(Indian Minerva )
సీతగారూ మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి..
కానీ, నాకు ... తెలుగంత బాగా ఇంగ్లీష్ రాదు. అందుకని తెలుగులో వ్యాఖ్య వ్రాస్తే బాగుండేది అనుకున్నాను.
అయితే,నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదన్న విషయం మీకు తెలియదుకదా!
* పరిణామవాదానికి వీలులేకుండా..... దైవం మొదలే జీవులను పరిపూర్ణంగా సృష్టించవచ్చు కదా ! అని చాలా మంది సందేహం ...........
దైవం భూమిపై జీవుల్ని రరకాలుగా సృష్టించటం జరిగింది.
అయినా పిండ దశలో ఉన్నప్పుడు వివిధ జీవజాతుల పిండాల్లో ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తాయి.అని శాస్త్రవేత్తలు అంటున్నారట.
మానవులకు జ్ఞానాన్ని , ఎన్నో తెలివితేటల్ని ఇచ్చిన దైవం తలచుకుంటే మొక్కలకూ, జంతువులకూ కూడా ఇవన్నీ ఇవ్వగలరు.
* కానీ ఏ జీవులకు ఏ లక్షణాలను ఇస్తే సృష్టి సజావుగా సాగుతుందో దైవానికే తెలుసు.
* పరిణామ సిద్ధాంతం కూడా సృష్టికి ఆటంకం కలుగకుండా పరిమితమైన పరిధిలోనే జరుగుతుంది అనిపిస్తుంది.
ఉదా... మొక్కలు ..వాటికి మనుషుల్లాగా మాట్లాడటం ,నడవటం చేతకాదు.
దైవం మొక్కలకు మాటలు, నడక ఇచ్చినట్లయితే మానవులకు ఆహారం పొందటం చాలా కష్టమయ్యేది కదా..
మనం కాయలు, పువ్వులు తెంపుకునేటప్పుడు, వాటిని పీకి ఆకుకూరగా వండుకునేటప్పుడు .... అవి బాధపడితే లేక పోట్లాడితే .... మనం కాయలు, పండ్లు కోయగలమా ? వాటిని ఆహారంగా తీసుకోగలమా ?
............................
* పరిణామవాదానికి వీలులేకుండా..... దైవం మొదలే జీవులను పరిపూర్ణంగా సృష్టించవచ్చు కదా ! అని చాలా మంది సందేహం .
*. ఒక కుక్క పిల్లనో, కుందేలు పిల్లనో భారతదేశంలోని వేడిప్రాంతం నుంచీ విదేశాల్లోని చలిప్రాంతాలకు తీసుకువెళ్తే ......అక్కడి కొత్త వాతావరణానికి తట్టుకోవాలంటే శరీరం కొంత మార్పుకు అలవాటుపడాలి.
ఇలాంటప్పుడు దైవం జీవుల శరీరాలను ఎండకు, లేక చలికీ మాత్రమే తట్టుకునేటట్లు ముందే ఏర్పాటు చేస్తే జీవులకు కష్టమయిపోతుంది.
ఒకోసారి ఒకే దేశంలో కూడా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తూంటాయి.
ఇలాంటప్పుడు దైవం జీవులకు పరిణామలక్షణం ఉండేలా ఇచ్చిన అవకాశం మంచిదే కదా !
అయితే పరిణామ సిద్ధాంతం కూడా సృష్టికి ఆటంకం కలుగకుండా పరిమితమైన పరిధిలోనే జరుగుతుంది అనిపిస్తుంది.
ఉదా..నదిలో ఒకేరకమైన వాతావరణం ఉన్నప్పటికీ జీవులు ఆల్గే, కప్పలు, చేపలు ఇలా...... విభిన్న రూపాల్లో ఉంటాయి కానీ, ఒకే లక్షణాలు కలిగిన జీవుల్లా మారిపోవటం లేదు కదా !
.....................
దైవం మానవులను చక్కగా సృష్టించారు. కానీ పాపాత్ములయ్యేది, పుణ్యాత్ములయ్యేదీ వారికి అవకాశాన్ని కూడా ఇచ్చారు.
పుణ్యాలు చేస్తే ఉత్తమలోకాల్లో గొప్ప జన్మ లభిస్తుంది. పాపాలు చేస్తే నీచజన్మ లభిస్తుంది.
అలాగే జీవులకు కూడా పై తరగతి జీవులుగానూ, లేక క్రింద తరగతి జీవులుగానూ పరిణామాన్ని చెందేట్లుగా అవకాశాన్ని ఇచ్చారేమో ?
