మాంసాహారాన్ని తినాలంటే..జంతువులను, పశుపక్ష్యాదులను చంపి తినాలి. చంపే సమయంలో అవి ఎంత భయాన్ని, బాధను అనుభవిస్తాయో.
మనుషులను ఎవరైనా రాక్షసులు చంపి లొట్టలేసుకుంటూ తింటారంటే మనుషులు గజగజ వణికిపోతారు. మరి నోరులేని పశుపక్ష్యాదులకు భయం ఉంటుంది కదా.
జీవితంలో కష్టాలు, అనారోగ్యాలు వస్తేనే తట్టుకోలేక మనుషులు రక్షించమని అదేపనిగా దైవానికి పూజలు చేస్తుంటారు.
రక్షించటం ఆలస్యమయితే దైవాన్ని నిందించేవారు కూడా ఉంటారు.
.........................
ప్రాచీనకాలంలో రాజులు, సైనికులు వేటకు వెళ్ళేవారని తెలుస్తోంది. క్రూరమృగాలు ఊళ్ళలోకి వచ్చినప్పుడు వాటిని చంపటంలో తప్పులేదు.
రుచి కోసం జంతువులను చంపి తినటం పాపం. చనిపోతూ అవి అనుభవించిన బాధ వాటిని చంపిన వారిని పాపకర్మలా చుట్టుకుంటుంది.
****************
కష్టపడుతున్న జీవులను చూస్తే బాధనిపిస్తుంది. అలాగని అసలు జీవులను చంపకుండా ఉండలేం.
ఉదా..ఎంత
జాగ్రత్తగా ఉన్నా కూడా, ఇంట్లో ఎప్పుడైనా చీమలు, బొద్దింకలు వస్తే మందు
వేసి చంపకుండా ఉండలేం. గిలగిలా కొట్టుకుంటున్న వాటిని చూస్తే
బాధనిపిస్తుంది. ఏం చేయాలో? ఎలా చేయాలో? అర్ధం కాదు.
జీవితంలో చాలా విషయాలను పాటించలేక కష్టంగా ఉంటుంది. దైవమే దిక్కు.
***************
నాకు కొన్ని సందేహాలున్నాయి.
జీవులను చంపే సమయంలో అవి భయంతో ఉండటం వల్ల, వాటి శరీరంలో కొన్ని హానికరమైన హార్మోన్లు విడుదల అవుతాయట. అలా చనిపోయిన వాటి మాంసాన్ని తిన్నవారికి రోగాలు వచ్చే అవకాశముంటుందట.
రక్తంలో
మలినాలుంటాయని ఆ రక్తం పోయేలా చేసి తినాలంటున్నారు కొందరు. జంతువు అంత
గిలగిలా కొట్టుకునేలా అంతసేపు కాకుండా, ఆ రక్తం పోయేలా మాంసాన్ని కడగవచ్చు
కదా..
చనిపోయే బాధను అనుభవించే జీవికి శరీరమంతటా హానికారక
హార్మోన్లు ప్రసారమవుతాయన్నప్పుడు, రక్తంతోపాటు మాంసంలోను..శరీరమంతటా కూడా
హార్మోన్లుంటాయి కదా..
మాంసాహారాన్ని తినకూడదని వేదములలో ఉందని కొందరు పండితులు చెబుతున్నారు.
హిందువుల్లోనే కొందరు దైవానికి బలులు అని ఇచ్చి, ఆ మాంసాన్ని తింటారు. ఏమిటో? ఇదంతా దైవానికే తెలుస్తుంది.
అవి
మూగజీవులు కాబట్టి చెప్పలేవు, ఈ విషయాలలో నిజంగా ఏం జరుగుతుందో, మరణించే
జీవుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో సరిగ్గా మనకు తెలియదు
కానీ,
తప్పనిసరిగ్గా చంపవలసివస్తే, అవి భయపడకుండా, ఎక్కువ బాధపడకుండా చంపటం కొంతలో బెటర్.
........................
విచిత్రం ఏమిటంటే, దైవము పేరు చెప్పి బలులు అని చేసి, ఆ మాంసాన్ని మనుషులు తింటారు. దైవము పేరుతో హింస చేయటం ఏమిటో?
బలులు
ఇవ్వటం అన్యాయం.. అంటూ మాంసాహారాన్ని తినేవాళ్లు కూడా మాట్లాడటం ఇంకో
విచిత్రం. రోజూ వేల సంఖ్యలో చికెన్, మటన్ షాపుల్లో వాటిని చంపి
తింటున్నారు. ఎక్కడ చంపినా హింసే కదా..
