ఓం.
శ్రీ పాద శ్రీ వల్లభస్వామికి వందనములు.
త్రిమూర్తులకు వారి పత్నులకు వందనములు.
గాయత్రీ దేవి అమ్మవారికి వందనములు.
విశ్వామిత్ర మహర్షికి వందనములు.
గాయత్రి మంత్రమును స్త్రీలు జపించకూడదని కొందరు అంటారు.
స్త్రీలకు కొన్ని శారీరిక సంబంధమైన అడ్డంకులు ఉండటం కూడా పూర్వీకులు ఇలా చెప్పటానికి ఒక కారణం అయి ఉండవచ్చు. అని అనిపిస్తుంది.
వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
మన వారు చెప్పిన వాటికి కారణాలుండచ్చు, మనకు తెలియటం లేదు.వద్దన్న పని చేయడం మంచిది కాదేమో! కారణం ఎవరేనా వివరిస్తారేమో చూదాం.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteనిజమేనండి, మన వారు చెప్పిన వాటికి కారణాలుండచ్చు, మనకు తెలియటం లేదు.వద్దన్న పని చేయడం మంచిది కాదేమో!
మంచి ప్రశ్న.
ReplyDeleteగాయత్రీమంత్రాధిష్టానదేవత స్వయంగా స్త్రీ అయినా గాయత్రీ మంత్రజపం స్త్రీలు యెందుకు చేయరాదు అని ప్రశ్నించటం కూడా సహజమే.
నిజానికి స్త్రీలకు యే మంత్రోపదేశాలూ విధించబడలేదు. దీని అర్థం వారిని మంత్రప్రయోజనాలనుండి వెలిగా ఉంచారని కాదు. అటువంటి అవసరం వారికి లేదనే అర్థం.
గృహమేధి చేసే సమస్తమైన ధర్మార్థసాధనాక్రియల యొక్క ఫలితాలలోనూ స్త్రీలకు అయాచితంగా సగానికి సగం భాగం లభిస్తుంది.
మంత్రానుష్ఠానంలో అనేక విషయాలున్నాయి. మంత్రజపానికి శుచీ, శ్రథ్థా, అర్చనావిధులు, పునశ్చరణాదికాలు విధించబడుతుంటాయి. అవన్నీ పాటించటం స్త్రీలకు దుష్కరం.
యే మంత్రమైనా స్త్రీలకు దుష్ఫలకారిగాని అపాయకారిగాని కాదు. కాని అవసరం లేదు కద.
మంత్రమన్నాక బీజాక్షరాలు, వాటినీ మంత్రాన్నీ సుస్వరంగా ఉఛ్ఛరించటానికి వేదాభ్యసనం అవసరం. వేదవిద్య అనేది సంవత్సరాల శ్రమతో గురుముఖంగా నేర్చుకోవలసి ఉండటమూ. అది స్త్రీలకు తరచుగా అసాధ్యంగ ఉండటమూ కూడ కారణాలే.
స్త్రీలకు పురాణేతిహాసాలు, నామస్మరణాదులు సరిపడా ఫలితాన్నిస్తాయి. వారికి మంత్రానుష్ఠానకష్టం లేదు.
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteఎన్నో విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదములండి.
నిజమేనండి , స్త్రీలకు శారీరిక కారణాల వల్ల కొన్ని నియమాలను పాటించటం కుదరకపోవచ్చు.
మీరన్నట్లు , స్త్రీలకు పురాణేతిహాసాలు, నామస్మరణాదులు సరిపడా ఫలితాన్నిస్తాయి.
పురాణేతిహాసాలు నామస్మరణాదుల వల్ల దైవకృప లభిస్తుంది.
దైవకృపను పొందగలిగిన వారి జన్మ ధన్యమవుతుంది.
ఈ రోజులలొ, విష్ణు,లలితా సహస్రనామాలు గుడుల్లో ,ఇళ్ళల్లో సాముహికంగా నిర్వహిస్తున్నారు.ఇవి సామాన్యులు సహితం ఉచ్చరిస్తున్నారు.ఇవి కూడా స్త్రీలకు నిషేదమా? వీటిని సామాన్యులు (వేదాల అర్ధం తెలియనివారు,ఉచ్చారణ దోషం కలిగినవారు) ఉచ్చరించవచ్చునా?
ReplyDeletetulasi
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteమీరన్నది నిజం. విష్ణు,లలితా సహస్రనామపారాయణాలు గుళ్ళల్లో ,ఇళ్ళల్లో సామూహికంగా నిర్వహిస్తున్నారు. కాని అలా పారాయణం చేసే వారు కొన్ని ముఖ్యమైన విషయాల్లో పొరబడుతున్నారు.
