koodali

Monday, June 13, 2022

ఈమధ్య కాలంలో వెగన్ గా...

 


 
 

ఈమధ్య కాలంలో వెగన్ గా మారేవారి సంఖ్య సంఖ్య పెరుగుతోంది. వీరు మాంసాహారం తినరు. పాలు, నేయి వంటివి కూడా తినరు.

 మాంసాహారం గురించి జంతువులను, పశుపక్ష్యాదులను పెద్దసంఖ్యలో పెంచటం వల్ల పర్యావరణం పాడవుతోందని, జీవహింస జరుగకూడదని, మాంసాహారం వల్ల ఎన్నో వ్యాధులు వస్తున్నాయని, కొందరికి పాలు ఎలర్జీ ఉండటం వల్ల..ఇలా అనేకకారణాలతో వెగన్ గా మారుతున్నారు.
 

 

పాతకాలంలో ఆవులు కొన్నిసార్లు మాత్రమే గర్భాన్ని ధరించేవట. ఈ రోజుల్లో జనాలు పాలకోసం ఆవులు, గేదెలకు మందులు ఇచ్చి ఎక్కువసార్లు గర్భంధరించేలా చేస్తున్నారట. అన్నిసార్లు గర్భం ధరించటం వల్ల అవి నీరసపడతాయట. మనుషులు కూడా ఎక్కువసార్లు గర్భాన్ని ధరించలేరుకదా.. మూగజంతువుల పట్ల అలా జీవహింస చేయకూడదు. కొందరు దూడలను చంపి పాలు పిండుతారు, కొందరయితే దూడలకు సరిగ్గా పాలు త్రాగించకుండా పాలను పిండుతారు. ఇలా చేయటం దారుణం.

 ఇంటివద్ద ఆవులు, గేదెలు ఉండి, వాటికి సహజంగా గర్భధారణ జరిగి, దూడ త్రాగగా మిగిలిన పాలను మనుషులు వాడుకోవచ్చు. అంతేకానీ, మూగజీవుల పట్ల అన్యాయంగా ప్రవర్తించటం సరైనది కాదు..........


 అంబలి త్రాగితే B12 లోపం అస్సలు ఉండదు..B12 కొరకు మాంసాహారం తినక్కరలేదని,  మాంసాహారం వల్ల వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశముందని   ఎందరో చెబుతున్నారు. మొక్కల నుంచి B12 తీసి టాబ్లెట్స్ రూపంలో కూడా అమ్ముతున్నారు.  వాటిని కూడా వాడుకోవచ్చు,

కొందరు ఏమంటారంటే, B12 అనేది లేకపోతే వ్యాధులు వస్తాయని..  పాలు, నెయ్యి వంటివి, మాంసాహారాన్ని తింటేనే  B12 లభిస్తుందని అంటున్నారు.

 పాలు, పెరుగు, నెయ్యి, మాంసాహారం తింటే B12 లోపం ఉండదు అన్నప్పుడు..అవి తినేవారికి ఎవ్వరికీ ఈ  B12 లోపం ఉండకూడదు కదా..

మరి.. పాలు, నేయి, మాంసాహారుల్లో కూడా ఎంతోమందికి B12 లోపం ఉంటోంది కదా...

తలతిరగటం వంటి  లక్షణాలు ..అనేక వ్యాధులలో  ఉంటాయి.ఇలాంటి లక్షణాలు తగ్గాలంటే..వ్యాధి ఏమిటో గుర్తించి ..దానికి తగ్గ చికిత్స తీసుకోవాలి.వాడుకోవాలి.

త్రిఫల, త్రికటు, శంఖుపుష్పి, పునర్నవ, అశ్వగంధ..వంటి ఎన్నో మూలికలున్నాయి. వాటిని వైద్యుల సలహాతో వాడుకోవాలి.

మనదేశంలో ఎన్నో తరాల నుంచి మాంసాహారాన్ని తిననివారు కూడా ఆరోగ్యంగా జీవించారు.

 రోజూ ఉదయానే లేచి సూర్యనమస్కారాలను లేత ఎండలో చేయటం.. ఉదయంగానీ సాయంకాలం కానీ అర్ధగంటయినా ఎండ శరీరానికి తగలాలి.

కనీసం 15 నిమిషాలన్నా ధ్యానం చేయాలి. మీకు ఇష్టమైన దేవుని నామాలను వింటూ కూడా ఉండవచ్చు. అయితే, ధ్యానం, ప్రాణాయామం..వంటివి శిక్షకుల వద్ద అభ్యసించి చేస్తే మంచిది.

