koodali

Monday, November 21, 2011

పరిణామవాదాన్ని వేరొక కోణం నుండి పరిశీలిస్తే..... ఒకటవ భాగం.....


డార్విన్ పరిణామవాదం గురించి చిన్నప్పుడు చదువుకున్నాను కానీ, ఇప్పుడు అంత గుర్తు లేదండి. .

పరిణామవాదం గురించి ఈ మధ్య శాస్త్ర విజ్ఞానం వారి బ్లాగులో చదివాక నాకు రకరకాల ఆలోచనలు వచ్చాయి.

నాకు శాస్త్రవేత్తలలా విషయపరిజ్ఞానం లేదు కానీ, కొన్ని ఆలోచనలు వచ్చాయి. చూసి తప్పుగా భావించవద్దండి.

పరిణామవాదం అంటే నాకు అర్ధమయింది ఏమంటే, జీవులు తమ అలవాట్లు, పరిసరాలకు అనుగుణంగా పరిణామాన్ని చెందే అవకాశం ఉందనీ,

ఉదా...మనిషి కోతి నుంచీ పరిణామాన్ని చెందిఉండవచ్చని ఇలాగ.........అన్నారు కదా.. నిజమే పరిణామసిద్ధాంత నిజమే కావచ్చు.

అయితే , దైవం యొక్క సృష్టిరచన అత్యద్భుతమైనది. వారు ఒక పద్ధతి ప్రకారం జీవులను సృష్టించారు.

ముందు జీవుల మనుగడకు, ఆహారానికి అవసరమైన పద్ధతిలో సూర్యుడు, వాతావరణం మొదలైనవి , సూర్యరశ్మి ద్వారా పత్రహరితాన్ని తయారుచేసుకునే మొక్కలు, మొక్కలపై ఆధారపడి జీవించే జంతువులు ఇలాగా ...........అన్నమాట.

ఇంకా,

ఒక నదిలో ఒకేరకమైన వాతావరణం ఉన్నా కూడా ఆల్గే, దాన్ని తినే చిన్న జీవులు, కప్పలు, చేపలు, చిన్నచేపలను తినే పెద్దచేపలు ఇలా ఒక ప్రణాళిక ప్రకారం సృష్టి ఏర్పడి ఉంది.

(నదిలో ఒకే రకమైన వాతావరణం ఉన్నా కూడా జీవులన్నీ ఒకే రకంగా మారిపోలేదు మరి. )

అలాగే జీవులకు పరిస్థితులను బట్టి పరిణామం చెందే అవకాశాన్ని కూడా దైవం కల్పించారేమో ? అని కూడా అనిపిస్తుంది.

ఇంకా ఏమనిపించిందంటే , ఉదా... కొందరి భావన ప్రకారం . జీవులలో పనికిమాలిన అవయవాలు అని చెప్పుకుంటున్నవి. పనికిమాలినవి కాదేమో ?

1...ఉదా...... కొన్ని పాములకి కాళ్ళు ఉంటాయి. పాకే పాములకి కాళ్లతో ఏం పని? బల్లులకి, మొసళ్లకి ఉన్నట్టే ఉంటాయి గాని నిజానికి ఆ కాళ్లు ఆ పాముల కదలికలో పాల్గొనవు. ఇలాంటి అంగాలనే వ్యర్థ అంగాలు అంటారు. అని కొందరి అభిప్రాయం.

కానీ, కొన్ని ప్రాకే జీవులకు కదలికలో కాళ్ళు కూడా సహాయపడతాయి. అలాగే పాములకు కూడా కాళ్ళు సహాయంగా ఉండటానికి వీలుగా పరిణామం జరుగుతోందేమో ?

( పాము కాళ్ళు వ్యర్ధ అవయవాలు కాదేమో ! )

2....అలాగే మోల్ అనబడే ఎలుకని పోలిన జంతువులకి చెందిన బ్లైండ్(గుడ్డి) మోల్ అనే ఉపజాతి ఒకటి ఉంది. ఇవి ఎక్కువగా కలుగుల్లో, చీకటి ప్రాంతాల్లో బతుకుతుంటాయి. వీటికి కళ్లు ఉంటాయి గాని అవి పని చెయ్యవు. వాటి మీదుగా ఓ చర్మపు పొర కప్పబడి ఉంటుంది. చూపు లేని ఈ జీవాలకి కళ్లెందుకు ? అని కొందరి అభిప్రాయం.

మోల్ అనే ( బ్లైండ్ )జంతువుకి కళ్ళెందుకు ? అనుకోకూడదు. వాటికి అవి నివసించే చీకటి ప్రాంతాల్లో కూడా చూడటానికి వీలుగా వాటికి కళ్ళు ఏర్పాటు జరుగుతోందేమో ? ( గుడ్లగూబలు చీకటిలో కూడా చూడగలవు కదా ! )

( కళ్ళు వ్యర్ధ
అవయవాలు కాదేమో ! )

3... అలాగే కోళ్ళకు రెక్కలెందుకు ? అని కాకుండా అవి నెమ్మదిగా పక్షుల్లా పైకి ఎగరటానికి సిద్ధమవుతున్నాయేమో ? అనుకోవచ్చు కదా ! ( కోళ్ళు పల్లెటూళ్ళలో ఇళ్ళ మధ్యన ఉండే అతి చిన్న కాలువలను ఎగిరి దాటుతుంటాయి. )

( కోడి రెక్కలు వ్యర్ధ అవయవాలు కాదేమో !)

అందుకే వీటిని వ్యర్ధ అవయవాలు అనుకోకూడదేమో ? అనిపించింది. దైవ సృష్టి తప్పకుండా ‘ప్రతిభతో కూడిన రూపకల్పనే. ’


౪... ఈ నాటి మానవులు అభివృద్ధి పేరుతో పనులన్నీ యంత్రాలకు అప్పజెప్పి తాము సుఖపడుతున్నామనే భ్రాంతిలో ఉన్నారు.


.ఈ నాటి మానవులు చాలామంది తమ శరీరాలకు అతిగా ఇచ్చిన విశ్రాంతి వల్ల  కొన్ని తరాల తర్వాత మానవుల కాళ్ళూచేతులూ బలహీనమయిపోతాయేమో ?

( పరిణామవాదం ప్రకారం చూస్తే .....)

కాలిక్యులేటర్లూ గట్రా అతిగా వాడటం వల్ల ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తి మందగిస్తాయేమో ?
.............. 
ఇంకా ఈ మధ్య మనుషుల్లో పెరిగిపోతున్న అజ్ఞానం, ఆటవిక ప్రవృత్తి చూస్తుంటే ,మానవులలో జంతువుల వలె  శారీరిక లక్షణాలు పెరుగుతున్నాయేమో ? ( కొందరిలో ) అనిపిస్తోంది.

ఉదా..మానవుల్లో వ్యర్ధభాగంగా భావిస్తున్న coccyx ( tail bone) గతకాలపు అవశేషం కాదేమో ?  తోక అవసరమయ్యే విధంగా శారీరిక పరిణామం చెందుతున్న లక్షణమేమో ? అనిపిస్తోంది.

................ 

టాన్సిల్స్ తీసివేసిన వారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుందని కొందరు అంటున్నారు.    అయితే, ఈ రోజుల్లో కొందరు డాక్టర్లు రోగం వస్తే చాలు ఆ భాగం వేస్ట్ అంటూ కోసిపారేస్తున్నారు.

౫.... ఒక జీవి ఇంకొక జీవిగా మారటానికి ....... బోలెడుతరాలు అక్కర్లేని జీవులు కూడా సృష్టిలో ఉన్నాయి. ఉదా...సీతాకోకచిలుక.

దైవసృష్టి యొక్క గొప్పదనానికి గొప్ప ఉదాహరణ .........

* గగుర్పాటు కలిగించే గొంగళిపురుగు సమాధి స్థితి వంటి ప్యూపా దశ తరువాత అందమైన రంగురంగుల సీతాకోక చిలుకగా మారటం మనకు తెలుసు కదా !

దైవం ఏం చేసినా అందులో ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి.


* దైవ సృష్టి ఎప్పుడూ గొప్పదే. " ఒక యోగి ఆత్మకధ "లో ఏం చెప్పారంటే........... సర్వార్ధ సాధకమైన అనంత సంకల్పంతో అనుసంధానం పొంది బాబాజీ , మూలక అణువుల్ని , సుసంయుక్తమైన ఏ రూపంలోనైనా సాక్షాత్కరించ వలసిందిగా ఆదేశించగలరు.....అలా చెప్పబడింది.

దైవం తలచుకుంటే దేనినైనా ఏ విధంగానైనా మార్చగలరు.

దైవం ఏం చేసినా అందులో ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి.

* సృష్టి గొప్ప ప్రణాళిక ప్రకారం దైవం చేత సృష్టించబడింది. అయితే పరిణామవాదాన్ని గమనిస్తే. ,జీవులకు పరిణామం చెందే అవకాశం కూడా ఇవ్వబడిందని అనిపిస్తూంది.. దైవం యొక్క సృష్టి " ప్రతిభతో కూడిన రూపకల్పనే ".


