జీవితంలో కష్టాలు తట్టుకోలేక కొందరు దైవం కొరకు కఠినమైన తపస్సు చేస్తారు.
దైవం ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటే కొందరు తమ సంసారంలో కష్టాలు
తొలగాలని కోరుకుంటారు.
మరి కొందరు సంసారంతో విసుగుచెంది, తిరిగి సంసారం వద్దని..బంధనాశకమూ,మోక్షప్రదమూ అయిన విశదజ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుకుంటారు.
వారు
సంసారం నుంచి బయటపడాలని కోరుకున్న విషయం తెలియక అలాంటి వారిని చూసి కొందరు
ఏమనుకుంటారంటే..అంత తపస్సు చేసినా అతనికి గొప్ప సంపదలు కలగలేదు కదా..ఇక
తపస్సులు చేయటం దేనికి? అనుకుంటారు.
ఎవరి మనస్సులో ఏముందో..ఎవరి గత కర్మలు ఎలాంటివో..ఎవరికి ఏ ఫలితాన్ని ఇవ్వాలో..దైవానికే తెలుస్తుంది.
.................
గతంలో చేసిన పాపకర్మల నుండి తప్పించుకోవాలంటే ఇప్పుడు మంచిగా ఉంటూ గొప్ప పాపపరిహారాలు చేయవలసి ఉంటుంది.
అయితే, పాపాలు చేసిన వారు పశ్చాత్తాపపడినా కూడా వెంటనే పాపకర్మ అంతా తొలగిపోదు.
వారు చేసిన పాపాల వల్ల కష్టాలు అనుభవించిన వారి ఉసురు ఊరికే పోదు కదా..కొంతయినా కష్టం అనుభవించవలసి ఉంటుంది.
గతకర్మ బలంగా ఉన్నప్పుడు వాటిని తొలగించుకోవాలంటే పరిహారాలూ గట్టిగానే చేయవలసి ఉంటుంది..
ఇహలోక విలాసాలకు ఆశపడకుండా మోక్షం కొరకు, లోకకల్యాణం కొరకు కూడా తమ తపశ్శక్తిని వినియోగించిన వారు ఎందరో ఉన్నారు.
జీవుల గత జన్మల కర్మలను ఇహజన్మ కర్మలను బట్టి దైవం వారికి తగ్గ ఫలితాలను ఇస్తారు. ఏది ఎందుకు ఎలా జరుగుతుందో దైవానికే తెలుస్తుంది.
సామాన్య మనుషులకే అంత దయ ఉన్నప్పుడు.. సమస్త జీవులను సృష్టించిన దయామయులైన దైవానికి మరెంతో దయ ఉంటుంది. సృష్టిలో అన్ని విషయాలు ..దైవానికి తెలుసు.
No comments:
Post a Comment