( అంటే ఇక్కడ పాపపుణ్యాలు అని కాకుండా వేరే పద్ధతిలో చూడాలి. అంటే పరిస్థితులు, అలవాట్లకు అనుగుణంగా పరిణామం చెందే విధంగా అని అర్ధం చేసుకోవాలి. )
పరిణామవాదం నిజమే అయితే ....ఈ వాదాన్ని గమనిస్తే నాకు ఇలా కూడా అనిపించింది.
.................
దైవం తన సృష్టి రచనలో భాగంగా . జీవులకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పరిచారు. జీవులను సృష్టించారు.
* అయితే జీవనసమరంలో జీవుల ప్రయత్నాలకు గుర్తింపు, ప్రాముఖ్యత ఉంటుందని మనం తెలుసుకోవచ్చేమో !
* జీవులు ప్రయత్నిస్తే ఉన్నతస్థాయికి గానీ, అధమ స్థాయికి గానీ మారే అవకాశాన్ని దైవం కల్పించారు అనిపిస్తుంది.
అంటే కొందరు అనేటట్లు మనతలరాత.. మనం ఏం చేయగలం .. అని అనుకోకూడదనీ , జీవుల ప్రయత్నానికి కూడా ప్రాముఖ్యత ఉందని మనం అర్ధం చేసుకోవచ్చు.
లోకానికి మొక్కలు, వంటి జీవజాతులు చాలా సహాయపడుతున్నాయి.
* అవి కష్టపడకుండా , తమను తాము కాపాడుకోవటానికి వీలుగా అంటే పరిసరాలకు అనుగుణంగా పరిణామం చెందే అవకాశాన్ని దైవం కల్పించారేమో అనిపిస్తుంది.
........................
ఇంకా,
* పరిణామవాదానికి వీలులేకుండా..... దైవం మొదలే జీవులను పరిపూర్ణంగా సృష్టించవచ్చు కదా ! అని చాలా మంది సందేహం .
* నిజమే కానీ ఈ భూలోకాన్ని జీవులకు పరీక్షాలోకం అనికూడా అనుకోవచ్చేమో !
( అయితే , ఆదిశక్తియైన పరమాత్మ యొక్క దయ ఉంటే , ఇహలోక భోగము ... పరలోకమోక్షము కూడా పొందవచ్చని పెద్దలు చెప్పటం జరిగింది.)
* పరిపూర్ణత్వమనేది పరమాత్మకే సాధ్యం.
జీవులు కూడా పరిపూర్ణత్వాన్ని పొందాలంటే పరమాత్మను పొందాలి. దానినే పెద్దలు మోక్షం అన్నారు.
భూలోకంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి..ఒక ప్రాణిని బాధించి లేక చంపి ఆహారాన్ని పొందటం ద్వారా ఇంకొక ప్రాణి జీవించటం వంటి పద్ధతి ఈ లోకంలో ఉంది.
ఈ లోకాన్ని దైవం ఇలాగే సృష్టించారు.
( కొందరు మహాత్ములు సమాధి వంటి పద్ధతుల ద్వారా ఆహారం లేకుండా కూడా జీవిస్తారు. అది వేరే విషయం . )
* భూమి కన్నా పైన ఎన్నో ఉత్తమ లోకాలున్నాయి. అక్కడ పద్ధతి వేరేగా ఉంటుంది.
ఆహారం గురించి ఇతర జీవులపై ఆధారపడే పద్ధతి అక్కడ ఉండదు.
పుణ్యాత్ములు వెళ్ళే ఆ లోకాల్లో వారికి సంకల్పమాత్రం చేతనే ఆహారాన్ని సృష్టించుకోగల శక్తి ఉంటుంది. ( వారికి ఆహారంతో అవసరం కూడా ఉండదేమో ! . . )
* అలా జీవులు పరమాత్మను చేరుకుంటే మోక్షమనబడే .....ఏ కష్టాలూ లేని పరిపూర్ణమైన పరమానందస్థితికి చేరుకుంటారు.
ఈ విధమైన చాలా విషయాలు " ఒక యోగి ఆత్మ కధ " గ్రంధంలో చెప్పబడ్డాయి.
* విజ్ఞానం, విశ్వవిజ్ఞానం కూడా ఆధ్యాత్మికతలో భాగమే.
......................
