koodali

Wednesday, February 20, 2013

నైతిక విలువల పట్ల గౌరవం తగ్గిపోవటం ........

ఇప్పటి   సమాజంలో  మంచి పనులు  చేస్తున్న వాళ్ళూ  ఉన్నారు.  చెడ్డపనులు  చేస్తున్న  వాళ్ళూ  ఉన్నారు.. కొన్ని  మంచి  పనులూ,  కొన్ని  చెడ్డ పనులూ  చేస్తున్న  వాళ్ళూ  ఉన్నారు.   

 దేశంలో  అవినీతి  ,  మహిళలపై  అఘాయిత్యాలు,  అశ్లీలత  వంటివి  పెరిగిపోతున్నాయని  గోలపెడుతున్నాం.  ఇవన్నీ  పెరగటానికి  కారణాలేమిటి  ? 
వ్యక్తులు  నేరస్తులుగా  తయారవ్వటంలో  సమాజం  బాధ్యత  ఉండకుండా  ఉంటుందా  ?

సమాజంలో  నేరాలు  పెరగటానికి  మనుషుల్లో   నైతిక  విలువల  పట్ల  గౌరవం  తగ్గిపోవటం   అనేది  ఒక  ముఖ్యమైన  కారణం. 


పసిపిల్లలుగా  ఉన్నప్పుడు  పిల్లలు  అందరూ  కల్మషం  లేని  చిరునవ్వులతో  అమాయకంగా  ఉంటారు.  మరి  పెద్దయిన  తరువాత  వీళ్ళల్లో  కొందరు   చెడ్డపనులను  ఎందుకు  చేస్తున్నారు ?



వ్యక్తుల  ప్రవర్తనపై  తల్లితండ్రులు, స్నేహితులు  మరియు  సమాజం  యొక్క  ప్రభావం  ఎంతో  ఉంటుంది.   నేరాలు  పెరగటానికి  సమాజంలో  పెరిగిపోతున్న  ఆర్ధిక  అసమానతలు,  పేదరికం,   అందుకోలేని  ఆకర్షణలు  వంటి   కారణాలెన్నో  ఉన్నాయి.  నిరాశానిస్పృహలకు  లోనవుతున్న  వ్యక్తులు  నేరాలకు  పాల్పడుతున్నారు.



 సమాజంలో  జరుగుతున్న  నేరాలను  తగ్గించాలంటే    అందుకు  గల  కారణాలను  అన్వేషించి,   ఇక  ముందు  అలాంటి  చెడ్డపనులు  జరగకుండా , వ్యక్తులలో  చెడ్డతనం  పెరగకుండా  తగిన  చర్యలను  చేపట్టాలి.  అంతేకానీ  నీది  తప్పంటే  నీది  తప్పని  సమాజంలోని  అందరూ  ఒకరినొకరు  దుమ్మెత్తిపోసుకోవటం  వల్ల  సమస్యలు  పరిష్కారం  కావు. 



చిన్నతనం  నుంచి  పిల్లలకు  నైతికవిలువల  పట్ల  గౌరవాన్ని  కలిగిస్తే  వాళ్ళు  చక్కటి  పౌరులుగా  తయారవుతారు.  చక్కటి  పౌరులున్న సమాజంలో  నేరాలు  జరగటం  గణనీయంగా  తగ్గుతుంది.    


అయితే జీవితం  గురించి  ధర్మాధర్మాల  గురించి  పిల్లలకు  ఎలా  తెలుస్తుంది?  వారికి   ఎవరు  తెలియజేస్తారు  ?

తల్లితండ్రి  పిల్లల  పట్ల   శ్రద్ధగా  ఉంటూ  వారితో  మాట్లాడుతూ  ఉంటే  పిల్లలు  ఉత్సాహంగా  ఉంటారు. తల్లితండ్రులు  బిజీగా  ఉండి  పిల్లలను  పట్టించుకోకుంటే  పిల్లలు  అభద్రతా  భావంతో  మానసికంగా  క్రుంగిపోతారని,  మానసికనిపుణులు   చెబుతుంటారు.  ఇవన్నీ  తెలిసిన  కొందరు  తల్లితండ్రులు  తాము  పనివత్తిడితో  బిజీగా  ఉన్నా  కూడా  సమయాన్ని  కల్పించుకుని  పిల్లలకూ  ఎక్కువసమయాన్ని  కేటాయిస్తారు.


