ఈ పోస్ట్ లోని విషయములు జనవరిలో వేసిన.. కొన్ని విషయములు ..పోస్టులోని విషయములే. ఆ పోస్ట్ పెద్దగా అవటం వల్ల, కొంతభాగాన్ని తీసి ఇక్కడ వేయటం జరిగిందండి.
....................
టెక్నాలజి అంటూ పోటీలు పడుతున్నారు కొందరు. టెక్నాలజీ కొంతవరకు అవసరమే కానీ, పర్యావరణహిత టెక్నాలజి ఉండాలి. .
ప్రపంచంలో నైతికవిలువలకు హాని కలగని విధమైన టెక్నాలజి వాడకం కావాలి. ఉదా..సెల్ఫోన్ల ద్వారా అశ్లీలచిత్రాలు వంటివి మంచిదికాదు.
............
ప్రపంచంలో మనుషులందరికీ ...ఆహారం, ఇల్లు, విద్య, వైద్యం, రక్షణ....ఇలాంటి కనీస అవసరాలు తీరాలి.
...........
ఒక్క మొక్క నుండి అనేక విత్తనాలు ..ఆ విత్తనాల నుండి అనేక మొక్కలు..ఆ మొక్కల నుండి బోలెడు ఆహారం లభించేలా దైవం సృష్టిని చేసారు. ..
అయినా కూడా, అందరికీ ఆహారం లభించేలా చేసుకోలేకపోతున్నారు.
ఇప్పటికీ ప్రపంచంలో చాలామందికి సరిగ్గా ఆహారం లభించటం లేదు.
కొందరేమో తినటానికి తిండిలేక, డబ్బులేక, ఉపాధిలేక కష్టపడుతున్నారు.
చాలామంది మద్యం, మత్తుమందులకు బానిసలవుతున్నారు.
డబ్బు ఉన్నా కూడా కొందరికి అనేక సమస్యలు ఉంటున్నాయి, చాలామందికి మానసిక ప్రశాంతత ఉండటం లేదు.
ధనిక దేశాలలో కూడా చాలామంది అనేక సమస్యలతో బాధలు పడుతున్నారు.
ప్రపంచంలో ప్రశాంతత లేనప్పుడు ఏం లాభం?
సమాజంలో నేరాలు..ఘోరాలు జరగకుండా ఉండాలి. అందరూ ప్రశాంతంగా బ్రతకాలి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలి.
.................
అంతా దైవము దయ.
.....................
marikonni vioshayamulu..
చిన్నపిల్లలు వాళ్ళకువాళ్ళు చేత్తో తీసుకుని సరిగ్గా తినలేరు. పిల్లలు
పెద్దవారిలా గబగబా నమిలి తినలేరు. నిదానంగా తింటారు. అలాగని పిల్లలకు
ఆహారాన్ని కుక్కి అదేపనిగా బోలెడు తినిపించకూడదు.
వాళ్ళకు ఎంతకావాలో అలాగ
తల్లి దగ్గరుండి చక్కగా ఓపికగా తినిపించాలి. అందుకు ఎక్కువ సమయమే పడుతుంది.
అయితే,
ఈ రోజుల్లో చాలామంది తల్లులు ఉద్యోగాల కొరకు వెళ్ళటం వల్ల పిల్లలకు చక్కగా
తినిపించటానికి కూడా సమయం ఉండటం లేదు.
పిల్లలను డేకేర్ సెంటర్లలో
వేస్తున్నారు. లేదంటే చిన్నప్పుడే స్కూల్లో వేస్తున్నారు. పిల్లలను త్వరగా
అక్కడ దింపాలని వాళ్లకు హడావిడిగా ఏదో కుక్కి తినిపిస్తారు.
ఇంట్లో
ఉండే తల్లులు కూడా కొందరు ఈ విషయంలో ఓపికగా చేయటం లేదు. చిన్నపిల్లలు ఏమీ
చేయలేరు కదా..
కొందరు పిల్లలు (ఉదా..3 సంవత్సరాల చిన్నపిల్లలు) నాకు తినిపించమని పెద్దవాళ్ళను అడిగినా నువ్వే తినాలంటూ తినిపించకుండా ఉండే పెద్దవాళ్ళను నేను చూసాను.
పాపం చిన్నపిల్లలు తమకు తాము సరిగ్గా తినలేని
వయస్సు వాళ్ళది.అలా అర్ధాకలితో ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఈ సమస్యలకు
పరిష్కారం ఎప్పుడో?
చాలామంది పిల్లలు తినటం విషయంలో విసిగిస్తారు. ఆ
వయస్సు పిల్లలు చాలామంది అలాగే ఉంటారు.
కొందరు తల్లులు మాత్రం ఓపికగా మాటలు చెబుతూ తినిపిస్తారు. ఇలాంటి గొప్ప తల్లులు అభినందనీయులు.