ఒక ఇంట్లో పెద్దవాళ్ళు బాగా చదువుకుని ఎన్నో విషయాలు తెలిసినా కూడా........ చిన్నపిల్లలకు అక్షరాలను దిద్దించటం నుంచే ప్రారంభిస్తారు గానీ, అన్నప్రాశననాడే ఆవకాయ సామెతలాగ చెయ్యరు గదా !
* అలాగే సృష్టి విధానం ఈ భూలోకంలో మాత్రం ఈ క్రమంలో జరుగుతుంది అనిపిస్తుంది. . ( పసితనం నుంచి వృద్ధాప్యం వచ్చినట్లుగా. )
...................
* అసలు ఇలా జీవులను సృష్టించటం ఇదంతా ఎందుకు ? అనుకుంటే ఇదంతా దైవానికి ఒక వినోదం అనుకోవచ్చేమో ..
ఉదా...మన ఇంట్లో పిల్లలకు ఆహారం అన్నీ అమర్చి ఇంట్లో కదలకుండా ఉండమంటే పిల్లలు వింటారా ? వినరు కదా !
బయటకెళ్ళి ఆడుకుంటాము.. అని పెద్దవాళ్ళను అడుగుతారు.
ఆటల్లో కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయని తెలిసినా, ఒకోసారి ఓడిపోతామని తెలిసినా కూడా ఆడుకోవటానికే పిల్లలు ఉత్సాహ పడతారు.
* ఎంత బయట ఆడుకున్నా తిరిగి పిల్లలందరూ ఇంటికి వెళ్ళాలి కదా !
అలాగే లోకంలో జీవులు అందరూ కష్టాలనూ, సుఖాలనూ అనుభవించి ఈ జగన్నాటకమనే ఆట ముగించి తిరిగి ఇంటికి వెళ్ళవలసిన వారే. జగన్మాతాపితరుల్ని చేరుకోవలసిన వారే.
సరైన మార్గంలో నడిచిన పిల్లలు ఇంటికి త్వరగా చేరుకుంటారు. దారి తప్పిన పిల్లలు ఆలస్యంగా ఇంటికి చేరుకుంటారు....
ఇంటికి అంటే దైవం దగ్గరకు అన్నమాట. ( ఇలా నేను ఇంతకుముందు ఒక టపాలో వ్రాశానండి. . )
ఈ సృష్టి అనేది లేకపోతే విశ్వం స్తబ్దంగా బోర్ గా ఉండేది.....
............................
*..ఏంటో తోచినట్లు వ్రాశాను. వ్రాసినదానిలో పొరపాట్లు ఉంటే దైవం క్షమించాలని ప్రార్ధిస్తున్నాను. ఇందులో తప్పులు ఉంటే నావిగానూ, ఒప్పులు ఉంటే దైవం దయగానూ నేను భావిస్తున్నాను.......అంతా దైవం దయ.
ఇదంతా పెద్ద వ్యాఖ్యగా రాయటం కుదరక ఇక్కడ పోస్ట్ చేయటం జరిగింది...
From Chinna Jeeyar Swamiji's Pravachanam:
ReplyDeleteసృష్టి కార్యం
నారములు అంటే సఖల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం. సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం, విడ దీస్తే ఉత్తర-అయణం అంటాం. నారాయణ శబ్దం లోని అయణ అనే పదాని అర్థం ఆధారం. ఈ సఖల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు.
సకల చరాచర వస్తువులకు లోపల బయట వ్యాపించి వాటికి ఆధారమైన వాడిని మనం నారాయణ అంటాం. అర్థాత్ ఆయన లోపన మరియూ బయట వ్యాపించి ఉంటాడని. అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గి, చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలబ్యాది గుణాలు ఉంటాయి. లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు, పైన కూదా ఉంటాడు కనక అయన పరుడు- అందుచే పరత్వం సౌలబ్యం లాంటి గుణాలు కల్గినవాడు. జ్ఞానులు కూడా ఈ నారములలోని వారేకనుక తాను జ్ఞానం కల్గి ఉంటాడు. చేయిజాస్తే అందేవాడు, వారిలోని దోశాలనను ఎలా దూరంచేయాలో తెలిసినవాడు, దోశాలున్నా తన నుండి మనల్ని దూరం చేయని వాత్సల్యం కల్గినవాడు. దోశాలను తొలగించే శక్తి కూదా ఉంది. అర్థాత్ ఆయనలో పరత్వం ఉంది, సౌశీల్యం ఉంది, వీటన్నిటినీ తనవనుకునే స్వామిత్వం ఉంది, వీటి యొగ్యత గుర్తించే జ్ఞానంచే సర్వజ్ఞత్వం ఉంది, తను ఇలాచేస్తానంటె ఎవ్వరూ అడ్డనంత శక్తి ఉంది, ఎంత ఇచ్చినా తరగని నిండుతనం అంటే పూర్ణత్వం ఉంది.
