ఈ మధ్య ఒకరోజు నేను గుడికి వెళ్తుంటే మా ఇంటికి దగ్గరలో రోడ్డు ప్రక్కన ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు.
జనాలు అందరూ ఆ వ్యక్తి ప్రక్కనుంచే వెళ్తున్నారు కానీ, ఏమీ పట్టించుకోవటం లేదు.
ఆ వ్యక్తి చనిపోయాడో లేక ఆకలివల్ల కళ్ళు తిరిగి అలా పడిపోయాడో అనుకున్నా నేను. ఏం చేయాలో అర్ధం కాలేదు.
అలాగే గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళానన్నమాటే కానీ, మనసంతా గందరగోళంగా ఉంది.
బ్లాగులో నీతులు చెప్పటమే కానీ, ఏమీ సాయం చెయ్యలేకపోయానే, ! అనిపించింది.
గుడినుండి తిరిగి వచ్చేటప్పుడు చూస్తే అలాగే పడి ఉన్నాడు ఆ వ్యక్తి.
అప్పుడు దగ్గరలోనే ఉన్న మా ఇంటికి వెళ్ళి ఇంట్లో మిగిలి ఉన్న కొద్దిగా అన్నం, కూర తీసుకువచ్చాను.
కానీ నాకు బెరుకుగా అనిపించింది. చూసేవాళ్ళు నాది ఓవర్ యాక్షన్ అనుకుంటారేమోనని .
చుట్టుప్రక్కలవారు నేను అన్నం తేవటం చూసి ఆ వ్యక్తిని పిలిచారు . అన్నం తింటావా ? అని గట్టిగా అడిగారు.
ఆ మాటలు విని ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు. కానీ లేవలేక పోతున్నాడు.
ఇలాంటప్పుడు మగవాళ్ళయితే ఏమైనా చెయ్యగలరు.
అప్పుడు చుట్టుప్రక్కల వారిని అడిగాను. అతనికి ఏమయ్యింది అని.
వాళ్ళు ఏమన్నారంటే , తాగి పడిపోయుంటాడు. అన్నం ఏం తింటాడు అన్నారు.
(అతను నిజంగా తాగి పడిపోయాడో లేక ఆహారం లేక పడిపోయాడో భగవంతునికే తెలియాలి. ).
ఆ మాట వినగానే నేను వెనక్కి తగ్గాను. తీసుకువెళ్ళిన ఆహారపదార్ధాలు ఆ వ్యక్తికి కొంచెం దూరంలో పెట్టి తిరిగి వచ్చేసాను.
తరువాత ఆ వ్యక్తి అన్నం తిన్నాడో లేదో నాకు తెలియదు.
( నేను అంతకన్నా ఏం సహాయం చేయలేకపోయాను. )
ఏంటో ! ప్రపంచం. కొందరికి డబ్బు లేక కష్టాలు.
కొందరికి డబ్బు ఎక్కువయ్యి కష్టాలు.
కొందరికి జబ్బుల వల్ల కష్టాలు, కొందరికి కుటుంబసభ్యులతో కష్టాలు.
కొందరికి తమ యొక్క కోపం, అసూయ,అత్యాశ వంటి గుణాల వల్లే కష్టాలు.
కొందరు ఇతరుల ప్రవర్తన భరించలేక తాగుడుకు అలవాటు పడతారు.
కొందరు తాము ఇతరులను కష్టపెట్టి తరువాత వచ్చే కష్టాలు భరించలేక తాగుతారు.
కుటుంబం సభ్యుల ప్రవర్తన భరించలేక తాగేవాళ్ళూ ఉన్నారు.
ఎలా తాగినా కూడా తాగేవాళ్ళకే నష్టం . ఆరోగ్యం పాడయితే పట్టించుకునేవారు కూడా ఉండరు.. .
ఏ కష్టాలైనా.... ఇలా తాగి పడిపోవటం వల్ల తీరకపోగా , కొత్త కష్టాలు మొదలవుతాయి.
ఇవన్నీ తెలిసినా కూడా వాళ్ళంతే.
ఇలాంటి వ్యక్తుల వల్ల వారి కుటుంబసభ్యులు కూడా నరకం అనుభవిస్తారు.
లోకంలోని ఇలాంటి కష్టాలన్నింటినీ మనం పోగొట్టలేకపోయినా , అందరూ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే చాలావరకూ పరిస్థితులు బాగుపడతాయి.
నేను సినిమాలు చూడటానికి టివీలు చూడటానికి , సరదాగా ఉండటానికి వ్యతిరేకిని కాదండి.
నేను కూడా సినిమాలు, సీరియల్సు చూస్తాను.( కొన్ని ) సినిమా వాళ్ళ గురించి పత్రికల్లో వచ్చే గాసిప్స్ కూడా చదువుతాను.