 ధ్యానం ద్వారా అనేక ఆలోచనల నుంచి కొంతసేపైనా మనస్సుకు విశ్రాంతిని ఇవ్వవచ్చు.

కనీసం అర్ధగంట నడవాలి...

తేలికగా అరిగే పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి..

జీవితం అంటే టెన్షన్లు తప్పకుండా ఉంటాయి, మన చుట్టూ టెన్షన్ పరిస్థితులు ఉన్నప్పుడు టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది.

 కానీ, మనం ఆరోగ్యంగా ఉండాలంటే టెన్షన్ ఎక్కువ ఉండకుండా తామరాకుమీద నీటిబొట్టులా జీవించటాన్ని తప్పక నేర్చుకోవాలి.

 జీవితంలో మన చేతనైనంత మనం చేసి,  దైవంపై భారం వేయాలి.నిష్కామకర్మ యోగంతో జీవించటాన్ని అభ్యసించాలి.

శక్తి చాలనప్పుడు ..సరైనవిధంగా జీవించే శక్తిని ప్రసాదించమని దైవాన్ని శరణువేడుకోవాలి.

అంతా  దైవం దయ.
 *****
దయచేసి మరిన్ని వివరాల కొరకు క్రింద కామెంట్స్ వద్ద చూడగలరు.
 
 
 

13 comments:

  1. మనదేశంలోనే శాకాహారులు ఎక్కువ, విదేశాల్లో అందరూ మాంసాహారం తింటారని మనలో చాలామందిమి భావిస్తాము.

    అయితే, అది తప్పు. విదేశాల్లో కూడా శాకాహారులుంటారు. ఈ రోజుల్లో విదేశాల్లో కూడా చాలామంది మాంసాహారం మానివేసి శాకాహారం వైపు మారుతున్నారట.

    మన దేశంలో, మన రాష్ట్రంలో చాలామంది నేచురోపతి వారు కొన్ని ఆహారపద్ధతులను పాటించటం ద్వారా వ్యాధులు వచ్చినవారికి నయం చేయటం, వ్యాధులు రాకుండా చేయటం గురించి చెబుతున్నారు. ఇలా ఆహారం ద్వారా వ్యాధులు తగ్గించుకోవటం అనేది గొప్ప విషయం.


    విదేశాల్లో కూడా కొందరు శాఖాహారం మంచిదని, ఆహారం ద్వారా వ్యాధులు తగ్గించుకోవచ్చని చెబుతున్నారట. వీరిలో వైద్యులు కూడా ఉన్నారు.

    ఉదా..Dr. Caldwell Esseltyns,

    Dr. Brook Goldner..

    ఒక వైద్యురాలు తనకు వచ్చిన వ్యాధిని ఈ పద్ధతిలో తగ్గించుకోవటం జరిగిందట.

    వీరి గురించి తెలుసుకోవాలంటే ఇంటర్నెట్ లో చూడవచ్చు.

    ReplyDelete
  2. ఈమధ్య B12 గురించి చాలామంది చాలా విధాలుగా చెబుతున్నారు. B 12 అనేది శరీరంలో లోపిస్తే చాలా జబ్బులు వస్తాయని, B 12 లభించాలంటే మాంసాహారం తినటం వల్లనే లభిస్తుందని చెబుతున్నారు.

    అనారోగ్యాలకు ఎన్నో కారణాలుంటాయి. అవన్నీ వదిలి, కేవలం మాంసాహారం తినకపోవటం వల్లే B12 రోగాలు వస్తున్నాయన్నట్లు కొందరు చెబుతున్నారు.

    అయితే, గమనించవలసిన విషయం ఏమిటంటే, మాంసాహారం బాగా తినే చాలామందిలో కూడా B12 లోపం ఉంటోంది. శాకాహారం తినే చాలామంది ఆరోగ్యంగా చక్కగా ఉండటం కూడా చూస్తున్నాము.

    ఒక విదేశీ డాక్టర్ గారు పెద్ద అనారోగ్యం బారిన పడగా.. మాంసాహారాన్ని, పాలు,పాల ఉత్పత్తులను కూడా మాని.. ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో చేర్చుకుని అనారోగ్యాన్ని తగ్గించుకుని, అనారోగ్యంగా ఉన్న ఇతరులకు కూడా ఈవిధానం ద్వారా ట్రీట్మెంట్ ఇస్తున్నారట.

