koodali

Monday, March 4, 2013

ఆధునిక టెక్నాలజీ ..మరి కొన్ని సంగతులు .

 
 ఆధునిక  టెక్నాలజీ  వల్ల  కమ్యూనికేషన్  అభివృద్ధి  అయిన  మాట  నిజమే.  అయితే , పురాతన కాలం నుండి  ఇప్పటి  వరకూ  కూడా  పురాణేతిహాసాలు  ప్రాచీన  విజ్ఞానం ఒక  తరం  నుండి  తరువాత  తరానికి  భద్రంగా అందింపబడుతూ  ఉండటమనేది  ఎంతో  అద్భుతమైన విషయం. దైవం దయ  వల్లనే  ఇలా  జరుగుతుంది.
....................................


ఆధునిక  విజ్ఞానం  మంచిదే.  దీనివల్ల  లాభాలు  ఉన్నాయి. అయితే  తగినవిధంగా  వాడుకోకపోతే కొన్ని   నష్టాలు  కూడా  ఉన్నాయి.

 ఎలెక్ట్రానిక్  వస్తువుల  వల్ల  ఆరోగ్యానికి  కొంత  హాని  కలిగే  అవకాశం  ఉంది  కాబట్టి ,  జాగ్రత్తలు  తీసుకోవాలి .  అని  కొందరు  హెచ్చరిస్తున్నారు. 


కాబట్టి  , ఎలెక్టానిక్  వస్తువులు   వాడేటప్పుడు  కొన్ని  జాగ్రత్తలు  తీసుకోవటం  వల్ల  లాభమే  కానీ  నష్టమేమీ  ఉండదు.

 లాప్ టాప్  వంటి  ఆధునిక  ఉపకరణాల  నుండి  వెలువడే   రేడియేషన్  మొదలైన  విషయాల   గురించి  అంతర్జాలంలో  చూడవచ్చు. 

వాడిపారేసిన  ఎలెక్ట్రానిక్  వస్తువుల  వల్ల  కూడా  వాతావరణం  కలుషితమవుతోందని  కొందరంటున్నారు. (  ఆ  పరికరాల  తయారీలో  వాడిన  పదార్ధాల  వల్ల.  ) 


మానవుల  అంతులేని  కోరికల  కోసం  మూగ జీవులు  అంతరించి  పోతున్నాయి. 


ఆ మధ్య  జీవవైవిధ్య  సదస్సు  జరిగినప్పుడు ప్రపంచంలో  అంతరించిపోతున్న  జీవ జాతుల  గురించి  అందరూ చర్చించారు   కదా  !


   ఇంతకుముందు  ఎక్కువగా  కనిపించే పిచ్చుకలు,  కాకులు  వంటి  పక్షులు ఇప్పుడు  ఎక్కువగా  కనిపించటం  లేదు . అన్నది  మనకు  తెలిసిన  విషయమే. 



  గ్లోబల్ వార్మింగ్  వంటి  సమస్యల  వల్ల  ఇతర  జీవజాతులకు  నష్టం  కలుగుతున్నప్పుడు  మానవులకు  మాత్రం  ఆరోగ్య  సమస్యలు  రాకుండా  ఉంటాయా  ?

 
మనుషుల్లో   పూర్వం  60  ఏళ్ళు  వచ్చిన  వారిలో  కనిపించే  కంటి ,  పంటి  సమస్యలు, జుట్టు  తెల్లబడటం  వంటి   లక్షణాలు  ఈ  కాలంలో  చిన్నపిల్లలలోనే   కనిపిస్తున్నాయి. 


 మన  అంతులేని  కోరికలను  తగ్గించుకుంటే  పర్యావరణ  కాలుష్యం  తగ్గుతుంది. ........అంతేకానీ  కోరికలను  పెంచుకుంటూ  పోతే  అంతరించిపోతున్న  జీవజాతుల  జాబితాలో  మానవులు  కూడా   చేరే  ప్రమాదముంది.

 
ఇక  ముందుముందు  నానో  టెక్నాలజీ  రాబోతోంది  అంటున్నారు. ఇక  దాని  ఫలితాలెలా  ఉంటాయో  ?  కాలమే  నిర్ణయించాలి.   


ఇలాంటి  విషయాలలో  పెద్దలు  చెప్పినట్లు  కీడెంచి  మేలెంచటం  ఎంతైనా  అవసరం.

 ( ఈ  మధ్య  ఒకరు  తమ   బ్లాగ్ లో  నానో టెక్నాలజి  గురించిన  సందేహాలను  వివరించారు.....
  ) .

 ఆధునిక  విజ్ఞానాన్ని  అవసరమైనంత  వరకు  మాత్రమే  వాడుకుంటే  మంచిది.   


ఉదా...మనుషులు  ఎత్తలేని  బరువుల  కోసం  క్రేన్  వాడకం   ఉపయోగకరమే. అయితే  కొద్ది  దూరానికి  కూడా  కారులోనే  వెళ్ళాలనుకోవటం  అనవసరం  కదా  ! ... ఇలా  ఏది  ఎంతవరకు  అవసరమో  విచక్షణతో  ఆలోచించుకోవాలి.

 

No comments:

Post a Comment