మొన్న " హరిసేవ " బ్లాగులో వారు వ్రాసిన
" రాముడు గొప్పా ? రామనామము గొప్పదా ? " అనే టపా చదివానండి. చక్కటి టపా. నాకు బాగా నచ్చింది.
అందులో వారు ఇలా వ్రాశారు.. భగవంతుడూ, ఆయన నామమూ వేరుకావు. అలాగే, రాముని కంటే రామనామమే గొప్పది. నిర్మలమైన మనస్సుతో రామనామాన్ని నిశ్చలంగా జపిస్తూ వున్న హనుమంతునిపై ఆ శ్రీరాముడే బాణం వేసినప్పటికీ అది ఆయనను ఏమీ చేయలేకపోయింది.... అని వ్రాశారు.
ఆ టపా చదివిన తరువాత ,నాకు ఇంకా ఏమనిపించిందంటేనండి,
" రాములవారూ గొప్పవారే....రామనామమూ గొప్పదే "
అంటే ఇంకా బాగుంటుంది కదా ! అనిపించిందండి.
అలా నా అభిప్రాయాలతో కామెంట్ వ్రాసాను.
తరువాత నా కామెంట్ చూసుకుంటే అందులో ఇలా ఉంది.
" రాములవారి నామమూ గొప్పదే. రామనామమూ గొప్పదే. తప్పనిపరిస్థితిలో రాములవారు హనుమంతుల వారిపై బాణం వేసినా ..........రామునికి హనుమంతునియందుగల అపారమైన వాత్సల్యం వల్ల హనుమంతునికి ఏమీ హాని జరగలేదు. అనీ,"
నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.
ఇదేమిటి ?నేను
" రాములవారూ గొప్పవారే...రామనామమూ గొప్పదే . " అని కదా వ్రాయాలనుకున్నాను.
మరి " రాములవారి నామమూ గొప్పదే.. రామనామమూ గొప్పదే " అని వ్రాశానేమిటి ?
ఈ పొరపాటు ఎలా జరిగింది ? అని ఆలోచిస్తూ ....
జరిగిన పొరపాటుకు బాధపడుతూ అలా ఆలోచిస్తూ ఉండగా నాకు కొన్ని ఆలోచనలు కలిగాయి.
ఏమంటే,
" రామునికంటే ..... రామనామమే గొప్పది " అని
పండితులు చెబుతున్న విషయం కూడా కొన్ని కోణాలనుండి చూస్తే సరైనదే అని అనుకోవచ్చు అనిపించింది.
ఎలా అంటే , బాహ్యదృష్టితో చూస్తే రామావతారానికి ముగింపు ఉంది.
కానీ, " రామ " నామానికి ముగింపు ఉండదు.
ఇప్పుడు రాములవారి రూపాన్ని అందరూ చూడలేరు.
అవతారమూర్తులు, కొందరు పుణ్యాత్ములు, ఇంకా రామదాసు వంటి భక్తులు ,తానీషా ప్రభువు వంటి కొందరు, ఇలా కొందరు మాత్రమే చూడగలరు.
కానీ, రామ నామము అలాకాదు.
సామాన్యులకు, అసామాన్యులకు, వారూవీరూ అని భేదం లేకుండా అందరికీ ,ఎప్పుడయినా, ఎక్కడయినా రామనామాన్ని స్మరించుకుని, తలుచుకుని , పాడుకుని ఆనందించే అవకాశం అందుబాటులో ఉంది కదా !
ఇప్పుడు నాకనిపిస్తూంది.
1..రాముని కంటే రామనామమే గొప్పది..
2..రాములవారూ గొప్పవారే....రామనామమూ గొప్పదే..
ఈ రెండు అభిప్రాయాలూ సరైనవే. అని..
ఇంకా ఏమనిపించిందంటే,మన తెలివితేటలంటూ ఏమీ ఉండవు. ఒకోసారి మనం అనుకున్నట్లు వ్రాయాలన్నా వ్రాయలేము. అనీ,
పొరపాట్ల వల్ల కూడా కొత్త ఆలోచనలు వస్తాయని తెలిసింది.