    మాంసాహారం, పాలు, నెయ్యి తినకుండా కూడా బలంగా ఉండవచ్చు. ఈ మధ్య చాలామంది మాంసాహారాన్ని, పాలను కూడా మాని వీగన్లుగా మారి చక్కగా బలంగా, ఆరోగ్యంగా ఉంటున్నారు.

    మాంసాహారం తినటం వల్ల అనారోగ్యం కలిగి శాకాహారులుగా మారిన వారు చాలామందే ఉన్నారు.మైక్ టైసన్ వంటివారు కూడా ఇలా మారారట.

    ఆ మధ్య..THE GAME CHANGERS...అనే డాక్యుమెంటరీ వచ్చింది. అందులో చాలామంది గురించి ఎన్నో విషయాలను తెలియజేసారు. చాలామంది తాము శాకాహారులుగా మారిన తరువాత మరింత శక్తివంతగా ఉన్నట్లు తెలియజేసారు.

    సాత్విక్ మూవ్మెంట్ వారు .. ఇండియాలో వెగన్ గురుంచి ప్రచారం చేస్తున్నారు.పాయసం వంటివి కూడా పాలు, నెయ్యి లేకుండా కొబ్బరిపాలు, జీడిపప్పు పాలు వేసి చక్కగా చేయవచ్చు.

    ReplyDelete
    Replies
    1. ప్రసాదాన్ని భోజనంలా తినకూడదని కొందరు అంటారు. 
      ప్రసాదాన్ని తగుమోతాదులో తీసుకుంటారు కొందరు.
      రుచిగా ఉందని బాగా ఎక్కువగా తింటారు కొందరు.
       
       శుచిగా పదార్ధాన్ని తయారుచేసి దైవానికి నివేదించి ప్రసాదంగా తీసుకోవటం ఒక విధానం అయితే, మనం ఆహారంగా తీసుకునే పదార్ధాలను ముందు దైవానికి నివేదించి తినటం ఒక విధానం.ఇది కూడా ప్రసాదమే.

      పులిహోర, అన్నప్రసాదం..వంటివి కడుపునిండేవరకు తినవచ్చు కానీ, పాలు, నేయి, పెరుగు..వంటివి వేసి తయారుచేసిన ప్రసాదాలను మాత్రం తగుమోతాదులో తింటే, తక్కువ మొత్తంలో పాలు, నెయ్యి, పెరుగు ..సరిపోతాయి.

      మనం రుచి కోసం ..కాఫీలు, టీలు, పాలవిరుగుడు(పన్నీరు),చీజ్, పాలకోవాలు, పాలతో చేసిన ఇతర స్వీట్స్..వంటివి తినటం తగ్గించుకుంటే మనకు మరియు పశువులకు కూడా కొంతమేలు జరుగుతుంది.

      ఎప్పుడూ మనుషులకు ఆహారం, మనుషులకు ఆరోగ్యం కొరకు సృష్టిలో మూగజీవులైన పశుపక్ష్యాదులు పనిచేయటమేనా..ఈ సృష్టి పశుపక్ష్యాదులది కూడా.

      మనుషులు తమ స్వార్ధాన్ని, అత్యాశను, అతి కోరికలను అదుపులో పెట్టుకుంటే వారికి ప్రపంచానికి కూడా మంచిది.

      Delete
    2. మనసును అదుపులో పెట్టుకోవటం చాలా చాలా కష్టమే.

      అయితే, అదుపులో ఉంచుకుంటే మంచి జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా అలా ప్రయత్నించాలి.


      అలా అదుపులో ఉంచుకునే శక్తి చాలనప్పుడు శక్తిని ప్రసాదించమని దైవాన్ని ప్రార్ధించాలి.

      Delete
  3. B12 లోపం అనేది ఈ మధ్యే ఎక్కువగా వింటున్నాము. B12 లోపం వల్ల వచ్చే లక్షణాలుగా చెప్పబడుతున్న తలతిరగటం, కళ్ళుతిరగటం..వంటివాటికి అనేక కారణాలుంటాయి.

