ఓమ్
శ్రీ లలితా అమ్మవారి నామములలో సుఖారాధ్యా అనే నామము కూడా ఉన్నది. దయామయి అయిన అమ్మను భక్తులందరూ చక్కగా ఆరాధించుకోవచ్చు.
..........................
ఇంతకుముందు ఒక టపాలో ఒకరు వ్యాఖ్యానిస్తూ ...
ఈ రోజులలొ, విష్ణు,లలితా సహస్రనామాలు గుడుల్లో ,ఇళ్ళల్లో సాముహికంగా నిర్వహిస్తున్నారు.ఇవి సామాన్యులు సహితం ఉచ్చరిస్తున్నారు.ఇవి కూడా స్త్రీలకు నిషేదమా? వీటిని సామాన్యులు (వేదాల అర్ధం తెలియనివారు,ఉచ్చారణ దోషం కలిగినవారు) ఉచ్చరించవచ్చునా? .... అన్నారు.
ఈ వ్యాఖ్యకు శ్రీ శర్మ గారు, శ్రీ శ్యామల రావు గారు తమ అభిప్రాయములను తెలియజేశారు.
నేను నా అభిప్రాయములను తెలియజేస్తూ .......ఈ క్రింది విధంగా వ్రాశాను.
శ్రీ విష్ణు,శ్రీ లలితా సహస్ర నామస్తోత్రములను ఎవరైనా పఠించవచ్చు కానీ తప్పులు లేకుండా పఠించాలని, విష్ణు, లలితా సహస్రనామావళిః పఠించే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని విన్నాను. ఇక్కడ మనము గమనించవలసినది నామ స్తోత్రమును పఠించటానికి నామావళిః పఠించటానికి గల తేడా గురించి.
( ఈ విషయాల గురించి నాకు ఎక్కువగా తెలియదు.)....అని వ్రాశాను.
...............................................
ఈ రోజు సాయంత్రం భక్తి టీవీలో డాక్టర్ శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు చక్కటి విషయాలను తెలియజేశారు. వారు ఏం చెప్పారంటే , శ్రీ లలితా సహస్ర నామస్తోత్రమును, శ్రీ లలితా సహస్ర నామములను భక్తులు ఎవరైనా పారాయణ చేయవచ్చునని తెలియజేశారు.
తప్పులు లేకుండా పారాయణ చేయాలని తెలియజేశారు.
దైవం యందు భక్తి, శ్రద్ధ లేనివారికి తప్ప, భక్తులకు శ్రీ లలితా సహస్ర నామస్తోత్రమును, శ్రీ లలితా సహస్ర నామములను గురించి తెలియజేయవచ్చునన్నారు.
ఇంకా ఎన్నో విషయములను తెలియజేసారు.
( క్షమించాలి, సర్ తెలియజేసిన విషయాలను నాకు తోచినంతలో వ్రాశాను. )
.....................................
పండితుల ద్వారా నేను తెలుసుకున్న కొన్ని విషయములను వ్రాస్తున్నాను.
లలితా సహస్రనామ స్తోత్రమును మనకు ఇష్టం వచ్చినట్లు కలిపేసి లేక మనకు ఇష్టం వచ్చినట్లు విడగొట్టి పారాయణ చేయకూడదట.
ఉదా.....
లలితాదేవి యొక్క కొన్ని నామములు ....
* అజా
* క్షయవినిర్ముక్తా
* ముగ్ధా
* క్షిప్రప్రసాదినీ
అజా క్షయవినిర్ముక్తా ముగ్దా క్షిప్రప్రసాదినీ .. అని పారాయణ చేయాలట .
అజాక్షయ వినిర్ముక్తా ముగ్దాక్షి ప్రప్రసాదినీ .. అని పారాయణ చేయకూడదట.
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము ముద్రించిన కొన్ని పుస్తకములలో అచ్చుతప్పులు ఉంటున్నాయి. అచ్చు తప్పులు లేకుండా జాగ్రత్తగా ముద్రించాలి. మా వద్ద ఉన్న ఒక పుస్తకములో ముగ్దా...అని ఉంది. ఒక పుస్తకములో ముగ్ధా ...అని ఉంది.
ముగ్దా అని ఉండాలో ? లేక ముగ్ధా అని ఉండాలో నాకు తెలియదు.
( వత్తు ఉంటుందో ? ఉండదో ? ).
ఒకవేళ మనం తెలిసితెలియక తప్పుగా పారాయణం చేసినా, అమ్మ దయామయి కదా ! క్రమంగా మన తప్పులు సరిదిద్దబడతాయి .
*******************
లలితా సహస్ర నామావళిః పారాయణ చేస్తూ , లలితా సహస్ర నామ స్తోత్రములోని ఒక్కొక్క నామమునకు ప్రక్కన కామా గుర్తు పెట్టుకుంటే వివరంగా తెలుస్తుంది. (నేను కొంతవరకు ఈ విధంగా ప్రయత్నించాను.)