ఇన్ని గుణాలు కల్గి ఉన్న నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవటం కష్టమే. మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవటం అవసరం. మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం, ఒక భూమి మీద నివసిస్తునాం. ఈ భూమి సౌరమండలంలో ఉంది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేసారో మనం ఆలోచించటం లేదు. ఒక చిన్నవిత్తనం నుండి ఒకపెద్ద వటవృక్షం వచ్చినట్లుగా ఇది ఒకనాడు ఎర్పడింది ఒకడిలోంచే అని మనకు వేదం చెబుతుంది.
ఇవన్ని ఏవి లేనప్పుడు పరమాత్మ ఈ జీవులందరూ ఉన్నారే అతి చిన్నరూపం కలవారు, అతి విలక్షణమైన జ్ఞానం కలవారు, కర్మభారాలు మోసేవారు, తామంతట తాము దేహాలు ధరించలేనివారు మరినేను వీల్లకు ఉపకారం చేయకుంటే ఎలా! కర్మతోలగాలంటే దేహం కావాలి, దేహం ఉండే నేల కావాలి, దాన్ని భోగ స్తానం అంటారు. అందుకు అనుభవించే వస్తువులు కావాలి, వాటిని భోగ్యములు అని అంటారు. వీటిని అనుభవించే ఇంద్రియాలు కావలి వాటినే భోగ్య్ ఉపకరణములు అంటారు. ఇన్నింటిని తయారు చేనినవాడిని మనం నారాయణ అంటాం. మరి ఇవన్నీ తయారు చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకొన్న స్తానాన్నే వ్యూహం అంటారు.
అక్కడ ఆయన వాసుదేవ, అనిరుద్ద,ప్రత్ర్యుమ్న, సంకర్షన అనే నాలుగు పేర్లతో ఉంటాడు. సృష్టి, స్తితి, లయము ఈ మూడు కార్యాలు చేస్తాడు, ఆ స్తానాన్నే పాల్కడలి అని కూడా అంటారు.
ఆయన కళ్యాణ గుణాలకు అది మూలస్థానం. అక్కడ వ్యూహ వాసుదేవ అనేరూపంతో సర్వం తన ఆదీనంలో పెట్టుకుంటాడు. అందులోంచి ఒక రూపం తీస్తాడు వ్యూహ అనిరుద్ద అని పేరు.
సృష్టి పూర్వ దశ నుండి సృష్టి తరువాత దశ వరకు స్వామిని ఎట్లా ఉంటాడో చాందోగ్య ఉపనిషత్ వర్ణిస్తుంది. సృష్టి కి ముందు భగవంతుడు ఒక సంకల్పం చేస్తాడట. ఆసంకల్పం “తడైక్షత భహుష్యాం ప్రజాయేయేతి” నెనే నానుండి అనేకమందిని తీద్దును గాక అనుకుంటాడట. ఇక సృష్టి చేయడం ఎలా అంటే త్రివుత్కరణం అని చెబుతారు.
సులభశైలి థన్యవాదములు
Deleteత్రివుత్కరణం: ఒక అండం
ReplyDeleteమొదట తనలోంచి తేజస్సుని తీస్తాడు, తేజస్సులోంచి జలాన్ని తీస్తాడు, జలంలోంచి పృథ్విని తీస్తాడు. ఈక వీటిని సగం సగం సగం భాగాలుగా చేస్తాడు. ప్రతి రెండో భాగాన్ని మల్లీ సగం సగం చేస్తాడు. ఇప్పుడు ప్రతీదీ ఒక పెద్ద భాగం గా రెండు చిన్న భాగాలుగా ఉంటాయి. ఇక అన్నీ భాగాలు ఒక్కో దానిలో వచ్చేట్లుగా పంచి మూడింటిని సిద్దం చేస్తాడు. అయితే ప్రతీదాంట్లో ఏదో ఒక భాగం ఎక్కువగా ఉండి మిగతావి రెండు తక్కువగా కల్గి ఉంటాయి. ఇవన్నీ కల్పి ఒక అండం క్రింద తయారు చేస్తాడు. దీన్నే బిగ్ బ్యాంక్ అని ఇప్పటి వాల్లు చెబుతున్నారే అది. “యుగప్పత్ సృష్టికార్యం” ఒక చిటికెలో సృష్టికార్యం జరిగి పోయింది, అనేక కోట్ల అండాలు బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చిన ఒక అండంలో ఒక గోళంలో మనం ఉన్నాం.
