koodali

Wednesday, March 6, 2013

బ్లాగ్ లో పచ్చగా ఉన్న చిత్రం..కొన్ని విషయాలు....

 
ఓం.
ఈ  బ్లాగ్ లో  పచ్చగా  ఉన్న  ఒక  చిత్రం  కనిపిస్తోంది  కదా  ! ఈ  చిత్రాన్ని   కంప్యూటర్లో  చూసి  బాగుందని  బ్లాగ్ లో  పెట్టాము.

ఈ  చిత్రాన్ని  ఎవరు  తీసారో  కానీ,   చాలా  బాగా  తీశారు. చిత్రంలోని   ప్రదేశం  కళ్ళముందు  ఉన్నట్లే  అనిపిస్తుంది. అయితే  ఈ  సీనరి  ఎక్కడిదో ? ఎవరు  తీసారో ? మాకు  తెలియదు. ఈ  చిత్రంలోని  పరిసరాలు  ఎక్కడివో ?  అనుకున్నాము.

అయితే, కొంతకాలం  క్రిందట  నేను....
Mahima Shanidev Ki 12march 1 HQ - YouTube .....లో   చూస్తుంటే  ఈ చిత్రంలోని  పరిసరాలు  కనిపించాయి.

ఆశ్చర్యంతో  మళ్ళీ  చూస్తే  నాకు  తెలిసిందేమిటంటే , శ్రీ  శనిదేవుని  మహిమలు  సీరియల్ లోని  అష్టావక్ర  మహర్షి  కధలోని  భాగాన్ని  ఈ  చిత్రంలోని  పరిసరాల్లో  చిత్రీకరించారని  నాకు  అనిపించింది. 



  ఈ  చిత్రంలోని  పరిసరాలు  బాగున్నాయని  భావించి,  ఎవరో   సీనరీగా  కంప్యూటర్ లో  పెట్టి  ఉంటారని  నాకు  అనిపించింది.
  కంప్యూటర్లో  ఈ  చిత్రాన్ని   చూసి  బాగుందని  బ్లాగ్ లో  పెట్టాము. ఇదంతా  నాకు  చిత్రంగా  ఉన్నది. 


మహారాష్ట్ర లో  శిరిడికి  కొంత  దూరంలో  ఉన్న  శ్రీ  శనిదేవుని  శింగణాపూర్ క్షేత్రం ఎంతో  గొప్పది. ఎందరో భక్తులు ఈ  క్షేత్రాన్ని  సందర్శిస్తుంటారు.
 
శ్రీ శ్రీ  ఆదిపరాశక్తి  అయిన  పరమాత్మకు  వందనములు.

శ్రీ  శనేశ్వరునికి వందనములు.  శ్రీ  శనేశ్వరునికి పత్ని శ్రీ  జ్యేష్ఠాదేవి .  శ్రీ  జ్యేష్ఠాదేవి  అమ్మవారికి  వందనములు. 


శ్రీ  శనిదేవుడు  న్యాయాన్ని  పరిరక్షిస్తారని  పెద్దలు  తెలియజేశారు.

వ్రాసిన  విషయములలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే   దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



No comments:

Post a Comment