( పెన్నుతో కాకుండా పెన్సిల్ తో కామా గుర్తు పెట్టుకుంటే తప్పు వచ్చినప్పుడు సరిదిద్దుకోవటానికి సులభంగా ఉంటుంది. )
ఒక్కొక్క నామము ప్రక్కన కామా పెట్టుకుని , దానితో పాటు పండితులు పారాయణ చేసిన శ్రీ లలితా సహస్ర నామస్తోత్రము పారాయణ విధానమును గమనించితే సరియైన ఉఛ్ఛారణతో ఏ విధముగా పారాయణ చేయాలో సులభంగా తెలుస్తుంది.
నామముల ప్రక్కన కామాలు పెట్టుకునేది నామములను విడగొట్టి చదవటానికి కాదు, నామములను మన ఇష్టం వచ్చినట్లు కలిపి లేక విడగొట్టకుండా ఉండటానికి .
పైన వ్రాసిన విషయం వివరంగా ...
లలితాసహస్రనామస్తోత్రంలో కొన్ని నామములు కలిసి ఒకటే లైన్లో ఉంటాయి. ఒకటే లైన్లో కొన్ని నామములు ఉన్నప్పుడు సులభంగా తెలియటానికి ఆ లైన్ లో కామాలు పెట్టుకోవచ్చు.
ఉదా..అజా, క్షయవినిర్ముక్తా, ముగ్దా, క్షిప్రప్రసాదినీ,
లలితాసహస్రనామస్తోత్రంలో కొన్ని చోట్ల.. నామము పెద్దగా ఒకే లైన్ గా ఉంటుంది. ఆ నామము కామా లేకుండా ఒకటేగా చదవాలి.
ఉదా..సచామర రమా వాణీ సవ్య దక్షిణ సేవితా.
అలాంటి లైన్ క్రింద అండర్ లైన్ చేసుకుంటే , ఆ లైన్ అంతా ఒకటే నామము అని సులభంగా తెలుస్తుంది.
...........................
టీవీచానల్స్ లో లలితా సహస్రనామస్తోత్రము గురించి పండితులు ఎన్నో వివరములను తెలియజేస్తున్నారు.
శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, డాక్టర్ శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు ,శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు, డాక్టర్ శ్రీ జి.ఎల్.ఎన్.శాస్త్రి గారు..... ఇంకా ఎందరో పండితులు శ్రీ లలితా అమ్మవారి గురించి తెలియజేస్తున్నారు.

..............................
ఇంతకుముందు గానీ, ఈ టపాలో గానీ ఏమైనా పొరపాట్లు వ్రాసి ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
నేను తెలుసుకున్న విషయాలు తక్కువ. నేను ఏమైనా పొరపాట్లు వ్రాసి ఉంటే , తెలిసినవారు దయచేసి చెప్పవలెనని కోరుతున్నానండి .
శ్రీమైలవరపువారు చెప్పిన అభిప్రాయాలనే నేనూ నా వ్యాఖ్యలలో తెలియజేసాను. గమనించగలరు.
ReplyDeleteసర్ ! మీరు చెప్పినది నిజమేనండి.
Deleteమీకు కృతజ్ఞతలండి.
ఇక్కడ ఇంతకుముందు kastephale బ్లాగ్ శర్మ గారు కూడా వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్య పొరపాటున డిలీట్ అయ్యింది.
Deleteఇందుకు శర్మ గారు దయచేసి నన్ను క్షమించాలి.
అసలేం జరిగిందంటేనండి, ఇంతకుముందు శ్రీ శ్యామల రావు గారు, శ్రీ శర్మ గారు వ్యాఖ్యానించారు.
నేను రిప్లై ఇస్తూ .... సర్ ! మీరు చెప్పినది నిజమేనండి . అని ఇద్దరి వ్యాఖ్యలకు ఒకే విధంగా వ్యాఖ్యానించాను. అయితే కృతజ్ఞతలని వ్రాయలేదు.
( ప్రతిసారి కృతజ్ఞతలండి . అని వ్రాయటం అతిగా ఉంటుందేమోనని భావించి , కృతజ్ఞతలని వ్రాయలేదు. )
అయితే, తరువాత వ్యాఖ్యానించిన వారి వ్యాఖ్యలకు కృతజ్ఞతలండి అని వ్రాయటం జరిగింది.
ఇవన్నీ గమనించిన తరువాత నేను ఏమనుకున్నానంటే ,
శ్రీ శ్యామల రావు గారు, శ్రీ శర్మ గారు వ్రాసిన వ్యాఖ్యలకు రిప్లైగా కృతజ్ఞతలు అని వ్రాయలేదు కదా ! కొందరికి కృతజ్ఞతలు అని వ్రాసి కొందరికి వ్రాయకపోతే అపార్ధం చేసుకుంటారేమోనని భావించాను.
అందువల్ల, ఈ రోజు పాత రిప్లైలను డిలీట్ చేసి కొత్తగా వ్రాద్దామని భావించి , శ్యామలరావు గారికి నేను వ్రాసిన పాత రిప్లైను డిలీట్ చేసి ,
కొత్తగా...... సర్ ! మీరు చెప్పినది నిజమేనండి.
మీకు కృతజ్ఞతలండి. అని వ్రాసి వ్యాఖ్యను ప్రచురించాను.