ReplyDeleteజాగ్రత్తగా గమనిస్తే విష్ణుసహస్రంకూడా మంత్రమే. కాని సర్వులూ సర్వవేళలలోనూ కేవలం శ్లోకసంపుటిక్రింద భావించి పారాయణం చేయవచ్చును. విష్ణుసహస్రనామస్త్రోత్రం పారాయణం చేసేటప్పుడు పూర్వోత్తరపీఠికలు కూడా తప్పకుండా పారాయణం చేయాలి.
లలితాసహస్రనామస్తోత్రం పారాయణం చేసేటప్పుడు చాలా జాగ్రత వహించాలి. అత్యధికశాతం ప్రజలు సోత్రపాఠాన్ని తప్పుగా చదువుతున్నారు. విష్ణుసహస్రం పథ్థతి వేరు లలితా సహస్రం పథ్థతి వేరు. విష్ణుసహస్రంలో చాలా వరకూ విడివిడి నామాలు. (వాటిలో అనేక ఆవృత్తు లున్నాయి. అది వేరే విషయం). లలితా సహస్రనామస్త్రోత్రంలో చాలా నామాలు దీర్ఘంగా ఉంటాయి. అనేక నామాలు శ్లోకంలో అర్థభాగం పరిమాణంలో ఉన్న సమాసాలుగా ఉంటాయి. అనేక మంది ఆ దీర్ఘనామాలను భ్రమపడి విడదీసి చదువుతున్నారు. అది చాలా తప్పు. అపాయకరం కూడా. ఎందుకంటే అలా విడదీసి నపుడు తప్పుడు అర్థాలు వచ్చే ప్రమాదం చాలా చోట్ల ఉన్నది. సరియైన ఉఛ్ఛారణ తెలిసి మరీ నామపారాయణం చేయటం అత్యావశ్యకం.
ఇంకా దారుణం యేమిటంటే పారాయణం గ్రూపులు కొన్నిటిలో చాలా డాంబికం చూసాను. వాటి లీడర్లు లలితాసహస్రనామాలకు -ఏమీ తెలియకుండానే- వ్యాఖ్యానం కూడా వెలిగిస్తున్నారు పారాయణం చేస్తున్న గృహస్థుల యిళ్ళలో. తగినంతగా పెద్దలవద్ద నేర్చుకోకుండా పరిశ్రమ చేయకుండా యిలాంటి పనులు చేసే వాళ్ళు అహితం కలిగిస్తున్నారు.
శ్యామలీయం గారు బాగా చెప్పేరు. సామూహికంగా పారాయణ చేసే చోట అప శబ్దాలు వినపడుతున్నాయి, చాలా చోట్ల, చెప్పలేక, చెప్పకుండా ఉండలేక బాధగా అక్కడనుంచి వెళిపోడం జరుగుతోంది.
ReplyDeleteఒకసారి నేనైతే అలా తప్పించుకు వెళ్ళలేక యిరుక్కుపోయిన దుఃస్థితి కూడా దాపురించింది. మా తోడల్లుడిగారింట్లో ఒక గ్రూపు వాళ్ళొచ్చి లలితాసహస్రం నానాభ్రష్టుగానూ పారాయణం చేసారు. పుండుమీద కారం చల్లినట్లుగా వారి నాయకురాలు కొన్ని నామాలకు భాష్యం కూడా సెలవిచ్చారు వినే వాళ్ళలో తెలిసినవారెవరైనా ఉంటే తలతిరిగిపోయేలా. మిగిలిన ఆవిడ శిష్యపరమాణువులు అటుపిమ్మట ఆవిడ విద్వత్తును వేనోళ్ళుగా పొగడతమూ తద్విద్వన్మణికి ఘనసన్మానమూ కూడా జరిగాయి.
Deleteఅలాగే మాయింటికే వచ్చి ఒక మహానుభావుడు సుందరకాండ పారాయణం చేసారు. వారు తమ యిచ్చవచ్చినట్లుగా హనుమంతులవారిని ఆడిస్తూ పోతుంటే నాకు దిక్కు తోచలేదు.
ఇలాంటివి మరికొన్ని సంఘటనలూ చూసాను.
కాబట్టి అందరికీ జాగ్రత వహించమని మనవి చేస్తున్నాను.
* శర్మ గారు, శ్యామల రావు గారు చక్కటి విషయములను తెలియజేశారు.
ReplyDelete* లలితా, విష్ణు...సహస్రనామ స్తోత్రములను కొందరు ప్రతిరోజు పఠిస్తారు. కొందరు అప్పుడప్పుడు పఠిస్తారు. గాయత్రి మంత్రము విషయములో ఇలా కాదు .
* శారీరిక కారణముల వల్ల స్త్రీలకు అడ్డంకులు ఉంటాయి. స్త్రీలు గాయత్రి మంత్ర జపం చేయటం గురించి ఇంతకుముందు వ్యాఖ్యలలో శ్యామల రావు గారు ఎన్నో విషయములను తెలియజేశారు.
