ఈ సంవత్సరపు శుభప్రదమైన అమరనాధ్ యాత్ర ప్రారంభమయింది.
...............
లోకంలో కొందరు ఏమనుకుంటారంటే, తాము ఎన్నో పూజలు చేస్తాము కాబట్టి ... తప్పులు చేసినా కూడా తమకు కష్టాలు రావనీ భ్రమపడుతుంటారు.
అయితే, దైవం ధర్మాన్ని కాపాడే విషయంలో ఎంతో ఖచ్చితంగా ఉంటారు.
శ్రీ కృష్ణుడికి ఎంతో ఆప్తులైన పాండవులు పాచికలాటలో పందేన్ని ఓడి, వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది.
ఇక్కడ మనకు ఒక సందేహమొస్తుంది. ఎన్నో మహిమలు కలిగిన శ్రీ కృష్ణుడు తలుచుకుంటే పాచికలాటలో పాండవులు ఓడిపోకుండా చేయవచ్చుకదా ? అనిపిస్తుంది.
పాండవులు అడవులకు వెళ్ళిన తరువాత వారికి సాయంగా అక్షయ పాత్రను ప్రసాదించారు దైవం . అంతేకానీ, పాచికలాటలో పాండవులు ఓడిపోకుండా సాయం చేయలేదు.
కృష్ణుడు ధర్మరాజును గెలిపించటానికి మహిమను చూపలేదు ..ధర్మరాజు ఓడిపోయారు. ..పాండవులు వనవాస కష్టాలను అనుభవించారు.
ఈ విషయాన్ని గమనించితే నాకు ఏమనిపించిందంటే, పై సంఘటన ద్వారా పాచికలాట పందెముల ద్వారా ఎన్ని నష్టాలు ఉంటాయో పెద్దలు మనకు తెలియజేసారు. అనిపించింది.
పురాణేతిహాసాలను పరిశీలిస్తే, ఎంత గొప్ప వాళ్ళైనా సరే తప్పులను చేస్తే, వాటికి తగ్గ ఫలితాన్ని అనుభవించే ప్రమాదం ఉందనీ, న్యాయానికి తర..తమ, పేద..గొప్ప వంటి తేడాలు లేవనీ మనము తెలుసుకోవచ్చు.
.........................
ధృతరాష్ట్రునికి పాచికలాటకు పాండవులను పిలవటం అంతగా ఇష్టం లేకపోయినా, పుత్రప్రేమను అణచుకోలేక ఒప్పుకున్నాడు. అందుకు తగ్గ మూల్యాన్ని చెల్లించారు.
ధర్మరాజుకు పాచికలాట ఆడటం ఇష్టం లేదు. అయితే, పెదతండ్రి అయిన ధృతరాష్ట్రుని ఆహ్వానం మేరకు , ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించకూడదని వచ్చి, పాచికలాట ఆడటం జరిగింది.
ఈ విషయాలు ఈ లింక్ ద్వారా చదువవచ్చు..... మహా భారతము
(తెలుగు )

No comments:
Post a Comment