజలను స్కూల్స్ వంటి పెద్దభవనాలలో.. అంటే శరణార్ధశిబిరాలలో ఉంచుతారు కదా..అలా వలసకూలీలకు కూడా ఆశ్రయం కల్పించవచ్చు.
అయితే, అందరినీ ఒకే దగ్గర కాకుండా వేరువేరు భవనాలో ఉంచి ఆశ్రయం ఇవ్వవచ్చు.
***************
సంస్థలు పని ప్రారంభించినా .. పూర్తి స్థాయిలో పనిచేస్తాయో ? లేదో ? తెలియదు.
ఇంతకుముందు పని చేసిన కార్మికులందరినీ పనిలోకి తీసుకుంటారో ? లేదో? కూడా తెలియదు.
అందువల్ల, స్వస్థలాలకు వెళ్తామనే వారిని వారి స్వస్థలాలకు వెళ్ళటానికి అనుమతించటమే మంచిది.
అయితే, వాహనాలలో దగ్గరగా కాకుండా, కొంత దూరంగా కూర్చుని ప్రయాణించటానికి అనుమతి ఇవ్వవచ్చు.
స్వస్థలాలకు వెళ్లిన తరువాత కొంతకాలం హోం క్వారంటైన్లో ఉండమనవచ్చు.
**********
స్వస్థలాలకు వెళ్తామనే వలసకూలీలను అడ్డుకోవటం, వారికి సరైన రవాణా వసతులు కల్పించకపోవటం జరిగితే మాత్రం దారుణం.
********
ఇక్కడివాళ్లు ఇతరప్రాంతాలకు వలస వెళ్తుంటే, ఇతర ప్రాంతాల వాళ్లు ఇక్కడికి వలస వచ్చి పనిచేస్తున్నారు.
ఆశ్చర్యం ఏమిటంటే, ఇక్కడివారేమో మాకు పనులకు కూలీలు దొరకటం లేదు, ఉన్న స్థానిక కూలీలు కూడా ఎక్కువ జీతం అడుగుతున్నారు కాబట్టి, మేము ఇతర ప్రాంతాల కూలీలకు పనులు ఇస్తున్నామని యజమానులు అంటారు.
స్థానికకూలీలేమో మాకు ఇక్కడ పనులు లేవు, ఉన్న పనులకు కూడా తక్కువ జీతం ఇస్తున్నారు కాబట్టి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నామంటారు.
ఇతర ప్రాంతాలలో జీతం ఎక్కువ ఇస్తుంటే.. అక్కడి కూలీలు ఇక్కడికి ఎందుకు వలస వస్తారు ?
జీతం విషయంలో కూలీలు, యజమానులు పట్టువిడుపు ప్రదర్సించి, వేతనాన్ని నిర్ణయించుకోవాలి.
అయితే, ఇతరప్రాంతాలకు వెళ్లిన కూలీలు అక్కడ ఉండకుండా, ఇప్పుడు లాక్డౌన్ సమయంలో మేము మా స్వస్థలాలకు వెళ్లిపోతామంటున్నారు.
లాక్ డౌన్ సమయంలో యజమానులు .. తమవద్ద పనిచేసే కూలీలకు కొంత జీతం ముందే ఇచ్చి ఆదుకోవచ్చు కదా!
కూలీలందరూ స్వస్థలాలకు వెళ్లిపోతే , లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత మళ్ళీ కూలీలను వెతుక్కోవాలి కదా!
స్వస్థలాలకు వెళ్ళిన కూలీలు పనికోసం కొన్ని రోజుల తరువాత మళ్ళీ తిరిగివస్తారని యజమానుల ధీమా కాబోలు.
ప్రజలు వలసలు పోకుండా ప్రభుత్వాలు ఎక్కడికక్కడే ఉపాధి కల్పిస్తే బాగుంటుంది.
***************
భారతదేశంలో ఎన్నో సహజవనరులున్నాయి. అయినాకూడా, కొన్నిసార్లు ఆహారధాన్యాలను కూడా దిగుమతి చేసుకోవటమేమిటో అర్ధం కాదు.
మనదేశానికి అవసరమయ్యే వస్తువులను ఇతరదేశాలనుంచి దిగుమతి చేసుకోకుండా , ఇక్కడే తయారుచేసుకుంటే ఇక్కడివారికి నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతుంది.
పారిశుధ్యకార్మికులకు కొరోనా సమస్య తగ్గిన తరువాత కూడా మాస్కులు, గ్లోవ్సు ఇవ్వాలి. పెద్ద ఎత్తున ఉన్న చెత్తను ఎత్తడానికి యంత్రాలను ఉపయోగించాలి. తడిచెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ .. వేయటానికి మూడు డస్ట్ బిన్లను విడివిడిగా ఎక్కువసంఖ్యలో ఏర్పాటు చేయాలి.
చేయాలనే గట్టి సంకల్పం ఉంటే ఎన్నో చేయవచ్చు. అయితే ప్రజలకు కూడా బాధ్యత ఉండాలి.
ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో గుంపులుగా తిరగవద్దు ...అని ప్రభుత్వాలు చెబుతున్నా కూడా ప్రజలు కొందరు గుంపులుగా వీధుల్లోకి వచ్చి తిరుగుతున్నారు.
ప్రభుత్వం, అధికారులు, ప్రజలు అందరూ దృఢంగా అనుకుంటేనే ఏమైనా చేయగలరు.