ఎక్కడైనా జంతువులు మనుషులను చంపి తింటే, ఎంత దారుణం జరిగింది.. అంటారు. మరి
మనుషులకు ప్రపంచంలో తినడానికి బోలెడు శాకాహారం ఉండగా, ఇంకా జంతువులను చంపి
తినటం దారుణం.
................
కోరికలు,
కష్టాలు తీరాలంటే.. దైవభక్తి కలిగి మంచిగా ఉంటూ కష్టాల్లో ఉన్నవారికి సాయం
చేయటం..వంటివి చేస్తే క్రమంగా కోరికలు, కష్టాలు తీరతాయి.
అంతేకానీ, జీవహింస చేస్తే, కొన్నిసార్లు అప్పటికి బాగున్నట్లు అనిపించినా, ఆ పాపఫలితం ఎక్కడికి పోదు. భవిష్యత్తులో అనుభవించవలసి వస్తుంది.
పాతకాలంలో కూడా కొందరు, పూజలంటూ.. హింసతో కూడిన పనులు చేసారంటారు. హింస చేస్తే పాత కష్టాలు పోవటం ఎలాఉన్నా, హింస చేసిన పాపానికి కొత్త పాపాలు వచ్చే అవకాశముంది.
..............................
రావణాసురుడు
కైలాసానికే వెళ్లగలిగే శక్తివంతుడు, పండితుడు.. అయినా కూడా, అహంకారిగా, అధర్మంగా ప్రవర్తించటం జరిగింది... తన వారసులతో సహా
మరణించాడు.
శివాంశకలిగిన హనుమంతులవారు..సీతాదేవిని శ్రీరామునికి
అప్పజెప్పమని, రావణాసురునితో చెప్పినా కూడా, అతడు వినిపించుకోలేదు.
పరమశివుడు కూడా, రావణాసురుని మరణం నుంచి తప్పించటానికి సాయపడలేదు.
నరకాసురుడు ఎన్నో పాపాలు..హింస చేయటం జరిగింది. అమ్మ అంశ ఉన్న అమ్మ చేతిలో మరణించాడు.
ఎవరైనా కూడా, జీవితంలో ధర్మంగా ప్రవర్తిస్తే దైవకృపను పొందగలరని తెలుస్తుంది.
......................
పశువధశాలలలో పశువులను చంపటం..అవి పడే బాధను చూస్తే కన్నీళ్లు వస్తాయి.
పశువధశాలలలో జరిగే విషయాలను, ఆ దృశ్యాలను యూట్యూబ్లో చూడవచ్చు.
జీవులను చంపటం అనేది మహాపాపం. ఎవరి పాపం వాళ్లది.
రుచిని అదుపులో పెట్టటం కష్టమే కానీ, అవి పడే బాధను గుర్తు తెచ్చుకుని మాంసాహారాన్ని మానేస్తే మంచిది.
మనస్సును
అదుపులో ఉంచుకోవటం కష్టమేకానీ, ఇతరజీవులను హింసించినందుకు..ఆ పాపఫలితంగా
కష్టాలు వస్తే, ఆ కష్టాలను తట్టుకోవటం కూడా చాలా కష్టమే. కాబట్టి, పాపాలు
చేయకుండా మొదటే మనస్సును కంట్రోల్ చేసుకుంటే మంచిది.
...................
మనదేశంలోనే శాకాహారులు ఎక్కువ, విదేశాల్లో అందరూ మాంసాహారం తింటారని మనలో చాలామందిమి భావిస్తాము.
అయితే, అది తప్పు.
విదేశాల్లో కూడా శాకాహారులుంటారు. ఈ రోజుల్లో విదేశాల్లో కూడా చాలామంది మాంసాహారం మానివేసి శాకాహారం వైపు మారుతున్నారట.
మన దేశంలో, మన రాష్ట్రంలో చాలామంది నేచురోపతి వారు కొన్ని ఆహారపద్ధతులను పాటించటం ద్వారా వ్యాధులు వచ్చినవారికి నయం చేయటం, వ్యాధులు రాకుండా చేయటం గురించి చెబుతున్నారు.
ఇలా ఆహారం ద్వారా వ్యాధులు తగ్గించుకోవటం అనేది గొప్ప విషయం.
విదేశాల్లో కూడా కొందరు శాకాహారం మంచిదని, ఆహారం ద్వారా వ్యాధులు తగ్గించుకోవచ్చని చెబుతున్నారట. వీరిలో వైద్యులు కూడా ఉన్నారు.
ఉదా..Dr. Caldwell Esseltyns,
Dr. Brook Goldner..
ఒక వైద్యురాలు తనకు వచ్చిన వ్యాధిని ఈ పద్ధతిలో తగ్గించుకోవటం జరిగిందట.
వీరి గురించి తెలుసుకోవాలంటే ఇంటర్నెట్ లో చూడవచ్చు.