ఓం
శ్రీ నగరేశ్వరస్వామి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ...వీరికి అనేక వందనములు.
......................
గతకాలంలో ఎక్కువమంది ప్రజలకు సామాజిక స్పృహ ఉండేది. ఈ రోజుల్లో ఎక్కువమంది వ్యక్తిగతస్వార్ధానికే ప్రాముఖ్యతను ఇస్తున్నారు.
పూర్వం ఎందరో ప్రజలు తమ సుఖసంతోషాలను త్యాగం చేసి స్వాతంత్ర్యాన్ని సాధించారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ .... ఇంకా ఎందరో వీరుల త్యాగాల వల్ల దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.
ఈ రోజుల్లో కూడా ఎందరో సైనికులు ఎండలో, వానలో, మంచులో ఎంతో విపత్కర పరిస్తితుల్లో కూడా విధులను నిర్వహిస్తూ దేశాన్ని రక్షిస్తున్నారు.......ఇలాంటి వీరసైనికులకు వందనములు.
సైనికులు దేశాన్ని రక్షిస్తున్నారు కాబట్టి మనం ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము.
వీళ్ళు అంత కష్టపడి దేశాన్ని ( ప్రజలను ) రక్షిస్తుంటే ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి కదా !
అయితే, సమాజంలో చూస్తే, కొందరు మంచి ప్రజలు ఉన్నారు. కానీ, కొందరు అవినీతితో కోట్లాదిరూపాయల సంపదను ప్రోగుచేస్తున్నారు. కొందరు విలాసాలలో మునిగితేలుతున్నారు.
....................
రైతులు ఎంతో కష్టపడి పంటలను పండిస్తున్నారు. ఇతర వృత్తుల వారితో పోలిస్తే రైతులకు వచ్చే ఆదాయం చాలా తక్కువ. అయినా కూడా వారు వ్యవసాయం చేయటాన్ని ఆపకుండా ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నారు.
............................
ఉపాధి కోసం ఇతరదేశాలకు వెళ్ళి , తిరిగి మాతృదేశానికి రావటానికి కూడా డబ్బు లేక కష్టాలు పడుతున్న పేదవారి గురించి మీడియా ద్వారా తెలుసుకుంటున్నాము.
దేశంలోని పేద రైతులు, పేద కార్మికులు, ఇతర దేశాల నుండి తిరిగిరావటానికి కూడా డబ్బు లేక ఇబ్బందులు పడుతున్న పేదవారు .....వీళ్ళందరి కష్టాలతో పోల్చుకుంటే సమాజంలో చాలామంది ప్రజలు బాగానే జీవిస్తున్నారు.
అయినా , తామే జీవితంలో చాలా కష్టపడిపోతున్నామనుకుంటూ చిన్నచిన్న విషయాలకే బాధపడుతూ , పంతాలు, పట్టింపులను ప్రదర్శిస్తుంటారు.
ఉదా......నచ్చినవారు ప్రేమించలేదని ఆత్మహత్య చేసుకునేవాళ్ళు కొందరయితే,... తనను ప్రేమించలేదని ఇతరులను చంపేసేవారు కొందరు, చిన్నచిన్న విషయాలకే ఎప్పుడూ కొట్లాడుకునే భార్యాభర్తలు కొందరు.
సమాజాన్ని పరికించితే ఎన్నో సమస్యలు కనిపిస్తాయి. అయినా , మనం కడుపు నిండా భోంచేసి, చిత్రవిచిత్రమైన సినిమాలను చూస్తూ హాయిగా కాలం గడిపేస్తాం.
సగం దుస్తులు వేసుకు తిరిగే హీరోయిన్(?) వెంటపడటం తప్ప వేరే ముఖ్యమైన లక్ష్యం లేని హీరో పాత్రలు (?) మనకు ఆదర్శమా?
జీడిపాకం సీరియల్స్ లో కనిపించే వారి కష్టాలను తలుచుకుని కడివెడు కన్నీరు కురిపిస్తాం.
సమాజంలో తిండిలేని పేదవారు ఎందరో కనిపిస్తున్నా, మనం ఇంకా ఇంకా డబ్బును పోగేసుకుని, ఆనందిస్తాము.
దేశంలోని సమస్యల గురించి ప్రజలు ఒకరిని ఒకరు తిట్టుకోవటం కన్నా, ప్రజలందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తేనే, దేశం అభివృద్ధిపధంలో పయనిస్తుంది.
గోరంతని కొండంతలు చేసుకుని బాధపడుతున్న జనాభా పెరిగిందండి. నిజంగా బాధలో ఉన్నవారు చెప్పుకోటంలేదు, ధైర్యంగా ఎదుర్కొంటున్నారు.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteనిజమేనండి, చక్కటి జీవితం ఉన్నవాళ్ళు కూడా ఏదో ఒక చిన్న విషయం గురించి బాధపడిపోతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటూ , కుటుంబసభ్యుల జీవితాలనూ కష్టాలపాలు చేస్తున్నారు.