5 comments:

  1. మీవాదన "Evolution is true, God said it!" అన్నట్లుందండీ :) . ఇంత లాజికల్‌గా ఆలోచించగలిగిన మీరు దేవుడి originగురించి మాత్రం ఇంతే లాజికల్‌గా ఆలోచించడానికి వెనుకాడుతున్నారు. The primary argument of evolutionary theory is that we don't need God to explain how the different species of beings came into existence. But here, I see the very process being approved of or being allowed by God Himself :). If God had created the beings, what compelled him into fooling us into thinking that they actually got evolved? If a perfect maker/designer made them, don't they have to be perfect by existence and if so why do they have to be evolved (to perfection)?.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  3. పరిణామాన్ని గురించిన మీ పరిశీలన బాగుందండీ..

    ReplyDelete
  4. విజయలక్ష్మి గారూ మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    పరిణామవాదానికి వీలులేకుండా..... దైవం మొదలే జీవులను పరిపూర్ణంగా సృష్టించవచ్చు కదా ! అని చాలా మంది సందేహం .

    .కానీ, ఒక కుక్క పిల్లనో, కుందేలు పిల్లనో భారతదేశంలోని వేడిప్రాంతం నుంచీ విదేశాల్లోని చలిప్రాంతాలకు తీసుకువెళ్తే అక్కడి కొత్త వాతావరణానికి తట్టుకోవాలంటే శరీరం కొంత మార్పుకు అలవాటుపడాలి.

    ఇలాంటప్పుడు దైవం జీవుల శరీరాలను ఎండకు, లేక చలికీ మాత్రమే తట్టుకునేటట్లు ముందే ఏర్పాటు చేస్తే జీవులకు కష్టమయిపోతుంది.

    ఒకోసారి ఒకే దేశంలో కూడా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తూంటాయి.

    ఇలాంటప్పుడు దైవం జీవులకు పరిణామలక్షణం ఉండేలా ఇచ్చిన అవకాశం మంచిదే కదా ! అని కూడా అనిపిస్తుంది.

    అయితే పరిణామ సిద్ధాంతం కూడా సృష్టికి ఆటంకం కలుగకుండా పరిమితమైన పరిధిలోనే జరుగుతుంది అనిపిస్తుంది.

    ఉదా.....నదిలో ఒకేరకమైన వాతావరణం ఉన్నప్పటికీ జీవులు ఆల్గే, కప్పలు, చేపలు ఇలా...... విభిన్న రూపాల్లో ఉంటాయి కానీ, ఒకే లక్షణాలు కలిగిన జీవుల్లా మారిపోవటం లేదు కదా !

    ReplyDelete
  5. (Indian Minerva )
    సీతగారూ మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    శాస్త్రవిజ్ఞానం వారి బ్లాగులో కూడా .... " పరిణామవాదానికి వీలులేకుండా..... దైవం మొదటే జీవులను పరిపూర్ణంగా సృష్టించవచ్చు కదా ! " అన్న అభిప్రాయం ఉన్నట్లు నాకు అనిపించింది.

    నాకు ఇలా అనిపిస్తోందండి.

    ఒక కుక్క పిల్లనో, కుందేలు పిల్లనో భారతదేశంలోని వేడిప్రాంతం నుంచీ విదేశాల్లోని చలిప్రాంతాలకు తీసుకువెళ్తే అక్కడి కొత్త వాతావరణానికి తట్టుకోవాలంటే శరీరం కొంత మార్పుకు అలవాటుపడాలి.

    ఇలాంటప్పుడు దైవం జీవుల శరీరాలను ఎండకు, లేక చలికీ మాత్రమే తట్టుకునేటట్లు ముందే ఏర్పాటు చేస్తే జీవులకు కష్టమయిపోతుంది.

    ఒకోసారి ఒకే దేశంలో కూడా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తూంటాయి.

    ఇలాంటప్పుడు దైవం జీవులకు పరిణామలక్షణం ఉండేలా ఇచ్చిన అవకాశం మంచిదే కదా ! అని కూడా అనిపిస్తుంది.

    అయితే పరిణామ సిద్ధాంతం కూడా సృష్టికి ఆటంకం కలుగకుండా పరిమితమైన పరిధిలోనే జరుగుతుంది అనిపిస్తుంది.

    ఉదా.....నదిలో ఒకేరకమైన వాతావరణం ఉన్నప్పటికీ జీవులు ఆల్గే, కప్పలు, చేపలు ఇలా...... విభిన్న రూపాల్లో ఉంటాయి కానీ, ఒకే లక్షణాలు కలిగిన జీవుల్లా మారిపోవటం లేదు కదా ! అనిపించింది.

    ఇంకా మరికొన్ని విషయాలతో కొత్త టపా వ్రాశానండి....

    ReplyDelete