చాలామందికి లాగే నాకు కూడా చెట్లు, మొక్కలంటే చాలా ఇష్టం. మొక్కలు, చెట్లు మధ్య తిరుగుతుంటే చాలా బాగుంటుంది.
చెట్లను, మొక్కలను పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది.
నీటిలో పెరిగే తామరమొక్కల ఆకులు చిత్రమైన లక్షణాలను కలిగి ఉంటాయి . తామరాకు పైన నీటిబొట్టు జర్రున జారిపోతుందికదా !
ఇప్పుడు మనం వాడుతున్న ప్లాస్టిక్ వల్ల ఎన్నో పర్యావరణ సమస్యలు వస్తున్నాయి.
కొంతకాలం క్రిందట అయితే ఇడ్లీలను అమ్మేవాళ్ళు ఇడ్లీలతో పాటు కొబ్బరిపచ్చడిని తామరాకులలోనే పొట్లం కట్టి ఇచ్చేవారు.
తామరాకు వల్ల ప్లాస్టిక్ లాగా పర్యావరణ సమస్యలు ఉండవు.
............................................
మొక్కల వల్ల ఎన్నో లాభాలున్నాయి.
మొక్కలు, చెట్లు మనకు ఆహారాన్ని అందిస్తున్నాయి. అనారోగ్యం వస్తే ఔషధాలుగానూ ఉపయోగపడుతున్నాయి.
ఆయుర్వేద వైద్య విధానము ఎంతో గొప్ప వైద్యవిధానము. పసుపు , వేప వంటివాటిని మనము తరతరాలుగా వాడుకుంటున్నాము.
అయితే వైద్యాన్ని మనకు తోచినట్లు కాకుండా, వైద్యుల ద్వారా తెలుసుకుని, లేక ఇంట్లోని అనుభవజ్ఞులైన పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకుని వాడుకోవాలి.
సీతాఫలాన్ని చక్కగా తినవచ్చు. నేను ఒక దగ్గర చదివిన దాని ప్రకారం సీతాఫలం గింజల పొడి తలకు రాసుకుంటే పేలు చనిపోతాయట. అయితే ఆ ఆకు బాగా శక్తివంతమైనది కాబట్టి తలకు రాసుకునేటప్పుడు ఆకురసం కళ్ళల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలట.
పసుపులో కూడా యాంటిబయాటిక్ లక్షణాలున్నాయి . కానీ పసుపును మనము ఆహారంలో కూడా వేసుకుంటాము. పసుపు కళ్ళల్లో పడినంతమాత్రాన ప్రమాదమేమీ లేదు. ( నాకు తెలిసినంతవరకు ) .
అన్నిరకాల ఆకులు, పండ్లు........ ఒకే రకం లక్షణాలను కలిగిఉండవు కదా !
మొక్కల యొక్క ఆకులు, పువ్వులు , పండ్లు......వీటి లక్షణాలను చక్కగా తెలుసుకుని అప్పుడు వాడుకుంటే మంచిది.
.............................................
ఆయుర్వేదం ఎంతో గొప్ప శాస్త్రం. పూర్వం రోగి ముఖాన్ని పరిశీలించినంత మాత్రాన్నే రోగాన్ని తెలుసుకునే గొప్ప వైద్యులుండేవారట.
పూర్వం ప్రతి చిన్నరోగానికి వైద్యుల వద్దకు పరిగెట్టేవారు కాదట. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వంటల్లో వాడుకునే పదార్ధాలతోనే ఎన్నో రోగాలను పోగొట్టేవారట.
ఇప్పుడు ప్రతి చిన్న జబ్బుకు రసాయనిక మందులు వేసుకోవటం వల్ల శరీరం మందులకు అలవాటుపడి రోగాలు తగ్గని పరిస్థితి వచ్చే ప్రమాదముందంటున్నారు.
( యాంటిబయోటిక్స్ విచ్చలవిడి వాడకం వల్ల కొన్నిసార్లు రోగకారక బాక్టీరియ బలపడే అవకాశాలున్నాయట .)
మన నిర్లక్ష్యంతో ఎన్నో గొప్ప ప్రాచీన గ్రంధాలను పోగొట్టుకున్నాము. మిగిలిఉన్న గ్రంధాలనైనా జాగ్రత్తగా భద్రపరిచి ముందుతరాల వారికి అందించవలసిన అవసరం ఎంతో ఉంది.
...............................
వ్రాసిన వాటిలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను ..
ఉపయోగకరమైన సమాచారం.మీరు ఆయుర్వేద వైద్యులా!
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteమీ వ్యాఖ్యను కొద్దిసేపటి క్రితమే చూశాను. ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.
ఆయుర్వేదం గురించి పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకోవటం ఇంకా ఆయుర్వేద వైద్యులు తెలియజేసిన విషయాలను తెలుసుకోవటం ద్వారా నేర్చుకోవటమేనండి.