koodali

Wednesday, February 27, 2013

నియమాలు మన మంచికే .


 జీవితంలో నియమనిబంధనల  వల్ల   స్వేచ్చ  తగ్గిపోతుంది  కదా ! అని  కొందరు  భావిస్తారు.  స్వేచ్చ  తగ్గినట్లు  కనిపించినా  నైతికవిలువలను  పాటించకపోతే  సమాజమే  ప్రమాదంలో  పడిపోతుంది. మనిషి  మనుగడకే  ముప్పు  వస్తుంది. ఇవన్నీ  ఆలోచించిన  పెద్దలు  సమాజం  సజావుగా  సాగటం  కోసం   కొన్ని  విలువైన  నియమనిబంధనలను  ఏర్పరిచారు.


 మనకు  నచ్చిన  వంటకాన్ని  మరీ  ఎక్కువెక్కువగా  తినేస్తే    హరాయించుకోలేక  విరేచనాలు  పట్టుకుంటాయి. దీన్ని  బట్టి  ఏం  అర్ధమవుతోందంటే , మనకు  ఇష్టమైన  వంటకాన్నైనా  హద్దులేకుండా  తినే  స్వేచ్చ  మనకు  లేదు
  అని అర్ధమవుతుంది.  


 అలాగే  జీవితంలో  కొన్ని  హద్దులు,  నియమనిబంధనలు  ఉంటాయి.  వాటి  ప్రకారం  జీవిస్తే  అందరూ  సుఖంగా  ఉండవచ్చు  హద్దులు  దాటితే  కష్టాలే  .


 మనిషి  మనస్సు  చంచలమైనది . మనస్సును  అదుపులో  పెట్టటం  అత్యంత  కష్టమైన  విషయం.  కష్టాలు  వస్తాయని  తెలిసినా .. మనస్సును  అదుపులో  ఉంచుకోలేక   కొందరు
నియమనిబంధనలను  అతిక్రమిస్తుంటారు . 


 తమకు  తాముగా  నైతిక విలువలను  పాటించే  దృఢమైన  మనస్సు  అందరికీ  ఉండదు.  పరిసరాల  ప్రభావం  వల్ల  కూడా  కొన్నిసార్లు  మానసిక  దృఢత్వం   చెదిరిపోయే  అవకాశం  ఉంది. 

ఇవన్నీ  ఆలోచించిన  పెద్దలు  సమాజం  సజావుగా  సాగటం  కోసం   కొన్ని  నియమనిబంధనలను  ఏర్పరిచారు. వాటిలో  కొన్నింటిని చూద్దాము.   

*ఉదా...అత్యాశ  ఉండటం ,ఇతరుల  సంపద  తనకు  కావాలని  ఆశపడటం  తప్పు .  అని  పెద్దలు  తెలియజేశారు.   

 *ఉదా... మద్యపానం  చేయటం  తప్పు.  అని కూడా  పెద్దలు  తెలియజేశారు.

* ఉదా..  అత్యాశ  కలిగిన  వాళ్ళు  ప్రపంచంలోని  సంపదంతా  తనకే  కావాలని  కోరుకుంటారు.  ఆ  ఆశతో   అందరి  పొట్టలనుగొట్టి  తామే  సంపదనంతా  పోగేసుకుంటారు.  ఇలాంటి  అత్యాశపరుల  వల్ల  సమాజంలో  పేదరికం  పెరిగి, పేదవాళ్ళు   బాధలను  అనుభవిస్తుంటారు.


*ఉదా ... మద్యపానానికి  బానిసలైన  వ్యక్తులలో   కొన్నిసార్లు  విచక్షణ  లోపిస్తుంది.  ఆ  మత్తులో  వారు   నేరాలు  చేసే  అవకాశం  కూడా ఉంది.  


మద్యపాన వ్యసనానికి  బానిసైన  వ్యక్తుల  ఆరోగ్యం  పాడవుతుంది. ఇలాంటి  వారికి  కలిగే  సంతానానికి  కూడా   భవిష్యత్తులో  అనారోగ్య  సమస్యలు  వచ్చే  అవకాశాలు  మెండుగా  ఉన్నాయని  పరిశోధనల  వల్ల  తేలిన  విషయం.


  ఈ  మద్యపాన  వ్యసనానికి  బానిసలైన   కొందరు   తమకు  వచ్చే  ఆదాయాన్నంతా ఈ  అలవాటు  కోసం  ఖర్చుపెట్టేస్తుంటారు.  ఇలాంటి  వారి  కుటుంబసభ్యులు  ఎన్నో  కష్టాలు  పడుతుంటారు. 

ఇవన్నీ  ఆలోచించి , అందరు  మద్యపానానికి  దూరంగా ఉండాలి . అని  పెద్దలు తెలియజేశారు .

మద్యపాన  నిషేధాన్ని అమలు  చేస్తే ఎన్నో  కుటుంబాలు బాగుపడతాయి.  


ఇవన్నీ  గమనిస్తే  మనకు  ఏం  తెలుస్తుందంటే,  నైతిక  విలువలంటే .. మన  మంచిని  కోరి   సమాజం  సజావుగా  సాగటానికి  పెద్దలు  ఏర్పరిచిన  నియమనిబంధనలు. 


 ఈ  నియమాలను పాటిస్తే  మనకే  మంచిది.  పాటించకపోతే  కష్టాలను  అనుభవించవలసి  వస్తుంది.  
 .................... 

ఈ  బ్లాగును  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్ఞతలండి .


 

2 comments:

  1. మనసును హద్దులలో ఉంచుకోలేని వారి పని అంతే

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    మనసును హద్దులలో ఉంచుకోలేని వారి పని అంతే..అని మీరన్నది నిజమే. అయితే, మనసును హద్దులలో ఉంచుకోవటం కూడా చాలా కష్టమైన పని. ( బలహీన మనస్కులకు మరీ కష్టం. )

    ఈ రోజుల్లో ఆధునిక సంస్కృతి పేరుతో మద్యపానం అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. అశ్లీల దృశ్యాలు విచ్చలవిడిగా ప్రసారమవుతున్నాయి.

    చుట్టూ ఎన్నో ఆకర్షణలున్న ఈనాటి సమాజంలో మనసును అదుపులో ఉంచుకోవటానికి ఎంతో మానసిక దృఢత్వం అవసరం .

    మద్యపానం వంటి అలవాట్ల నుండి బయటపడటం చాలా కష్టం అంటారు. ఎవరైనా ఆ అలవాట్లను మానివేస్తే వాళ్ళు గొప్ప వ్యక్తులు అని చెప్పవచ్చు.

    మద్యపాన నిషేధాన్ని అమలుచేస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. మద్యపానం, అశ్లీల దృశ్యాలకు అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందో భగవంతునికే తెలియాలి.

    * సమాజంలో చెడ్డ అలవాట్లను ప్రోత్సహిస్తున్న వాళ్ళు తాము చేసిన పాపాలకు భగవంతుని న్యాయస్థానంలో ఏం సమాధానం చెప్పుకుంటారో ?



    ReplyDelete