అయితే, ఈ  రోజుల్లో  ఎక్కువమంది  తల్లితండ్రులకు  తమ  పిల్లలతో  మాట్లాడటానికి  కూడా  తగినంత   సమయం  లేనంతగా  పనివేళలు  పెరిగిపోయాయి.

 ఉదయం  వెళ్తే  రాత్రికి  అలసటగా  ఇంటికి  చేరే  తల్లితండ్రులకు  పిల్లలతో  తీరుబడిగా  మాట్లాడటానికి  కూడా  ఓపిక  ఉండదు. 



  ఇక,   పాఠశాలలో  చూస్తే , ఉదయం  నుంచి  రాత్రి  వరకు  పిల్లలను  కూర్చోబెట్టి ,   కొండంత   సిలబస్ తో  బోలెడు  సబ్జెక్టులను  బోధిస్తుంటారు.  
 
ఇలా  అందరికీ  బిజీగా  రోజులు  గడిచిపోతూంటాయి. 
ఇక   జీవితం  గురించి  ధర్మాధర్మాల  గురించి  పిల్లలకు  ఎలా  తెలుస్తుంది  ?  తెలిసినా  అమలుజరిగేలా   ఎవరు  చూస్తారు  ?



 ఇలాంటప్పుడు   కొద్దిపాటి  తీరిక  సమయాల్లో   చూసే  ప్రసారమాధ్యమాల్లోని   కొన్ని కధలలోని   చిత్రవిచిత్రమైన  పాత్రలనే  ఆదర్శంగా  తీసుకుని   పిల్లలూ అలా తయారవుతారు.
 

 ఈనాటి  పిల్లలే  రేపటి  పెద్దలు  (  పౌరులు  ). వీళ్ళ  ప్రవర్తన   పైనే  సమాజం  యొక్క  మంచిచెడ్డలు  ఆధారపడి  వుంటాయి.   అందువల్ల  సమాజంలోని  పెద్దవాళ్ళందరూ   తమ  వంతు  బాధ్యతను  సరిగ్గా  నిర్వర్తించినప్పుడు   సమాజానికి  చక్కటి  పౌరులు  తయారవుతారు.

* శ్రీ  రామకృష్ణుల శిష్యులైన శ్రీ వివేకానందుల వారు చెప్పినట్లు సత్యం, పవిత్రత, నిస్వార్థత, ఇనుపకండలు,ఉక్కునరాలు కలిగిన  వ్యక్తులు ఇప్పుడు సమాజానికి ఎంతో అవసరం.


8 comments:

  1. నేలవిడిచి సాము చేస్తున్నారు నేటివారు, నేలకు దిగక తప్పదు, సమయం పడుతుంది.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి, మీరన్నట్లు నేలవిడిచి సాము చేస్తున్నారు నేటివారు, నేలకు దిగక తప్పదు, సమయం పడుతుంది.

    ReplyDelete
  3. kaani kondaru cheddapanulu chestunte vaarini marchesariki. malli kothavaru thayaravutunnaru. moral values pina schools ,colleges,parents. and society andaru prayatnam cheste kondarina maradaniki avakasam untundi

    ReplyDelete
  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి, మీరన్నట్లు అందరూ ప్రయత్నం చేస్తే కొందరైనా మారడానికి అవకాశం ఉంటుంది.

    ReplyDelete
  5. చిన్నతనం నుంచి పిల్లలకు నైతికవిలువల పట్ల గౌరవాన్ని కలిగిస్తే వాళ్ళు చక్కటి పౌరులుగా తయారవుతారు. చక్కటి పౌరులున్న సమాజంలో నేరాలు జరగటం గణనీయంగా తగ్గుతుంది...
    అక్షర సత్యాలను చెప్పారు. మంచి టపా.

    ReplyDelete
    Replies
    1. భారతి గారు మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  6. తల్లితండ్రులు పిల్లల్ని ప్రేమతో పలకించరాలి. ఇంటిలో ఉన్న పెద్దలను గౌరవించటం, మంచి మాటలు నేర్పటం వంటివి నేర్పాలి. అంతేకాని టివి చూస్తున్నారు కదా అని వారి మట్టుగా వారిని విడిచి పెట్టకూడదు. ఏది మంచి మాట , ఏది చెడ్డపని వారికీ వివరంగా తెలియచేయాలి. ఏది కొనమంటే అది కొనటం అవసరమా కాదా అన్నది చెప్పి వివరించాలి. అలా అయితే సమాజం కొంతవరకు మార్పు వస్తుంది.

    ReplyDelete
  7. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete