కొన్ని దేశాలు నాగరికతకు దూరంగా ఉన్న సమయంలోనే ఈ దేశంలో అద్భుతమైన నాగరికత వెల్లివిరిసింది.
ఈ దేశాన్ని అభిమానించే ప్రజలు , ఈ దేశ ప్రాచీన సంస్కృతిని ప్రేమించే ప్రజలు, మన పూర్వీకులు అపారమైన మేధస్సు కలవారనే నిజాన్ని గ్రహించి గొప్పగా చెప్పుకునే ప్రజలు, ప్రాచీన గ్రంధాలలోని విజ్ఞానాన్ని గ్రహించే ప్రజలు , పుణ్యభూమి నా దేశం ... అని మనస్సు ఉప్పెంగేలా చెప్పుకునే ప్రజలు ఈ దేశానికి కావాలిప్పుడు. అప్పుడే దేశం మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందుతుంది.
...................................
భారతదేశ ప్రజలు కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతిదానికి మాది పేదదేశం ... మాకు సాయం చేయండి ........అంటూ విదేశాల వాళ్ళను కానీ, ప్రపంచ బేంకును కానీ దేబిరించుకోవటం మానుకోవాలి.
మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవటం చేతకాని చవటలం కాదు కదా మనం ?
......................
ఈ దేశానికి కావలసినది నీతిమంతులు, కష్టపడి పనిచేసే ప్రజలు.
.............................
దేశంలో సంపదకు కొదువ లేదు. అయితే కొందరు ద్రోహులు ప్రజల సొమ్మును దిగమింగి దాచుకుంటున్నారు. అందువల్లే దేశంలో పేదరికం అలాగే ఉంది.
................................
ప్రజలు ఎన్నో సమస్యలను ఏకరువు పెడుతున్నారు. మాకు నీళ్ళు లేవు. సరుకులు లేవు. మురుగు నీరు పోదు....... ఇలా ఒకటా రెండా..అనేక సమస్యలు.
నిజమే ఎటు చూసినా సమస్యలే. మరి ఇవన్నీ పరిష్కరించాలంటే ఎవరు చేస్తారు ? అంటే ప్రభుత్వం చేయాలి అంటారు.
ప్రభుత్వం అంటే అదేమీ మంత్రదండం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం కూడా ప్రజలే కదా !
పాలకులు, అధికారులు, సాధారణ ప్రజలు..అందరూ కలిసి ఎవరి పనిని వారు సవ్యంగా చేస్తేనే సమాజం సజావుగా సాగుతుంది.
....................................
పాలకుల్లోనూ మంచి ఆశయాలు కలవారుంటారు. అధికారుల్లోనూ మంచి ఆశయాలు కలవారుంటారు. ప్రజలలోనూ మంచి ఆశయాలు కలవారుంటారు.
అందరూ కూడా ఆడంబరాలను, అత్యాశలను కొంచెం తగ్గించుకుని తలోచెయ్యి వేస్తేనే సమాజం బాగుపడుతుంది.
................
మనం, మనదేశం, మన బ్రతుకులు బాగుపడి ప్రపంచంలో గర్వంగా తలెత్తుకుని నిలబడాలంటే, మనకు తెలిసిన నీతులను సాధ్యమైనంతవరకు ఆచరించాలి. అప్పుడే సమాజంలో సుఖమూ, శాంతీ వెల్లివిరుస్తాయి.
No comments:
Post a Comment