ఈ బయటకు వచ్చిన ప్రతి అండంలో ఒక బ్రహ్మ ను పెడుతాడు. ఆ బ్రహ్మ శరీరంలోంచి పదకోండు ప్రజాపతులను బయటికి తీస్తాడు. ఇంతవరకు తాను నేరుగా చేస్తాడు. దీన్నే అద్వారక సృష్టి అంటారు.
చతుర్ముఖుడైన బ్రహ్మకు నాలుగు వేదాలను ఉపదేశం చేసి, తిరిగి ఆయన వేదాలను పోగొట్టుకుంటే మల్లీ తెచ్చి ఇస్తుంటాడు.
బ్రహ్మకు వేద ఉపడేశం చేసాక, ఇక పై బ్రహ్మ ద్వారా సృష్టి చేస్తాడు. ఇది సద్వారక సృష్టి.
మంచి జీవిని తయారు చేయాలని అనుకున్నాడు, ఆ మంచి జీవిని తయారు చేయాలనే ప్రయత్నంలోనే ఈవాల మనం ఈ విశ్వంలో చూసే ఇన్ని జీవరాసులు. ఎనభై నాలుగు లక్షల జీవరాశుల రకాలు అంటుంటారు. బ్రహ్మ గారి లక్ష్యం మనిషిని తయారు చేయటం, ఆయన ప్రయోగాలలో తయారైనవి ఇన్ని జీవ రాశులు.
ఇక బ్రహ్మ సృష్టించాక అన్నీ వస్తువులలో అంతర్యామి అయ్యి తానుంటాడు.
ఇక ఇన్నింటిని రక్షించటానికి వ్యూహ వాసుదేవ అనే రూపంలోంచి మరొక రూపం తీస్తాడు అది వ్యూహ ప్రత్యుమ్న అని పేరు. సృష్టించిన వాటిని రక్షించటానికి ఇంద్రుడిలో తానుండి చేస్తాడు. ఏదైన సరియైనదిగా రాకుంటే, అందులోంచి ఒక రూపం తీస్తాడు దానికి వ్యూహ సంకర్షణ అని పేరు, ఇది ప్రళయం చేయటానికి శివునిలో తానుండి చేస్తాడు.
ఆర్తితో పిలిచేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో అక్కడినుండి లోకరక్షణకై వ్యూహ వాసుదేవ అనే రూపంలోంచి అవతారాలను పంపిస్తుంటాడు. ఆయా అవతారల్లో ఆయన గుణ సంపదలను లోకానికి చాటుతాడు. అందుకే అవతారాలను విభవములు అంటారు. ఒక సారి చేప లాగా, ఒకసారి తాబేలు లాగా, ఒక సారి వరాహమ్లాగ, మరోకసారి ఇటు మనిషి కాని అటు మృగము కాని వాడిలా, ఒక సారి మనిషిలా ఇలా ఎన్నో రకాలుగా ఆయా అవసరాలను బట్టి ఒక రూపం స్వీకరించి మనవద్దకు వస్తాడు.
ఆయన కళ్యాణ గుణాలకు అది మూలస్థానం. అక్కడికి ఆయన మొట్టమొదటిగా అడుగు పెడతాడు, ఆదిశేశువు పైన ఆయన ఉంటాడు. అన్ని అవతారాలకు మూల స్థానం పాల్కడలియే.
thanku sir
Deleteమీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలండి.
ReplyDeleteవేదములలో, మరియు కొన్ని ప్రాచీన గ్రంధాలలో సృష్టి గురించిన ఎన్నో విషయాలు చెప్పబడ్డాయని పెద్దలు చెప్పటం జరిగింది. దశావతారముల ద్వారా సృష్టిపరిణామక్రమం గురించి తెలుసుకోవచ్చని కొందరు అంటారు. మీ వ్యాఖ్య ద్వారా స్వామివారు చెప్పిన విషయములు ,ఇంకా ఎన్నో విషయములు తెలుసుకున్నందుకు ఆనందంగా ఉందండి.
మీకు ధన్యవాదములు..
easy explanation thanks for sharing
ReplyDelete