koodali

Friday, February 8, 2013

1. కొన్ని విషయములు.2. విడాకుల వలన లాభమా ? 3. జీవితాంతము ఈ అమ్మ,నాన్న ఉంటారా..లేక కొత్త అమ్మ నాన్న వస్తారా..

1.  కొన్ని  విషయములు.
ఇంతకు  ముందు  వ్రాసిన  పోస్ట్  లోని  విషయాలు  శ్రీ  దేవీ  భాగవతము . గ్రంధము  ద్వారా  తెలుసుకున్నవి.
..........................................


2. విడాకుల వలన లాభమా  ?

అసలు 90 శాతం మంది ఆడవాళ్ళు, 90
శాతం మంది మగవాళ్ళు ఒకే రకం  మనస్తత్వాన్ని  కలిగిఉంటారని  నా అభిప్రాయము.

కొంతమంది   స్త్రీలు  పురుషులు  తమ  జీవితభాగస్వామి నచ్చలేదని  భావించి   విడాకులిచ్చేస్తుంటారు. 


 ఇలా   పెళ్ళి  తరువాత  పెళ్ళి  చేసుకుంటుంటారు.  ఇలాంటివారికి  రెండు, మూడు పెండ్లిండ్లు  చేసుకున్నాక   అప్పుడు తత్వము  తెలిసివస్తుంది.  ఇక   అప్పుడు   మరిన్ని  వివాహాలు  చేసుకునే  ఓపిక  లేక    ఉన్నవారితో  సర్దుకుపోవటము నేర్చుకుంటారు.  తాము  జీవితంలో  చాలా సంతోషముగా   ఉన్నట్లు   ప్రపంచానికి   కనిపిస్తారు. (  నటిస్తారు. )


  ఈ సర్దుకుపోవటము మొదటి పెండ్లి  వారితోనే అయితే    కనీసము వారి   తల్లితండ్రులు,  పిల్లలు అయినా సంతోషముగా ఉంటారు కదా ! 

ఇక   ఇతరుల  జీవితాల్లోకి  మరీ తప్పని   పరిస్థితులలో భార్యాభర్త  విడిపోవలసి  వస్తే ,  విడిపోయి తమ  బ్రతుకు  తాము  బ్రతకాలి. ( ఇతరులను ఇబ్బంది  పెట్టకుండా..)  ఒంటరిగా  జీవించే  ధైర్యం  లేనప్పుడు  విడాకులు  తీసుకోకపోవటమే  మంచిది.

......................................

3. జీవితాంతము ఈ అమ్మ,నాన్న ఉంటారా ..? లేక  కొత్త అమ్మ నాన్న వస్తారా..?

ఈ రోజుల్లో భార్యాభర్తలు విడాకులు తీసుకోవటము ఎక్కువగా చూస్తున్నాము.   జీవితాంతం ఈ అమ్మా,నాన్న ఉంటారాలేక...... వారు విడిపోయి కొత్త అమ్మానాన్న వస్తారో తెలియని ...అతి చిత్రమయిన   పరిస్థితిలో(అభద్రతా  భావంతో  )  ఈనాడు  చాలామంది పిల్లలు  ఉన్నారు.

అంటే , తల్లితండ్రి  వేరే  వివాహాలు  చేసుకుంటే..పిల్లలకు  కొత్తా అమ్మానాన్న వస్తారు కదా !  


 ఒక   జంట గుర్తుంచుకోవాల్సింది   ఏమంటే......... 

మనము జీవితములో ,  చిన్నతనములో   పెద్దల మాట గౌరవిస్తాము. మరి మన ముసలితనములో మన కోడళ్ళను,  అల్లుళ్ళను   చచ్చినట్టు గౌరవించక తప్పదు. ఏమంటే అప్పుడు మనకు   ఒపిక ఉండదు కాబట్టి.  

 వృద్ధాశ్రమంలో  చేరినా  అక్కడున్న  వారికి  అణగిమణగి   ఉండవలసి  వస్తుంది. 

మరి,   జీవితములో ఎంత   మందితోనో  సర్దుకుపోతుంటాము.      ఆఫీసులలో ప్రక్కవారితోను  ,   ఇంటిప్రక్కవారితోను ,   పనివారితోను,   కూరలవారితోను, మన  సొంత పిల్లలతోను, ఇలా........ఎంతో మందితోనో   సర్దుకుపోతుంటాము.  

