ఈ రోజుల్లో మనుషులు ప్రకృతికి దూరంగా జీవించటం పెరిగింది. తలుపులు వేసిన గదులలో ( ఏ.సీ గదుల్లో ) ఎలెక్ట్రానిక్ వస్తువుల మధ్యే రోజంతా గడపవలసి వస్తోంది. శారీరిక శ్రమ తగ్గిపోయింది. రోగాలు పెరుగుతున్నాయి. ఒక వ్యాధికి మందులు కనుక్కుంటుంటే కొత్తరకం వ్యాధి వస్తోంది.
కొన్ని ఎలెక్ట్రానిక్ వస్తువుల నుంచి రేడియేషన్ వెలువడుతుందని అంటున్నారు . అందువల్ల వీటిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట .
ఉదా... స్త్రీలు పురుషులు కూడా లాప్ టాప్ ను ఒడిపై కాకుండా టేబుల్ పై పెట్టి చూడాలని చెబుతున్నారు.
ఎందుకంటే లాప్ టాప్ నుంచి ప్రసరించే వేడి మరియు రేడియేషన్ వల్ల మగవారికి స్పెర్మ్ కౌంట్ గణనీయంగా తగ్గిపోవటం , సంతానానికి సమస్యలు ... వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని పరిశోధనల్లో తేలిందట .
గర్భవతులు మరింత జాగ్రత్తగా ఉండాలి. లాప్ టాప్ ను కడుపుకు దగ్గరగా ఉంచటం వల్ల లాప్ టాప్ నుంచి ప్రసారమయ్యే వేడి మరియు రేడియేషన్ గర్భంలోని శిశువుపై ప్రభావాన్ని చూపిస్తుందని పరిశోధనల్లో తేలిందట.
అందువల్ల స్త్రీలు, పురుషులు లాప్ టాప్ వాడేటప్పుడు ఒడిపై కాకుండా, ఎదురుగా టేబుల్ పై పెట్టి వాడుకుంటే మంచిదని అంటున్నారు.
ఈ మధ్య మాకు తెలిసిన వాళ్ళింటికి వెళ్ళాను. వారి అమ్మాయి సోఫాలో కూర్చుని ఒడిపై లాప్ టాప్ లో ఎదో చూస్తోంది. ఆ అమ్మాయి గర్భవతి.... ఈ దృశ్యం చూసి, ఆ అమ్మాయి కి ఈ విషయాలన్నీ చెప్పాలనిపించింది నాకు.
అయితే ఆ అమ్మాయి ఏమైనా అపార్ధం చేసుకుంటుందేమోనని భావించి నా అభిప్రాయాలను చెప్పకుండా ఇంటికి వచ్చేశాను .
ఇంటికి వెళ్ళాక ఆ అమ్మాయికి విషయం చెప్పకుండా వచ్చేశానే .......బిడ్డకు ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో ? అని ఫీలయ్యాను. అయినా ఆ అమ్మాయికి ఈ విషయం తెలియకుండా ఉంటుందా ? అనుకుని ఊరుకున్నాను.
ఆ అమ్మాయితో నాకు ఎక్కువ పరిచయం లేదు. ఆమె కొద్ది రోజుల క్రితమే విదేశాలనుంచి ఇండియాకు వచ్చింది. నాకు ఆ అమ్మాయి పెద్దవాళ్ళు బాగా పరిచయం. నేను అప్పుడప్పుడు తీరిక సమయాలలో వాళ్ళింటికి వెళ్ళి కొద్దిసేపు కబుర్లు చెప్పి వస్తుంటాను.
ఒక వారం గడిచిన తరువాత మళ్లీ వాళ్ళింటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆ అమ్మాయే తలుపుతీసింది. నేను నా అభిప్రాయాలను చెప్పేసాను.
గర్భవతులు లాప్ టాప్ దూరంగా ఉంచి చూడాలి . దగ్గరగా ఉంచకూడదట.. అని నాకు తెలిసిన విషయాలను చెప్పేసాను. చెప్పి, ఇలా చెప్పినందుకు అపార్ధం చేసుకోవద్దని అన్నాను.
అప్పుడు ఆ అమ్మాయి అయ్యో ! ఇందులో అపార్ధం చేసుకోవటానికి ఏముందండి. మా వదిన కూడా లాప్ టాప్ ను దూరంగా పెట్టి చూడమని చెప్పింది. నేను ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను అన్నది.
నాకు మనసు తేలికయింది. నా అభిప్రాయాన్ని చెప్పేసాను. ఇక దాన్ని పాటించటం పాటించకపోవటం అనేది ఆ అమ్మాయి ఇష్టం.
గర్భిణీ స్త్రీలు మైక్రో అవెన్ నుంచి కూడా దూరంగా ఉండాలంటున్నారు. ఏమిటో అన్నింటికి దూరంగా ఉండాలంటున్నారు. మళ్ళీ ఎలెక్ట్రానిక్ పరికరాలు లేనిదే జీవితాలు గడవని పరిస్థితులు ఏర్పరుస్తున్నారు.
ఈ మధ్య ఒక టీవీ చానల్లో సెల్ టవర్స్ గురించిన విషయాలను చెప్పారు. సెల్ టవర్స్ కు దగ్గరలో నివసించేవారిలో కొన్ని వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయట. ఇవన్నీ వింటుంటే ఏమీ అర్ధం కావటం లేదు.
అయితే కొంతకాలం క్రిందట కాన్సర్ వ్యాధి ఇప్పటంత ఎక్కువగా ఉండేది కాదు. ఈ రోజుల్లో కాన్సర్ , బీపి, డయాబెటిస్ వంటి వ్యాధులు పూర్వం కన్నా బాగా పెరిగినట్లు అనిపిస్తోంది.
వీటన్నింటికీ కాలమే జవాబు చెప్పాలి.

కొన్ని విషయాలు చెప్పాలి, కాకపోతే సున్నితంగా చెబితే సంబంధాలు చెడవు.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteమీరు చెప్పింది నిజమేనండి.
thanks andi information ichinanduku
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeletehi
ReplyDelete