    కలుషితమైన వాతావరణం, ఎండ తగలకుండా జీవించటం, రసాయన పురుగుమందులతో పెంచే పంటలను తినటం, మారిన జీవన పద్ధతులు, శారీరిక వ్యాయామం లేకపోవటం, ఎక్కువగా సెల్పోన్లు, కంప్యూటర్స్ వాడకం..వల్ల అనేక జబ్బులు వస్తాయి.

    కాన్సర్, కిడ్నీవ్యాధులు, ..వంటి ఎన్నో వ్యాధులు పాతకాలంలో చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు బాగా ఎక్కువయినాయి.

    నాకు ఏమనిపిస్తుందంటే, B12 అని చెబుతున్న రోగ లక్షణాలు రావటానికి మారిన జీవన విధానాలు కూడా కారణం కావచ్చు.B12 లోపం ఉందనిపిస్తే తగుమోతాదులో సోయా,B12 సప్లిమెంట్స్ వాడుకోవచ్చు. ఇంకా,తలతిరగటం.. వంటి లక్షణాలుంటే ఆయుర్వేద వైద్యులను సంప్రదించి అశ్వంధ, శంఖుపుష్పి టీ..వంటివి వాడుకోవచ్చు.

    మారిన జీవనవిధానంలో పెరిగిన టెన్షన్లు, ప్రకృతికి దూరంగా నాలుగుగోడల మధ్య ఎక్కువసేపు గడపటం, పర్యావరణ కాలుష్యంవంటివి కొన్ని కారణాలయితే..

    సెల్ఫోన్లు, కంప్యూటర్స్, టీవీలు చూడటం..వంటివి కూడా అనారోగ్యాలకు కారణం కావచ్చు.

    సెల్పోన్లు వ్రేలితో గంటల తరబడి నొక్కటం వల్ల , లాప్టాప్ వాడటం వల్ల కూడా ఎన్నో జబ్బులు వచ్చే అవకాశం ఉంది. B12 రోగ లక్షణాలుగా చెబుతున్న తలతిరగటం, మెడనొప్పి, తలనొప్పి ..వంటి అనేక అనారోగ్యాలు కూడా కలిగే అవకాశం ఉంది.

    ఇప్పుడు ఎవర్ని చూసినా గంటల తరబడి సెల్పోన్లు నొక్కుతూనే ఉంటారు.

    అదేపనిగా వ్రేళ్ళను గంటలతరబడి నొక్కితే చేతులు, భుజాల నొప్పి, మెడనొప్పి, నరాల బలహీనత, కళ్ళనొప్పి, స్పాండిలైటిస్.. వంటివి వచ్చే అవకాశముంది. ఇప్పుడు కంప్యూటర్ ఉద్యోగస్తులు చాలామంది ఈ సమస్యలతో బాధలు పడుతున్నారు.

    సెల్ఫోన్లు, లాప్టాప్లు..వంటివాటికి రేడియేషన్ వంటి సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి సెల్ఫోన్లను..తక్కువగా వాడటం మంచిది.

    అనారోగ్యాలు తగ్గాలంటే సెల్పోన్లు వాడకం తగ్గించటం, లాప్టాప్లు వాడే సమయాన్ని తగ్గించి.. ఎండలో కనీసం అరగంట ఉండటం, పచ్చని పరిసరాలలో రోజూ అర్ధగంట నడవటం, మంచి ఆహారాన్ని తగినంత తీసుకోవటం, టెన్షన్లు ఎక్కువగా లేకుండా తక్కువ కోరికలతో తృప్తిగా జీవించటం..వంటివి అలవాటు చేసుకోవాలి.


    ReplyDelete


  4. మానవశరీరం మాంసాహార ఆహారానికి అనువుగా ఉండదని, మాంసాహారం వల్ల అనేక వ్యాధులు వస్తాయని ఎందరో చెబుతున్నారు.

    ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో జంతువులకు ఎన్నో మందులను ఇచ్చి పెంచటం వల్ల, వాటిని తిన్న వారికి అనేక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

    సృష్టిలో ఎన్నో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉండగా ఇంకా పశుపక్ష్యాదులను బాధించి మాంసాహారాన్ని తినవలసిన అవసరం లేదు.

    మనుష్యజనాభా విపరీతంగా పెరగటం వల్ల ఎక్కువ పశువులు అవసరమవుతున్నాయి. మాంసం రుచికోసం ఎక్కువగా పశుపక్ష్యాదులను వధిస్తున్నారు.

