కొన్ని సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఇల్లు కట్టించే సమయంలో పై నుంచి క్రింద పడ్డారు. ఎత్తు నుంచి క్రింద పాతి ఉన్న ఇనుపచువ్వల పైన పడటం వల్ల ప్రక్కటెముకలు కొన్ని దెబ్బతిన్నాయట.
ఆయుర్వేద వైద్యుని సంప్రదించగా కొన్ని మందులు ఇచ్చారట. విరిగాయనుకున్న ఎముకలు కొన్ని రోజులలో అతుక్కున్నాయట.
( అందరినీ శ్రమపెట్టడం ఎందుకని , జరిగిన విషయాలను మాకు ఎవరికీ వెంటనే చెప్పకుండా కొన్ని రోజుల తరువాత తెలియజేసారు. )
పెద్దపెద్ద కట్లు, బోలెడు డబ్బు ఖర్చు లేకుండానే ఆశ్చర్యకరంగా ఆయుర్వేద మందులతో అంత పెద్ద దెబ్బలు తగ్గిపోయాయి.
ఆయుర్వేదం ఎంతో గొప్పది. పూర్వకాలంలో సుశ్రుతుడు వంటి ఆయుర్వేదవైద్యులు శస్త్రచికిత్సలు కూడా చేసేవారట.
ఉదా..యుద్ధాలలో గాయపడ్డ సైనికులకు శస్త్రచికిత్సలు చేయటం వంటివి.
పూర్వకాలంలో ఇప్పటిలా రోగాన్ని కనుగొనటానికి స్కానింగులు వంటివి లేకపోయినా , రోగి యొక్క ముఖాన్ని పరిశీలించి లేక రోగలక్షణాలను బట్టి చక్కగా రోగనిర్ధారణ చేసే గొప్ప వైద్యులు ఉండేవారట.
మన దురదృష్టం వల్ల ఆయుర్వేదాన్ని ఎంతో నిర్లక్ష్యం చేశాం. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆయుర్వేదం, యోగా వంటి వాటిపట్ల ఆసక్తి పెరుగుతోంది. ఇది మంచి పరిణామం.
Let us hope for the best
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteనిజమేనండి, Let us hope for the best.
ఆ ఆయుర్వేద వైదుడు ఎవరో,ఎక్కడి వారో వివరాలు ఇస్తే బాగుంటుంది. వారు అందుబాటు లో వుండకుంటే వారి శిష్యబృందమన్నా దొరకవచ్చు కదా.ఆయుర్వేదానికి,ఆ వైద్యుదు గారికి, అవసరమైన ప్రజలకు,సమాజానికి మేలు చెసినవారౌతారు.
ReplyDelete
Deleteఅజ్ఞాతల వ్యాఖ్యలను కొద్దిసేపటి క్రితమే చూశాను.
వ్యాఖ్యానించినందుకు మీకు కృతజ్ఞతలండి.
పైన వ్రాసిన సంఘటన జరిగి చాలా సంవత్సరాలు గడిచాయి. ఆ వైద్యుని గురించిన వివరాలు నాకు సరిగ్గా తెలియవు.
మా పెద్దవాళ్ళను అడిగి తెలుసుకుని వ్రాయటానికి ప్రయత్నిస్తానండి. చికిత్స జరిగింది మాత్రం కృష్ణా జిల్లా లో. వైద్యులు ఎక్కడి వారో నాకు సరిగ్గా తెలియదు.
కొన్ని కారణాల వల్ల మరిన్ని వివరాలను తెలియజేయలేకపోతున్నాను. దయచేసి క్షమించండి.
Deleteఅవునా! ఆ ఆయుర్వేద వైద్య శిఖామణి వివరాలు తెలియచేస్తే, మన మోడీ గారికి చెప్పి భారతరత్న ఇప్పించే ప్రయత్నం చేయ్యోచ్చు...
ReplyDeleteఅసలు ఈ శాస్త్ర విజ్ఞానాలన్నిటి గురించి మనవాళ్ళు వేదాల్లో ఏనాడో చేప్పేసారంట, కొద్దిగా వెతికితే ఈ ఇంటర్నెట్టు, బ్లాగులు గురించి కూడా ఏదో మూల రాసీ వుంటారు.
అజ్ఞాతల వ్యాఖ్యలను కొద్దిసేపటి క్రితమే చూశాను.
ReplyDeleteవ్యాఖ్యానించినందుకు మీకు కృతజ్ఞతలండి.
అయితే , ఆయుర్వేదాన్ని విమర్శించేముందు మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. విరిగిన ఎముకలు చక్కగా అతకటానికి ఆయుర్వేదంలో ఎన్నో మందులు ఉన్నాయని చదివాను.