* విష్ణు, లలితా సహస్ర నామస్తోత్రములను ఎవరైనా పఠించవచ్చు కానీ తప్పులు లేకుండా పఠించాలని, విష్ణు, లలితా సహస్రనామావళిః పఠించే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని విన్నాను. ఇక్కడ మనము గమనించవలసినది నామ స్తోత్రమును పఠించటానికి నామావళిః పఠించటానికి గల తేడా గురించి. ( ఈ విషయాల గురించి నాకు ఎక్కువగా తెలియదు. ).
*లలితా, విష్ణు...సహస్రనామ స్తోత్రములను తప్పులు లేకుండా పారాయణం చేయాలి.
మనకు ఇష్టం వచ్చినట్లు కలిపేసి లేక మనకు ఇష్టం వచ్చినట్లు విడగొట్టి చదవకూడదట. పద్ధతి ప్రకారం అర్ధవంతంగా పఠించాలట.
* ఉదా. లలితా సహస్ర నామ స్తోత్రమును పఠించేటప్పుడు...
* అజా క్షయవినిర్ముక్తా ముగ్దా క్షిప్రప్రసాదినీ .. అని పఠించాలట.
* అజాక్షయ వినిర్ముక్తా ముగ్దాక్షి ప్రప్రసాదినీ .. అని పఠించకూడదట.
* లలితా సహస్ర నామావళిః చదివి , లలితా సహస్ర నామ స్తోత్రములోని ఒక్కొక్క నామమునకు ప్రక్కన కామా గుర్తు పెట్టుకుంటే వివరంగా తెలుస్తుంది.
* లేకపోతే పండితులు పఠించిన శ్రీ లలితాసహస్రనామస్తోత్రము కాసెట్ కొనుక్కుని నేర్చుకోవచ్చు. టీవీచానల్స్ లో కూడా లలితా సహస్రనామస్తోత్రము గురించి పండితులు ఎన్నో వివరములను తెలియజేస్తున్నారు.
* విష్ణు, లలితా సహస్ర నామ స్తోత్రము ముద్రించిన కొన్ని పుస్తకములలో అచ్చుతప్పులు ఉంటున్నాయి. ఇలా అచ్చు తప్పులు లేకుండా జాగ్రత్తగా ముద్రించాలి. మా వద్ద ఉన్న పుస్తకములో ముగ్దా...అని ఉంది. ముగ్దా అని ఉండాలో ? లేక ముగ్ధా అని ఉండాలో నాకు తెలియదు.
* కొందరు పండితులు ఏమంటున్నారంటే , విష్ణు, లలితా సహస్ర నామములు , గాయత్రి మంత్రము.. రింగ్ టోన్లుగా ఎక్కడబడితే అక్కడ వినిపించకూడదంటున్నారు.
* నేను వ్రాసే విషయములలో ఏమైనా తప్పులు ఉంటే మొహమాటం లేకుండా చెప్పమని కోరుకుంటున్నానండి.
లిలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదవడం, పఠించడం అనకూడదు, పారాయణ చేయడమనే అనాలి.
ReplyDelete
Deleteవిషయమును తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.
మరొక ప్రశ్న
ReplyDeleteలలితా,విష్ణు సహస్రనామం చేసినవారు బ్రహ్మచర్యం పాటించవలెనా?సంసారులు పారయణ చేయవచ్చునా? అవి చదివేవారు పవిత్రంగా ఉండాలి (చదివినన్నిరోజులు )అని ఒక పెద్దాయన అన్నారు.
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteసంసారులు ఎందరో లలితా, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని, నామ పారాయణాన్ని చేస్తున్నారట. కొందరు రోజూ పారాయణం చేస్తారట.. బ్రహ్మచర్యం పాటించనవసరం లేదని నా అభిప్రాయం.
ఇక ఇంట్లో పెద్ద ఎత్తున పూజ చేసుకుని సత్యనారాయణ స్వామి వ్రతం వంటివి చేసుకున్నప్పుడు ఆ సందర్భంగా ప్రత్యేకముగా లలితా, విష్ణు సహస్రనామావళిని పారాయణం చేయటం జరిగినప్పుడు మాత్రం బ్రహ్మచర్యం వంటి కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుందని అనుకుంటున్నాను.
( ప్రత్యేకమైన పూజలు జరిగే రోజులలో ) .
చాలాకాలం తరువాత చదువుతుంటే, ఒక సందేహం కలిగింది...
ReplyDeleteపైన కామెంట్ వద్ద నేను..పారాయణం అని వ్రాసాను.
అలా కాకుండా, పారాయణ అని వ్రాయాలేమో ? అనిపించింది.