koodali

Thursday, June 19, 2014

దేశం తప్పక అభివృద్ధిలోకి వస్తుందనటంలో.............

 
 
మనదేశం  ఇప్పుడు  పేదదేశం  అని  అంటున్నారు. డబ్బుతో  లెక్కలు  వేస్తే  మనది  పేదదేశం  అనిపిస్తుందేమో  కానీ , సహజసంపదలు  ఎన్నో  ఉన్నదేశం  పేదదేశం  ఎలా  అవుతుంది  ?

 దేశంలో  ఎందరో మేధావులు  ఉన్నారు.  అయినా  దేశం  ఇలా  సమస్యలు  ఉన్నాయంటే  ఎంతో  సిగ్గుపడవలసిన  విషయం.

మనలో  మనకు  ఐకమత్యం  తక్కువ.  మన  ప్రాచీన  సంస్కృతిని  మనం  కించపరిచినంతగా  ఏ  దేశం వాళ్ళూ   తమ  ప్రాచీన సంస్కృతిని  కించపరచటం  జరగదేమో..


మనదేశంలో  వినోదం  కూడా  ఎక్కువయ్యింది.  ప్రజలు  వినోదంలో  మునిగితేలుతున్నారు.  సినిమాలు, సీరియల్స్, అంతర్జాలం, సెల్ ఫోన్స్   ...అంతటా  వినోదమే.

ఇంట్లో  టీవీ  చానల్స్,  బయటకెళ్తే ..  బస్టాండ్,  రైల్వే స్టేషన్, బస్సులో వీడియో  ... ఇలా  చాలా  చోట్ల   వినోదకార్యక్రమాలు  ఉంటాయి .  ఇక  జనం  వాటికేసి  కళ్ళప్పగించి  చూస్తుంటారు.


చిన్నపిల్లల్ని  సినిమా  పరిజ్ఞానం ,
సినిమా పాటల   పరిజ్ఞానం  గురించి   నేర్పిస్తూ, పోటీలు  పెడుతూ  తల్లితండ్రులు  తెగ హైరానా  పడుతుంటారు.


ఇప్పుడు  ఈ  దేశం  అభివృద్ధి  చెందాలంటే  ప్రధాని,  ముఖ్యమంత్రులు  మాత్రమే  బాగా  పనిచేస్తే  చాలదు. ప్రతి  ఒక్కరూ  కష్టపడి  పనిచేయాలి.  అందరూ  పూనుకుని  కష్టపడితే  దేశం  ఎందుకు  అభివృద్ధి  చెందదు  ? 



మన  ప్రాచీన గ్రంధాలను  అదేపనిగా  చదవటం  మాత్రమే  కాదు  వాటినుంచి  మనం  ఎన్నో  నేర్చుకోవాలి. 


 ఉదా..హనుమంతుడు  సీతమ్మను  వెదకటానికి  వెళ్ళే  సమయంలో ... తన  దైవమైన  రాముని  యందు   భారం  వేసి,   లక్ష్యం  పట్ల  ఎంతో  ఏకాగ్రతగా   , పట్టుదలగా    కార్యాన్ని  సాధిస్తారు. వెళ్ళే  దారిలో  మైనాకుని  ఆతిధ్యాన్ని  స్వీకరించటానికి  కూడా   సమయాన్ని  వృధా  చేయలేదు.    


హనుమంతునికున్నంత    పట్టుదల  మనకు  లేకపోయినా    మనమూ  దైవం   యందు   భారం  వేసి,  మనకు  చేతనైనంతలో    పనిచేస్తే  దేశం  తప్పక  అభివృద్ధిలోకి  వస్తుందనటంలో  ఎటువంటి   సందేహమూ  లేదు.



 జపాన్  చూడండి  రెండవ  ప్రపంచయుద్ధంలో  ఎంతో  నష్టపోయినా  కూడా  త్వరగానే  కోలుకుంది.  అక్కడ  వాళ్ళు  మనలా  ఎప్పుడూ  వినోదమాధ్యమాన్ని   అంటిపెట్టుకుని  కూర్చోరు  అనుకుంటా.



మనదేశంలో   చిన్న,  పెద్ద  అందరికీ  క్రికెట్  లేక  సినిమాలపై  ఉన్న  ఆసక్తి  సమాజంలోని  సమస్యల  పరిష్కారం  గురించి  ఆలోచించటంలో  ఉండదు.  ఇలాంటివి  మాట్లాడాలంటే  బొర్  ఫీలవుతారు.  

వినోదం  అవసరమే.  అయితే  రోజూ  టీవీలు  చూసినా  పరీక్షల  సమయంలోనైనా   టీవీ  చూడటం  తగ్గిస్తాము  కదా  ! 


పరీక్షలు  జరిగేటప్పుడు  చదివీచదివీ   రిలాక్స్  అవటానికి  కొంతసేపు  వినోదకార్యక్రమాలను  చూస్తాము.  అంతేకానీ,  రోజూ  చూసినంతసేపు  చూడము  కదా  !

 ఇప్పుడు మనదేశానికీ  పరీక్షా  సమయమే.


  ఈ  దేశానికి  అపారమైన  సహజవనరులున్నాయి.   ఖనిజవనరులను  ఖాళీ  చేయకుండా  పొదుపుగా  వాడుకోవాలి.

చాలాదేశాలకు  లేని    అపారమైన  సూర్యరశ్మి  మనకు   ఉంది.  మనకు  లేనిదల్లా  ఒక్కటే. మనమీద  మనకు  ఆత్మవిశ్వాసం. 

 
కొన్ని  సంవత్సరాలు  మనలో  మనం  కొట్లాడుకోవటం  మాని  ,  వినోదాన్ని  కొంత  తగ్గించుకుని ,  మన  కుటుంబం  కోసం  కొంత  దాచుకుని ,  సమాజ  అభివృద్ధి  కోసం  కూడా  కష్టపడితే  మన  దేశం  బంగారు భారతదేశమై  సగర్వంగా  తిరిగి  పూర్వవైభవాన్ని  సంతరించుకుంటుంది.   అందరికి  ఆహారం, ఆరోగ్యం, విద్య, రక్షణ..ఇలా  అభివృద్ధి  చేసుకోగల  సత్తా  మనకుంది.




2 comments:

  1. "పరీక్షలు జరిగేటప్పుడు చదివీచదివీ రిలాక్స్ అవటానికి కొంతసేపు వినోదకార్యక్రమాలను చూస్తాము. అంతేకానీ, రోజూ చూసినంతసేపు చూడము కదా !"

    well said.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి, జీవితంలో వినోదమూ అవసరమే.

    అయితే, చుట్టూ అనేక సమస్యలను ఉన్నా, ఎక్కడి సమస్యలను అక్కడ వదిలివేసి వినోదకార్యక్రమాలను చూస్తూ సంతోషాన్ని పొందటం కన్నా...

    వినోదాన్ని కొంతయినా తగ్గించుకుని సమస్యలను పరిష్కరించుకోవటం ద్వారా లభించే సంతోషం ఎంతో గొప్పగా ఉంటుంది.

    ReplyDelete