* అంతా దైవం దయే ....
bhaagavatula manasu telusukogaligaamu mee manasu dvaaraa
ReplyDeleteమీకు కృతజ్ఞతలండి.
ReplyDeleteమీ వ్యాసం చదివిన తరువాత , జరిగిన సంఘటనల తరువాత,
రాముడు గొప్పా ? రామనామము గొప్పదా ? అన్న విషయంలో నాకు తోచిన ఆలోచనలు ఎంతవరకూ సరైనవో నాకు తెలియదు. ఆ భగవంతునికే తెలియాలి.
కానీ, ఈ విషయంలో నావరకూ సందేహం తీరినట్లే అనిపిస్తున్నదండి. మీకు మరొక్కసారి కృతజ్ఞతలు. అంతా దైవం దయే......
కృష్ణుడు గొప్పా? కృష్ణ నామము గొప్పా?
ReplyDeleteఆది శక్తి గొప్పా? లలిత సహస్ర నామ పారాయణం గొప్పా?
విష్ణువు గొప్పా? విష్ణు సహస్ర నామ పారాయణం గొప్పా?
అల్లా గొప్పా? అల్లా నామము గొప్పా?
ప్రభువు గొప్పా? ప్రభు నామము గొప్పా?
మీకు కృతజ్ఞతలండి.
ReplyDeleteఇంకా వ్యాఖ్యలు ఉండవేమోలే అనుకుని ఇంతవరకూ చూడలేదండి. , ఇప్పుడే బ్లాగును చూశానండి. మీ వ్యాఖ్య కనిపించింది. ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు సారీనండి. ఇప్పటికిప్పుడు నాకు ఏమనిపిస్తుందంటేనండి,
కృష్ణుడూ గొప్పే . కృష్ణ నామమూ గొప్పే .
ఆది శక్తీ గొప్పే . లలితా సహస్ర నామ పారాయణమూ గొప్పే .
విష్ణువూ గొప్పే . విష్ణు సహస్ర నామ పారాయణమూ గొప్పే .
అల్లానూ గొప్పే . అల్లా నామమూ గొప్పే .
ప్రభువూ గొప్పే . ప్రభు నామమూ గొప్పే .
ఇప్పటికే రిప్లై ఇవ్వటం ఆలస్యమయిందని వెంటనే నాకు తోచినట్లు వ్రాస్తున్నానండి. తరువాత ఇంకా ఏమైనా వ్రాయాలనిపిస్తే వ్రాస్తానండి.
అయితే, బాహ్యదృష్టితో చూస్తే భగవంతుని అవతారాలకు కొంతకాలానికి ముగింపు ఉంటుంది. మూలదైవానికి ( ఆది దైవానికి ) ప్రారంభము ముగింపు ( ఆద్యంతాలు ఉండవు. ) అనేవి ఉండవు.
అప్పుడు మూలదైవమూ గొప్పే. మూలదైవము యొక్క నామమూ గొప్పే.
ఇలా ఆలోచిస్తే , మీరు చెప్పిన దైవస్వరూపాలలో ఏవి అవతారమూర్తులు, ఏవి కాదు అని ఆలోచిస్తే జవాబు మీకు తెలుస్తుంది.......
దైవం సర్వాంతర్యామి. కొందరు ప్రాచీనులు దైవాన్ని సాకారంగానూ, నిరాకారంగానూ ఆరాధించారు.
ReplyDeleteనేను కూడా కొన్నిసార్లు సాకారంగానూ కొన్నిసార్లు నిరాకారంగానూ ఆరాధిస్తాను.
మణిద్వీపవాసులైన పరమాత్మ ఆదిపరాశక్తి ( శ్రీమన్మహాదేవీమహాదేవులు ) ఆద్యంతాలు లేని నిత్యులు. అని శ్రీ దేవీ భాగవతంలో చెప్పబడింది.
దైవాన్ని రామునిగానూ, విష్ణువుగానూ , ఏసుప్రభువుగానూ , ప్రవక్తగానూ ఎలాగైనా ఆరాధించుకోవచ్చు. అప్పుడు వీరందరూ నిత్యులే.