(ఇప్పుడు మనుషుల మనస్తత్వాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది కదా !.)
అయితే ప్రతీదానికీ ఒక పద్ధతి ఉంటుంది కదా !
ఉదా...ఒక కుటుంబం అందరూ హాల్లో కూర్చుని టీవీలో సీరియల్ చూస్తుండగా , వెనుక తలుపునుండి దొంగలు చొరబడి ఇల్లంతా దోచుకుపోయారని కొంత కాలం క్రితం ఒక వార్త చదివాను.
ఇల్లును అంత అజాగ్రత్తగా వదిలేసి అంతలా టీవీ చూడటమేమిటి ? అనిపిస్తుంది కదా !
అలాగే దేశాన్ని దొంగలు దోచుకుపోతుంటే ఏమీ పట్టనట్టు సినిమాలూ, సీరియళ్ళు చూసుకుంటూ ఉండటం ఏం బాగుంది ?
దేశం పాడైపోతే మనకూ ప్రమాదమే కదా ! . అని నా అభిప్రాయం.
దేశాన్ని బాగుచేసుకోవాలంటే పెద్దగా ఉద్యమాలు చెయ్యటమే కాదు...
ఎవరి పనిని వారు నీతిగా, నిజాయితీగా ,సక్రమంగా నిర్వర్తించినా చాలు , సమాజంలోని చాలా సమస్యలు పరిష్కారమవుతాయి.
కానీ, సమాజంలో నైతిక విలువలు బాగా లోపించటమే ఇప్పుడు పెద్ద సమస్య.
అయితే ఇప్పటికీ మంచివారూ, దైవభక్తి కలవారు , నీతీ, నిజాయితీ కలవారూ, మేధావులు ఎందరో ఉన్నారు.
అందరూ గట్టిగా ప్రయత్నిస్తే ఈ దేశం ప్రపంచానికే ఆదర్శమవుతుంది.మార్గదర్శి కూడా అవుతుంది.
బాగా రాసారు
ReplyDeleteGood One.
ReplyDeleteమంచి విలువలు కలిగిన యువత వల్ల దేశ భవిష్యత్తు బాగుంటుంది. మీకు ఈ టపా నచ్చినందుకు ధన్యవాదాలండి. వివేకానందస్వామి యువశక్తి గురించి బాగా చెప్పటం జరిగింది..
ReplyDeleteమీకు ఈ టపా నచ్చినందుకు ధన్యవాదాలండి.
ReplyDeleteఎవరి పనిని వారు నీతిగా, నిజాయితీగా ,సక్రమంగా నిర్వర్తించినా చాలు , సమాజంలోని చాలా సమస్యలు పరిష్కారమవుతాయి.
ReplyDeletevyakthi gatha shreyasse samaaja shreyassu ane vaakyaniki mee matatho jatha kudirindi.
mee lanti experience naku chaala sarlu jarigindandi.
:)
meeru antha manchi uddeshyam tho manchi pani chesaru
sadeham ledu athanu
mee prasaadaani sweekarinchi untaadu
?!
http://paramapadasopanam.blogspot.com
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలండి. మీకు ఈ బ్లాగు నచ్చినందుకు, ఈ బ్లాగును ప్రోత్సహిస్తున్నందుకు నా ధన్యవాదాలండి.
ReplyDeleteసమాజశ్రేయస్సులోనే వ్యక్తి శ్రేయస్సు............వ్యక్తి శ్రేయస్సులోనే సమాజశ్రేయస్సు ఆధారపడి ఉంది అని కూడా అనిపిస్తున్నది.
మనకు ఎవరికయినా సహాయం చేసే అవకాశం లభించిందంటే, ఆ విధంగా మనకు మరింత పుణ్యం లభిస్తుంది కదా !
అలా చూస్తే వారే మనకు సహాయం చేసినట్లు .... అని కూడా అనిపిస్తున్నది..
సమాజంలో పేదరికం, ఆర్ధిక అసమానతలు ఎక్కువయిపోతున్నాయి. అందుకే ఇలా రోడ్డుపై పడిపోయేవారు చాలామందే కనిపిస్తున్నారు.
పూర్వపురోజుల్లో ఇలా రోడ్డుపై ఒక వ్యక్తి పడిపోతే ఇలా పట్టించుకోకుండా ఎవరిదారిన వారు వెళ్ళేవారు కాదు. ఒక ఊరిలోకి కొత్త వ్యక్తి వస్తేనే వివరాలు అడిగేవారు. ఇప్పుడు ఆ రోజులన్నీ పోయాయి.
ఒకే ఇంట్లోఉన్న కుటుంబసభ్యులకే ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి సమయం లేని మాయదారి రోజులు వచ్చాయి. దీనినే అభివృద్ధి అంటున్నారు కొందరు...