koodali

Monday, June 13, 2022

ఈ మధ్యన మేము తెలిసిన వాళ్ళింటికి వెళ్ళాము..

 

 ఈ మధ్యన మేము తెలిసిన వాళ్ళింటికి వెళ్ళాము.వారి  ఇంటిముందు బోలెడు స్థలం ఉంది. అయితే, అంతా సిమెంట్ చేసి, ఎండకు ఫెళ్ళున ఎండపడి ఎడారిలా ఉంది.


ఇంత ఖాళీ స్థలం ఉంది.. మొక్కలు పెంచుకోవచ్చు కదా..అని అడిగితే, ఇంటామె ఏమన్నారంటే.. అయ్యో ఏం చెప్పమంటారు..ఈ మధ్య వరకూ ఎన్నో మొక్కలూ, చెట్లూ ఉండేవని, వాస్తు బాగోలేదు అని ఎవరో చెబితే వారి భర్త ఆ మొక్కలు, చెట్లు అన్నీ తీయించేసి సిమెంట్ చేయించేసారని చెప్పి చాలా బాధపడింది.



అయితే, కొందరు ఇంటిచుట్టూ చెట్లను పెంచితే రాలిన ఆకులను శుభ్రం చేసుకోవటం కష్టమని కూడా చెట్లను పెంచటం మానేసారు.

ఈమధ్యన ఎన్నో అంతస్తులతో ఎత్తుగా కడుతున్న అపార్ట్మెంట్స్ వల్ల కూడా చుట్టుప్రక్కల ఇళ్ళవారికి ఏ దిక్కునుంచి కుడా సూర్యరశ్మి ఇళ్ళలోకి రావట్లేదు.



 ప్రజలందరూ ఇంటిచుట్టూ కొన్నయినా చెట్లు పెంచేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అడవులు అంతరించిపోకుండా కూడా ప్రభుత్వాలు  చర్యలు తీసుకోవాలి.రహదారుల ప్రక్కన విస్తారంగా చెట్లను నాటి డ్రైనేజ్ నీరు శుద్దిచేసి వాటికి పోయవచ్చు.



రకరకాల కారణాలతో పర్యావరణాన్ని పాడుచేస్తే భూతాపం, ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయి. అప్పుడు నీరు ఎండిపోయి వృక్షసంపద ఎండిపోతుంది. తద్వారా మానవుల మనుగడ కూడా  అంతరించిపోయే పరిస్థితి వస్తుంది.



కొన్ని రకాల టెక్నాలజీ వల్లకూడా పర్యావరణానికి హాని కలుగుతోంది.పర్యావరణానికి హానికలగని విధంగా టెక్నాలజీని వాడుకోవాలి.



 ప్రపంచంలో జనాభా విపరీతంగా పెరగటం వల్లకూడా వారి అవసరాల కోసం వనరులను విపరీతంగా  వాడుతున్నారు. ప్రపంచ జనాభా తగ్గేవిధంగా ప్రభుత్వాలు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి.


ఇప్పుడు చాలా ఎండలు మండిపోతున్నాయి. చాలామంది ఏసీలు వేసుకుని కూర్చుంటున్నారు.
ఉష్ణోగ్రతలు ఇలాగే పెరిగితే అనేక కష్టాలు వస్తాయంటున్నారు.

 భూమిపై  మానవులు లేకపోయినా వృక్షజాతులు, పశుపక్ష్యాదులు చక్కగా జీవించగలవు. కానీ, వృక్షజాతులు, పశుపక్ష్యాదులు  లేకపోతే మానవుల మనుగడే కష్టమవుతుంది. అందువల్ల పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి విధి.
 
 

1 comment:

  1. ఈమధ్య వచ్చే సీరియల్స్ ఎక్కువగా కుట్రలు, కుతంత్రాలు అంతులేని నేరాలుఘోరాలతో నిండిపోయి ఉంటున్నాయి. ఒకరిపై ఒకరు కుట్రలు చేస్తునట్లు చూపిస్తున్నారు.

    ఇలాంటివి రోజూ చూస్తే ప్రజల మనస్సులు కూడా అలానే మారిపోతాయి. ఇలాంటివి కాకుండా కామెడీవి తీస్తే బాగుండు. అందరూ హాయిగా నవ్వుకుంటారు.

    ReplyDelete