    పాలు కూడా ఎక్కువగా త్రాగుతున్నారు. సృష్టిలో ఏ జీవులైనా పసిపిల్లలప్పుడే తల్లిపాలు త్రాగుతాయి, మనుషులు మాత్రమే పెద్దయిన తరువాత కూడా పాలు, పెరుగు వంటివి త్రాగటం అలవాటుచేసుకున్నారు. మనుషులు రుచులకు అలవాటుపడి ఇతరజీవులను హింసిస్తున్నారు.

    పశువులనుండి పాలు తీసి రుచికోసం పాలనుండి కోవా వంటి స్వీట్స్ చేయటం, జున్ను చేయటం, పెరుగు, వెన్న చేసి తినటం అలవాటయింది.

    తన బిడ్దకు పాలివ్వటానికే కొందరు స్త్రీలు తమ వద్ద సరిపడా పాలు రావటం లేదంటారు.. అలాంటిది మనుషులు పశువుల పాలకోసం వాటిని పీల్చిపిప్పి చేస్తున్నారు. ఆవులు, గేదెల పాల కోసం వాటికి పుట్టిన దూడలను అర్ధాకలితో ఉంచుతారు కొందరు, అవి పూర్తిగా పాలు త్రాగితే మనుషులకు ఉండవని వాటిని ప్రక్కకు లాగేస్తారు. కొన్నిచోట్ల దూడలను చంపేస్తారు కూడా.

    వైద్య విధానాలలో కొత్తవి కనిపెట్టినప్పుడు ఎన్నో జంతువులపై ప్రయోగాలు చేస్తారు. పాపం ఆ జంతువులు ఎంతో బాధను అనుభవిస్తాయి. మనుషుల కోసం ఎన్నో జీవులు బాధలు పడుతుంటే మనుషులు తమ అంతులేని కోరికల కోసం ఎన్నో జీవులను బాధలు పెడుతున్నారు.

    ReplyDelete
  5. మాంసాహారం వల్ల జరుగుతున్న అనర్ధాలను గమనించి విదేశాల్లో చాలామంది వీగన్లుగా మారుతున్నారు.

    అయితే మాంసాహారరుచిని మర్చిపోలేని వారి కోసం ..మాంసాహారాన్ని పోలిన శాకాహారం, జీవులను చంపకుండా లాబ్ లలో తయారు చేసే మాంసాహారం వంటివి వచ్చాయి.

    ReplyDelete
    Replies
    1. పాయసం ..బియ్యం, పప్పు ఉడికించి, దానిని గరిటతో కొద్దిగా మెదిపి, అందులో జీడిపప్పు పొడి, కొబ్బరిపాలు, ఏలక్కాయ పొడి, బెల్లం వేసి చిక్కగా దగ్గరకు వచ్చేలా వండితే చాలా బాగుంటుంది.

      Delete

  6. ఇక పుణ్యం వస్తుందని లీటర్ల కొద్ది పాలతో పాలాభిషేకాలు చేయటం కన్నా, నీటితో కూడా దైవానికి అభిషేకం చేయవచ్చు. పాతకాలంలో చిన్న విగ్రహాలకు అభిషేకం చేసేవారు అప్పుడు తక్కువపాలు సరిపోయేవి. ఇప్పుడు భారీఎత్తున విగ్రహాలను తయారుచేసి 108లీటర్లు పాలతో అభిషేకాలు కూడా చేస్తున్నారు.ఇప్పుడు దొరికే కల్తీ పాలతో చేసే అభిషేకాల వల్ల పుణ్యం రాకపోగా పాపం వచ్చే అవకాశం కూడా ఉంది.

    దైవకృపను పొందాలంటే పాలతో అభిషేకాలే చేయనవసరం లేదు. మనుషులు ధర్మబద్ధమైన జీవితం గడపటం ద్వారా దైవకృపను పొందవచ్చు.


    ReplyDelete
    Replies
    1. ఈ మధ్య కాలంలో అంటే, గత కొన్ని సంవత్సరాలుగా కొత్తగా వచ్చిన కొన్ని పద్ధతుల వల్ల గాలి, నీరు, వాతావరణం, ఆహార ఉత్పత్తులు పొల్యూషన్ కు గురి అవుతున్నాయి.

      రసాయనిక ఎరువులు, మందులు వేసి పెంచే మొక్కల నుంచి వచ్చే కాయగూరలను, పండ్లను తింటే రోగాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. పశువులకు కూడా కొందరు హార్మోన్స్ ఇవ్వటం,మందులు ఇచ్చి పెంచటం వల్ల పాలు కూడా తేడా వచ్చాయంటున్నారు.