మీరు పుత్తూరు గురించి విన్నారా ? విరిగిన ఎముకలను అతకటానికి , ( ఆయుర్వేద మూలికలతో ) చక్కగా నయం చేయటానికి పుత్తూరు ఎంతో ఫేమస్ .... అని నేను ఒక వార్తాపత్రికలో చదివాను. ఎముకలు విరిగిన వారు ఎందరో అక్కడకు వెళ్ళి చికిత్స చేయించుకుంటారట.
మీ వ్యాఖ్యను బట్టి చూస్తే, ఆయుర్వేదం యోగా... గొప్పదనం గురించి మీకు తెలియదని తెలుస్తోంది. ఆయుర్వేద వైద్యం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేని చక్కటి వైద్యం లభిస్తుంది.
మీకు తెలుసా ? అయ్యంగార్ యోగా ద్వారా ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తి అయిన B K S Iyengar అనే ఆయనకు పద్మ విభూషణ్ బిరుదును ఇచ్చి సత్కరించారు.
అసలు ఈ శాస్త్ర విజ్ఞానాలన్నిటి గురించి మనవాళ్ళు వేదాల్లో ఏనాడో చేప్పేసారంట, ఇంటర్నెట్టు, బ్లాగులు కన్నా ఎక్కువగా విజ్ఞానమే వేదాల్లో ఉంది.
ఆనాటి వారి విజ్ఞానం గురించి చెప్పుకోవాలంటే బోలెడు ఉదాహరణలున్నాయి. ఉదా..గాంధారి కుండలలో పిండాలను పెంచటం గురించి ప్రాచీన గ్రంధాలలో చదివి , అలా పెంచటం ఎలా సాధ్యమని ? ఎందరో నవ్వారు. ఇప్పుడు టెస్ట్ ట్యూబులలో పిండాలను పెంచుతున్నారు కదా !
ప్రాచీన గ్రంధాలలో ఎంతో విజ్ఞానం ఉంది. అప్పటి గ్రంధాలలో మనిషి మాయమవటం తిరిగి ప్రత్యక్షమవటం..వంటి ఎన్నో విశేషాలను గురించి తెలియజేశారు. అవన్నీ తెలుసుకునే స్థాయికి ఆధునిక విజ్ఞానం ఇంకా ఎదగలేదు.
మరికొన్ని విషయాలను తరువాత వ్రాస్తాను.
ReplyDeleteఈ రోజులలో ఎందరో ఆయుర్వేద వైద్యుల గురించి టీవీ చానల్స్ ద్వారా తెలియజేస్తున్నారు. ఎందరో రోగులు తమకు ఆయుర్వేద వైద్యం ద్వారా అనారోగ్యం తగ్గిందని తెలియజేస్తున్నారు .
ReplyDelete......................................
హోమియో వైద్యం కూడా గొప్పదే.
ఒక సంఘటన గురించి వ్రాస్తాను. నేను చిన్నతనంలో టాన్సిల్స్ వల్ల చాలా బాధపడ్డాను. ఇంగ్లీష్ వైద్యుని వద్ద మందులు వాడినా తగ్గలేదు. ఇక ఆపరేషన్ చేసి టాన్సిల్స్ తీసేయటం తప్ప వేరే మార్గం లేదన్నారు. చేసేదేమీ లేక అందుకు సిద్ధపడ్డాము.
ఇంతలో మా అమ్మగారికి కొద్దిగా అనారోగ్యం కలగటం వల్ల ఒక హోమియా డాక్టర్ గారు మా ఇంటికి వచ్చి మందులు ఇచ్చేవారు. పనిలో పనిగా నా టాన్సిల్స్ గురించి తెలుసుకుని ఆపరేషన్ అవసరం లేకుండా హోమియో మందులతో తగ్గిస్తానన్నారు.
వారు ఇచ్చిన మందులు వాడిన తరువాత చిత్రంగా టాన్సిల్స్ వల్ల బాధలు మటుమాయమైపోయాయి. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా మళ్లీ ఎప్పుడూ బాధలు రాలేదు.
.............................................
ఇంగ్లీష్ వైద్యం కూడా గొప్పదే.
వాంతులు, విరేచనాలు వంటివి వచ్చి నీరసం వచ్చిన వాళ్ళకు వెంటనే సెలైన్ ఎక్కించి కాపాడటం చేయవచ్చు.
ఈ కాలం నాటి స్త్రీలు డెలివరీ నొప్పులను ఎక్కువసేపు భరించలేరు. స్త్రీలకు డెలివరీస్ విషయంలోనూ, ఇంకా కొన్ని రకాల ఆపరేషన్స్ విషయంలోనూ ఇంగ్లీష్ వైద్యం సహాయపడుతుంది. అయితే ఇంగ్లీష్ వైద్యంలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయంటారు.
....................................
చాలామందితో పోల్చుకుంటే మాకు అనారోగ్యం చాలా తక్కువసార్లు వచ్చింది. అంతా దైవం దయ.