అలాగే శర్మగారికి నేను వ్రాసిన పాత రిప్లైను డిలీట్ చేసి ,
కొత్తగా......
సర్ ! మీరు చెప్పినది నిజమేనండి.
మీకు కృతజ్ఞతలండి. అని వ్రాసి వ్యాఖ్యను ప్రచురించాలని భావించి , డిలీట్ నొక్కితే.....
నేను వ్రాసిన రిప్లైతో పాటు శర్మగారి వ్యాఖ్య కూడా డిలీట్ అయ్యింది .
( ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలియదండి. )
శర్మగారి వ్యాఖ్య డిలీట్ అవ్వటం చూసిన తరువాత నాకు కంగారు వేసింది.
నేనే కావాలని శర్మగారి వ్యాఖ్యను డిలీట్ చేసానని శర్మగారు నన్ను అపార్ధం చేసుకుంటారేమోననే భయంతో జరిగిన విషయాన్ని వివరంగా వ్రాసానండి.
............................
నేను ఇతరుల వ్యాఖ్యలకు రిప్లైలు ఇచ్చేటప్పుడు , ఇతరుల బ్లాగులలో నేను వ్యాఖ్యానించేటప్పుడు కూడా కొన్నిసార్లు నాకు తికమకలు ఎదురయ్యాయి.
ఇవన్నీ ఇలా ఎందుకు జరుగుతాయో తెలియదు. అయితే ఇవన్నీ గమనిస్తే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
శ్రీమాత్రే నమః
ReplyDeleteమీ వినయ పూర్వకమైన, భక్తి పూర్వకమైన సమాచారం చక్కగా ఉందండీ.
నిజమే లలితా సహస్ర నామము ఎవరైనా పఠించవచ్చు, కానీ ఒక జాగ్రత్త ఏమిటంటే, అంగన్యాస, కరన్యాసములు చేయకుండా శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ దగ్గర నుంచి మాత్రమే చదవాలి అని నేను విన్నాను.
మీరు చెప్పినట్లుగా నామాలను సరైన ఉఛ్చారణతోనూ, సరైన పదవిభజన చూసుకుని చదవాలి, లేకపోతే తప్పు అర్ధాలు వస్తాయి. ఇలా తప్పుగా చదవడం అనేది మొదట్లో తెలియక అజ్ఞానంతో అయితే అమ్మవారు తప్పకుండా క్షమించి, అమ్మవారే సరిదిద్దుతుంది.
శ్రీమాత్రే నమః
శ్రీమాత్రే నమః
Deleteలలితా సహస్ర నామము ఎవరైనా పఠించవచ్చు, కానీ ఒక జాగ్రత్త ఏమిటంటే, అంగన్యాస, కరన్యాసములు చేయకుండా శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ దగ్గర నుంచి మాత్రమే చదవాలి అని నేను విన్నాను.
నామాలను సరైన ఉఛ్చారణతోనూ, సరైన పదవిభజన చూసుకుని చదవాలి, లేకపోతే తప్పు అర్ధాలు వస్తాయి. ఇలా తప్పుగా చదవడం అనేది మొదట్లో తెలియక అజ్ఞానంతో అయితే అమ్మవారు తప్పకుండా క్షమించి, అమ్మవారే సరిదిద్దుతుంది.
చక్కటి విషయాలను తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలండి.
ice thing sir share it with all.............
ReplyDeleteవ్యాఖ్యానించినందుకు మీకు కృతజ్ఞతలండి.
Deleteనేను మహిళను.
ReplyDeleteకొన్ని విషయములండి..
లలితాసహస్రనామస్తోత్రంలో కొన్ని నామములు కలిసి ఒకటే లైన్లో ఉంటాయి. ఒకటే లైన్లో కొన్ని నామములు ఉన్నప్పుడు సులభంగా తెలియటానికి ఆ లైన్ లో కామాలు పెట్టుకోవచ్చు.
ఉదా..అజా, క్షయవినిర్ముక్తా, ముగ్దా, క్షిప్రప్రసాదినీ,
లలితాసహస్రనామస్తోత్రంలో కొన్ని చోట్ల.. నామము పెద్దగా ఒకే లైన్ గా ఉంటుంది. ఆ నామము కామా లేకుండా ఒకటేగా చదవాలి.
ఉదా..సచామర రమా వాణీ సవ్య దక్షిణ సేవితా.
అలాంటి లైన్ క్రింద అండర్ లైన్ చేసుకుంటే , ఆ లైన్ అంతా ఒకటే నామము అని సులభంగా తెలుస్తుంది.
శ్రీ రాజరాజేశ్వర్యష్టకంలో ..
ReplyDeleteవారాహీమధుకైటభప్రశమనీ ..అని అంతా ఒకే నామంలా గబగబా అనకుండా..
వారాహీ తరువాత కొద్దిగా గాప్ ఇచ్చి మధుకైటభప్రశమనీ అని అనాలని నా అభిప్రాయం.
ReplyDeleteదైవం గురించి.. శ్రీ నండూరి శ్రీనివాస్ గారు ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు.
ReplyDeleteదైవం గురించి.. ఎందరో ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు.