koodali

Monday, March 11, 2013

నిధి చాలా సుఖమా .

ఓం,
 ఓం శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారికి  వందనములు.
శ్రీ  అనఘాదేవిసమేతదత్తాత్రేయస్వామి వారికి  వందనములు.
శ్రీ  పార్వతీపరమేశ్వరులకు  వందనములు.
శ్రీ  సీతారాములకు  వందనములు.


 నిధి  చాలా  సుఖమా ....రాముని  సన్నిధి  సేవ  సుఖమా .... అని  త్యాగయ్య వారు  తనకు  రాముని  సన్నిధి  సేవే  సుఖమని  తెలియజేశారు. 

  త్యాగయ్యగారు  మహా  భక్తులు  కాబట్టి  అలా  నిబ్బరంగా  ఉండగలిగారు. ఈ  రోజుల్లో  ప్రజలకు  ఇలాంటి  పరీక్ష  ఎదురైతే  ?  

రామసేతు  కట్టడాన్ని  కొంతవరకు  తీసి  దారి  ఏర్పరిస్తే   ఆర్ధికంగా  కొన్ని  లాభాలు  ఉంటాయని  కొందరు  అంటున్నారు. 


కొందరేమో  రామసేతుకు  హాని  కలిగించటం  వల్ల  పర్యావరణానికి  హాని  వంటి  ఎన్నో  నష్టాలుంటాయని  అంటున్నారు.

  శ్రీరాముని  కాలంలో  కట్టబడినదిగా  భావిస్తున్న  రామసేతును  కదిలించటం   అనే  ఆలోచన   ఎంతో  దురదృష్టకరమైనది. 


 కొందరు విదేశాల  వాళ్ళు  తమ దేశాల లోని  పురాతన  కట్టడాలను  ఎంతో  జాగ్రత్తగా  కాపాడుకుంటారు.  మనదేశంలో  అంత  శ్రద్ధ  కనిపించటం  లేదు.

 మనం  కొత్తగా  కట్టడం  లేకపోయినా  పూర్వం  నుంచి  ఉన్నవాటిని  పడగొట్టి  సొమ్ము  చేసుకోవటం  గురించి  ఆలోచించటం  అనేది  ఎంతో   దురదృష్టకరమైన  విషయం. 

అందునా  రామసేతు  కట్టడం  కేవలం  ప్రాచీన కట్టడం మాత్రమే  కాదు. అది  పరమ  పవిత్రమైన నిర్మాణము.  

డబ్బు   ఎలాగైనా  సంపాదించుకోవచ్చు.  పురాతన  కట్టడాలను  మళ్ళీ  రప్పించలేము  కదా  ! పురాతన  కట్టడాల  విలువ  డబ్బుతో  తూచలేనిది.


  మనలో  చాలా  మందికి  భక్తి  ఉంటోంది  కానీ , నిధికన్నా  రాముని  సన్నిధి  సేవే  సుఖమని  అనుకునేవారు   తక్కువమంది.
 

నేటి సమాజంలో  పెరిగిన   ఎన్నో  ఆకర్షణల  నడుమ  మనస్సును  అదుపులో  పెట్టుకోలేక  కొందరు  పాపాలను  కూడా చేస్తున్నారు.

 దేవాలయాలు  ఎందరో  భక్తులతో  కిటకిటలాడుతున్నాయి.

   ప్రజలలో  పాపభీతి ఉండటం  అనేది  ఎంతో  సంతోషించవలసిన  విషయం.   

డబ్బు   ఎలాగైనా  సంపాదించుకోవచ్చు .  అంటే,  దేశంలో  పెరిగిపోయిన  అవినీతిని  నిర్మూలించటం,  విదేశాలకు  తరలిపోతున్న  నల్లడబ్బుకు   అడ్డుకట్టవేయటం,  సంపద  కొందరి  దగ్గరే  ప్రోగుపడకుండా   చూడటం..... వంటి   చర్యలను  కఠినంగా  అమలుచేసినప్పుడు  ఈ  దేశంలో  ఆర్ధిక  సమస్యలు  ఉండవు. 

అంతేకాని, ఆర్ధికాభివృద్ధి  కోసం  అని  చెప్పి, పురాతన  కట్టడాలకు  హాని  కలిగించటం  ఏమిటో ? అర్ధం  కావటం లేదు.



6 comments:

  1. మనం కొత్తగా కట్టడం లేకపోయినా పూర్వం నుంచి ఉన్నవాటిని పడగొట్టి సొమ్ము చేసుకోవటం గురించి ఆలోచించటం
    ----------------------------------------------------
    అదేకదా మన పాస్ టైం. ఎల్లా నిలుపు కుందామనే ఆలోచన ఉండదు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      మీరన్నది నిజమేనండి.
      రామసేతు విషయంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో ? ఏమిటో ?

      Delete
  2. ఆలోచనాత్మకమైన పోస్ట్. అందరూ మన పురాతన చారిత్రిక అమూల్య అద్భుత కట్టడాలను సంరక్షించుకుంటే ఎంతో బాగుంటుంది .

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      మీరన్నది నిజమేనండి.
      మన పురాతన చారిత్రిక అమూల్య అద్భుత కట్టడాలను సంరక్షించుకుంటే ఎంతో బాగుంటుంది .

      Delete
  3. ఎలాగయినా సరే డబ్బు సంపాదించెయ్యాలి, అదీ నేటి సమాజ ఆలోచన, దానినుంచి మరలుతారేమో చూదాం, అంతకుమించి చేయగలది లేదు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      మీరన్నది నిజమేనండి.
      ఎలాగయినా సరే డబ్బు సంపాదించెయ్యాలి, అని భావించే వారి సంఖ్య పెరిగింది.

      Delete