దేవతలు మూలదైవాన్ని తల్లిగానూ, తండ్రిగానూ కూడా భావించటం జరుగుతుంది. . త్రిమూర్తులైన బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు కూడా ఆదిపరాశక్తిని జగన్మాతగా భావించారట.
త్రిమూర్తులకు కూడా ఇంత అని ఆయుర్దాయం ఉంటుందట. భవిష్యత్తులో ఆంజనేయస్వామి బ్రహ్మగా అవుతారని పెద్దలు చెప్పటం జరిగింది. .
ఇక ఏసుప్రభువు గురించి నాకు తెలిసినంతలో.....యోహాను 14: 1 - 2 ( బైబిలు ) " మీ గుండెలో గాభరా కలగనివ్వకండి... నా తండ్రి ఇంట్లో చాలా భవనాలున్నాయి ." అని చెప్పబడిందట.
ఇక్కడ ఏసుప్రభువు " నా తండ్రి " అని అనటాన్ని గమనించాలి. వారు నిత్యులు.
ఇక అల్లాహ్ ను గురించి నాకు తెలిసినంతలో ..... వారిని ఎక్కువగా నిరాకారంగా పూజిస్తారు. వారు నిత్యులు.
దైవాన్ని ఎవరు ఏ పేరుతో, ఏ రూపంతో, లేక నిరాకారంగానో , ఎలా ఆరాధించినా , దైవం అందరికీ సమానమే.
దైవాన్ని మనకు నచ్చినట్లు ఆరాధించుకోవచ్చు. కానీ , దైవ భావన ముఖ్యం. ప్రేమభక్తిని కలిగిఉండటం ముఖ్యం. .
దైవానికి నచ్చినట్లు సత్ప్రవర్తనతో జీవించటానికి ప్రయత్నించటం ముఖ్యం.......
కృష్ణుడూ గొప్పే . కృష్ణ నామమూ గొప్పే .
ఆది శక్తీ గొప్పే . లలితా సహస్ర నామ పారాయణమూ గొప్పే .
విష్ణువూ గొప్పే . విష్ణు సహస్ర నామ పారాయణమూ గొప్పే .
అల్లానూ గొప్పే . అల్లా నామమూ గొప్పే .
ప్రభువూ గొప్పే . ప్రభు నామమూ గొప్పే .
అందరూ గొప్పే. అందరూ నిత్యులే.
నాకు తోచినట్లు వ్రాసిన వాటిలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని కోరుకుంటూ....
wow
ReplyDeleteNice Satsang on blog
bhale nadichindi kadandi
mee andaritho prathyaksham ga matlaaduthunnatte undi
paina antha vintunte
.....
నామి కి నామానికి భేదం లేదు అని పెద్దల ఉవాచ !!
ఇంకా కొంచెం లోతుకు వెళ్దామని పిస్తున్నది మీ అందరి ఆసక్తి ని చూసి
దేవుడు, భగవంతుడు
సాకారం , నిరాకారం
నామ రూపాలు సాకారం
వాటికి అతీత స్వరూపం నిరాకారం
నామ రూపాత్మకం గా భగవంతుని భావించటం ప్రాధమిక స్థాయి
భగవంతుని ఉనికిని ఇలా విగ్రహ మూర్తుల రూపం లో గుర్తింది
అదే చైతన్యమే కదా నా ఉనికి కూడా కారణమై ఈ సమస్తాన్ని కూడా ప్రకసింప చేస్తుంది అని
నిరతం గుర్తిస్తూ
సర్వం ఆ చైతన్యత్వమే అనే భావన చేస్తూ
నేను, నా అనే భావ జాలాన్ని మనసు నుండీ త్రోసి పుచ్చి సర్వము కూడా
సర్వాత్మగా చైతన్యంగా నిండిన ఆ పరంధాముని లీలగా
మనది నిమిత్తమాత్రంగా భావన చేస్తూ
ఇహ జీవనం సాగిస్తే పరం సిద్దిస్తుంది!!
ఇక నామము రూపము అంటారా ....
రాముడు, కృష్ణుడు , అల్లా, యేసు....
ఇవి బయటికి నామాలు గా చలామణి అవుతున్న కానీ...