  (  మనకు ఇష్టము ఉన్నా,లేకపోయినా.) 


మరి భార్యాభర్తలు   కూడా   ఇలా   సర్దుకుపోతే  చాలా ప్రశాంతముగా ఉంటుంది. ముఖ్యముగా వారి పిల్లల  జీవితము ఎంతో  సంతోషముగా ఉంటుంది.



 కుటుంబం అన్నాక   ఎన్నో  కారణాల  వల్ల  భార్యాభర్తలకు   తప్పక   గొడవలు వస్తాయి. బయటివారికి   ఇవన్నీ ఉండవు    కాబట్టి  , బయటివారితో   ఇన్ని సమస్యలు రావు.



మనుషుల  మధ్య  అభిప్రాయ  భేదాలు  సహజం.  తల్లితండ్రి,  పిల్లలకు  మధ్యే  అభిప్రాయ  భేదాలు  ఉంటాయి..   అన్నదమ్ములకు,  అక్కచెల్లెళ్ళకు  మధ్య  అభిప్రాయభేదాలు  ఉంటాయి  .  ఎక్కడో  పుట్టి  పెరిగిన  భార్యాభర్తలకు  అభిప్రాయభేదాలు  రావటంలో  ఆశ్చర్యమేమీ  లేదు.

మన  పూర్వీకులు   తమ  మధ్య  అభిప్రాయ  భేదాలు  ఉన్నా  కూడా    విడాకులు  తీసుకోకుండా    సర్దుకుపోయారు   కాబట్టి,    మన   కుటుంబవ్యవస్థ  ఇంకా  చెక్కుచెదరలేదు. చక్కటి  కుటుంబవ్యవస్థలో   పిల్లలు  భద్రంగా  ఉన్నారు. 



  పిల్లలు  ఇంటికి వచ్చినప్పుడు  తమ   సొంత అమ్మకు   బదులు వేరే అమ్మ ,.......సొంతనాన్నకు  బదులు  వేరే నాన్న ఉంటే వారి మనస్సుకు   ఎంత  బాధగా ఉంటుందో   ఆలోచించండి.

మన  గురించి 
మన  పిల్లలు  గొప్పగా  చెప్పుకునేటట్లు  మన  ప్రవర్తన  ఉండాలి. అంతేకానీ   మన తరువాత  తరాల  వాళ్ళు   గిల్టీగా  ఫీలయ్యేటట్లు  మన  ప్రవర్తన  ఉండకూడదు  కదా !
...........................


  ఇక్కడ  ఒక   విషయం.  ...  కొందరి  విషయంలో   భార్యాభర్తలలో  ఒకరు  ఎంత  చక్కటి  ప్రవర్తనతో  ఉన్నా  కూడా,  రెండో  వారు  అహంకారంతో  తమ   జీవితభాగస్వామిని  వదిలి  వెళ్ళిపోయి  ఇంకో  వివాహం  చేసుకుంటున్నారు.   ఇలా  జీవితభాగస్వామి  వదిలి  వెళ్ళిపోయిన  సంఘటనలలో  చేసేదేమీ  లేక  ఇంకో  వివాహం  చేసుకుంటున్నారు.
....................


పూర్వకాలంలో   ఎక్కువమంది ,  సమాజం   బాగుండాలనే  తపనతో  తమ  వ్యక్తిగతసుఖాలను  కొంతమేర  త్యాగం  చేసేవారు.  ఇప్పుడు  సమాజం  ఎటుపోయినా  పరవాలేదు. వ్యక్తిగత  సుఖమే  ముఖ్యం . అనుకునే  వారు  ఎక్కువగా  కనిపిస్తున్నారు.  ఇందువల్ల  సమాజంలో   ఎన్నో  సమస్యలు  వస్తున్నాయి.
 

2 comments:

  1. రక రకాల పీడ ముఖాలు, నీ పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలతో దెబ్బలాడుకుంటున్నారని ఒక భర్త భార్యతో అంటాడు,పశ్చిమ దేశాలలో, ఈ సంస్కృతి కావాలని తహ తహలాడిపోతున్నారు.

    ReplyDelete

  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి. నీ పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలు అనే సంస్కృతి ఇక్కడ కూడా వ్యాపిస్తోంది.

    ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి.

    ReplyDelete