koodali

Monday, March 25, 2013

కొన్ని విషయాలు..



కొంతమంది చెడ్డ పనులు చేసి ఇతరులను ఇబ్బంది పెడుతూ తమకి మాత్రం మంచి జరగాలని గొప్ప ముహూర్తాల కోసం తాపత్రయ పడిపోతుంటారు.

నాకు ఏమనిపిస్తుందంటే మనం మంచిపనులు చేస్తూ ఉన్నప్పుడు కొద్దిపాటి పంచాంగమును చూసుకున్నా మంచి ముహూర్తములు అవే కలసి వస్తాయి.


అదే చెడ్డగా ప్రవర్తించేవారికి ఎంత మంచి ముహూర్తమును పెట్టించుకున్నా కూడా ఆ ముహూర్తంలో పని జరగక తప్పిపోవటమే జరుగుతుంది.


ఉదా...గడియారం ముల్లు ముందుకు , వెనుకకు నడవటం ద్వారా కావచ్చు, ఇంకా మనకు తెలియని ఎన్నో విధములుగా ఆ మంచి ముహూర్తం తప్పిపోయే అవకాశాలున్నాయి. లేదా మనకి తెలియని లోటుపాట్లు ఉన్న ముహూర్తమే కుదురుతుంది........


ఇవన్నీ ఇలా జరగటం చూస్తే నాకు ఏమనిపిస్తుందంటేనండి , మనం దైవభక్తిని కలిగి జీవితంలో సత్ప్రవర్తనతో నడచినప్పుడు మనకు జీవితం సవ్యంగా నడిచేటట్లు మంచి ఆలోచనలు కలిగేటట్లు ఆ భగవంతుడు చేస్తాడు అని,


అదే మనము చెడ్డగా ప్రవర్తిస్తే,  దాని ఫలితంగా మనము రాంగ్ రూట్ లో ఆలోచించే విధంగా చేసి మనకు కష్టాలు కలుగచేస్తాడు భగవంతుడు అని. 
 
 
ఇంకా,  ఏమనిపిస్తుందంటేనండీ, మనం పూర్వ కర్మ ప్రకారం ఒకవేళ కష్టాలు అనుభవిస్తున్నా కూడా , చలించకుండా దైవభక్తిని కలిగి మంచిపనులు చేస్తూ పోతే భగవంతుడు అన్నీ సవ్యంగా జరిగేటట్లు సరిదిద్దటం జరుగుతుంది అని..


అయితే ఆ శక్తి రావాలంటే భగవంతుని దయ ఎంతో అవసరం.

****************

కొన్నిసార్లు  దేవాలయాలకు  వెళ్ళినప్పుడు   అక్కడ   పూజ  పూర్తయ్యేవరకు   ఉండటానికి  మనకు  సమయం  కుదరకపోవచ్చు.

దేవాలయంలో   దైవానికి  నమస్కరించి  ప్రసాదం  తీసుకోకుండా  ఇంటికి  వచ్చేసినప్పుడు  ఇంట్లోని  దైవం  వద్ద  ఉన్న  ప్రసాదాన్ని  లేక   ఏదైనా  పదార్ధాన్ని  దైవప్రసాదంగా  భావించి  స్వీకరించవచ్చు.

అంతేకానీ  ప్రసాదం  తీసుకోకుండా   దేవాలయం   నుంచి  ఇంటికి  వెళ్ళామని  బాధపడనవసరం  లేదు.

దైవం సర్వాంతర్యామి..దైవం  యందు  మనకు  గల   భక్తి,  భావం  ముఖ్యం .



2 comments:

  1. దైవం సర్వాంతర్యామి...దైవం యందు మనకుగల భక్తి, భావం ముఖ్యం.
    ఇది సత్యం.
    మంచి మాట చెప్పారు.

    ReplyDelete
    Replies

    1. మీకు కృతజ్ఞతలండి.

      Delete