వేదాంతం నామ రూపాల విశిష్టతను వేరే విధిగా చెప్పింది
నామం అంటే భావం (కాన్సెప్ట్)
రూపం అంటే idea
రామ అని అనగానే రామ అనే భావం మన మనసులో కలుగుతుందే అది నామం (భావం)
కృష్ణ అనగానే ఆ శబ్దానికి మన మనసు ఊహ చేసి ఒక రూపాన్ని చుపుతుందే అది (రూపం)
బయట కనిపించే నా మా రూపాలు కావు
అంతరం లో నిండినవి
అయితే ఈ ప్రయాణం నామ రూపాలతో ఆగలేదు
మన ఉనికి మన ఉనికికి సంబంధించిన ఎరుక ఇట్లా సాగి
సాక్షాత్ ఆ పరమాత్మ స్వరూపాన్ని సుప్రతిష్టం చేసే వరకు సాగుతుంది
ధన్య వాదాలు
?!
http://paramapadasopanam.blogspot.com
చక్కగా చెప్పారు. మీకు కృతజ్ఞతలండి..
ReplyDeleteఇప్పుడే మీ బ్లాగ్ చూశానండి. రాముడు గొప్ప? రామనామం గొప్ప పై మీ విశ్లేషణ చాల బాగుందండి. చక్కటి అవగాహన. మీకు నా అభినందనలు.
ReplyDeleteBhaarathamma gaaru!!
ReplyDeleteనేను పై వ్యాఖ్యను వ్రాసిన మరుసటి రోజే మీ వద్ద మరింత పూర్ణం గా శ్రీ రామ నామా వైభవం గ్రహించాగాలగతం నాకు మరింత పారవశ్యాన్ని కలిగించింది
http://smarana-bharathi.blogspot.com/2011/11/blog-post.html?showComment=1320647403968#c7732373769488207069
Jai sree sithaa raam
maku intha chakkani avakaasam kalipinchina anandam variki subhaabhinandanalu
ReplyDelete?!
http://endukoemo.blogspot.com/2011/11/holy-smarana.html
భారతి గారు మీకు ఈ టపా నచ్చినందుకు కృతజ్ఞతలండి.
ReplyDeleteనేను మీ వ్యాఖ్య ఇప్పుడే చదివానండి. రిప్లై ఇవ్వటానికి ఆలస్యమయినందుకు సారీనండి..
( ఎందుకో ? ఏమో ! ) బ్లాగర్ గారికి , మీకు మరియు అందరికీ కూడా నా శుభాభినందనలండి.
ReplyDeleteరిప్లై ఇవ్వటానికి ఆలస్యమయినందుకు సారీనండి..
పేరులో గొప్పదనమంటూ ఏముంటుంది? ఆవ్యక్తి వ్యక్తిత్వం వల్లనే పేరుకు పేరుప్రతిష్టలు చేకూరుతాయి. రాముడు అనే దొంగ వుంటే దొంగరాముడవుతాడు, ఇందులో దొంగ నామము ఏ గొప్పతనం తెచ్చిపెడుతోంది? జనార్ధన అని పేరు పెట్టుకున్నంత మాత్రాన గాలి జనార్ధనరెడ్డిగారి నేరానికి పరిహారంగా కృష్ణజన్మస్థానం ప్రాప్తించింది కదా!
ReplyDeleteఅందుచేత, పేరులో ఏమున్నది పెన్నిది? పేరు గొప్ప వూరు దిబ్బ! పేరుకన్నా వున్నతమైన వ్యక్తి(త్వమే) గొప్ప, మామూలు రక్త మాంసాలతో జన్మించిన మనిషుల్లా జరామరణాలు పొందిన శ్రీరాముడు, కృష్ణుడు, సీత, బుద్ధుడు, ఆదిశంకరులు, జీసస్ ... ఇలా ఎంతమందికో దైవత్వం ఆపాదించబడింది, అని నా విశ్వాసం.