      ఇక పాలను చాలాసార్లు కల్తీ కూడా చేస్తున్నారు.. ఇలాంటి కల్తీ పాలతో చేసిన అభిషేకాల వల్ల ఎప్పుడూ లేనివిధంగా శివలింగాలు రూపుమారే ప్రమాదం ఉందని గుర్తించిన కొందరు ..శివలింగాలకు తొడుగులు వేసి ఆ తొడుగులపైనుంచి అభిషేకం జరిగేటట్లు జాగ్రత్తలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

      శివలింగానికి అభిషేకాలు జరగాలి. అయితే, మురికినీరు, ఫ్లోరైడ్ నీరు, క్లోరిన్ వంటివి వేసిన నీటితో కాకుండా అభిషేకం చేయాలి. ఈ రోజుల్లో భూమిలో ఇంకుతున్న నీరు కూడా పొల్యూట్ అవుతోందని అంటున్నారు. అందువల్ల పొల్యూషన్ జరగకుండా మనకు చేతనైనంత ప్రయత్నించాలి.

      దైవానికి సమర్పించేవి పాపపు సొమ్ముతో సంపాదించినవి అయినా, కల్తీవి అయినా పుణ్యం రాకపోగా పాపం చుట్టుకునే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.

      ఇవన్నీ తెలిసే కాబోలు, కలియుగంలో దైవనామ స్మరణ సులభోపాయం అని పెద్దలు తెలియజేసారు.

      Delete

  7. ఏదిఏమైనా తల్లిపాలకు వాటి బిడ్దలకు మాత్రమే హక్కు ఉంటుంది. అయితే, పాతకాలంలో తల్లిపాలు సరిపోని చంటిపిల్లలకు ఆవుపాలు లేక గేదెపాలు కొద్దిగా పట్టేవారు. అంతవరకూ పరవాలేదు. పిల్లలు పెద్దయిన తరువాత కూడా గేదెపాలు, ఆవుపాలు త్రాగటం ఎందుకు? చంటిపిల్లలు ఎక్కువ పాలు త్రాగరు కాబట్టి వారికి ఆవు లేక గేదె పాలు పట్టవచ్చు.

    పిల్లలు పెద్దగా ఎదిగిన తరువాత తమసొంత తల్లిపాలే త్రాగరు, ఇక వేరే పాలు త్రాగే అవసరం ఎందుకు ఉంటుంది?

    పాలుత్రాగితే బలం అని బాగా ప్రచారం జరిగింది. అయితే బలం కావాలంటే పాలే త్రాగనవసరం లేదు. పాలలో కన్నా నువ్వులు, ..వంటి పదార్ధాలలో ఎక్కువ విటమిన్లు ఉన్నాయని ఎందరో చెబుతున్నారు. బలం కొరకు ఎన్నో ఉన్నాయి. శాకాహారం తినే ఏనుగు, అడవిదున్న..వంటివి ఎంతో బలంగా ఉంటాయి.

    శాకాహారం తీసుకుంటూ బలంగా ,ఆరోగ్యంగా ఉన్నవారు ఎందరో ఉన్నారు.THE GAME CHANGERS అన్న డాక్యుమెంట్ చూస్తే ఈ విషయాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. మనలో చాలామందికి విదేశీయులు చెపితే బాగా నమ్మకం కలుగుతుంది కదా..

    ReplyDelete
  8. గతకాలంలో ఆరుబయట పచ్చికబయళ్ళలో పశువులు హాయిగా మేతమేసేవి. ఇప్పుడు పట్నాలలో కొందరు ఇరుకుషెడ్లు వేసి గడ్ది కొనితెచ్చి పశువులకు వేస్తున్నారు. కొన్ని విదేశాలలో కొందరు ఆవులకు మాంసాన్ని కూడా తినిపించి పెంచుతున్నారట......

     పశువులకు వాటి దూడలకు సరిపోగా మిగిలిన పాలు మనుషులు వాడుకోవచ్చు కానీ, ఎక్కువ పాలదిగుబడి కోసం వాటికి మందులు ఇచ్చి మరీ పాలు తీసుకోకూడదు.

    కొందరు తల్లులకు పాలు తక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు బిడ్డలకు పోతపాలను పడతారు.
    కొందరు తల్లులకు పాలు ఎక్కువగా ఉంటాయి. అంటే, వారి బిడ్డ యొక్క కడుపు నిండిన తరువాత కూడా ఇంకా ఉంటాయి. అలాంటప్పుడు కొన్నిసార్లు నొప్పి వచ్చి, కొద్దిగా జ్వరం వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది.

     అలా పాలు ఎక్కువగా వచ్చినవారు తమ శిశువు కడుపు నిండిన తరువాత మిగిలిన పాలను.. పాలు లభించని శిశువులకు ఇవ్వటం కూడా చేస్తారు. లేదంటే ఎక్కువగా వస్తున్న పాలను పిండేస్తారు. అప్పుడు శరీరం తేలికపడుతుంది.
     
    పాలుఇచ్చే పశువుల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందేమో నాకు తెలియదు. ఇలా ఉంటే గనుక దూడ కడుపునిండిన తరువాత మిగిలిన పాలను మనుషులు పిండి వాడుకుంటారేమో.

    మనుషులకు అయినా పశువులకు అయినా వారి శిశువుల కడుపు నిండిన తరువాత పాలు ఇంకా మిగిలి ఉంటే, అప్పుడు వాటిని వాడుకోవటం ఫరవాలేదనిపిస్తుంది.

    అలాగని, పశువుల్లో వాటి దూడలకు మరియు మనుషులకు కూడా పాలు విస్తారంగా లభించేలా , పాలు బాగా పెరగడానికి మందులు ఇచ్చి మరీ పాలు పిండుకోవటం సరికాదు. అలా చేస్తే తల్లి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది.


    గత కాలంలో మంచి వాతావరాణం, మంచి ఆహారం వల్ల పశువుల వద్ద సహజంగానే ధారాళంగా పాలు ఉండేవి. వాటి దూడలు త్రాగిన తరువాత కూడా చాలా పాలు మిగిలి ఉండేవి కావచ్చు. అందువల్ల మిగిలిన పాలను పిండి మనుషులు త్రాగేవారు కావచ్చు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మనుషుల జనాభా విపరీతంగా పెరిగిపోయింది. వారి రుచులు బాగా పెరిగాయి. అందుకే పశువులపాలను త్రాగటం, పశుపక్ష్యాదుల మాంసాన్ని యధేచ్చగా తినటం చేస్తున్నారు.

    పశువులు గానీ మనుషులు గానీ గర్భం ధరించి బిడ్దలను కన్నప్పుడే పాలను ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయం కూడా పాలు త్రాగే చాలామందికి తెలియదు.

    కొన్నిసార్లు గర్భం దాల్చి పాలు ఇచ్చిన తరువాత పశువులు గర్భం దాల్చటం ఆగిపోతుంది. ముసలి ఆవులను, గేదెలను కొందరు చక్కగా చూసుకుంటారు. కొందరు కబేళాలకు తరలిస్తారు.ఇలా కబేళాలకు తరలించటం తప్పు. పశువుల మూత్రం, పేడ నుంచి ఎరువులను తయారుచేసి పొలాల్లో పంటలకు వేస్తే పంటలు చక్కగా పెరుగుతాయి.

    మన ఆహారం కొరకు మాంసాన్ని తినటం మానివేస్తే మంచిది.
    మనం రుచి కోసం ..కాఫీలు, టీలు, పాలవిరుగుడు(పన్నీరు),చీజ్, పాలకోవాలు, పాలతో చేసిన ఇతర స్వీట్స్..వంటివి తినటం తగ్గించుకుంటే మనకు మరియు పశువులకు కూడా మేలు జరుగుతుంది.
    ఎవరైనా పాలు, పాల ఉత్పత్తులను.. తినటాన్ని మానకూడదనుకుంటే , వాటిని తినటం కొంత తగ్గించినా పశువులకు కొంత భారం తగ్గుతుంది.

    ***********
    మనుషులు అత్యాశకు పోకుండా మంచి జీవనవిధానంతో ధర్మబద్ధంగా జీవిస్తే ఎన్నో జబ్బులు రావు. పర్యావరణం కూడా బాగుంటుంది. ఎన్నోజీవులు ఊపిరిపీల్చుకుంటాయి.

    ధర్మబద్ధంగా జీవించటానికి శాయశక్తులా ప్రయత్నించాలి. అందుకొరకు దైవాన్ని ప్రార్ధించాలి. అంతా దైవం దయ.

    ReplyDelete