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteమీ వ్యాఖ్య ఆలస్యంగా చూశాను. రిప్లై ఇవ్వటం ఆలస్యమయినందుకు సారీనండి. . నిజమే , సామాన్య మానవుల విషయంలో అయితే మీరన్నట్లు పేరుకన్నా వున్నతమైన వ్యక్తి(త్వమే) గొప్ప, కానీ శ్రీరాముడు, కృష్ణుడు, సీత........వంటి అవతారమూర్తుల విషయంలో వారి వ్యక్తిత్వమూ, పేరు కూడా గొప్పవే.
పెద్దలు ఏమని చెప్పారంటే దైవభక్తిలో భావన ముఖ్యమని చెప్పారు. దైవభావనతో ఏ నామాన్ని, రూపాన్ని స్మరించినా ఫలితం లభిస్తుందట. రామనామం వంటి పేర్లు దైవాన్ని దృష్టిలో ఉంచుకొని స్మరించేటప్పుడు ఆ స్మరణ దైవస్మరణే అవుతుంది.
...........................................................
" .మామూలు రక్త మాంసాలతో జన్మించిన మనిషుల్లా జరామరణాలు పొందిన శ్రీరాముడు, కృష్ణుడు, సీత, బుద్ధుడు, ఆదిశంకరులు, జీసస్ ... ఇలా ఎంతమందికో దైవత్వం ఆపాదించబడింది, అని నా విశ్వాసం. "..........అన్నారు. మీ అభిప్రాయం మీది. సరే.
అసలు ఈ సృష్టిలో జీవులన్నీ ఆదిదైవం నుండే వచ్చాయంటారు. అన్ని జీవులలోనూ ఆత్మ రూపంలో పరమాత్మే ఉంటారట. అవతారమూర్తులలో దైవాంశ ఎక్కువగా ఉంటుందట.
ఒక జీవి తిరిగి పరమాత్మను పొందాలంటే ఈ లోకంలోని నియమాలకు బద్ధులై జీవించి క్రమంగా పరమాత్మను పొందవలసి ఉంటుందట. కానీ అవతారమూర్తులు కేవలం లోకకళ్యాణం కోసం జన్మను పొందుతారట. వారికి ఈ లోకంలో పొందవలసిన లాభమంటూ ఏమీ ఉండదు. కేవలం లోకకళ్యాణం కోసం జన్మను పొందుతారట.
అంటే జీవి పరమాత్మను పొందటానికి ఆరాటపడితే...........దైవం జీవిలా జన్మను ధరించి జీవులందరి మంచికోసం ఆరాటపడతారన్నమాట. అదే దైవం యొక్క అవతారమూర్తుల గొప్పదనం.
.........................................................
ఇంకా నాకు ఏమనిపిస్తుందంటేనండి, దైవం...జీవులు ఎలాగంటే...... తల్లిదండ్రులూ..... పిల్లలు . పోలిక ఎలాగో .... అలా అన్నమాట.
ఒకరకంగా చూస్తే తల్లిదండ్రులు పిల్లలూ వేరుకాదు. ఒకటే.
.ఇంకొకకోణం నుంచీ చూస్తే తల్లిదండ్రులు వేరు ........ పిల్లలు వేరు కదా !
అలాగే ఒక కోణం నుండీ చూస్తే దైవంజీవులు వేరుకాదు.
ఇంకొక కోణం నుండీ చూస్తే దైవం వేరు జీవులు వేరు.
అయితే ఏ జీవి అయినా తిరిగి తన స్వస్థానమైన పరమాత్మను చేరవలసినదే. జీవుల చరమలక్ష్యం అదే. అలా పరమాత్మను చేరుకున్న జీవికి పరమాత్మకు తేడాలేదు..... ... అనిపిస్తోంది.
అయితే, గమనించవలసిన విషయం ఏమిటంటే, దైవంజీవులు విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలూ విషయంతో పూర్తిగా పోల్చలేము.
ReplyDeleteఒక కోణం నుండీ చూస్తే దైవంజీవులు వేరుకాదు.
ఇంకొక కోణం నుండీ చూస్తే దైవం వేరు జీవులు వేరు.
అయితే ఏ జీవి అయినా తిరిగి తన స్వస్థానమైన పరమాత్మను చేరవలసినదే. జీవుల పరమలక్ష్యం అదే.